భారతదేశం తరఫున అంతర్జాతీయ క్రికెట్లో ప్రాతినిధ్యం వహించే జట్టు From Wikipedia, the free encyclopedia
భారతదేశం తరఫున అంతర్జాతీయ క్రికెట్లో ప్రాతినిధ్యం వహించే జట్టు, భారత క్రికెట్ జట్టు. ఇది భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (BCCI) అజమాయిషీలో ఉంటుంది. ప్రస్తుతం భారత క్రికెట్ జట్టు ప్రపంచంలోనే స్పాన్సర్షిప్ రూపంలో అత్యధిక డబ్బును ఇచ్చే జాతీయ క్రీడాజట్టుగా నిలిచింది.[10] ఈ జట్టును మెన్ ఇన్ బ్లూ అని కూడా అంటారు,[11][12]
మారుపేరు | మెన్ ఇన్ బ్లూ, ఇన్విన్సిబుల్స్ | ||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
అసోసియేషన్ | భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు | ||||||||||||
వ్యక్తిగత సమాచారం | |||||||||||||
కెప్టెన్ | రోహిత్ శర్మ | ||||||||||||
కోచ్ | Gautham Gambhir | ||||||||||||
చరిత్ర | |||||||||||||
టెస్టు హోదా పొందినది | 1931 | ||||||||||||
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ | |||||||||||||
ICC హోదా | పూర్తి సభ్యత్వం (1926) | ||||||||||||
ICC ప్రాంతం | ACC | ||||||||||||
| |||||||||||||
టెస్టులు | |||||||||||||
మొదటి టెస్టు | v ఇంగ్లాండు లార్డ్స్, లండన్ వద్ద; 25–28 జూన్ 1932 | ||||||||||||
చివరి టెస్టు | v వెస్ట్ ఇండీస్ క్వీన్స్ పార్క్ ఓవల్, పోర్ట్ ఆఫ్ స్పెయిన్వద్ద; 20–24 జూలై 2023 | ||||||||||||
| |||||||||||||
ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ లో పోటీ | 2 (first in 2019–2021) | ||||||||||||
అత్యుత్తమ ఫలితం | |||||||||||||
వన్డేలు | |||||||||||||
తొలి వన్డే | v ఇంగ్లాండు హెడింగ్లీ, లీడ్స్ వద్ద ; 13 జూలై 1974 | ||||||||||||
చివరి వన్డే | v ఆస్ట్రేలియా నరేంద్ర మోదీ స్టేడియం, అహ్మదాబాద్ వద్ద ; 19 నవంబర్ 2023 | ||||||||||||
| |||||||||||||
పాల్గొన్న ప్రపంచ కప్‌లు | 13 (first in 1975రన్నరప్ (2019–21, 2021–23)) | ||||||||||||
అత్యుత్తమ ఫలితం | ఛాంపియన్స్ (1983, 2011) | ||||||||||||
ట్వంటీ20లు | |||||||||||||
తొలి టి20ఐ | v దక్షిణాఫ్రికావాండరర్స్ స్టేడియం, జోహన్నెస్‌బర్గ్ వద్ద; 1 డిసెంబర్ 2006 | ||||||||||||
చివరి టి20ఐ | v ఆఫ్ఘనిస్తాన్ జెజియాంగ్ యూనివర్శిటీ ఆఫ్ టెక్నాలజీ క్రికెట్ ఫీల్డ్, హాంగ్జౌ; 7 అక్టోబర్ 2023 | ||||||||||||
| |||||||||||||
ఐసిసి టి20 ప్రపంచ కప్ లో పోటీ | 8 (first in 2007) | ||||||||||||
అత్యుత్తమ ఫలితం | ఛాంపియన్స్ (2007) | ||||||||||||
| |||||||||||||
As of 19 November 2023 |
భారతదేశం మొట్టమొదటి సారిగా 1921లో తొలి క్రికెట్ మ్యాచ్ ఆడింది. కాని అధికారికంగా మొదటి టెస్ట్ మ్యాచ్ 1932, జూన్ 25న ఇంగ్లాండుతో లార్డ్స్‌లో ఆడి టెస్ట్ మ్యాచ్ ఆడిన ఆరవ దేశంగా స్థానం సంపాదించింది. ప్రారంభం నుంచి విదేశాలలో కన్నా స్వదేశంలోనే మంచి ఫలితాలను రాబట్టుకుంటోంది. ఆస్ట్రేలియా, ఇంగ్లాండు జట్లపై బలహీనమైన ప్రదర్శన కావిస్తోంది. అంతర్జాతీయ క్రికెట్ ప్రారంభించిన తొలి 50 సంవత్సరాలలో మొత్తం 196 టెస్టులు ఆడి కేవలం 35 విజయాలను మాత్రమే నమోదుచేయగలిగింది.[10]
50 సంవత్సరాల అనంతరం సునీల్ గవాస్కర్ రూపంలో ప్రముఖ బ్యాట్స్‌మెన్, కపిల్ దేవ్ రూపంలో ప్రముఖ బౌలర్లు భారత జట్టులో స్థానం సంపాదించారు. అప్పటినుంచి టెస్టులలోనూ, ఒకరోజు అంతర్జాతీయ క్రికెట్ (వన్డే క్రికెట్) లోనూ భారత జట్టు ప్రదర్శన పూర్వం కంటే బాగుపడింది. 20వ శతాబ్ది చివరి దశకంలో భారత జట్టులో సచిన్ టెండుల్కర్, రాహుల్ ద్రవిడ్, సౌరవ్ గంగూలీ, అనిల్ కుంబ్లే లాంటి ప్రముఖ ఆటగాళ్ళు జట్టులో స్థానం సంపాదించి లెక్కకు మిక్కిలి ప్రపంచ రికార్డులు సృష్టించారు.[13]
భారత జట్టు ఐదు ప్రధాన ఐసిసి టోర్నమెంటులను గెలుచుకుంది. క్రికెట్ ప్రపంచ కప్‌ను రెండుసార్లు (1983, 2011 ), ఒకసారి T20 ప్రపంచకప్ (2007), ఐసిసి ఛాంపియన్స్ ట్రోఫీని రెండుసార్లు (2002, 2013 ) గెలుచుకుంది. ప్రపంచ కప్‌లో ఒకసారి (2003), T20 ప్రపంచ కప్‌లో ఒకసారి (2014), ఛాంపియన్స్ ట్రోఫీలో రెండుసార్లు (2000, 2017) రన్నరప్‌గా కూడా నిలిచింది. ఈ జట్టు ఐసిసి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ మొదటి రెండు ఎడిషన్లలో (2021, 2023) ఫైనల్స్‌లో ఆడింది. వెస్టిండీస్ తర్వాత ప్రపంచ కప్ గెలిచిన రెండవ జట్టు, సొంతగడ్డపై ప్రపంచ కప్ గెలిచిన మొదటి జట్టు (2011) ఇదే.
