ఇంద్రజిత్ సింగ్ బింద్రా స్టేడియం పంజాబ్‌లోని మొహాలీలో ఉన్న క్రికెట్ మైదానం. ఇది మొహాలి స్టేడియంగా ప్రసిద్ధి చెందింది. పంజాబ్ జట్టుకు నిలయంగా ఉన్న ఈ స్టేడియం గీతాంశు కాల్రా నిర్మించాడు. స్టేడియం నిర్మాణానికి సుమారు 3 సంవత్సరాలు, ₹ 25 కోట్ల సొమ్మూ ఖర్చైంది.[1] అధికారికంగా స్టేడియం సామర్థ్యం 26,950.[2] ఈ స్టేడియంను అరుణ్ లూంబా అండ్ అసోసియేట్స్ రూపొందించగా, చండీగఢ్‌లో ఉన్న RS కన్‌స్ట్రక్షన్ కంపెనీ నిర్మించింది. [3] ఇంద్రజిత్ సింగ్ బింద్రా స్టేడియం పంజాబ్ క్రికెట్ జట్టు, పంజాబ్ కింగ్స్ (ఐపీఎల్ ఫ్రాంచైజీ)కి నిలయం. ఈ స్టేడియంకు బీసీసీఐ మాజీ అధ్యక్షుడు & పీసీఏ మాజీ అధ్యక్షుడు ఇందర్‌జిత్ సింగ్ బింద్రా పేరు పెట్టారు.
"పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియం" పిసిఎ స్టేడియం సాహిబ్‌జాదా అజిత్‌సింగ్ నగర్ స్టేడియం మొహాలీ స్టేడియం | |
Location | మొహాలీ, పంజాబ్ |
---|---|
Owner | పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ |
Capacity | 27,000 |
మైదాన సమాచారం | |
స్థాపితం | 1993 |
వాడుతున్నవారు |
|
ఎండ్‌ల పేర్లు | |
యువరాజ్ సింగ్ ఎండ్ హర్భజన్ సింగ్ ఎండ్ | |
అంతర్జాతీయ సమాచారం | |
మొదటి టెస్టు | 1994 డిసెంబరు 10–14: India v వెస్ట్ ఇండీస్ |
చివరి టెస్టు | 2022 మార్చి 4–8: India v శ్రీలంక |
మొదటి ODI | 1993 నవంబరు 22: India v వెస్ట్ ఇండీస్ |
చివరి ODI | 2019మార్చి 10: India v ఆస్ట్రేలియా |
మొదటి T20I | 2009 డిసెంబరు 12: India v శ్రీలంక |
చివరి T20I | 2022 సెప్టెంబరు 20: India v ఆస్ట్రేలియా |
ఏకైక WODI | 1997 డిసెంబరు 21: ఇంగ్లాండు v శ్రీలంక |
మొదటి WT20I | 2016 మార్చి 18: న్యూజీలాండ్ v ఐర్లాండ్ |
చివరి WT20I | 2016 మార్చి 27: India v వెస్ట్ ఇండీస్ |
2022 మార్చి 4 నాటికి Source: Inderjit Singh Bindra stadium |
ఇతర క్రికెట్ స్టేడియాలతో పోలిస్తే ఇక్కడ ఫ్లడ్‌లైట్లు చాలా తక్కువ ఎత్తులో ఉంటాయి. సమీపంలోని చండీగఢ్ విమానాశ్రయం నుండి విమానాలు లైట్ స్తంభాలను ఢీకొనడాన్ని నివారించడానికి ఇలా చేసారు. స్టేడియంలో 16 ఫ్లడ్‌లైట్లు ఉండడానికి కారణం అదే. 2019 డిసెంబరు నాటికి, ఇక్కడ 13 టెస్టులు, 25 వన్‌డేలు, 5 T20Iలూ జరిగాయి.
