From Wikipedia, the free encyclopedia
వాంఖెడే స్టేడియం ముంబైలో ఉన్న అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం.[2] ఇది ముంబై క్రికెట్ అసోసియేషన్ (ఎమ్సిఏ) యాజమాన్యంలో ఉంది. ఐపియెల్ లోని ముంబై ఇండియన్స్ జట్టుకు ఇది హోమ్ గ్రౌండ్. ఎమ్సిఏ, బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (BCCI), ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) ల ప్రధాన కార్యాలయాలు ఈ స్టేడియం లోనే ఉన్నాయి.
Address | నేతాజీ సుభాస్ చంద్ర బోస్ రోడ్డు, చర్చ్‌గేట్, దక్షిణ ముంబై |
---|---|
Location | చర్చ్‌గేట్, ముంబై, మహారాష్ట్ర |
Owner | ముంబై క్రికెట్ అసోసియేషన్ |
Operator | ముంబై క్రికెట్ అసోసియేషన్ |
Seating type | స్టేడియం సీటింగు |
Capacity | 32,000 (2011–ఇప్పటి వరకు)[1] 39,000 (1974–2010)[1] |
Surface | పచ్చిక |
Construction | |
Architect | శశి ప్రభు అండ్ ఎసోసియేట్స్ (1974), శశి ప్రభు అండ్ ఎసోసియేట్స్, పి.కె. దాస్ అండ్ ఎసోసియేట్స్ (2017) |
మైదాన సమాచారం | |
స్థాపితం | 1974 |
వాడుతున్నవారు | ముంబై క్రికెట్ జట్టు ముంబై ఇండియన్స్ భారత క్రికెట్ జట్టు |
ఎండ్ల పేర్లు | |
టాటా ఎండ్ గర్వారే పెవిలియన్ ఎండ్ | |
అంతర్జాతీయ సమాచారం | |
మొదటి టెస్టు | 1975 జనవరి 23-29: భారతదేశం v వెస్ట్ ఇండీస్ |
చివరి టెస్టు | 2021 డిసెంబరు 3–7: భారతదేశం v న్యూజీలాండ్ |
మొదటి ODI | 1987 జనవరి 17: భారతదేశం v శ్రీలంక |
చివరి ODI | 2023మార్చి 17: భారతదేశం v ఆస్ట్రేలియా |
మొదటి T20I | 2012 డిసెంబరు 22: భారతదేశం v ఇంగ్లాండు |
చివరి T20I | 2023 జనవరి 3: భారతదేశం v శ్రీలంక |
ఏకైక మహిళా టెస్టు | 1984 ఫిబ్రవరి 10–13: భారతదేశం v ఆస్ట్రేలియా |
మొదటి WODI | 1997 డిసెంబరు 23: ఐర్లాండ్ v న్యూజీలాండ్ |
చివరి WODI | 2019 ఫిబ్రవరి 28: భారతదేశం v ఇంగ్లాండు |
ఏకైక WT20I | 2016 మార్చి 31: వెస్ట్ ఇండీస్ v న్యూజీలాండ్ |
2023 మార్చి 17 నాటికి Source: Cricinfo |
ఈ స్టేడియం చర్చ్‌గేట్ ప్రాంతంలో మెరైన్ డ్రైవ్‌కు సమీపంలో ఉంది. హిందూ జింఖానా, పార్సీ జింఖానా, క్రికెట్ క్లబ్ ఆఫ్ ఇండియా (CCI)తో సహా అనేక పాత క్రికెట్ క్లబ్‌లు స్టేడియం సమీపంలో ఉన్నాయి.
ఈ స్టేడియంలో గతంలో అనేక హై-ప్రొఫైల్ క్రికెట్ మ్యాచ్‌లు జరిగాయి. ముఖ్యంగా 2011 క్రికెట్ ప్రపంచ కప్ ఫైనల్. ఇక్కడే భారత్ శ్రీలంకను ఓడించి, సొంత గడ్డపై క్రికెట్ ప్రపంచ కప్‌ను గెలుచుకున్న మొదటి దేశంగా అవతరించింది. సచిన్ టెండూల్కర్ అంతర్జాతీయ కెరీర్లో చివరి మ్యాచ్ జరిగింది కూడా ఈ స్టేడియం లోనే.
ముంబైలో మూడు వేర్వేరు మైదానాల్లో టెస్టు మ్యాచ్‌లు జరిగాయి. బాంబే జింఖానా మైదానంలో 1933-34లో ఇంగ్లండ్‌పై భారతదేశం మొట్టమొదటి టెస్టు ఆడింది. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత, క్రికెట్ క్లబ్ ఆఫ్ ఇండియాకు చెందిన బ్రాబోర్న్ స్టేడియంలో 17 టెస్టులు జరిగాయి. ఇది నగరంలోని రెండవ మైదానం.
