Remove ads
From Wikipedia, the free encyclopedia
భారత మహిళల జాతీయ క్రికెట్ జట్టు మహిళల అంతర్జాతీయ క్రికెట్లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తుంది. ఈ జట్టును 'ఉమెన్ ఇన్ బ్లూ' అని కూడా పిలుస్తారు.[8] దీనిని బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (బిసిసిఐ) నిర్వహిస్తుంది. దీనికి అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) లో పూర్తి సభ్యత్వం కలిగి ఉంది. ఈ జట్టు మహిళల టెస్ట్ క్రికెట్, మహిళల ఒక రోజు అంతర్జాతీయ (WODI)) క్రికెట్, మహిళల అంతర్జాతీయ ట్వంటీ 20 రూపాలలో మ్యాచ్ లు ఆడుతుంది.
మారుపేరు | వుమెన్ ఇన్ బ్లు | |||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|
అసోసియేషన్ | Board of Control for Cricket in India | |||||||||
వ్యక్తిగత సమాచారం | ||||||||||
కెప్టెన్ | Harmanpreet Kaur | |||||||||
కోచ్ | Hrishikesh Kanitkar (acting) | |||||||||
చరిత్ర | ||||||||||
టెస్టు హోదా పొందినది | 1976 | |||||||||
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ | ||||||||||
ICC హోదా | List of International Cricket Council members|Full member (1926) | |||||||||
ICC ప్రాంతం | Asian Cricket Council Asia | |||||||||
| ||||||||||
Women's Tests | ||||||||||
తొలి మహిళా టెస్టు | v వెస్ట్ ఇండీస్ at the M. Chinnaswamy Stadium, Bangalore; 31 October – 2 November 1976 | |||||||||
చివరి మహిళా టెస్టు | v ఆస్ట్రేలియా at Carrara Stadium, Gold Coast; 30 September – 3 October 2021 | |||||||||
| ||||||||||
Women's One Day Internationals | ||||||||||
తొలి మహిళా వన్డే | v ఇంగ్లాండు at Eden Gardens, Calcutta; 1 January 1978 | |||||||||
చివరి మహిళా వన్డే | v బంగ్లాదేశ్ at Sher-e-Bangla National Cricket Stadium, Mirpur; 22 July 2023 | |||||||||
| ||||||||||
Women's World Cup appearances | 10 (first in 1978) | |||||||||
అత్యుత్తమ ఫలితం | Runners-up (2005, 2017) | |||||||||
Women's World Cup Qualifier appearances | 1 (first in 2017 Women's Cricket World Cup Qualifier|2017) | |||||||||
అత్యుత్తమ ఫలితం | Champions (2017) | |||||||||
Women's Twenty20 Internationals | ||||||||||
తొలి WT20I | v ఇంగ్లాండు at the County Cricket Ground, Derby; 5 August 2006 | |||||||||
చివరి WT20I | v బంగ్లాదేశ్ at Sher-e-Bangla National Cricket Stadium, Mirpur; 13 July 2023 | |||||||||
| ||||||||||
Women's T20 World Cup appearances | 8 (first in 2009 ICC Women's World Twenty20|2009) | |||||||||
అత్యుత్తమ ఫలితం | Runner-up (2020) | |||||||||
| ||||||||||
As of 22 జులై 2023 |
భారతదేశ మహిళా జట్టు మొదట 1976లో వెస్టిండీస్‌తో జరిగిన టెస్ట్ మ్యాచ్ తో ఆరంభించింది. తరువాత 1978లో ఆతిథ్యమిచ్చిన దేశంతో ప్రపంచ కప్ ఒకరోజు ఇంటర్నేషనల్ (ODI) మ్యాచ్ లు మొదలు పెట్టింది.[9] 2006లో ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి మహిళా టీ20లో భారత్ అరంగేట్రం చేసింది.
2005లో ఆస్ట్రేలియా చేతిలో 98 పరుగుల తేడాతో ఓడిపోయింది ఇంకా 2017లో ఇంగ్లాండ్ చేతిలో 9 పరుగుల తేడాతో ఓడిపోవడం జరిగింది. అయితే ఈ రెండు సందర్భాలలో భారత జట్టు ఒక రోజు ప్రపంచ కప్ ఆఖరి రోజుకు (ఫైనల్) చేరుకుంది. భారత్ మరో మూడు సందర్భాల్లో - 1997, 2000, 2009 చివరి ముందు పోటీలకు (సెమీఫైనల్స్) చేరుకుంది. భారత్ ఒక సందర్భంలో (2020) టి20ఐ ప్రపంచ కప్ ఫైనల్స్, ఇంకా నాలుగు సందర్భాలలో (2009, 2010, 2018, 2023 - 2023) సెమీఫైనల్స్ కు చేరుకుంది.
