From Wikipedia, the free encyclopedia
కుల్దీప్ యాదవ్ (జననం 1994 డిసెంబరు 14) భారతీయ అంతర్జాతీయ క్రికెట్ ఆటగాడు. అతను బౌలరు ఆల్-రౌండరు, లెఫ్ట్ ఆర్మ్ అన్‌ఆర్థడాక్స్ స్పిన్ బౌలరు. భారతదేశం తరఫున, దేశీయ క్రికెట్లో ఉత్తరప్రదేశ్ తరపున ఆడే సమర్ధుడైన లోయర్ ఆర్డర్ బ్యాటర్. ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ అతను సంతకం చేసాడు. [3] అతను భారత అండర్-19 క్రికెట్ జట్టుకు ఆడాడు. 2014 అండర్-19 క్రికెట్ ప్రపంచ కప్‌లో ఆడాడు. [4] 2019 డిసెంబరు 18 న, వెస్టిండీస్‌పై హ్యాట్రిక్ సాధించి, భారతదేశం తరపున అంతర్జాతీయ క్రికెట్లో రెండు హ్యాట్రిక్‌లు సాధించిన మొదటి బౌలర్‌గా నిలిచాడు. [5] 2020 జనవరి 17 న, ఆస్ట్రేలియాతో జరిగిన రెండవ వన్డేలో యాదవ్, తన 58వ ఇన్నింగ్స్‌లో వన్డే క్రికెట్లో 100 వికెట్లు తీసి, ఇన్నింగ్స్ సంఖ్య పరంగా భారతదేశం తరపున అత్యంత వేగంగా ఆ రికార్డు చేరిన స్పిన్ బౌలరు అయ్యాడు. [6] టోర్నమెంట్లో రషీద్ ఖాన్, ముస్తాఫిజుర్ రెహ్మాన్‌లతో పాటు 10 వికెట్లు పడగొట్టి, భారతదేశం తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు.
వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పుట్టిన తేదీ | కన్పూర్, ఉత్తర ప్రదేశ్ | 1994 డిసెంబరు 14|||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
ఎత్తు | 5 అ. 6 అం. (168 cమీ.)[1] | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | ఎడమచేతి వాటం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బౌలింగు | Left-arm unorthodox spin | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పాత్ర | bowler | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
జాతీయ జట్టు |
| |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి టెస్టు (క్యాప్ 288) | 2017 మార్చి 25 - ఆస్ట్రేలియా తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి టెస్టు | 2022 డిసెంబరు 14 - బంగ్లాదేశ్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి వన్డే (క్యాప్ 217) | 2017 జూన్ 23 - వెస్టిండీస్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి వన్డే | 2023 జూలై 29 - వెస్టిండీస్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
వన్డేల్లో చొక్కా సంఖ్య. | 23 | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి T20I (క్యాప్ 69) | 2017 జూలై 9 - వెస్టిండీస్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి T20I | 2023 ఆగస్టు 13 - వెస్టిండీస్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
T20Iల్లో చొక్కా సంఖ్య. | 23 | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
దేశీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
Years | Team | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2012 | ముంబై ఇండియన్స్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2014–2021 | కోల్‌కతా నైట్‌రైడర్స్ (స్క్వాడ్ నం. 23) | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2009–present | ఉత్తర ప్రదేశ్ (స్క్వాడ్ నం. 3) | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2022-present | ఢిల్లీ క్యాపిటల్స్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: ESPNcricinfo, 25 March 2023 |
వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పుట్టిన తేదీ | Kanpur, ఉత్తర ప్రదేశ్, India | 1994 డిసెంబరు 14|||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
ఎత్తు | 5 అ. 6 అం. (168 cమీ.)[2] | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | ఎడమచేతి వాటం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బౌలింగు | Left-arm unorthodox spin | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పాత్ర | bowler | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