క్రికెట్ మ్యాచ్‌ల టిక్కెట్ల కేటాయింపు విషయమై బ్రాబోర్న్ స్టేడియం యాజమాన్యానికి (సిసిఐ), బాంబే క్రికెట్ అసోసియేషన్‌కూ (బిసిఏ; ఇప్పుడు ముంబై క్రికెట్ అసోసియేషన్) వివాదాలు వచ్చాయి.[3] 1973లో భారత్, ఇంగ్లాండ్ ల మధ్య జరిగిన టెస్టు తర్వాత ఈ వివాదాలు ముదిరాయి. ముంబై క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి, రాజకీయ నాయకుడూ అయిన SK వాంఖెడే చొరవతో బిసిఏ, దక్షిణ బొంబాయిలో చర్చ్‌గేట్ స్టేషన్‌కు సమీపంలో కొత్త స్టేడియం నిర్మించుకుంది. 1974లో దీనికి వాంఖెడే పేరే పెట్టారు. సుమారు 13 నెలల్లో నిర్మించి,1975లో భారత, వెస్టిండీస్ ల మధ్య జరిగిన చివరి టెస్టుతో దీన్ని ప్రారంభించారు.[4] అప్పటి నుండి, వాంఖెడే స్టేడియం నగరంలో ప్రధాన క్రికెట్ వేదికగా ఉంటూ వచ్చింది.
1974-75 సీజన్లో వెస్టిండీస్ భారత్‌లో పర్యటించినప్పుడు వాంఖెడే స్టేడియంలో మొదటి టెస్టు జరిగింది. ఆ మ్యాచిలో భారత్ 201 పరుగుల తేడాతో ఓడిపోయింది. వెస్టిండీస్ ఆటగాడు క్లైవ్ లాయిడ్‌ను పలకరించడానికి ఒక అభిమాని మైదానంలోకి దూసుకొచ్చాడు. రెండు సీజన్ల తర్వాత న్యూజిలాండ్‌పై జరిగిన మ్యాచిలో భారత్ ఈ స్టేడియంలో తొలి విజయం సాధించింది. 1978-79 సిరీస్‌లో వెస్టిండీస్‌పై సునీల్ గవాస్కర్ 205 పరుగులు, అదే గేమ్‌లో ఆల్విన్ కాళీచరణ్ 187 పరుగుల ఇన్నింగ్స్‌కు, ఇయాన్ బోథమ్ సెంచరీతో పాటు, పదమూడు వికెట్ల వంటి ఆల్ రౌండ్ ప్రదర్శనలకూ ఈ స్టేడియం సాక్షి. 1979-80లో జూబ్లీ టెస్టులో ఇంగ్లండ్ పది వికెట్ల తేడాతో గెలిచింది. 2016–17లో ఇంగ్లండ్‌పై విరాట్ కోహ్లి చేసిన 235 పరుగులే వాంఖెడే స్టేడియంలో భారత ఆటగాడి అత్యధిక స్కోరు. యాదృచ్ఛికంగా రంజీ ట్రోఫీలో ఫస్ట్-క్లాస్ క్రికెట్లో వేగవంతమైన డబుల్ సెంచరీకి వెళ్లే క్రమంలో రవిశాస్త్రి, బరోడా ఆటగాడు తిలక్ రాజ్ వేసిన ఓవర్లో ఆరు సిక్సర్లు బాదిన రికార్డు, 1984-85లో ఈ మైదానంలోనే నమోదైంది. శాస్త్రి 123 బంతుల్లో 113 నిమిషాల్లో 13 ఫోర్లు, 13 సిక్సర్లతో చేసిన అజేయమైన 200 పరుగులు ఫస్ట్ క్లాస్ క్రికెట్లో అత్యంత వేగవంతమైన డబుల్ సెంచరీకి రికార్డుగా నిలిచింది. 2017–18 సీజన్లో షఫీకుల్లా షఫాక్ 89 బంతుల్లో డబుల్ సెంచరీ చేసినపుడు ఆ రికార్డు బద్దలైంది.[5][6]
2011 ప్రపంచ కప్‌ను భారతదేశం, బంగ్లాదేశ్, శ్రీలంకలు సంయుక్తంగా నిర్వహించాయి. ఫైనల్ మ్యాచ్ వాంఖెడే స్టేడియంలో జరిగింది. ప్రేక్షకులకు ఆధునిక సౌకర్యాలు అందించేందుకు స్టేడియాన్ని అభివృద్ధి చేసారు.