2022 కామన్వెల్త్ గేమ్స్ లో భారత్ రజత పతకాన్ని గెలుచుకుంది. 2018 వ సంవత్సరం మినహా మహిళల ఆసియా కప్ మిగిలిన అన్ని ఎడిషన్లను భారత్ గెలుచుకుంది. భారత్ మహిళా క్రికెట్ జట్టు ఆసియాలోనే అత్యంత విజయవంతమైన జట్టు.
1700 ల ప్రారంభంలో బ్రిటిష్ వారు భారతదేశానికి క్రికెట్ ని ప్రవేశ పెట్టారు. 1721 లో క్రికెట్ ఆడబడిన మొదటి డాక్యుమెంట్ ఉదాహరణ. దీనిని గుజరాత్ కి చెందిన కోలీలు ఆడారు. ఈ కోలీలు బ్రిటిష్ నౌకలను దోచుకునే సముద్రపు దొంగలు ఇంకా చట్టవ్యతిరేకులు కాబట్టి, ఈస్ట్ ఇండియా కంపెనీ క్రికెట్లో కోలీలను ఆడించింది, విజయవంతమైంది.[10][11] మొదటి భారతీయ క్రికెట్ క్లబ్ ను 1848లో బొంబాయిలో పార్సీ సమాజం స్థాపించింది. ఈ క్లబ్ 1877లో ఐరోపా వారితో (యూరోపియన్) తమ మొదటి మ్యాచ్ ఆడింది.[12] మొదటి అధికారిక భారత క్రికెట్ జట్టు 1911లో ఇంగ్లాండ్ లో పర్యటించింది. అక్కడ వారు ఇంగ్లీష్ కౌంటీ జట్లతో ఆడారు.[13] 1932లో ఇంగ్లాండ్ తో జరిగిన తొలి టెస్టులో భారత జట్టు ఆడింది.[14] అదే సమయంలో అంటే 1934 లో ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా మధ్య మొదటి మహిళల టెస్ట్ జరిగింది.[15] అయితే మహిళల క్రికెట్ చాలా కాలం తరువాత భారతదేశానికి వచ్చింది. 1973లో భారత మహిళా క్రికెట్ సంఘం (ఉమెన్స్ క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా) ఏర్పడింది.[16] భారత మహిళల జట్టు 1976లో తమ తొలి టెస్ట్ మ్యాచ్ వెస్టిండీస్ జట్టుతో ఆడింది.[17] 1978 నవంబరులో పాట్నాలోని మొయిన్ - ఉల్ - హక్ స్టేడియంలో శాంత రంగస్వామి నాయకత్వంలో వెస్టిండీస్ మీద తొలి టెస్ట్ విజయాన్ని భారత్ నమోదు చేసింది.[18][19]
1973లో మహారాష్ట్రలోని పూణేలో భారత మహిళల క్రికెట్ సంఘం (ఉమెన్స్ క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా) స్థాపించారు. ప్రేమాల చవాన్ దాని మొదటి అధ్యక్షురాలు. ఇది మొదట్లో అంతర్జాతీయ మహిళా క్రికెట్ మండలికి అనుబంధంగా ఉండేది. అయితే మహిళల క్రికెట్ ను అభివృద్ధి చేయడానికి అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ చొరవతో, 2006 - 07లో భారత మహిళల క్రికెట్ సంఘం భారత క్రికెట్ నియంత్రణ మండలి ( బిసిసిఐ) లో విలీనం చేశారు.[20]
2021లో భారత మహిళల క్రికెట్ జట్టుకు రమేష్ పొవార్ ప్రధాన కోచ్‌గా వ్యవహరిస్తారని బిసిసిఐ ప్రకటించింది.[21][22] 2022లో భారత మహిళలు 23 సంవత్సరాలలో ఇంగ్లాండ్ గడ్డపై మొదటి సిరీస్‌ను గెలుచుకోవడం ద్వారా చరిత్ర సృష్టించారు.