భారత జట్టు 1984, 1988, 1990-91, 1995, 2010, 2016, 2018, 2023 లో ఎనిమిది సార్లు ఆసియా కప్‌ను గెలుచుకుంది. మూడుసార్లు (1997, 2004, 2004) రన్నరప్‌గా నిలిచింది.
ఈ జట్టు 1985 వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ క్రికెట్‌ను కూడా గెలుచుకుంది, ఫైనల్లో పాకిస్థాన్‌ను ఓడించింది. ఐసిసి టెస్ట్ ఛాంపియన్షిప్ మ్యాస్ను ఐదుసార్లు, ఐసిసి వన్డే ఛాంపియన్షిప్ షీల్డ్‌ను ఒకసారి గెలుచుకుంది.
2023 సెప్టెంబరు నాటికి భారత జట్టు, ఐసిసి ర్యాంకింగ్స్‌లో మొదటి (టెస్టులు, వన్డేలు, T20Iలు) స్థానంలో ఉంది.[14] ఆ విధంగా ఇది, అంతర్జాతీయ క్రికెట్లో అత్యంత విజయవంతమైన జట్లలో ఒకటి.
1700లో బ్రిటీష్ వారు క్రికెట్ ఆటను భారత్‌కు తీసుకొని వచ్చారు. 1721లో మొదటి క్రికెట్ మ్యాచ్‌ను ఇక్కడ నిర్వహించారు.[15] 1848లో ముంబాయిలో పార్సీ కమ్యూనిటీ ఓరియెంటల్ క్లబ్‌ను స్థాపించారు. అదే భారతీయులు స్థాపించిన తొలి క్రికెట్ క్లబ్. 1877లో యూరోపియన్లు పార్సీలకు క్రికెట్ మ్యాచ్ ఆడటానికి పిల్చారు.[16] 1912 నాటికి పార్సీలు, హిందువులు, ముస్లిములు, యూరోపియన్లు ప్రతి ఏడాది క్రికెట్ ఆడేవారు.[16] 1900లలో కొందరు భారతీయులు ఇంగ్లీష్ క్రికెట్ టీంలో ఆడటానికి ఇంగ్లాండు వెళ్ళినారు. వారిలో ముఖ్యులు రంజిత్ సింహ్ జీ, దులీప్ సింహ్ జీ. వారిపేర్లపై ప్రస్తుతం దేశవాళీ క్రికెట్ ట్రోఫీలు నిర్వహించబడుతున్నది. 1911లో భారత జట్టు తొలి అధికారిక పర్యటన ఇంగ్లాండులో జరిపింది. కాని ఇంగ్లీష్ క్రికెట్ టీంతో కాకుండా ఇంగ్లాండు లోని టీంలతో ఆడినది.[17] 1926లో ఇంపీరియల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసిసి)లో భారతదేశానికి ఆహ్వానించారు. 1932లో తొలిసారిగా అధికారిక టెస్ట్ మ్యాచ్ సి.కె.నాయుడు నేతృత్వంలో ఇంగ్లాండుతో ఆడింది.[18] తొలి టెస్ట్ మ్యాచ్ ఆడుతూ భారతజట్టు బలంగా లేకపోవుటచే 158 పరుగులకే కుప్పకూలింది.[19] 1930, 1940లలో భారతజట్టు శక్తివంచన లేకుండా కృషిచేసింది. కాని విజయం సాధించలేకపోయింది. టెస్ట్ మ్యాచ్‌లో భారత్‌కు తొలి విజయం 1952లో ఇంగ్లాండుపై చెన్నైలో లభించింది.[20] ఆ తరువాతి సంవత్సరం పాకిస్తాన్ పై తొలి సీరీస్ విజయం సాధించింది. 1950 దశాబ్దిలో భారత జట్టు మంచి పురోగతి సాధించింది. 1956లో న్యూజీలాండ్ పై కూడా సీరీస్ విజయం సాధించింది. కాని ఆస్ట్రేలియా, ఇంగ్లాండులపై దశాబ్దం వరకు కూడా విజయం సాధించలేక పోయింది.
1970 దశకంలో భారత జట్టులో స్పిన్ దిగ్గజాలైన బిషన్ సింగ్ బేడీ, ఎర్రపల్లి ప్రసన్న, చంద్రశేఖర్, వెంకట రాఘవన్ లాంటివారు ప్రవేశించారు. అదే సమయంలో ఇద్దరు ప్రముఖ బ్యాట్స్మెన్లు (సునీల్ గవాస్కర్, గుండప్ప విశ్వనాథ్ లు) కూడా భారత జట్టులో రంగప్రవేశం చేశారు. 1971లో వెస్ట్ఇండీస్ పై గవాస్కర్ తొలి సిరీస్‌లోనే 774 పరుగులు చేసి ఔరా అనిపించుకున్నాడు. ఆ ఏడాది అజిత్ వాడేకర్ నాయకత్వంలో భారతజట్టు ఇంగ్లాండు, వెస్ట్ఇండీస్ లపై సీరీస్ విజయం సాధించగలిగింది.
1971లో వన్డే క్రికెట్ ప్రారంభమైన తరువాత క్రికెట్‌కు జనాదరణ బాగా పెరిగింది. కాని ప్రారంభంలో భారతజట్టు ఒకరోజు క్రికెట్ పోటీలలో బలహీనంగా ఉండేది. బ్యాత్స్‌మెన్లు రక్షణాత్మక ధోరణితో మందకొడిగా ఆడేవారు. 1975లో జరిగిన తొలి వన్డే ప్రపంచ కప్‌లో ఇంగ్లాండుతో జరిగిన ఒక మ్యాచ్‌లో గవాస్కర్ ప్రారంభం నుంచి 60వ ఓవర్ వరకు మొత్తం 176 బంతులు ఎదుర్కొని కేవలం 36 పరుగులు మాత్రమే సాధించాడు. ఆ మ్యాచ్‌లో భారత్ కేవలం 132 పరుగులు (3 వికెట్లకు) మాత్రమే చేసి 202 పరుగులు తేడాతో పరాజయం పొందినది. తొలి రెండు ప్రపంచ కప్ టోర్నమెంట్లలో భారత్ రెండో రౌండ్‌కు కూడా చేరుకోలేదు.