జాతీయ జట్టు |
| |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి టెస్టు (క్యాప్ 288) | 2017 మార్చి 25 - ఆస్ట్రేలియా తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి టెస్టు | 2022 డిసెంబరు 14 - బంగ్లాదేశ్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి వన్డే (క్యాప్ 217) | 2017 జూన్ 23 - వెస్టిండీస్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి వన్డే | 2023 జూలై 29 - వెస్టిండీస్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
వన్డేల్లో చొక్కా సంఖ్య. | 23 | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి T20I (క్యాప్ 69) | 2017 జూలై 9 - వెస్టిండీస్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి T20I | 2023 ఆగస్టు 13 - వెస్టిండీస్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
T20Iల్లో చొక్కా సంఖ్య. | 23 | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
దేశీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
Years | Team | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2012 | ముంబై ఇండియన్స్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2014–2021 | కోల్‌కతా నైట్‌రైడర్స్ (స్క్వాడ్ నం. 23) | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2009–present | ఉత్తర ప్రదేశ్ (స్క్వాడ్ నం. 3) | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2022-present | ఢిల్లీ క్యాపిటల్స్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: ESPNcricinfo, 25 March 2023 |
యాదవ్, ఉత్తరప్రదేశ్ లోని ఉన్నావ్‌లో ఇటుక బట్టీ యజమానికి జన్మించాడు. కాన్పూర్‌లో పెరిగాడు. ఒక ఇంటర్వ్యూలో, తాను క్రికెట్ ఆడటం కొనసాగించాలని తండ్రి కోరుకున్నాడని కోచ్ కపిల్ పాండే వద్దకు తీసుకువెళ్లాడనీ వెల్లడించాడు. బౌలింగ్ గ్రేట్స్ వసీం అక్రమ్, జహీర్ ఖాన్ నుండి ప్రేరణ పొంది, అతను లెఫ్ట్ ఆర్మ్ సీమర్ కావాలనుకున్నాడు. అయితే, చిన్నపాటి శరీరాకారాన్ని బట్టీ, ట్రయల్స్‌లో యాదవ్ చూపిన టర్న్, వైవిధ్యాలతో ఆకట్టుకున్నందున కోచ్ అతను మణికట్టు-స్పిన్ బౌలర్‌గా ఎదగాలని పట్టుబట్టాడు. అప్పటి నుండి, అతను షేన్ వార్న్ బౌలింగు వీడియోలను చూడటం ప్రారంభించాడు అతనిని తన రోల్ మోడల్‌గా చేసుకున్నాడు.
ఉత్తరప్రదేశ్ అండర్-15 జట్టులో ఎంపిక కానప్పుడు క్రికెట్‌ను వదిలేసి, ఆత్మహత్య చేసుకోవాలని భావించిన చీకటి దశ ఒకటి తన జీవితంలో ఉందని యాదవ్ వెల్లడించాడు. [7] [8] [9]
2012లో యాదవ్, ముంబై ఇండియన్స్ జట్టులో సభ్యుడయ్యాడు. 2014లో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టులో చేరాడు. 2014 ఛాంపియన్స్ లీగ్ ట్వంటీ20 లో ఆ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు.
2018 జనవరిలో, 2018 IPL వేలంలో యాదవ్‌ను KKR తిరిగి కొనుగోలు చేసింది. [10] 2022 ఫిబ్రవరిలో, 2022 ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ కోసం జరిగిన వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ అతనిని కొనుగోలు చేసింది. [11]
యాదవ్ 2014 అక్టోబరులో వెస్టిండీస్‌తో ఆడేందుకు భారత క్రికెట్ జట్టులో ఎంపికయ్యాడు కానీ ఏ మ్యాచ్‌లోనూ కనిపించలేదు. [12] 2017 ఫిబ్రవరిలో, బంగ్లాదేశ్‌తో జరిగిన ఒక మ్యాచ్ కోసం అతన్ని భారత టెస్ట్ జట్టులోకి తీసుకున్నారు.[13] 2017 మార్చి 25 న ధర్మశాల క్రికెట్ స్టేడియంలో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో భారతదేశం తరపున తొలి ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్లు పడగొట్టాడు.[14] టెస్టు క్రికెట్లో భారత జాతీయ క్రికెట్ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన మొదటి ఎడమచేతి మణికట్టు స్పిన్ బౌలర్ యాదవ్. టెస్టు క్రికెట్లో అరంగేట్రంలోనే నాలుగు వికెట్లు తీసిన మూడో ఎడమచేతి మణికట్టు స్పిన్ బౌలర్‌గా కూడా అతను నిలిచాడు.