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బిసిసిఐ) భారత క్రికెట్ జట్టుకు, భారతదేశంలో మొదటి తరగతి (ఫస్ట్ - క్లాస్) క్రికెట్ కు పాలకమండలి. ఈ బోర్డు 1929 నుండి పనిచేస్తోంది, అంతర్జాతీయ క్రికెట్ మండలిలో భారతకి ప్రాతినిధ్యం వహిస్తోంది. ఇది ప్రపంచంలోని అత్యంత ధనిక క్రీడా సంస్థలలో ఒకటి. ఇది 2006 నుండి 2010 వరకు భారతదేశ మ్యాచ్ మీడియా హక్కులను 6,12,00,000 అమెరికన్ డాలర్లకు విక్రయించింది.[23] ఇది భారత జట్టు స్పాన్సర్ షిప్ లను, దాని భవిష్యత్ పర్యటనలు, జట్టు ఎంపికను నిర్వహిస్తుంది. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) తన భవిష్యత్ పర్యటనల కార్యక్రమం ద్వారా భారతదేశం రాబోయే మ్యాచ్ లను నిర్ణయిస్తుంది.
2020 సెప్టెంబరు 26న, భారత క్రికెట్ నియంత్రణ మండలి (బిసిసిఐ) అఖిల భారత మహిళల ఎంపిక సమితి నియామకాన్ని ప్రకటించింది.[24] ఐదుగురు సభ్యులకి మాజీ ఎడమచేతి వాటం స్పిన్నర్ నీతు డేవిడ్ నాయకత్వం వహిస్తున్నారు.[24]
పోటీ | కిట్ తయారీదారు | స్లీవ్ స్పాన్సర్ |
---|---|---|
1973, 1978 మహిళల క్రికెట్ ప్రపంచ కప్ | ||
1982 హాన్సెల్స్ వీటా ఫ్రెష్ వరల్డ్ కప్ | ||
1988 షెల్ బైసెంటెనియల్ మహిళల ప్రపంచ కప్ | ||
1993 మహిళల క్రికెట్ ప్రపంచ కప్ | ||
1997 హీరో హోండా మహిళల ప్రపంచ కప్ | విల్స్ | |
2000, 2005 మహిళల క్రికెట్ ప్రపంచ కప్ | ||
2009,2013, 2017 మహిళల క్రికెట్ ప్రపంచ కప్ | నైక్ | సహారా |
2009, 2010,2012, 2014, 2016, 2018, 2020 ఐసీసీ మహిళల ప్రపంచ ట్వంటీ20 | ||
2022 మహిళల క్రికెట్ ప్రపంచ కప్ | ఎంపిఎల్ స్పోర్ట్స్ | బైజూస్ |
2023 ఐసీసీ మహిళల టీ20 ప్రపంచ కప్ |
ఈ జట్టుకు ప్రస్తుతం 'బైజూస్' స్పాన్సర్ చేస్తోంది.[25] OPPO స్పాన్సర్షిప్ 2017 నుండి 2022 వరకు అమలు కావాల్సి ఉంది, కానీ 2019 సెప్టెంబరు 5న 'బైజూస్' కి అప్పగించబడింది.[26] గతంలో 2014 నుండి 2017 వరకు భారత జట్టును స్టార్ ఇండియా, 2002 నుండి 2013 వరకు సహారా ఇండియా పరివార్ స్పాన్సర్ చేసింది.[27] భారత జట్టుకు కిట్ నైక్ ఎక్కువకాలం సరఫరా చేసింది, ఈ ఒప్పందం 2005, ఐదేళ్ల కాలానికి 2011, 2016లలో రెండు సార్లు వరుసగా పొడిగించారు.[28][29][30] అంతర్జాల ఆటల వేదిక (ఆన్లైన్ గేమింగ్ ప్లాట్‌ఫామ్) మొబైల్ ప్రీమియర్ లీగ్ అనుబంధ సంస్థ ఎంపిఎల్ స్పోర్ట్స్ అప్పారెల్ & యాక్సెసరీస్ ( MPL Sports Apparel & Accessories) 2020 అక్టోబరునుంచి కిట్ సరఫరా చేస్తోంది.[31][32][33][34]
