కేరళకు చెందిన క్రికెటర్. From Wikipedia, the free encyclopedia
సంజు శాంసన్, కేరళకు చెందిన క్రికెటర్. దేశీయ క్రికెట్లో కేరళకు, ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో రాజస్థాన్ రాయల్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరించాడు.
వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పూర్తి పేరు | సంజు విశ్వనాథ్ శాంసన్ | |||||||||||||||||||||||||||||||||||
పుట్టిన తేదీ | పుల్లువిలా, తిరువనంతపురం, కేరళ | 1994 నవంబరు 11|||||||||||||||||||||||||||||||||||
ఎత్తు | 5 అ. 7 అం. (170 cమీ.)[1] | |||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | కుడిచేతి వాటం | |||||||||||||||||||||||||||||||||||
బౌలింగు | కుడిచేతి ఆఫ్ బ్రేక్[2] | |||||||||||||||||||||||||||||||||||
పాత్ర | వికెట్-కీపర్ | |||||||||||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||
జాతీయ జట్టు |
| |||||||||||||||||||||||||||||||||||
తొలి వన్డే (క్యాప్ 241) | 2021 జూలై 23 - శ్రీలంక తో | |||||||||||||||||||||||||||||||||||
చివరి వన్డే | 2023 ఆగస్టు 1 - వెస్టిండీస్ తో | |||||||||||||||||||||||||||||||||||
వన్డేల్లో చొక్కా సంఖ్య. | 9 | |||||||||||||||||||||||||||||||||||
తొలి T20I (క్యాప్ 55) | 2015 జూలై 19 - జింబాబ్వే తో | |||||||||||||||||||||||||||||||||||
చివరి T20I | 2023 ఆగస్టు 13 - వెస్టిండీస్ తో | |||||||||||||||||||||||||||||||||||
T20Iల్లో చొక్కా సంఖ్య. | 9 (గతంలో 14) | |||||||||||||||||||||||||||||||||||
దేశీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||
Years | Team | |||||||||||||||||||||||||||||||||||
2011–ప్రస్తుతం | కేరళ (స్క్వాడ్ నం. 9) | |||||||||||||||||||||||||||||||||||
2013–2015 | రాజస్థాన్ రాయల్స్ (స్క్వాడ్ నం. 8) | |||||||||||||||||||||||||||||||||||
2016–2017 | ఢిల్లీ క్యాపిటల్స్ (స్క్వాడ్ నం. 8) | |||||||||||||||||||||||||||||||||||
2018–ప్రస్తుతం | రాజస్థాన్ రాయల్స్ (స్క్వాడ్ నం. 11) | |||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||
మూలం: Cricinfo, 2023 జనవరి 3 |
కుడిచేతి వాటం కలిగిన వికెట్-కీపర్-బ్యాటర్, 2014 అండర్-19 క్రికెట్ ప్రపంచ కప్ కోసం భారత అండర్-19 జట్టుకు వైస్-కెప్టెన్‌గా ఉన్నాడు. 2015 లో జింబాబ్వేతో జరిగిన అంతర్జాతీయ టీ20 క్రికెట్ కు, 2021లో శ్రీలంకపై వన్డే అంతర్జాతీయ క్రికెట్ కు అరంగేట్రం చేశాడు.
ఢిల్లీలో తన క్రికెట్ కెరీర్‌ను ప్రారంభించిన సంజు, తరువాత కేరళకు వెళ్ళాడు. జూనియర్ క్రికెట్లో ప్రభావం చూపిన తర్వాత, 2011లో కేరళ తరఫున ఫస్ట్ క్లాస్ క్రికెట్ లోకి అరంగేట్రం చేశాడు. 2013లో రాజస్థాన్ రాయల్స్ తరపున తన ప్రీమియర్ లీగ్‌లో అరంగేట్రం చేసాడు. ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్‌ను గెలుచుకున్నాడు. 2019–20 విజయ్ హజారే ట్రోఫీలో అజేయంగా 212 పరుగులు చేసాడు, లిస్ట్ ఎ క్రికెట్లో ఆరోసారి డబుల్ సెంచరీ చేశాడు, ఇది ఫార్మాట్లో రెండవ వేగవంతమైన డబుల్ సెంచరీగా నమోదయింది.
