From Wikipedia, the free encyclopedia
నారిమన్ జంషెడ్జీ "నారీ" కాంట్రాక్టర్ (జననం 1934 మార్చి 7) మాజీ భారత క్రికెట్ ఆటగాడు. ఇతను ఎడమచేతి వాటం ఓపెనింగ్ బ్యాట్స్‌మన్. కాంట్రాక్టర్ 1955లో తొలి టెస్టుతో మొదలుపెట్టి, 1962 వరకు ఆడాడు. తీవ్రమైన గాయంతో అతని కెరీర్ ముగిసింది. 26 సంవత్సరాల వయస్సులో కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టిన నారీ అతి పిన్న వయస్కుడైన భారత కెప్టెన్.[1] 2007లో, అతను CK నాయుడు లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ అవార్డును అందుకున్నాడు. ఇది భారత బోర్డు మాజీ ఆటగాడికి అందించే అత్యున్నత గౌరవం. [2]
వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పూర్తి పేరు | నారిమన్ జంషెడ్జీ కాంట్రాక్టర్ | |||||||||||||||||||||||||||||||||||||||
పుట్టిన తేదీ | గోధ్ర, బాంబే ప్రెసిడెన్సీ, బ్రిటిషు భారతదేశం | 1934 మార్చి 7|||||||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | ఎడమచేతి వాటం | |||||||||||||||||||||||||||||||||||||||
బౌలింగు | కుడిచేతి వాటం మీడియం | |||||||||||||||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||
జాతీయ జట్టు | ||||||||||||||||||||||||||||||||||||||||
తొలి టెస్టు (క్యాప్ 77) | 1955 డిసెంబరు 2 - న్యూజీలాండ్ తో | |||||||||||||||||||||||||||||||||||||||
చివరి టెస్టు | 1962 మార్చి 7 - వెస్టిండీస్ తో | |||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: ESPNcricinfo, 2013 జనవరి 10 |
కాంట్రాక్టర్ గుజరాత్ తరపున తన ఫస్ట్-క్లాస్ కెరీర్‌ను ప్రారంభించాడు. 1955లో MCA సిల్వర్ జూబ్లీ మ్యాచ్‌ల కోసం జరిగిన సెలక్షన్ ట్రయల్ మ్యాచ్‌లలో నారీ ఆటను గుజరాత్ కెప్టెన్ ఫిరోజ్ ఖంబట్టా చూశాడు. అతను ట్రయల్స్‌లో బాగా రాణించాడు. పాకిస్తాన్ సర్వీసెస్ & భావల్పూర్ క్రికెట్ అసోసియేషన్‌తో జరిగే మ్యాచ్‌లకు ఎంపిక అవుతానని ఆశించాడు. కెప్టెన్ ఖంబట్టాను తప్పించడంతో అతను జట్టులోకి వచ్చాడు. కాంట్రాక్టర్ తన తొలి మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌లలోను సెంచరీలు సాధించాడు. ఆర్థర్ మోరిస్ తర్వాత అది సాధించిన రెండవ వ్యక్తి అతడు. [3]
తర్వాత భారత్ తరఫున ఆడేందుకు ఎంపికయ్యాడు. 1955లో ఢిల్లీలో న్యూజిలాండ్‌తో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో వినూ మన్కడ్ పాల్గొనలేకపోయిన తర్వాత [3] ఓపెనర్ అయ్యాడు. తర్వాత భారత కెప్టెన్ అయ్యాడు.
1959లో లార్డ్స్‌లో, మొదటి ఇన్నింగ్స్‌లో అతను బ్రియాన్ స్టాథమ్ వేసిన బంతి తగిలి రెండు పక్కటెముకలు విరిగాయి. అయినప్పటికీ అతను 81 పరుగులు చేశాడు. ఆ తర్వాత సంవత్సరం, కాన్పూర్‌లో రెండో ఇన్నింగ్స్‌లో అతని 74 పరుగులు ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టులో భారత్ విజయం సాధించడంలో కీలకంగా మారాయి. ఆ సమయంలో ఎడమచేతి వాటం స్పిన్ బౌలింగ్ చేస్తున్న అలన్ డేవిడ్సన్ వేసిన బంతిని అతను పుల్ చేసినపుడు షార్ట్ లెగ్ వద్ద నీల్ హార్వే క్యాచ్ చెయ్యడంతో ఈ ఇన్నింగ్స్ ముగిసింది. నీల్ హార్వే ఆ బంతిని పట్టుకోడానికి పలు ప్రయత్నాలు చేసాడు - వంగున్నాడు, పక్కకు తిరిగాడు కానీ చేతులతో బంతిని పట్టుకోలేకపోయాడు. అయితే బంతి అతని కాళ్ళ మధ్య చిక్కుకుని కాంట్రాక్టరు ఔటయ్యాడు..