కాలం. | కిట్ తయారీదారు | చొక్కా స్పాన్సర్ |
---|---|---|
1993 - 1996 | విల్స్ | |
1999 - 2001 | ||
2001 - 2002 | ||
2002 - 2003 | సహారా | |
2003 - 2005 | ||
2005 - 2013 | నైక్ | |
2014 - 2017 | స్టార్ ఇండియా | |
2017 - 2019 | ఒప్పో | |
2019 - 2020 | బైజూస్ | |
2020 - 2023 | ఎం.పి.ఎల్. స్పోర్ట్స్ | |
2023 - 2028 | అడిడాస్ | టీబీఏ |
పేటీఎం 2015లో భారతదేశంలో జట్టు ఆడిన అన్ని మ్యాచ్ లకు శీర్షిక హక్కును కొనుగోలు చేసింది, 2019 నుంచి 2023 వరకు పొడిగించింది.[35][36] స్టార్ ఇండియా, ఎయిర్టెల్ కంపెనీలు ఇంతకు ముందు శీర్షిక హక్కుదారులుగా వ్యవహరించాయి.[37][38]
జట్టు స్పాన్సర్ | డ్రీమ్ 11 |
---|---|
టైటిల్ స్పాన్సర్ | మాస్టర్ కార్డ్ |
కిట్ స్పాన్సర్ | అడిడాస్ |
అధికారిక భాగస్వాములు | హ్యుందాయ్ |
లాఫార్జ్ హోల్సిమ్ (అంభుజా సిమెంట్స్ ACC) | |
అధికారిక ప్రసారకర్త | టీబీఏ |
అంతర్జాతీయ క్రికెట్లో ఫలితాలు, రాబోయే మ్యాచ్‌లు
ద్వైపాక్షిక సిరీస్ లు పర్యటనలు | |||||
---|---|---|---|---|---|
తేదీ | వ్యతిరేకంగా | H / A / N | ఫలితాలు [మాచ్ లు] | ||
టెస్ట్ | WODI | టీ20 ప్రపంచకప్ | |||
2022 ఫిబ్రవరి | న్యూజిలాండ్ | విదేశం | - | 1-4 [5] | 0 - 1 [1] |
2022 సెప్టెంబరు | ఇంగ్లాండు | విదేశం | - | 3-0 [3] | 1 - 2 [3] |
2022 డిసెంబరు | ఆస్ట్రేలియా | హోమ్ | - | - | 1 - 4 [5] |
ఆసియా క్రీడలు 2023లో మహిళల క్రికెట్ పోటీ 2023 సెప్టెంబరు,19న చైనాలో హాంగ్జౌలో ప్రారంభం అయ్యాయి. భారత మహిళల జట్టు ఆసియా క్రీడల్లో తొలిసారిగా ఆడింది. మహిళల పోటీలో మొత్తం 11 మ్యాచ్‌లు ఆడారు. అన్ని మ్యాచ్‌లు జెజియాంగ్ యూనివర్శిటీ ఆఫ్ టెక్నాలజీ పింగ్‌ఫెంగ్ క్రికెట్ ఫీల్డ్‌లో జరిగాయి. భారత్, పాకిస్థాన్, శ్రీలంక, బంగ్లాదేశ్‌లు క్వార్టర్ ఫైనల్స్‌కు అర్హత సాధించాయి. సెప్టెంబరు 25న భారత మహిళా క్రికెట్ జట్టు చివరిరోజు ఆట శ్రీలంక జట్టుతో ఆడి 19 పరుగుల దూరంలో గెలిచి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది.[39]
ఇటీవల బిసిసిఐతో ఒప్పందం కుదుర్చుకున్న ఒక రోజు లేదా టి20ఐ జట్లలో ఎంపికైన క్రియాశీల క్రీడాకారుల జాబితా. ఈ జాబితా 2023 జూలై 13 న నవీకరించబడింది. టోపీ లేని క్రీడాకారులు ఏటవాలు అక్షరాలలో (ఇటాలిక్స్) జాబితా చేశారు.