2017 జూన్‌లో, వెస్టిండీస్‌కు పరిమిత ఓవర్ల పర్యటన కోసం యాదవ్ భారత జట్టులో ఎంపికయ్యాడు. [15] 2017 జూన్ 23 న వెస్టిండీస్‌పై భారతదేశం తరపున తన తొలి వన్డే అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు.[16] అయితే, ఈ గేమ్‌లో, భారత్ మొదటి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేస్తున్నప్పుడు వర్షం కారణంగా ఆట ఫలితం లేకుండా ముగిసింది. అతనికి బౌలింగు చేసే అవకాశం రాలేదు. సిరీస్‌లోని తదుపరి మ్యాచ్‌లో బౌలింగ్ చేసి, మూడు వికెట్లు పడగొట్టాడు. [17] 2017 జూలై 9 న వెస్టిండీస్‌పై భారతదేశం తరపున తన తొలి ట్వంటీ20 అంతర్జాతీయ మ్యాచ్ (టి20I) ఆడాడు.[18]
2017 సెప్టెంబరు 21 న యాదవ్, చేతన్ శర్మ, కపిల్ దేవ్ల తర్వాత వన్డే లో హ్యాట్రిక్ సాధించిన మూడవ భారత బౌలరయ్యాడు. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో ఆస్ట్రేలియాపై ఈ హ్యాట్రిక్ సాధించాడు. [19] [20]
2018 జూలై 3 న యాదవ్, ఇంగ్లాండ్‌తో జరిగిన మొదటి టి20Iలో తన మొదటి ఐదు వికెట్ల పంట సాధించాడు. టి20Iలో ఐదు వికెట్లు తీసిన మొదటి ఎడమ చేతి మణికట్టు-స్పిన్ బౌలరతడు. యుజ్వేంద్ర చాహల్, భువనేశ్వర్ కుమార్ తర్వాత టి20Iలో ఐదు వికెట్లు తీసిన మూడవ భారతీయ బౌలరతడు.[21] [22]
2018 జూలై 12 న, ఇంగ్లండ్‌తో జరిగిన మొదటి వన్డేలో యాదవ్, వన్డేల్లో తన తొలి ఐదు వికెట్ల పంట సాధించాడు. ఆ మ్యాచ్‌లో అతని 6/25, వన్డేలో ఎడమచేతి వాటం స్పిన్ బౌలరు సాధించిన అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు. [23]వన్డేలలో ఇంగ్లండ్‌పై అత్యుత్తమ స్పిన్ బౌలింగ్ గణాంకాలకు షాహిద్ ఆఫ్రిది పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టాడు. ఇంగ్లాండ్‌లో వన్డేలో అత్యుత్తమ స్పిన్ బౌలింగ్ గణాంకాల ఆఫ్రిది రికార్డును కూడా బద్దలు కొట్టాడు. [24] [25]
2018 అక్టోబరు 6 న, వెస్టిండీస్‌తో జరిగిన మొదటి టెస్ట్‌లో యాదవ్, టెస్ట్‌లలో తన మొదటి ఐదు వికెట్ల పంటను సాధించాడు. [26]
2018/19 లో భారత్ పర్యటించిన ఆస్ట్రేలియాతో జరిగిన టి20I సిరీస్‌లో ఆకట్టుకునే ఆట తర్వాత, 2018 నవంబరు 26 న MRF ICC టి20I బౌలర్స్ ర్యాంకింగ్స్‌లో కుల్దీప్ 20 స్థానాలు ఎగబాకి,[27] తన కెరీర్లో అత్యున్నతమైన మూడవ స్థానాన్ని పొందాడు.
2019 ఫిబ్రవరి 11 న యాదవ్, టి20I బౌలర్ల ర్యాంకింగ్స్‌లో రెండవ స్థానానికి చేరుకున్నాడు. [28] 2019 ఏప్రిల్‌లో అతను 2019 క్రికెట్ ప్రపంచ కప్ కోసం భారత జట్టులో ఎంపికయ్యాడు. [29] [30] 2019 జూన్ 30 న, ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో, కుల్దీప్ తన 50వ వన్డేలో ఆడాడు. [31] 2019 డిసెంబరు 18 న, వెస్టిండీస్‌పై వన్డే మ్యాచ్‌లో హ్యాట్రిక్ సాధించి, వన్డేల్లో రెండు హ్యాట్రిక్‌లు సాధించిన తొలి భారత బౌలర్‌గా నిలిచాడు. [32]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.