1970 దశాబ్దం ద్వితీయార్థం నుంచి టెస్టులలో భారత్ బలంగా తయారైంది. 1976లో క్లైవ్ లాయిడ్ నేతృత్వంలోని వెస్ట్ఇండీస్ జట్టుతో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో 403 పరుగుల లక్ష్యాన్ని ఛేదింది భారత్ రికార్డు సాధించింది. నాల్గవ ఇన్నింగ్సులో గుండప్ప విశ్వనాథ్ 112 పరుగులు సాధించాడు. 1976లోనే న్యూజీలాండ్‌పై మరో రికార్డు సాధించింది. కాన్పూర్‌లో జరిగిన టెస్టులో 524 పరుగులు సాధించి (9 వికెట్లకు) ఇన్నింగ్సు డిక్లేర్ చేసింది. ఆ టెస్టులో ఎవరూ సెంచరీ సాధించకున్ననూ ఆరుగురు బ్యాట్స్మెన్లు 50కు పైగా పరుగులు సాధించడం గమనార్హం. ఆ ఇన్నింగ్సులోని మరో విశేషం మొత్తం 11 క్రికెటర్లు రెండంకెల స్కోరును చేయడం. ప్రపంచ టెస్ట్ క్రికెట్లో అప్పటికి ఇలాంటిది 8వ సారి మాత్రమే.
1980 ప్రాంతంలో దిలీప్ వెంగ్‌సర్కార్, రవిశాస్త్రి సేవలను ఉపయోగించుకొని భారతజట్టు పలు విజయాలు నమోదుచేయగలిగింది. 1983లో జరిగిన మూడవ వన్డే ప్రపంచ కప్‌లో కపిల్ దేవ్ నాయకత్వంలోని భారతజట్టు వెస్ట్‌ఇండీస్‌ను ఫైనల్లో బోల్టా కొట్టించి కప్‌ను ఎవరేసుకొనివచ్చింది. 1984లో సునీల్ గవాస్కర్ నాయకత్వంలోని భారతజట్టు ఆసియా కప్‌ను సాధించింది. 1985లో ఆస్ట్రేలియా ప్రపంచ చాంపియన్‌షిప్‌ను గెలిచింది. రవిశాస్త్రి చంపియన్ ఆఫ్ చాంపియన్‌గా అవార్డు పొందినాడు. 1986లో ఇంగ్లాండ్‌పై టెస్ట్ సీరీస్‌లో కూడా విజయం సాధించారు. భారత ఉపఖండం వెలుపల భారతజట్టు 19 సంవత్సరాల అనంతరం సాధించిన విజయమది. 1987 ప్రపంచ కప్ క్రికెట్‌ను భారత ఉపఖండంలోనే నిర్వహించబడింది. 1980 దశాబ్దిలో సునీల్ గవాస్కర్, కపిల్ దేవ్‌లు బ్యాటింగ్, బౌలింగ్‌లలో పలు రికార్డులు సృష్టించారు. సునీల్ గవాస్కర్ టెస్ట్ క్రికెట్లో 34 సెంచరీలు, 10,000 పైగా పరుగులతో ప్రపంచ రికార్డు సృష్టించగా కపిల్ దేవ్ 434 టెస్ట్ వికెట్లు సాధించి ప్రపంచ రికార్డు సృష్టించాడు (వీరి రికార్డులు తరువాత ఛేదించబడ్డాయి). వారి క్రీడాజీవితపు చివరిదశలో వారిరువిరి మధ్య నాయకత్వ బాధ్యతలు పలుమార్లు చేతులుమారింది.
1980 దశాబ్ది చివరలో సచిన్ టెండుల్కర్, అనిల్ కుంబ్లే, జనగళ్ శ్రీనాథ్‌లు భారతజట్టులోకి ప్రవేశించారు. 1990 దశాబ్ది మధ్యనాటికి సచిన్ తెండుల్కర్ అనేక ప్రపంచ రికార్డులు తనపేరిట నమోదు చేసుకున్నాడు. ఇప్పటికీ సచిన్ భారతజట్టుకు సేవలందిస్తున్నాడు. బ్యాట్స్‌మెన్‌గా రాణిస్తున్ననూ నాయకత్వ బాధ్యతలు నిర్వహించి జట్టుకు విజయం సాధంచ లేకపోయాడు. మూడో పర్యాయం నాయకత్వ బాధ్యతలు అప్పగించడానికి సిద్ధంగా ఉన్ననూ తన నిస్సాయత వ్యక్తం చేయగా ఆ కిరీటం అనిల్ కుంబ్లేకు వరించింది.
2000లలో అజహరుద్దీన్, అజయ్ జడేజాలు మ్యాచ్ ఫిక్సింగ్‌లో ఇరుక్కొని భారతజట్టుకు చెడ్డపేరు తెచ్చారు. 2000 తరువాత భారత జట్టుకు తొలి విదేశీ కోచ్ జాన్ రైట్ రావడంతో జట్టు కొద్దిగా మెరుగుపడింది. కోల్‌కత టెస్టులో ఫాలోఆన్ ఆడుతూ మ్యాచ్ గెల్చి సంచలనం సృష్టించింది. వి.వి.యెస్.లక్ష్మణ్ వీరోచిత డబుల్ సెంచరీతో సాధిమ్చిన ఆ ఘనకార్యం టెస్ట్ చరిత్రలో అలాంటి విజయాల్లో మూడోది మాత్రమే. 2004లో జాన్ రైట్ స్థానంలో గ్రెగ్ చాపెల్ కోచ్‌గా వచ్చాడు. చాపెల్, సౌరవ్ గంగూలీ విభేదాల వల్ల గంగూలీ నాయకత్వం నుంచి తప్పించుకోవల్సివచ్చింది. రాహుల్ ద్రవిడ్‌కు ఆ బాధ్యతలు అప్పగించబడ్డాయి. మహేంద్రసింగ్ ధోని, యువరాజ్ సింగ్, ఇర్ఫాన్ పటేల్, రాబిన్ ఉతప్ప లాంటి యువకులు ప్రవేశించుటలో జట్టులో యువరక్తం పెరిగింది. 2007 వన్డే ప్రపంచకప్‌లో లీగ్ దశలో బంగ్లాదేశ్ పై ఓడి సూపర్-8 కు కూడా అర్హత సాధించలేదు. దానికి బాధ్యత వహించి అనిల్ కుంబ్లే స్వచ్ఛందంగా టెస్ట్ క్రికెట్‌కు నిష్క్రమణ ప్రకతించాడు. ఆ తరువాత జరిగిన ట్వంటీ-20 ప్రపంచ కప్‌లో నలుగులు సీనియర్ క్రికెటర్లు లేకుండానే యువ భారతజట్టు అనూహ్యమైన విజయం సాధించి సంచలనం సృష్టించింది.
బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (BCCI), భారత క్రికెట్ జట్టుకు, భారతదేశంలో ఫస్ట్-క్లాస్ క్రికెట్‌కూ పాలకమండలి. 1929 నుండి ఇది పనిచేస్తోంది. ఇది అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC)లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తుంది. బోర్డు ప్రధాన కార్యాలయం ముంబై చర్చ్‌గేట్‌లోని 'క్రికెట్ సెంటర్'లో ఉంది. ఇది ప్రపంచంలోని అత్యంత ధనిక క్రీడా సంస్థలలో ఒకటి. ఇది 2006 నుండి 2010 వరకు భారత మ్యాచ్‌ల మీడియా హక్కులను $612,000,000కి విక్రయించింది. [21] ప్రస్తుతం బీసీసీఐ అధ్యక్షుడిగా రోజర్ బిన్నీ, కార్యదర్శిగా జే షా ఉన్నారు.
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ దాని భవిష్యత్ పర్యటనల కార్యక్రమం ద్వారా భారతదేశం ఆడాళ్సిన మ్యాచ్‌లను నిర్ణయిస్తుంది. అయితే, బలమైన ఆర్థిక స్థితి కలిగిన BCCI, తరచుగా ICC కార్యక్రమాలను సవాలు చేస్తూంటుంది. బంగ్లాదేశ్ లేదా జింబాబ్వే ల పర్యటనల కంటే ఎక్కువ ఆదాయాన్ని ఆర్జించే అవకాశం ఉన్న భారతదేశం, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌ల మధ్య మరిన్ని సిరీస్‌లు జరపాలని పిలుపునిచ్చింది. [22] గతంలో బీసీసీఐ స్పాన్సర్‌షిప్‌ల విషయంలో ఐసీసీతో విభేదించింది.[23]
భారత క్రికెట్ జట్టుకు ఎంపిక BCCI వారి జోనల్ ఎంపిక విధానం ద్వారా జరుగుతుంది. ఐదు జోన్లలో ప్రతిదానికీ ఒక సెలెక్టరు, BCCI నామినేట్ చేసిన సభ్యులొకరు ప్రాతినిధ్యం వహిస్తారు. ఈ సెలెక్టర్లు తమ జోన్ల పట్ల పక్షపాతంతో వ్యవహరిస్తున్నారని కొన్నిసార్లు వివాదాలు వచ్చాయి.[24]
2022 నవంబరు 18 వరకు, చేతన్ శర్మ చీఫ్ సెలెక్టర్‌గా, దేబాశిష్ మొహంతి, హర్విందర్ సింగ్, సునీల్ జోషిలు సభ్యులుగానూ ఉన్నారు. 2022 ICC పురుషుల T20 ప్రపంచ కప్‌లో జట్టు విఫల ప్రదర్శన తర్వాత మొత్తం ప్యానెల్‌ను తొలగించారు. [25]
2023 జనవరి 7న, శివ సుందర్ దాస్, సుబ్రొతో బెనర్జీ, సలీల్ అంకోలా, శ్రీధరన్ శరత్‌లతో పాటు చేతన్ శర్మ మళ్లీ చీఫ్ సెలెక్టర్‌గా నియమితులయ్యారు. [26]
2023 ఫిబ్రవరి 17న, చేతన్ శర్మ ఒక ప్రైవేట్ న్యూస్ ఛానెల్ చేసిన స్టింగ్ ఆపరేషనులో భారత జట్టుపై అనేక విశృంఖల వ్యాఖ్యలు చేసాడు. అది వెల్లడి అవడంతో అతను తన పదవికి రాజీనామా చేశాడు. శివ సుందర్ దాస్ అతని స్థానంలో తాత్కాలిక చీఫ్ సెలెక్టరయ్యాడు. [27]
2023 జూలై 4న, అజిత్ అగార్కర్ కొత్త చీఫ్ సెలెక్టరుగా నియమితుడయ్యాడు.[28] అతను శివ సుందర్ దాస్, సుబ్రోతో బెనర్జీ, సలీల్ అంకోలా, శ్రీధరన్ శరత్‌లతో పాటు ఎంపిక కమిటీలో చేరాడు. [29]
వన్డే క్రికెట్ కప్ | ట్వంటీ-20 ప్రపంచ కప్ | ఐసిసి చాంపియన్ ట్రోఫీ | కామన్వెల్త్ క్రీడలు | ఆసియా కప్ క్రికెట్ |
---|---|---|---|---|
|
|
|||
భారతదేశంలో ప్రసిద్ధిగాంచిన అనేక క్రికెట్ వేదికలున్నాయి. అందులో చాలా రాష్ట్ర క్రికెట్ బోర్డు అజమాయిషీలో ఉన్నాయి. పూర్తిస్థాయిలో క్రికెట్ మ్యాచ్‌ను నిర్వహించిన తొలి స్టేడియం ముంబాయి జింఖానా గ్రౌండ్. 1877లో పార్సీలు, యూరోపియన్ల మధ్య ఇక్కడ మ్యాచ్ జరిగింది. 1933లో భారతదేశంలో టెస్ట్ మ్యాచ్ నిర్వహించిన తొలి స్టేడియం కూడా ఇదే. కాని అదే టెస్ట్ ఆ వేదికకు చివరి టెస్ట్ కూడా. టెస్ట్ మ్యాచ్‌లు జరిగిన రెండో, మూడవ స్టేడియాలు ఈడెన్ గార్డెన్, చేపాక్ స్టేడియంలు. స్వాతంత్ర్యం తరువాత టెస్ట్ మ్యాచ్‌ను నిర్వహించిన తొలి స్టేడియం ఢిల్లీ లోని ఫిరోజ్ షా కోట్లా మైదానం. వెస్టిండీస్ క్రికట్ జట్టుతో జరిగిన ఆ మ్యాచ్ 1948లో జరుగగా డ్రాగా ముగిసింది.
