From Wikipedia, the free encyclopedia
తమిళనాడు క్రికెట్ జట్టు తమిళనాడు రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తున్న తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ నిర్వహిస్తున్న దేశీయ క్రికెట్ జట్టు. దేశీయ సర్క్యూట్లో తెల్లబంతి క్రికెట్లో ఆధిపత్యంలో ఉన్న జట్లలో ఇది ఒకటి. ఈ జట్టు భారతదేశంలోని దేశీయ ఫస్ట్-క్లాస్ క్రికెట్ టోర్నమెంట్లో అగ్రశ్రేణి అయిన రంజీ ట్రోఫీలో, జాబితా A టోర్నమెంట్లలో విజయ్ హజారే ట్రోఫీ, సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలలోనూ ఆడుతుంది. జట్టు రెండుసార్లు రంజీ ట్రోఫీని గెలుచుకుని, తొమ్మిది సార్లు రన్నరప్‌గా నిలిచింది. [1] విజయ్ హజారే ట్రోఫీ, సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలను తరచుగా గెలుచుకున్న జట్టు ఇది. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీని గెలుచుకున్న మొదటి జట్టు. మద్రాస్ రాష్ట్రం పేరును తమిళనాడుగా మార్చడానికి ముందు 1970-71 సీజన్ వరకు జట్టును మద్రాస్ అని పిలిచేవారు. భారతదేశంలో ఐదు వేర్వేరు దేశీయ ట్రోఫీలను (రంజీ ట్రోఫీ, ఇరానీ ట్రోఫీ, సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ, విజయ్ హజారే ట్రోఫీ, దేవధర్ ట్రోఫీ ) గెలుచుకున్న ఏకైక జట్టు తమిళనాడు.
వ్యక్తిగత సమాచారం | |
---|---|
కెప్టెన్ | సాయి కిషోర్ |
కోచ్ | సులక్షణ్ కులకర్ణి |
యజమాని | తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ |
జట్టు సమాచారం | |
రంగులు | Yellow Dark Blue |
స్థాపితం | 1864 |
స్వంత మైదానం | ఎం.ఎ. చిదంబరం స్టేడియం |
సామర్థ్యం | 50,000 |
చరిత్ర | |
రంజీ ట్రోఫీ విజయాలు | 2 |
ఇరానీ కప్ విజయాలు | 1 |
దేవధర్ ట్రోఫీ విజయాలు | 1 |
విజయ్ హజారే ట్రోఫీ విజయాలు | 5 |
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ విజయాలు | 3 |
అధికార వెబ్ సైట్ | TNCA |
ఈ జట్టు, BCCI మాజీ అధ్యక్షుడు MA చిదంబరం పేరు మీద నిర్మించిన MA చిదంబరం స్టేడియంలో ఉంది. 1916లో స్థాపించబడిన ఈ స్టేడియం సామర్థ్యం 38,000. [2] 1996 లో ఇక్కడ ఫ్లడ్లైట్లను ఏర్పాటు చేసారు.
భారత జట్టులో వన్డేలు మాత్రమే ఆడిన (టెస్టులు ఆడకూండా) తమిళనాడు ఆటగాళ్ళు (బ్రాకెట్లో తొలి మ్యాచ్ ఆడిన సంవత్సరం):
భారత జట్టులో భారత్ తరఫున టి20 లు ఆడిన (టెస్టులు, వన్డేలూ ఆడని) తమిళనాడు ఆటగాళ్ళు (బ్రాకెట్లో తొలి మ్యాచ్ ఆడిన సంవత్సరం):
తమిళనాడు జట్టులో ఆడి, భారత జట్టులో టెస్టులు ఆడిన ఇతర రాష్ట్రాల జట్టుల ఆటగాళ్ళు (బ్రాకెట్లో తొలి మ్యాచ్ ఆడిన సంవత్సరం):
ఇతరదేశాల జట్టులలో అంతర్జాతీయ క్రికెట్ ఆడిన తమిళనాడు ఆటగాళ్ళు (బ్రాకెట్లో తొలి మ్యాచ్ ఆడిన సంవత్సరం):
అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడని ప్రముఖ ఆటగాళ్ళు
పేరు | పుట్టిన రోజు | బ్యాటింగు శైలి | బౌలింగు శైలి | TNCA క్లబ్ | గమనికలు | |
---|---|---|---|---|---|---|
బ్యాటర్లు | ||||||
బాబా అపరాజిత్ | 1994 జూలై 8 | కుడిచేతి వాటం | కుడిచేతి ఆఫ్ బ్రేక్ | జాలీ రోవర్స్ CC | ||