కాంట్రాక్టర్ 1961–62లో ఇంగ్లండ్‌పై భారత్‌కు సిరీస్ విజయాన్ని అందించాడు. అదే సీజన్లో కరీబియన్‌లో పర్యటించిన భారత జట్టుకు నాయకత్వం వహించాడు. రెండు టెస్టుల అనంతరం భారత జట్టు బార్బడోస్‌కు వెళ్లింది. అక్కడ, 1962 మార్చిలో బ్రిడ్జ్‌టౌన్‌లోని కెన్సింగ్టన్ ఓవల్‌లో బార్బడోస్‌తో జరిగిన టూర్ మ్యాచ్‌లో, అతను జట్టు మొదటి ఇన్నింగ్స్‌లో దిలీప్ సర్దేశాయ్తో కలిసి బ్యాటింగ్ ప్రారంభించేటప్పుడు 2 పరుగులతో ఉండగా, [4] రెండో ఓవర్ నాలుగో బంతికి చార్లీ గ్రిఫిత్‌ను ఎదుర్కొన్నప్పుడు అతని దృష్టి ఒక్క క్షణం చెదిరిపోయింది. పెవిలియన్‌లో ఎవరో కిటికీ తెరవడం చూశాడు. దాంతో, బంతి అతని అతని పుర్రె [5][6] వెనుక భాగంలో తగిలింది. మెదడు లోపల రక్తం గడ్డకట్టడం వలన అతని నడుము నుండి కింద స్తంభించిపోయింది. రక్త్పు గడ్డను తొలగించడానికి రెండు శస్త్రచికిత్సలు జరిగాయి. అందుకు రక్తమార్పిడి అవసరం అయినందున, వెస్టిండీస్ కెప్టెన్ ఫ్రాంక్ వోరెల్,[7] కాంట్రాక్టర్ సహచరులు చందూ బోర్డే, బాపు నద్కర్ణి, పాలీ ఉమ్రిగర్లు రక్తదానం చేశారు. [8] కాంట్రాక్టర్ ప్రాణాలను కాపాడారు కానీ అతని అంతర్జాతీయ కెరీర్ ఆకస్మికంగా ముగిసింది. మూడో టెస్టు నుంచి మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ కెప్టెన్సీ బాధ్యతలు స్వీకరించాడు. ఇటీవలి ఇంటర్వ్యూలో, కాంట్రాక్టర్ గాయం తర్వాత కేవలం ఒకే ఒక టెస్టు ఆడాలనుకున్నానని, కానీ ప్రజలు తనను కోరుకోలేదని విచారం వ్యక్తం చేశాడు. [5]
కాంట్రాక్టర్ గాయపడిన సమయంలో క్రికెట్ బ్యాట్స్మెన్లు హెల్మెట్ ధరించేవారు కాదు. ఇప్పుడు ధరిస్తున్నారు.
అతను ఆడే రోజుల్లో, కాంట్రాక్టర్‌ను భారత క్రికెట్లో గ్లామర్ బాయ్‌గా పరిగణించేవారు. 1999లో సిమి గరేవాల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత పాఠశాల విద్యార్థినిగా తనకు కాంట్రాక్టర్‌పై ప్రేమ ఉండేదని పేర్కొంది.
నారీ కాంట్రాక్టర్ పార్సీ కమ్యూనిటీకి చెందినవాడు. [1] కాంట్రాక్టర్ ఇప్పుడు ముంబైలో నివసిస్తున్నాడు, అతను క్రికెట్ క్లబ్ ఆఫ్ ఇండియా అకాడమీలో కోచ్‌గా ఉన్నాడు. అతను 2007లో CK నాయుడు లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ అవార్డును అందుకున్నాడు [2]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.