భారత్‌లో టెస్ట్ మ్యాచ్‌లను నిర్వహించిన స్టేడియాలు 19 ఉండగా, అందులో ఈడెన్ గార్డెన్ అత్యధింగా 35 టెస్టులకు వేదికగా నిలిచింది. ఆరు స్టేడియంలలో కేవలం ఒకే ఒక్క మ్యాచ్ జరిగింది. ఆంధ్ర ప్రదేశ్‌లో టెస్ట్ మ్యాచ్‌కు వేదికగా నిలిచిన ఏకైక స్టేడియం హైదరాబాదులోని లాల్ బహదూర్ స్టేడియం. అందులో ఇప్పటి వరకు 3 టెస్టులు జరిగాయి. ముంబాయి నగరంలో ఉన్న మూడు స్టేడియంలలో (వాంఖేడే, బ్రబోర్న్, జింఖానా) కలిపి అత్యధిక టెస్టులను నిర్వహించిన నగరంగా ముంబాయి ప్రథమస్థానంలో ఉంది.
భారత్‌లో అత్యధిక టెస్టుమ్యాచ్‌లను నిర్వహించిన కోల్‌కత లోని ఈడెన్ గార్డెన్ ప్రపంచంలోనే అత్యధిక ప్రేక్షకులు వీక్షించే స్టేడియంగా రికార్డు సృష్టించింది.[30] మరో ప్రముఖ స్టేడియం ఢిల్లీలోని ఫిరోజ్‌షా కోట్లా మైదానం. 1883లో ఏర్పాటుచేసిన ఈ స్టేడియం పాకిస్తాన్ పై అనిల్ కుంబ్లే సాధించిన ఒకే ఇన్నింగ్సులో 10 వికెట్ల రికార్డుతో పాటు అనేక రికార్డులకు నిలయంగా మారింది. గత కొద్దికాలంగా ఈ స్టేడియం పునరుద్ధరణ దిశలో ఉంది.[31] చేపాక్ (చెన్నై) లోని ఎం.ఎ.చిదంబరం స్టేడియం భారతదేశానికి తొలి టెస్ట్ విజయాన్ని అందించిన వేదిక.[32]
స్టేడియం | నగరం | టెస్ట్ మ్యాచులు |
---|---|---|
ఈడెన్ గార్డెన్ | కోల్‌కాతా | 35 |
అరుణ్ జైట్లీ క్రికెట్ స్టేడియం | ఢిల్లీ | 29 |
ఎం.ఎ.చిదంబరం స్టేడియం | చేపాక్, చెన్నై | 28 |
వాంఖేడే స్టేడియం | ముంబై | 21 |
గ్రీన్ పార్క్ స్టేడియం | కాన్పూర్ | 19 |
బ్రబోర్న్ స్టేడియం | ముంబై | 17 |
ఎం. చిన్నస్వామి స్టేడియం | బెంగళూరు | 17 |
జవహర్లాల్ నెహ్రూ స్టేడియం (చెన్నై) | చెన్నై | 9 |
విదర్భ క్రికెట్ అసోసియేషన్ గ్రౌండ్ | నాగపూర్ | 9 |
నరేంద్ర మోదీ స్టేడియం | అహ్మదాబాద్ | 8 |
ఇంద్రజిత్ సింగ్ బింద్రా స్టేడియం | మొహలి (పంజాబ్) | 7 |
లాల్ బహదూర్‌శాస్త్రి స్టేడియం | హైదరాబాదు | 3 |
బారాబతి స్టేడియం | కటక్ | 2 |
బాంబే జింఖానా | ముంబై | 1 |
గాంధీ స్టేడియం | జలంధర్ | 1 |
కె.డి.సింగ్ బాబు స్టేడియం | లక్నో | 1 |
సవాయి మాన్సింగ్ స్టేడియం | జైపూర్ | 1 |
సెక్టర్ 16 స్టేడియం | చండీగఢ్ | 1 |
యూనివర్శిటీ గ్రౌండ్ (లక్నో ) | లక్నో | 1 |
భారత క్రికెట్ జట్టు ఇంతవరకు (జనవరి 28, 2008 నాటికి) ఆడిన 415 టెస్టులకు 30 గురు జట్టుకు నాయకత్వం వహించారు. వారిలో సౌరవ్ గంగూలీ అత్యధికంగా 49 టెస్టులకు నాయకత్వం వహించగా హేము అధికారి, పంకజ్ రాయ్, చందూ బోర్డే, రవిశాస్త్రి, వీరేంద్ర సెహ్వాగ్ లు ఒక్కొక్క టెస్ట్ మ్యాచ్‌కు నాయకత్వం వహించారు.
భారత జట్టు టెస్ట్ కెప్టెన్లు [34] | ||||||||
---|---|---|---|---|---|---|---|---|
క్ర.సం | పేరు | టెస్టులు | విజయాలు | ఓటములు | డ్రా | |||
1 | సి.కె.నాయుడు | 4 | 0 | 3 | 1 | |||
2 | మహారాజ్కుమార్ | 3 | 0 | 2 | 1 | |||
3 | జూనియర్ పటౌడి | 3 | 0 | 1 | 2 | |||
4 | లాలా అమర్నాథ్ | 15 | 2 | 6 | 7 | |||
5 | విజయ్ హజారే | 14 | 1 | 5 | 8 | |||
6 | వినూ మన్కడ్ | 6 | 0 | 1 | 5 | |||
7 | గులాం అహ్మద్ | 3 | 0 | 2 | 1 | |||
8 | పాలీ ఉమ్రీగర్ | 8 | 2 | 2 | 4 | |||
9 | హేమూ అధికారి | 1 | 0 | 0 | 1 | |||
10 | దత్తా గైక్వాడ్ | 4 | 0 | 4 | 0 | |||
11 | పంకజ్ రాయ్ | 1 | 0 | 1 | 0 | |||
12 | గులాబ్రాయ్ రాంచంద్ | 5 | 1 | 2 | 2 | |||
13 | నారీ కాంట్రాక్టర్ | 12 | 2 | 2 | 8 | |||
14 | నవాబ్ పటౌడీ జూనియర్ | 40 | 9 | 19 | 12 | |||
15 | చందూబోర్డే | 1 | 0 | 1 | 0 | |||
16 | అజిత్ వాడేకర్ | 16 | 4 | 4 | 8 | |||
17 | వెంకట రాఘవన్ | 5 | 0 | 2 | 3 | |||
18 | సునీల్ గవాస్కర్ | 47 | 9 | 8 | 30 | |||
19 | బిషన్ సింగ్ బేడీ | 22 | 6 | 11 | 5 | |||
20 | గుండప్ప విశ్వనాథ్ | 2 | 0 | 1 | 1 | |||
21 | కపిల్ దేవ్ | 34 | 4 | 7 | 23 | |||