సాయి సుదర్శన్ | 2001 అక్టోబరు 15 | ఎడమచేతి వాటం | కుడిచేతి లెగ్ బ్రేక్ | జాలీ రోవర్స్ CC | ఐపిఎల్‌లో Gujarat Titans కు ఆడతాడు | |
బాబా ఇంద్రజిత్ | 1994 జూలై 8 | కుడిచేతి వాటం | కుడిచేతి లెగ్ బ్రేక్ | జాలీ రోవర్స్ CC | ||
షారుఖ్ ఖాన్ | 1995 మే 27 | కుడిచేతి వాటం | కుడిచేతి ఆఫ్ బ్రేక్ | గ్రాండ్ స్లామ్ CC | ఐపిఎల్‌లో Punjab Kings కు ఆడతాడు | |
ప్రదోష్ రంజన్ పాల్ | 2000 డిసెంబరు 21 | ఎడమచేతి వాటం | కుడిచేతి ఆఫ్ బ్రేక్ | విజయ్ CC | Vice-captain | |
జి అజితేష్ | 2002 సెప్టెంబరు 26 | కుడిచేతి వాటం | జాలీ రోవర్స్ CC | |||
ఆల్ రౌండర్లు | ||||||
విజయ్ శంకర్ | 1991 జనవరి 26 | కుడిచేతి వాటం | కుడిచేతి మీడియం | విజయ్ CC | ఐపిఎల్‌లో Gujarat Titans కు ఆడతాడు | |
సంజయ్ యాదవ్ | 1995 మే 10 | ఎడమచేతి వాటం | ఎడమచేతి స్లో ఆర్థడాక్స్ | మైలాపూర్ RC (A) | ||
J. కౌసిక్ | 1995 మే 23 | కుడిచేతి వాటం | కుడిచేతి మీడియం | Young Stars CC | ||
వాషింగ్టన్ సుందర్ | 1999 అక్టోబరు 5 | ఎడమచేతి వాటం | కుడిచేతి ఆఫ్ బ్రేక్ | గ్ళొబ్ ట్రాటర్స్ SC | ఐపిఎల్‌లో Sunrisers Hyderabad కు ఆడతాడు | |
వికెట్ కీపరు | ||||||
నారాయణ్ జగదీశన్ | 1995 డిసెంబరు 24 | కుడిచేతి వాటం | విజయ్ CC | ఐపిఎల్‌లో Kolkata Knight Riders కు ఆడతాడు | ||
స్పిన్ బౌలర్లు | ||||||
సాయి కిషోర్ | 1996 నవంబరు 6 | ఎడమచేతి వాటం | ఎడమచేతి స్లో ఆర్థడాక్స్ | విజయ్ CC | Captain ఐపిఎల్‌లో Gujarat Titans కు ఆడతాడు | |
మణిమారన్ సిద్ధార్థ్ | 1998 జూలై 3 | ఎడమచేతి వాటం | ఎడమచేతి స్లో ఆర్థడాక్స్ | విజయ్ CC | ||
అజిత్ రామ్ | 1998 సెప్టెంబరు 5 | ఎడమచేతి వాటం | ఎడమచేతి స్లో ఆర్థడాక్స్ | గ్ళొబ్ ట్రాటర్స్ SC | ||
వరుణ్ చక్రవర్తి | 1991 ఆగస్టు 29 | కుడిచేతి వాటం | కుడిచేతి లెగ్ బ్రేక్ | విజయ్ CC | ఐపిఎల్‌లో Kolkata Knight Riders కు ఆడతాడు | |
రవిచంద్రన్ అశ్విన్ | 1986 సెప్టెంబరు 17 | కుడిచేతి వాటం | కుడిచేతి ఆఫ్ బ్రేక్ | మైలాపూర్ RC (A) | ఐపిఎల్‌లో Rajasthan Royals కు ఆడతాడు | |
పేస్ బౌలర్లు | ||||||
సందీప్ వారియర్ | 1991 ఏప్రిల్ 4 | కుడిచేతి వాటం | కుడిచేతి మీడియం | విజయ్ CC | ఐపిఎల్‌లో Mumbai Indians కు ఆడతాడు | |
ఎల్ విఘ్నేష్ | 1989 మార్చి 20 | కుడిచేతి వాటం | కుడిచేతి ఫాస్ట్ మీడియం | విజయ్ CC | ||
సోనూ యాదవ్ | 1999 నవంబరు 11 | కుడిచేతి వాటం | కుడిచేతి మీడియం-fast | జాలీ రోవర్స్ CC | ఐపిఎల్‌లో Royal Challengers Bangalore కు ఆడతాడు | |
అస్విన్ క్రిస్ట్ | 1994 జూలై 9 | కుడిచేతి వాటం | కుడిచేతి ఫాస్ట్ మీడియం | గ్రాండ్ స్లామ్ CC | ||
త్రిలోక్ నాగ్ | 2000 మే 28 | కుడిచేతి వాటం | కుడిచేతి ఫాస్ట్ మీడియం | విజయ్ CC | ||
ఎం మహమ్మద్ | 1991 డిసెంబరు 3 | కుడిచేతి వాటం | కుడిచేతి మీడియం-fast | United Friends CC | ||
రఘుపతి సిలంబరసన్ | 1993 మార్చి 7 | కుడిచేతి వాటం | కుడిచేతి మీడియం-fast | మైలాపూర్ RC (A) | ||
టి నటరాజన్ | 1991 ఏప్రిల్ 4 | ఎడమచేతి వాటం | ఎడమచేతి మీడియం | విజయ్ CC | ఐపిఎల్‌లో Sunrisers Hyderabad కు ఆడతాడు |
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.