మేనేజింగ్ కమిటీ పి.కె. దాస్ & అసోసియేట్స్, శశి ప్రభు & అసోసియేట్స్ తో సంయుక్తంగా వాంఖెడే స్టేడియం పునరాభివృద్ధి కోసం ఒక ప్రాజెక్ట్‌ను రూపొందించింది. స్టేడియాన్ని తిరిగి అభివృద్ధి చేస్తున్నప్పుడు, బకెట్ సీటింగ్, పెద్ద సంఖ్యలో టాయిలెట్లు, ఫుడ్ కోర్ట్‌ల పరంగా ప్రేక్షకులకు మెరుగైన సౌకర్యాలతో ఉత్తర, దక్షిణ ఎండ్లలో పెద్ద మార్పులు చేసారు.
స్టేడియం ముఖ్యాంశాలలో కాంటిలివర్ పైకప్పు ఒకటి. దీనికి వేసిన టెఫ్లాన్ ఫాబ్రిక్ పైకప్పు బరువు తక్కువగా ఉంటుంది, వేడిని తట్టుకోగలదు. ఆట చూసేటపుడు ప్రేక్షకులకు అడ్డం లేకుండా ఉండేలా కప్పుకి స్తంభాలు లేకుండా నిర్మించారు. పైకప్పుపై, స్టాండ్ల నుండి వేడి గాలిని పీల్చేసే ఎగ్జాస్ట్ ఫ్యాన్లు ఉన్నాయి. వీటివలన పశ్చిమం నుండి చల్లటి గాలి లోపలికి వీస్తుంది. స్టేడియంలో ఉత్తర, దక్షిణ స్టాండ్ల కోసం 20 ఎలివేటర్లు ఉన్నాయి.[7]
2011 క్రికెట్ ప్రపంచ కప్ కోసం పునరుద్ధరణల తరువాత స్టేడియంలో 32,000 మంది కూచునే సామర్థ్యం మిగిలింది. పునరుద్ధరణకు ముందు సామర్థ్యం సుమారు 39,000 ఉండేది.[1]
2023 ప్రపంచ కప్ పోటీల్లో వేదికగా వాంఖెడే స్టేడియాన్ని ఉపయోగించాలని ప్రతిపాదించారు. దానికోసం స్టేడియాన్ని నవీకరించారు. అవుట్‌ఫీల్డ్ మొత్తాన్ని పునరుద్ధరించే పనిని పర్యవేక్షించడానికి శశి ప్రభు & అసోసియేట్లను మరోసారి నియమించారు. మ్యాచ్‌లు 2023 అక్టోబరు, నవంబరుల్లో జరగనున్నాయి.
మైదానంలో నేల పైపొర అంతా స్థానికంగా లభించే ఎర్ర మట్టి పరచారు. దీనివలన బంతికి అదనపు బౌన్స్ లభిస్తూ, బ్యాటింగ్ చెయ్యడం కొద్దిగా క్లిష్టతరంగా మారుతుంది. కొద్ది సంవత్సరాలుగా ఇక్కడి పిచ్ సాధారణంగా బౌలర్ల కంటే బ్యాటర్లకే ఎక్కువగా అనుకూలంగా ఉంటూ వచ్చింది. అయితే, 2004 నాటి బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో 4వ టెస్టు సందర్భంగా పిచ్ తీవ్ర విమర్శలకు గురైంది. ఈ టెస్ట్ మ్యాచ్ కేవలం రెండున్నర రోజుల్లోనే భారత్ విజయంతో ముగిసింది. అప్పటి ఆసీస్ కెప్టెన్ రికీ పాంటింగ్ ఈ మైదానాన్ని "మందుపాతర" అని వర్ణించాడు. ఆట 1వ సెషన్ నుండి బంతి చాలా వేగంగా తిరగడం ప్రారంభించింది. మామూలుగానే, స్టేడియం వెంబడి సముద్రపు గాలి ప్రవాహం కారణంగా కొత్త బంతితో పేస్ బౌలర్లు పిచ్ నుండి కొంత సహాయం పొందుతారు.
క్రికెట్ ప్రపంచ కప్‌కు భారతదేశం ఆతిథ్యం ఇచ్చిన ప్రతిసారీ ఈ స్టేడియం 20 వన్డే ఇంటర్నేషనల్ మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇచ్చింది:
2011 మార్చి 13 స్కోరు |
v |
కెనడా 261/9 (50 ఓవర్లు) | |
ఆషిష్ బగాయ్ 84(87) హర్వీర్ బైద్వాన్ 3/84 (9.1 ఓవర్లు) |
వాంఖడే స్టేడియంలో 2011 ప్రపంచ కప్ గెలిచినపుడు, సొంతగడ్డపై క్రికెట్ ప్రపంచకప్ గెలిచిన తొలి దేశంగా భారత్ నిలిచింది.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.