22 | దిలీప్ వెంగ్‌సర్కార్ | 10 | 2 | 5 | 3 | |||
23 | రవి శాస్త్రి | 1 | 1 | 0 | 0 | |||
24 | కృష్ణమాచారి శ్రీకాంత్ | 4 | 0 | 0 | 4 | |||
25 | అజహరుద్దీన్ | 47 | 14 | 14 | 19 | |||
26 | సచిన్ టెండుల్కర్ | 25 | 4 | 9 | 12 | |||
27 | సౌరవ్ గంగూలీ | 49 | 21 | 13 | 15 | |||
28 | రాహుల్ ద్రవిడ్ | 22 | 8 | 6 | 11 | |||
29 | వీరేంద్ర సెహ్వాగ్ | 1 | 1 | 0 | 0 | |||
30 | అనిల్ కుంబ్లే | 7 | 2 | 2 | 3 | |||
మొత్తం | 415 | 93 | 133 | 189 [35] | ||||
ఇంతవరకు భారత వన్డే జట్టుకు 19 గురు నాయకత్వం వహించారు. వారిలో అత్యధికంగా అజహరుద్దీన్ 173 వన్డేలకు నాయకత్వం వహించి ప్రథమస్థానంలో ఉండగా, సయ్యద్ కిర్మాణి, మోహిందర్ అమర్నాథ్, అనిల్ కుంబ్లేలు ఒక్కొక్క వన్డేలకు నాయకత్వం వహించారు. విజయశాతం ప్రకారం చూస్తే అనిల్ కుంబ్లే నాయకత్వం వహించిన ఏకైక వన్డేకు విజయం చేకూర్చి 100% విజయశాతంతో అగ్రస్థానంలో ఉన్నాడు. 20 కంటే అధికంగా వన్డేలకు నాయకత్వం వహించిన కెప్టెన్లలో రాహుల్ ద్రవిడ్, కపిల్ దేవ్‌లు 56% విజయశాతంతో ముందంజలో ఉన్నారు. ప్రపంచ కప్ క్రికెట్‌ను గెలిపించిన ఏకైక కెప్టెన్ కపిల్ దేవ్. 1983లో అతడు ఈ అపురూపమైన విజయాన్ని అందించాడు. కెప్టెన్‌గా అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన రికార్డు సచిన్ టెండుల్కర్ సాధించాడు. 1999-00లో న్యూజీలాండ్ పై ఆ స్కోరు సాధించి కపిల్ దేవ్ (175*) రికార్డును ఛేదించాడు. కెప్టెన్‌గా అత్యుత్తమ బౌలింగ్ విశ్లేషణ రికార్డు (10-1-34-5) సౌరవ్ గంగూలి పేరిట ఉంది. కెప్తెన్‌గా అత్యధిక సెంచరీల రికార్డు (11) కూడా గంగూలీ పేరిట నమోదైంది. కెప్టెన్‌గా అత్యధిక పరుగులు చేసిన రికార్డు అజహరుద్దీన్ సాధించాడు.
భారత జట్టు వన్డే కెప్టెన్లు | ||||||||
---|---|---|---|---|---|---|---|---|
క్ర.సం. | పేరు | సం. | వన్డేల సంఖ్య | గెలిచినవి | ఓటమి | టై | ఫలితం తేలనివి | విజయ శాతం[36] |
1 | అజిత్ వాడేకర్ | 1974 | 2 | 0 | 2 | 0 | 0 | 0% |
2 | వెంకటరాఘవన్ | 1975-1979 | 7 | 1 | 6 | 0 | 0 | 14% |
3 | బిషన్ సింగ్ బేడీ | 1975/6-1978/9 | 4 | 1 | 3 | 0 | 0 | 25% |
4 | సునీల్ గవాస్కర్ | 1980/1-1985/6 | 38 | 14 | 22 | 0 | 2 | 39% |
5 | గుండప్ప విశ్వనాథ్ | 1980/1 | 1 | 0 | 1 | 0 | 0 | 0% |
6 | కపిల్ దేవ్ | 1982/3-1992/1993 | 74 | 40 | 32 | 0 | 2 | 56% |
7 | సయ్యద్ కిర్మాణి | 1983/4 | 1 | 0 | 1 | 0 | 0 | 0% |
8 | మోహిందర్ అమర్నాథ్ | 1984/1985 | 1 | 0 | 0 | 0 | 1 | NA |
9 | రవిశాస్త్రి | 1986/7-1991/2 | 11 | 4 | 7 | 0 | 0 | 36% |
10 | దిలీప్ వెంగ్‌సర్కార్ | 1987/8-1988/9 | 18 | 8 | 10 | 0 | 0 | 44% |
11 | కృష్ణమాచారి శ్రీకాంత్ | 1989/90 | 13 | 4 | 8 | 0 | 1 | 33% |
12 | అజహరుద్దీన్ | 1989/90-1999 | 173 | 89 | 76 | 2 | 6 | 54% |
13 | సచిన్ టెండుల్కర్ | 1996-1999/2000 | 73 | 23 | 43 | 1 | 6 | 35% |
14 | అజయ్ జడేజా | 1997/8-1999/2000 | 13 | 8 | 5 | 0 | 0 | 62% |
15 | సౌరవ్ గంగూలీ | 1999-2005 | 146[37] | 76 | 65[37] | 0 | 5 | 54% |
16 | రాహుల్ ద్రవిడ్ | 2000/1-2007 | 79 | 42 | 33 | 0 | 4 | 53% |
17 | అనిల్ కుంబ్లే | 2001/2 | 1 | 1 | 0 | 0 | 0 | 100% |
18 | వీరేంద్ర సెహ్వాగ్ | 2005 | 5 | 3 | 2 | 0 | 0 | 60% |
19 | మహేంద్రసింగ్ ధోని | 2007/8 | 12 | 5 | 6 | 0 | 1 | 48% |
మొత్తం | 667 | 315 | 321 | 3 | 28 | 47.23% |
భారతదేశంలో జరిగే దేశవాళి క్రికెట్ పోటీలు:
గత 12 నెలల్లో భారతదేశం తరపున ఆడిన లేదా ఇటీవలి కాలంలో టెస్టులు, వన్డేలు, టి20ఐ స్క్వాడ్లలో స్థానం పొందిన ఆటగాళ్లందరి జాబితా ఇక్కడ ఉంది. 2023 మార్చిలో, బిసిసిఐ కొత్త కాంట్రాక్టు జాబితాను ప్రచురించింది. ఇది 2022 అక్టోబరు నుండి 2022 సెప్టెంబరు వరకు చెల్లుబాటు అవుతుంది.[38][39]