చరిత్ర
ఈ స్టేడియంను మొహాలి స్టేడియం లేదా పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియం అని కూడా అంటారు. ఇది భారతదేశంలో 19వ టెస్ట్ క్రికెట్ వేదిక. పిచ్ జీవంతో, పేస్ బౌలర్లకు మద్దతుగా ఉంటుందని పేరు పొందింది. అయితే నిదానంగా ఇది నెమ్మదించి, స్పిన్ బౌలింగ్‌కు కూడా సహాయపడుతోంది. ఇది 1993 నవంబరు 22న హీరో కప్ సందర్భంగా భారత దక్షిణాఫ్రికా ల వన్ డే ఇంటర్నేషనల్ మ్యాచ్‌తో ప్రారంభమైంది.ఆ తరువాతి సీజన్‌లో, 1994 డిసెంబరు 10 న, ఇక్కడి మొదటి టెస్ట్ మ్యాచ్ భారత వెస్టిండీస్ ల మధ్య జరిగింది [4] 1996 ఫిబ్రవరిలో ఆస్ట్రేలియా, వెస్టిండీస్ మధ్య జరిగిన క్రికెట్ ప్రపంచ కప్ సెమీ-ఫైనల్ మ్యాచ్ ఈ మైదానంలో జరిగిన అత్యంత ప్రసిద్ధ వన్డే మ్యాచ్‌లలో ఒకటి. ఇంద్రజిత్ సింగ్ బింద్రా స్టేడియం 2011 ప్రపంచ కప్‌లో 3 మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇచ్చింది. వాటిలో 2011 మార్చి 20 న భారత పాకిస్తాన్ మధ్య జరిగిన రెండవ సెమీ-ఫైనల్ మ్యాచ్ ఒకటి. ఈ మ్యాచ్‌కు భారత ప్రధాని మన్మోహన్ సింగ్, పాకిస్థాన్ ప్రధాని యూసఫ్ రజా గిలానీలు హాజరయ్యారు. క్రికెట్ దౌత్యానికి ఇదొక ఉదాహరణ. ఈ మ్యాచ్‌లో భారత్ విజయం సాధించింది.
ఫ్రీడమ్ ట్రోఫీ 2015 తొలి టెస్టు మొహాలీలో జరిగింది. ఆ టెస్ట్ సమయంలో, భారత స్పిన్నర్లకు పిచ్ నుండి భారీ మద్దతు లభించింది. ఆ మ్యాచ్‌లో భారత్ భారీ తేడాతో విజయం సాధించింది. మొహాలీలో పిచ్ నుండి స్పిన్నర్లకు పెద్ద ఎత్తున సహకారం లభించడం ఇదే మొదటి ఉదాహరణ.
2009 లో శ్రీలంకను భారత్ 6 వికెట్ల తేడాతో ఓడించిన మ్యాచ్‌తో ఈ మైదానంలో T20 అంతర్జాతీయ మ్యాచ్‌లు మొదలయ్యాయి. 2016 ICC వరల్డ్ ట్వంటీ20 లో 3 T20I మ్యాచ్‌లు ఇక్కడ జరిగాయి.
ఇందర్‌జిత్ సింగ్ బింద్రా స్టేడియానికి ప్రస్తుత పిచ్ క్యూరేటర్ దల్జిత్ సింగ్ [5]
గుర్తించదగిన సంఘటనలు
- ఈ మైదానంలో అత్యధిక వ్యక్తిగత స్కోరు 208* (153) రోహిత్ శర్మ 13 డిసెంబరు 2017న శ్రీలంకతో జరిగిన 2వ ODI లో చేశాడు. [6]
- 2011 పురుషుల క్రికెట్ ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌ను 29 పరుగుల తేడాతో ఓడించిన భారత్ ఫైనల్స్‌కు అర్హత సాధించింది. 85 పరుగులతో సచిన్ టెండూల్కర్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచాడు.
క్రికెట్ ప్రపంచ కప్ మ్యాచ్‌లు
స్టేడియంలో 4 ప్రపంచ కప్ మ్యాచ్‌లు జరిగాయి. 1996లో ఒక మ్యాచ్ (ఆస్ట్రేలియా, వెస్టిండీస్ ల మధ్య సెమీఫైనల్), 2011 ప్రపంచ కప్‌లో మూడు (భారత, పాకిస్తాన్ ల మధ్య సెమీఫైనల్‌తో సహా) ఇక్కడ జరిగాయి. 2016 ICC వరల్డ్ ట్వంటీ20లో 3 T20 మ్యాచ్‌లు కూడా ఈ స్టేడియంలో జరిగాయి,
1996 క్రికెట్ ప్రపంచ కప్ సెమీఫైనల్
2011 క్రికెట్ ప్రపంచ కప్
v |
||
ఎబి డి విల్లియర్స్ 134 (98) Ryan ten Doeschate 3/72 (10 ఓవర్లు) |
Wesley Barresi 44 (66) Imran Tahir 3/19 (6.5 ఓవర్లు) |
- Netherlands won the toss and elected to field.
v |
||
Devon Smith 107 (133) Kevin O'Brien 4/71 (9 ఓవర్లు) |
Ed Joyce 84 (106) Sulieman Benn 4/53 (10 ఓవర్లు) |
- ఐర్లాండ్ టాస్ గెలిచి ఫీల్డింగు ఎంచుకుంది.