సంజు 1994, నవంబరు 11న[3] కేరళ రాష్ట్రం, తిరువనంతపురం జిల్లాలోని విజింజం సమీపంలోని తీరప్రాంత గ్రామమైన పుల్లువిలాలో ఒక మలయాళీ కుటుంబంలో[4] జన్మించాడు.[5] తండ్రి శాంసన్ విశ్వనాథ్, గతంలో ఢిల్లీ పోలీస్‌లో పోలీస్ కానిస్టేబుల్ గా పనిచేశాడు. రిటైర్డ్ ఫుట్‌బాల్ ప్లేయర్ గా సంతోష్ ట్రోఫీ[6] లో ఢిల్లీకి ప్రాతినిధ్యం వహించాడు. తల్లి లిజీ విశ్వనాథ్ గృహిణి.[7] అన్నయ్య సాలీ శాంసన్ జూనియర్ క్రికెట్[8][9] లో కేరళకు ప్రాతినిధ్యం వహించాడు. ప్రస్తుతం ఏజీ కార్యాలయంలో పనిచేస్తున్నాడు.[10]
బుతువు | జట్టు | మ్యాచ్‌లు | పరుగులు |
---|---|---|---|
2013 | రాజస్థాన్ రాయల్స్ | 11 | 206 |
2014 | రాజస్థాన్ రాయల్స్ | 13 | 339 |
2015 | రాజస్థాన్ రాయల్స్ | 14 | 204 |
2016 | ఢిల్లీ డేర్ డెవిల్స్ | 14 | 291 |
2017 | ఢిల్లీ డేర్ డెవిల్స్ | 14 | 386 |
2018 | రాజస్థాన్ రాయల్స్ | 15 | 441 |
2019 | రాజస్థాన్ రాయల్స్ | 12 | 342 |
2020 | రాజస్థాన్ రాయల్స్ | 14 | 375 |
2021 | రాజస్థాన్ రాయల్స్ | 14 | 484 |
2022 | రాజస్థాన్ రాయల్స్ | 17 | 458 |
2023 | రాజస్థాన్ రాయల్స్ | 14 | 362 |
మొత్తం | 152 | 3888 | |
|
2016 నాటికి, సంజు తిరువనంతపురంలోని భారత్ పెట్రోలియం మేనేజర్‌గా పనిచేశాడు.[12] 2018లో తిరువనంతపురంలో యువ ఆటగాళ్ళకు క్రికెట్, ఫుట్‌బాల్ శిక్షణ ఇచ్చేందుకు "సిక్స్ గన్స్ స్పోర్ట్స్ అకాడమీ" అనే స్పోర్ట్స్ అకాడమీని ప్రారంభించాడు.[13] 2021 కేరళ శాసనసభ ఎన్నికలకు ముందు కేరళ రాష్ట్ర ఎన్నికల చిహ్నంగా నియమించబడ్డాడు.[14] 2023 ఫిబ్రవరిలో ఇండియన్ సూపర్ లీగ్ క్లబ్ కేరళ బ్లాస్టర్స్ ఎఫ్.సి. క్లబ్‌కు ప్రాతినిధ్యం వహించడానికి సంజును బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించినట్లు ప్రకటించింది.[15]
తిరువనంతపురం నివాసి అయిన తన చిరకాల స్నేహితురాలు చారులత రమేష్‌తో తన వివాహం జరుగునున్నట్లు 2018, సెప్టెంబరు 8న సంజు తన సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా ప్రకటించాడు.[16] వారు మార్ ఇవానియోస్ కాలేజీకి చెందిన కాలేజీ-మేట్స్.[17] 2018 డిసెంబరు 22న కోవలంలో ఒక ప్రైవేట్ వేడుకలో వివాహం జరిగింది.[18] సంజూ మాజీ కోచ్, మెంటర్ రాహుల్ ద్రవిడ్ మాత్రమే వివాహానికి హాజరయ్యాడు. వివాహ రిసెప్షన్ అదే రోజు నలంచిరలో జరిగింది.[19]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.