1945, ఏప్రిల్ 21 న చెన్నైలో జన్మించిన శ్రీనిసరాఘవన్ వెంకటరాఘవన్ (Srinivasaraghavan Venkataraghavan) భారతదేశానికి చెందిన మాజీ క్రికెట్ క్రీడాకారుడు. ఇంగ్లీష్ కౌంటీ క్రికెట్ లో ఇతడు డెర్బీషైర్ తరఫున ఆడినాడు. భారత క్రికెట్ జట్టు నుంచి రిటైర్ అయిన తర్వాత అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ఎలైట్ టెస్ట్ ప్యానెల్ అంపైర్ గా నియమించబడ్డాడు.
వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పూర్తి పేరు | శ్రీనివాస రాఘవన్ వెంకట రాఘవన్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పుట్టిన తేదీ | చెన్నై | 1945 ఏప్రిల్ 21|||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
మారుపేరు | వెంకట్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | కుడిచేతి వాటం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బౌలింగు | కుడిచేతి వాటం ఆఫ్ బ్రేక్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పాత్ర | బౌలరు | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
జాతీయ జట్టు | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి టెస్టు (క్యాప్ 110) | 1965 ఫిబ్రవరి 27 - న్యూజీలాండ్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి టెస్టు | 1983 సెప్టెంబరు 24 - పాకిస్తాన్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి వన్‌డే (క్యాప్ 8) | 1974 జూలై 13 - ఇంగ్లాండ్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి వన్‌డే | 1983 ఏప్రిల్ 7 - వెస్టిండీస్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
వన్‌డేల్లో చొక్కా సంఖ్య. | 79 | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
దేశీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
Years | Team | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
1963–1970 | Madras | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
1970–1985 | తమిళనాడు | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
1973–1975 | డెర్బీషైర్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
అంపైరుగా | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
అంపైరింగు చేసిన టెస్టులు | 73 (1993–2004) | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
అంపైరింగు చేసిన వన్‌డేలు | 52 (1993–2003) | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
అంపైరింగు చేసిన ఫ.క్లా | 79 (1990–2004) | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
అంపైరింగు చేసిన లిస్ట్ ఎ | 56 (1990–2003) | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: CricketArchive, 2014 మార్చి 10 |
1970 దశాబ్దంలో భారత జట్టులో ప్రముఖ స్పిన్నర్లయిన చంద్రశేఖర్, బిషన్ సింగ్ బేడీ, ఎరపల్లి ప్రసన్న లతో బాటు వెంకట రాఘవన్ ఒకరు. ఇతను ఫీల్డింగ్ లో మంచి నేర్పరి. అంతేకాకుండా చివరి వరుస బ్యాట్స్‌మెన్ లలో ఇతను ప్రయోజనకారిగా ఉండేవాడు. 20 సంవత్సరాల ప్రాయంలోనే భారత్ తరఫున న్యూజీలాండ్ పై టెస్ట్ మ్యాచ్ ఆడి, సీరీస్ చివరి నాటికి ప్రపంచ శ్రేణి స్పిన్నర్ గా అవతరించాడు. ఢిల్లీ టెస్టులో 12 వీకెట్లు సాధించి భారత విజయానికి దోహదపడ్డాడు. 1970-71 లో ఇంగ్లాండు పర్యటించిన భారత జట్టుకు ఉప నాయకుడిగా వ్యవహరించాడు. ఆ సీరీస్ లో భారత్ గెల్వడమే కాకుండా చరిత్ర సృష్టించింది. ఇందులో వెంకట రాఘవన్ కీలక పాత్ర వహించాడు. ట్రినిడాడ్ టెస్టులో 5 వికెట్లు సాధించడమే కాకుండా 3 టెస్టులలో మొత్తం 13 వికెట్లు పడగొట్టాడు.
1975లో జరిగిన మొదటి ప్రపంచ కప్ క్రికెట్ లో, 1979 రెండో ప్రపంచ కప్ క్రికెట్ లో ఇతను భారత జట్టుకు నాయకత్వం వహించాడు. 1979లో ఇంగ్లాండుతో జరిగిన 4 టెస్టుల సీరీస్ కు కూడా ఇతను నాకకత్వం వహించాడు. దేశవాళీ క్రికెట్ లో ఇతను సౌత్ జోన్ కు, తమిళనాడుకు దశాబ్దం పైగా నేతృత్వం వహించాడు.
1985లో వెంకట రాఘవన్ ఫస్ట్ క్లాస్ క్రికెట్ నుంచి నిష్క్రమించాడు. ఆ తర్వాత భారత టెస్ట్ జట్టుకు అడ్మినిస్ట్రేటర్ గా నియమించబడ్డాడు. 2003లో ఇతనికి పద్మశ్రీ బిరుదును భారత ప్రభుత్వం ప్రధానం చేసింది. వృత్తిరీత్యా ఇతను మెకానికల్ ఇంజనీరు.
అంపైర్ గా క్రీడా జీవితం
మొదటిసారిగా 1993, జనవరి 18 న జైపూర్లో జరిగిన భారత-ఇంగ్లాండు వన్డే మ్యాచ్ కు అంపైర్ గా బాధ్యతలు నిర్వహించాడు. అప్పటి నుంచి 73 టెస్టు మ్యాచ్ లకు, 52 వన్డే మ్యాచ్ లకు అతను అంపైరింగ్ బాధ్యతలు చేపట్టాడు. అతని అంపైర్ క్రీడా జీవితంలో ముఖ్యఘట్టాలు 1996, 1999, 2003 ప్రపంచ కప్ లలో అంపైరింగ్ విధులను నిర్వహించడం.
బయటి లింకులు
ఇవి కూడా చూడండి
Wikiwand in your browser!
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.