పేరు | వయస్సు | బ్యాటింగ్ శైలి | బౌలింగ్ శైలి | స్వదేశీ జట్టు | C/G | రూపము | S/N |
---|---|---|---|---|---|---|---|
బాటర్స్ | |||||||
స్మృతి మందాన | 28 | ఎడం చేతి వాటం | - | మహారాష్ట్ర | A | ODI & T20I
(Vice-captain) |
18 |
హర్మన్‌ప్రీత్ కౌర్ | 35 | కుడిచేతి వాటం | రైట్ ఆర్మ్ ఆఫ్ బ్రేక్ | పంజాబ్ | A | ODI & T20I
(Captain) |
7 |
షఫాలీ వర్మ | 20 | కుడిచేతి వాటం | రైట్ ఆర్మ్ ఆఫ్ బ్రేక్ | హర్యానా | B | ODI & T20I | 17 |
జెమిమా రోడ్రిగ్స్ | 24 | కుడిచేతి వాటం | రైట్ ఆర్మ్ ఆఫ్ బ్రేక్ | ముంబై | B | ODI & T20I | 5 |
సబ్భినేని మేఘన | 28 | కుడిచేతి వాటం | - | రైల్వే | C | T20I | 27 |
ప్రియా పునియా | 28 | కుడిచేతి వాటం | కుడిచేతి మీడియం | ఢిల్లీ | - | ODI | 16 |
ఆల్ రౌండర్లు | |||||||
దీప్తి శర్మ | 27 | ఎడం చేతి వాటం | రైట్ ఆర్మ్ ఆఫ్ బ్రేక్ | బెంగాల్ | A | ODI & T20I | 6 |
పూజా వస్త్రాకర్ | 25 | కుడిచేతి వాటం | కుడిచేతి మీడియం | మధ్యప్రదేశ్ | C | ODI & T20I | 34 |
హర్లీన్ డియోల్ | 26 | కుడిచేతి వాటం | రైట్ ఆర్మ్ లెగ్ బ్రేక్ | హిమాచల్ ప్రదేశ్ | C | ODI & T20I | 98 |
దేవికా వైద్య | 27 | ఎడం చేతి వాటం | రైట్ ఆర్మ్ లెగ్ బ్రేక్ | మహారాష్ట్ర | C | ODI & T20I | 97 |
అమంజోత్ కౌర్ | 24 | కుడిచేతి వాటం | కుడిచేతి మీడియం | పంజాబ్ | - | ODI & T20I | 30 |
మిన్ను మణి | 25 | ఎడం చేతి వాటం | రైట్ ఆర్మ్ ఆఫ్ బ్రేక్ | కేరళ | - | T20I | 71 |
కనికా అహుజా | 22 | ఎడం చేతి వాటం | రైట్ ఆర్మ్ ఆఫ్ బ్రేక్ | పంజాబ్ | - | T20I | - |
వికెట్ కీపర్లు | |||||||
యస్తికా భాటియా | 24 | ఎడం చేతి వాటం | - | బరోడా | C | ODI & T20I | 11 |
రిచా ఘోష్ | 21 | కుడిచేతి వాటం | - | బెంగాల్ | B | T20I | 13 |
ఉమా చెత్రీ | 22 | కుడిచేతి వాటం | - | అస్సాం | ODI & T20I | ||
స్పిన్ బౌలర్లు | |||||||
రాజేశ్వరి గయక్వాడ్ | 33 | కుడిచేతి వాటం | ఎడమ చేయి ఆర్థోడాక్స్ | రైల్వేస్ | B | ODI & T20I | 1 |
స్నేహ రానా | 30 | కుడిచేతి వాటం | రైట్ ఆర్మ్ ఆఫ్ బ్రేక్ | రైల్వేస్ | C | ODI & T20I | 2 |
రాధా యాదవ్ | 24 | కుడిచేతి వాటం | ఎడమ చేయి ఆర్థోడాక్స్ | బరోడా | C | T20I | 21 |
అనూషా బారెడ్డి | 21 | ఎడం చేతి వాటం | ఎడమ చేయి ఆర్థోడాక్స్ | ఆంధ్ర | - | ODI & T20I | 3 |
రాశి కనోజియా | 26 | కుడిచేతి వాటం | ఎడమ చేయి ఆర్థోడాక్స్ | ఉత్తర ప్రదేశ్ | - | ODI & T20I | 36 |
పేస్ బౌలర్లు | |||||||
రేణుకా సింగ్ | 28 | కుడిచేతి వాటం | కుడిచేతి మీడియం/వేగం | రైల్వేస్ | B | ODI & T20I | 10 |
మేఘనా సింగ్ | 30 | కుడిచేతి వాటం | కుడిచేతి మీడియం | రైల్వేస్ | C | ODI & T20I | 16 |
అంజలి శర్వాణి | 27 | ఎడం చేతి వాటం | ఎడమ చేతి మీడియం | రైల్వేస్ | C | ODI & T20I | 28 |
మోనికా పటేల్ | 25 | ఎడం చేతి వాటం | ఎడమ చేతి మీడియం | కర్ణాటక | - | ODI & T20I | - |
టిటాస్ సాధు | 20 | కుడిచేతి వాటం | కుడిచేతి మీడియం | బెంగాల్ | - | T20I | - |
ఆటగాళ్లకు మ్యాచ్ ఫీజు ₹15 లక్షలు (టెస్టుకు $ 19,000), మ్యాచ్ ఫీజు ₹6 లక్షలు (వన్డేలకు US $ 7,500), మ్యాచ్ ఫిజు ₹3 లక్షలు (టి20ఐకి US $ 3,800). బిసిసిఐ 2022 అక్టోబరు 27న పురుషుల మహిళల జట్ల మ్యాచ్ సమాన రుసుములో విధానాన్ని అమలు చేస్తోంది.[41] ఆటగాళ్ల వేతనాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.