దిలీప్ వెంగ్‌సర్కార్

From Wikipedia, the free encyclopedia

దిలీప్ వెంగ్‌సర్కార్

1956 ఏప్రిల్ 6మహారాష్ట్ర లోని రాజాపూర్ లో జన్మించిన దిలీప్ బల్వంత్ వెంగ్‌సర్కార్ (Dilip Balwant Vengsarkar) భారత మాజీ క్రికెట్ క్రీడాకారుడు, ప్రస్తుత భారత జట్టు సెలెక్షన్ కమిటి చైర్మెన్. కొలోనెల్ అనే ముద్దుపేరు కల ఈ బ్యాట్స్‌మెన్ డ్రవ్‌లు కొట్టడంలో నేర్పరి. 1975-76 లో న్యూజీలాండ్తో జరిగిన ఆక్లాండ్ టెస్ట్ ద్వారా ఓపెనర్ గా అంతర్జాతీయ క్రికెట్ ఆరంగేట్రం చేసాడు. అతను అంతగా సఫలం కాకున్ననూ భారత్ ఈ మ్యాచ్ గెల్చింది. 1983లో ప్రపంచ కప్ గెల్చిన భారత జట్టులో ఇతను ప్రాతినిధ్యం వహించాడు. 1985 నుంచి 1987 వరకు చక్కగా రాణించి పాకిస్తాన్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండు, వెస్ట్‌ఇండీస్, శ్రీలంక లపై సెంచరీలు సాధించి ఆ సమయంలో అత్యుత్తమ బ్యాట్స్‌మెన్ గావతరించాడు. వెస్ట్‌ఇండీస్ క్రికెట్ ప్రపంచాన్ని శాసించే సమయంలో మార్షల్, హోల్డింగ్, రోబెర్ట్స్ ల బౌలింగ్ ను సమర్థంగా ఎదుర్కొని ఆ జట్టుపై 6 సెంచరీలు సాధించాడు. టెస్ట్ క్రికెట్ అత్యుత్తమ వేదికలలో ఒకటైన లార్డ్స్ మైదానంలో వరుసగా 3 సెంచరీలు సాధించి ఈ ఘనతను సాధించిన తొలి భారతీయుడిగా నిల్చాడు. 1987 ప్రపమ్చ కప్ తర్వాత కపిల్ దేవ్ నుంచి నాయకత్వ బాధ్యతలు స్వీకరించాడు. టెస్ట్ క్రికెట్ లో అతను 116 టెస్టులు ఆడి 6868 పరుగులు సాధించాడు. ఇందులో 17 సెంచరీలు, 35 అర్థ సెంచరీలు ఉన్నాయి. వన్డే క్రికెట్ లో 129 మ్యాచ్‌లు ఆడి ఒక సెంచరీతో సహా మొత్తం 3508 పరుగులు చేసాడు. క్రికెట్ నుంచి రిటైర్‌మెంట్ తర్వాత Elf-Vengsarkar Academy[1]ని స్థాపించాడు.2003లో వెంగ్‌సర్కార్ ముంబాయి క్రికెట్ అసోసియేషన్ కు ఉపాద్యక్షుడిగా ఎన్నికైనాడు.[2] ఆ తర్వాత బి.సి.సి.ఐ సెల్క్షన్ కమీటీ చైర్మెన్ గా నియమించబడ్డాడు. 2006 మార్చిలో మ్యాచ్ రెఫరీ చేయుటకు అతని పేరు ప్రతిపాదించిననూ [3] సెలక్షన్ కమీటీ అధిపతిగా ఉండుటకు మాత్రమే అతను మొగ్గుచూపుటంతో అది ముందడుగు పడలేదు.[4] తాజాగా దినపత్రికలో కాలమ్స్ వ్రాయుటకు నిషేధం విధించడంతో అతను బోర్డు నిర్ణయానికి ఒప్పుకోవాల్సి వచ్చింది.

త్వరిత వాస్తవాలు వ్యక్తిగత సమాచారం, పూర్తి పేరు ...
దిలీప్ వెంగ్‌సర్కార్
Thumb
2011 లో వెంగ్‌సర్కార్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
దిలీప్ బల్వంత్ వెంగ్‌సర్కార్
పుట్టిన తేదీ (1956-04-06) 6 ఏప్రిల్ 1956 (age 68)
రాజాపూర్, మహారాష్ట్ర
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి వాటం మీడియం పేస్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 139)1976 జనవరి 24 - న్యూజీలాండ్ తో
చివరి టెస్టు1992 ఫిబ్రవరి 5 - ఆస్ట్రేలియా తో
తొలి వన్‌డే (క్యాప్ 19)1976 ఫిబ్రవరి 21 - న్యూజీలాండ్ తో
చివరి వన్‌డే1991 నవంబరు 14 - దక్షిణాఫ్రికా తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
1975/76–1991/92Bombay
1985Staffordshire
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్టులు వన్‌డేలు ఫస్ట్ లిస్ట్ ఎ
మ్యాచ్‌లు 116 129 260 174
చేసిన పరుగులు 6,868 3,508 17,868 4,835
బ్యాటింగు సగటు 42.13 34.73 52.86 35.29
100లు/50లు 17/35 1/23 55/87 1/35
అత్యుత్తమ స్కోరు 166 105 284 105
వేసిన బంతులు 47 6 199 12
వికెట్లు 0 0 1 0
బౌలింగు సగటు 126.00
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0
అత్యుత్తమ బౌలింగు 1/31
క్యాచ్‌లు/స్టంపింగులు 78/– 37/– 179/– 51/–
మూలం: Cricinfo, 2010 ఫిబ్రవరి 7
మూసివేయి

గుర్తింపులు, బిరుదులు

పద్మశ్రీ పురస్కారం

మూలాలు

ఇవి కూడా చూడండి

Loading related searches...

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.