2011 క్రికెట్ ప్రపంచ కప్ సెమీఫైనల్
v |
||
Misbah-ul-Haq 56 (76) Ashish Nehra 2/33 (10 ఓవర్లు) |
- ఇండియా టాస్ గెలిచి బ్యాటింగు ఎంచుకుంది
2016 వరల్డ్ ట్వంటీ20
v |
||
Sharjeel Khan 47 (25) ఆడం మిల్నే 2/25 (4 ఓవర్లు) |
- New Zealand won the toss and elected to bat.
v |
||
ఖాలిద్ లతీఫ్ 46 (41) జేమ్స్ ఫాక్నర్ 5/28 (4 ఓవర్లు) |
- ఆస్ట్రేలియా టాస్ గెలిచి బ్యాటింగు ఎంచుకుంది.
v |
||
ఆరన్ ఫించ్ 43 (34) హార్దిక్ పాండ్య 2/36 (4 ఓవర్లు) |
- ఆస్ట్రేలియా టాస్ గెలిచి బ్యాటింగు ఎంచుకుంది.
రికార్డులు
పరీక్ష రికార్డులు
- అత్యధిక టెస్ట్ మొత్తం: 630/6d – న్యూజిలాండ్ vs. భారతదేశం, 16 అక్టోబరు 2003
- అత్యధిక వ్యక్తిగత టెస్ట్ స్కోరు: 187 – శిఖర్ ధావన్, భారతదేశం vs. ఆస్ట్రేలియా, 14 మార్చి 2013
- ఉత్తమ టెస్ట్ ఇన్నింగ్స్ బౌలింగ్ గణాంకాలు: 6/27 – డియోన్ నాష్, న్యూజిలాండ్ vs. భారతదేశం, 10 అక్టోబరు 1999
- అత్యధిక టెస్టు భాగస్వామ్యం: 314 (రెండో వికెట్‌కు) – రాహుల్ ద్రవిడ్ & గౌతమ్ గంభీర్, భారత్ vs. ఇంగ్లాండ్, 19 డిసెంబరు 2008
- సచిన్ టెండూల్కర్ (767 పరుగులు) అత్యధిక టెస్టు పరుగులు సాధించగా, రాహుల్ ద్రవిడ్ (735), వీరేంద్ర సెహ్వాగ్ (645) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.
- అనిల్ కుంబ్లే (36 వికెట్లు) అత్యధిక వికెట్లు పడగొట్టగా, హర్భజన్ సింగ్ (24), రవీంద్ర జడేజా (18) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.
ODI రికార్డులు
- అత్యధిక ODI మొత్తం: 393/3 – భారత్ vs. శ్రీలంక, 13 డిసెంబరు 2017
- అత్యధిక వ్యక్తిగత ODI స్కోరు: 208 – రోహిత్ శర్మ, భారతదేశం vs శ్రీలంక, 13 డిసెంబరు 2017
- ఉత్తమ ODI ఇన్నింగ్స్ బౌలింగ్ గణాంకాలు: 5/21 – మఖాయా ంటిని, సౌత్ ఆఫ్రికా vs. పాకిస్తాన్, 2006 ICC ఛాంపియన్స్ ట్రోఫీ, 27 అక్టోబరు 2006
- అత్యధిక ODI భాగస్వామ్యం: 221 (3వ వికెట్‌కు) - హషీమ్ ఆమ్లా & AB డివిలియర్స్, దక్షిణాఫ్రికా vs. నెదర్లాండ్స్, 2011 క్రికెట్ ప్రపంచ కప్, 3 మార్చి 2011
- వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రోహిత్ శర్మ (410 పరుగులు) రెండో స్థానంలో నిలిచాడు సచిన్ టెండూల్కర్ (366), ఎంఎస్ ధోని (363)
- హర్భజన్ సింగ్ (11 వికెట్లు) అత్యధిక వికెట్లు పడగొట్టగా, గ్లెన్ మెక్‌గ్రాత్ (8), సక్లైన్ ముస్తాక్ (8) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.
ట్వంటీ20 అంతర్జాతీయ రికార్డులు
IPL రికార్డులు [7]
- అత్యధిక మొత్తం: 240/5 – చెన్నై సూపర్ కింగ్స్ vs. కింగ్స్ XI పంజాబ్, 19 ఏప్రిల్ 2008
- అత్యధిక వ్యక్తిగత స్కోరు: 120* – పాల్ వాల్తాటి, కింగ్స్ XI పంజాబ్ vs. చెన్నై సూపర్ కింగ్స్, 13 ఏప్రిల్ 2011
- ఉత్తమ బౌలింగ్ గణాంకాలు: 5/21 – మునాఫ్ పటేల్, ముంబై ఇండియన్స్ vs. కింగ్స్ XI పంజాబ్, 10 మే 2011
ఇవి కూడా చూడండి
- మహారాజా యదవీంద్ర సింగ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం
- సామర్థ్యం ఆధారంగా క్రికెట్ మైదానాల జాబితా
మూలాలు
Wikiwand in your browser!
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.