గుర్తు | అర్థం |
---|---|
CG | బిసిసిఐ తో ఉన్న కాంట్రాక్టు గ్రేద్ |
No. | చొక్కా సంఖ్య |
రూపాలు | ఇటీవల ఆడిన క్రికెట్ రూపం, కెరీర్ మొత్తంలో కాదు |
పేరు | వయస్సు | బ్యాటింగు శైలి | బౌలింగు శైలి | దేశీయ జట్టు | ఐపిఎల్ జట్టు | CG | రూపాలు | No. | చివరి టెస్టు | చివరి వన్డే | చివరి టి20ఐ |
---|---|---|---|---|---|---|---|---|---|---|---|
కెప్టెన్; బ్యాటరు | |||||||||||
రోహిత్ శర్మ | 37 | కుడిచేతి వాటం | కుడిచేతి ఆఫ్ స్పిన్ | ముంబై | ముంబై ఇండియన్స్ | A+ | టెస్టులు, వన్డేలు | 45 | 2023 | 2023 | 2022 |
టెస్టు జట్టు వైస్ కెప్టెన్; బ్యాటరు | |||||||||||
అజింక్య రహానే | 36 | కుడిచేతి వాటం | — | ముంబై | చెన్నై సూపర్ కింగ్స్ | — | టెస్టులు | 27 | 2023 | 2018 | 2016 |
టి20ఐ & వన్డే జట్ల వైస్ కెప్టెన్; ఆల్ రౌండరు | |||||||||||
హార్దిక్ పాండ్యా | 31 | కుడిచేతి వాటం | కుడిచేతి మీడియం ఫాస్ట్ | బరోడా | గుజరాత్ టైటన్స్ | A | వన్డే, టి20ఐ | 33 | 2018 | 2023 | 2023 |
బ్యాటర్లు | |||||||||||
రుతురాజ్ గైక్వాడ్ | 27 | కుడిచేతి వాటం | — | మహారాష్ట్ర | చెన్నై సూపర్ కింగ్స్ | — | వన్డే, టి20ఐ | 31 | — | 2023 | 2023 |
శుభ్‌మన్ గిల్ | 25 | కుడిచేతి వాటం | కుడిచేతి ఆఫ్ స్పిన్ | పంజాబ్ | గుజరాత్ టైటన్స్ | B | టెస్టులు, వన్డేలు, టి20ఐ | 77 | 2023 | 2023 | 2023 |
శ్రేయాస్ అయ్యర్ | 29 | కుడిచేతి వాటం | కుడిచేతి లెగ్ స్పిన్ | ముంబై | కోల్‌కతా నైట్ రైడర్స్ | B | టెస్టులు, వన్డేలు | 96 | 2023 | 2023 | 2022 |
యశస్వి జైస్వాల్ | 22 | ఎడమచేతి వాటం | — | ముంబై | రాజస్థాన్ రాయల్స్ | — | టెస్టులు, టి20ఐ | 64 | 2023 | — | 2023 |
విరాట్ కొహ్లి | 35 | కుడిచేతి వాటం | కుడిచేతి మీడియం | ఢిల్లీ | రాయల్ చాలెంజర్స్ బెంగళూరు | A+ | టెస్టులు, వన్డేలు | 18 | 2023 | 2023 | 2022 |
చతేశ్వర్ పుజారా | 36 | కుడిచేతి వాటం | కుడిచేతి లెగ్ స్పిన్ | సౌరాష్ట్ర | — | B | టెస్టులు | 25 | 2023 | 2014 | — |
రింకు సింగ్ | 27 | ఎడమచేతి వాటం | — | ఉత్తర ప్రదేశ్ | కోల్‌కతా నైట్ రైడర్స్ | — | టి20ఐ | 35 | — | — | 2023 |
రాహుల్ త్రిపాఠి | 33 | కుడిచేతి వాటం | — | మహారాష్ట్ర | సన్‌రైజర్స్ హైదరాబాద్| data-sort-value="" style="background: #ececec; color: #2C2C2C; vertical-align: middle; text-align: center; " class="table-na" | — | టి20ఐ | 52 | — | — | 2023 | |
సూర్యకుమార్ యాదవ్ | 34 | కుడిచేతి వాటం | — | ముంబై | ముంబై ఇండియన్స్ | B | టెస్టులు, వన్డేలు, టి20ఐ | 63 | 2023 | 2023 | 2023 |
ఆల్ రౌండర్లు | |||||||||||
రవిచంద్రన్ అశ్విన్ | 38 | కుడిచేతి వాటం | కుడిచేతి ఆఫ్ స్పిన్ | Tamil Nadu | రాజస్థాన్ రాయల్స్ | A | టెస్టులు, వన్డేలు | 99 | 2023 | 2023 | 2022 |
శివం దూబే | 27 | కుడిచేతి వాటం | కుడిచేతి మీడియం | ముంబై | చెన్నై సూపర్ కింగ్స్ | — | టి20ఐ | 25 | — | 2019 | 2023 |
దీపక్ హూడా | 29 | కుడిచేతి వాటం | కుడిచేతి ఆఫ్ స్పిన్ | రాజస్థాన్ | లక్నో సూపర్ జెయింట్స్ | C | టి20ఐ | 57 | — | 2022 | 2023 |
రవీంద్ర జడేజా | 35 | ఎడమచేతి వాటం | ఎడమచేతి ఆర్థడాక్స్ స్పిన్ | సౌరాష్ట్ర | చెన్నై సూపర్ కింగ్స్ | A+ | టెస్టులు, వన్డేలు | 8 | 2023 | 2023 | 2022 |
అక్షర్ పటేల్ | 30 | ఎడమచేతి వాటం | ఎడమచేతి ఆర్థడాక్స్ స్పిన్ | గుజరాత్ | ఢిల్లీ క్యాపిటల్స్ | A | టెస్టులు, వన్డేలు, టి20ఐ | 20 | 2023 | 2023 | 2023 |
వాషింగ్టన్ సుందర్ | 25 | ఎడమచేతి వాటం | కుడిచేతి ఆఫ్ స్పిన్ | తమిళనాడు | సన్‌రైజర్స్ హైదరాబాద్ | C | వన్డే, టి20ఐ | 5 | 2021 | 2023 | 2023 |
తిలక్ వర్మ | 21 | ఎడమచేతి వాటం | కుడిచేతి ఆఫ్ బ్రేక్ | హైదరాబాదు | ముంబై ఇండియన్స్ | — | వన్డే, టి20ఐ | 72 | — | 2023 | 2023 |
వికెట్ కీపర్లు | |||||||||||
కె.ఎస్. భరత్ | 31 | కుడిచేతి వాటం | — | ఆంధ్ర | గుజరాత్ టైటన్స్ | C | టెస్టులు | 14 | 2023 | — | — |
ఇషాన్ ఖాన్ | 26 | ఎడమచేతి వాటం | — | జార్ఖండ్ | ముంబై ఇండియన్స్ | C | టెస్టులు, వన్డేలు, టి20ఐ | 32 | 2023 | 2023 | 2023 |
రిషభ్ పంత్ | 27 | ఎడమచేతి వాటం | — | ఢిల్లీ | ఢిల్లీ క్యాపిటల్స్ | A | — | 17 | 2022 | 2022 | 2022 |
కేఎల్ రాహుల్ | 32 | కుడిచేతి వాటం | — | కర్ణాటక | లక్నో సూపర్ జెయింట్స్ | B | టెస్టులు, వన్డేలు | 1 | 2023 | 2023 | 2022 |
సంజు శామ్సన్ | 29 | కుడిచేతి వాటం | — | కేరళ | రాజస్థాన్ రాయల్స్ | C | వన్డే, టి20ఐ | 9 | — | 2023 | 2023 |
పేస్ బౌలర్లు | |||||||||||
జస్ప్రీత్ బుమ్రా | 30 | కుడిచేతి వాటం | కుడిచేతి ఫాస్ట్ | గుజరాత్ | ముంబై ఇండియన్స్ | A+ | వన్డే, టి20ఐ | 93 | 2022 | 2023 | 2023 |
ముకేష్ కుమార్ | 31 | కుడిచేతి వాటం | కుడిచేతి మీడియం | బెంగాల్ | ఢిల్లీ క్యాపిటల్స్ | — | టెస్టులు, వన్డేలు, టి20ఐ | 49 | 2023 | 2023 | 2023 |
ప్రసిద్ధ్ కృష్ణ | 28 | కుడిచేతి వాటం | కుడిచేతి ఫాస్ట్ | కర్ణాటక | రాజస్థాన్ రాయల్స్ | — | వన్డే, టి20ఐ | 24 | — | 2023 | 2023 |
ఉమ్రాన్ మాలిక్ | 24 | కుడిచేతి వాటం | కుడిచేతి ఫాస్ట్ | జమ్మూ కాశ్మీర్ | సన్‌రైజర్స్ హైదరాబాద్ | — | వన్డే, టి20ఐ | 21 | — | 2023 | 2023 |
శివం మావి | 25 | కుడిచేతి వాటం | కుడిచేతి ఫాస్ట్ మీడియం | ఉత్తర ప్రదేశ్ | గుజరాత్ టైటన్స్ | — | టి20ఐ | 26 | — | — | 2023 |
హర్షల్ పటేల్ | 33 | కుడిచేతి వాటం | కుడిచేతి మీడియం | హర్యానా | రాయల్ చాలెంజర్స్ బెంగళూరు | — | టి20ఐ | 36 | — | — | 2023 |
మొహమ్మద్ షమీ | 34 | కుడిచేతి వాటం | కుడిచేతి ఫాస్ట్ | బెంగాల్ | గుజరాత్ టైటన్స్ | A | టెస్టులు, వన్డేలు | 11 | 2023 | 2023 | 2022 |
అర్ష్‌దీప్ సింగ్ | 25 | ఎడమచేతి వాటం | ఎడమచేతి మీడియం ఫాస్ట్ | పంజాబ్ | పంజాబ్ కింగ్స్ | C | టి20ఐ | 2 | — | 2022 | 2023 |
మొహమ్మద్ సిరాజ్ | 30 | కుడిచేతి వాటం | కుడిచేతి ఫాస్ట్ | హైదరాబాదు | రాయల్ చాలెంజర్స్ బెంగళూరు | B | టెస్టులు, వన్డేలు | 73 | 2023 | 2023 | 2022 |
శార్దూల్ ఠాకూర్ | 32 | కుడిచేతి వాటం | కుడిచేతి మీడియం | ముంబై | కోల్‌కతా నైట్ రైడర్స్ | C | టెస్టులు, వన్డేలు | 54 | 2023 | 2023 | 2022 |
జయదేవ్ ఉనద్కత్ | 32 | కుడిచేతి వాటం | ఎడమచేతి మీడియం | సౌరాష్ట్ర | లక్నో సూపర్ జెయింట్స్ | — | టెస్టులు, వన్డేలు | 91 | 2023 | 2023 | 2018 |
ఉమేష్ యాదవ్ | 36 | కుడిచేతి వాటం | కుడిచేతి ఫాస్ట్ | విదర్భ | కోల్‌కతా నైట్ రైడర్స్ | C | టెస్టులు | 19 | 2023 | 2018 | 2022 |
స్పిన్ బౌలర్లు | |||||||||||
రవి బిష్ణోయి | 24 | కుడిచేతి వాటం | కుడిచేతి లెగ్ స్పిన్ | గుజరాత్ | లక్నో సూపర్ జెయింట్స్ | — | టి20ఐ | 56 | — | 2022 | 2023 |
యజువేంద్ర చాహల్ | 34 | కుడిచేతి వాటం | కుడిచేతి లెగ్ స్పిన్ | హర్యానా | రాజస్థాన్ రాయల్స్ | C | వన్డే, టి20ఐ | 3 | — | 2023 | 2023 |
కుల్దీప్ యాదవ్ | 29 | ఎడమచేతి వాటం | ఎడమచేతి అనార్థడాక్స్ స్పిన్ | ఉత్తర ప్రదేశ్ | ఢిల్లీ క్యాపిటల్స్ | C | వన్డే, టి20ఐ | 23 | 2022 | 2023 | 2023 |
BCCI తన ఆటగాళ్లకు సెంట్రల్ కాంట్రాక్ట్‌లను ఇస్తుంది, ఆటగాళ్ల ప్రాముఖ్యతను బట్టి వేతనాల గ్రేడ్ అమలౌతుంది. గ్రేడ్లు, జీతాలూ ఇలా ఉన్నాయి:[38]
ఆటగాళ్ళు ఒక్కో టెస్టు మ్యాచ్‌కు ₹15 lakh (US$19,000), ఒక్కో వన్డేకి ₹6 lakh (US$7,500), టి20ఐకి ₹3 lakh (US$3,800) చొప్పున రుసుము అందుకుంటారు.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.