హైదరాబాదుకు చెందిన క్రికెట్ క్రీడాకారుడు From Wikipedia, the free encyclopedia
గులాం అహ్మద్ (4 జూలై 1922 - 28 అక్టోబరు 1998) హైదరాబాదుకు చెందిన క్రికెట్ క్రీడాకారుడు. ఆఫ్ స్పిన్ బౌలరైన అహ్మద్, టెస్ట్ క్రికెట్లో భారత్‌కు కెప్టెన్‌గా వ్యవహరించాడు. పదవీ విరమణ తరువాత చాలా సంవత్సరాలు బిసిసిఐ కార్యదర్శిగా పనిచేశాడు.[1]
వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పుట్టిన తేదీ | హైదరాబాదు, తెలంగాణ, భారతదేశం | 1922 జూలై 4|||||||||||||||||||||||||||||||||||||||
మరణించిన తేదీ | 1998 అక్టోబరు 28 76) హైదరాబాదు, తెలంగాణ, భారతదేశం | (వయసు|||||||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | కుడిచేతివాటం | |||||||||||||||||||||||||||||||||||||||
బౌలింగు | ఆఫ్ స్పిన్ | |||||||||||||||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||
జాతీయ జట్టు | ||||||||||||||||||||||||||||||||||||||||
తొలి టెస్టు | 1948 డిసెంబరు 31 - వెస్టిండీస్ తో | |||||||||||||||||||||||||||||||||||||||
చివరి టెస్టు | 1958 డిసెంబరు 31 - వెస్టిండీస్ తో | |||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: క్రిక్ ఇన్ఫో, 2020 నవంబరు 23 |
అహ్మద్ 1922, జూలై 4న తెలంగాణలోని హైదరాబాదులో జన్మించాడు.
1939-40 నుండి 1958-59 వరకు హైదరాబాదు జట్టు తరఫున ఫస్ట్ క్లాస్ క్రికెట్, 1948-49 నుండి 1958-59 వరకు భారతదేశం తరపున 22 టెస్టులు ఆడాడు. 1952లో ఇంగ్లాండ్, 1954-55లో పాకిస్తాన్ దేశాలలో మ్యాచ్ లు ఆడాడు. 1955-56లో న్యూజిలాండ్‌తో జరిగిన ఒక టెస్టులో, 1958-59లో వెస్టిండీస్‌తో జరిగిన రెండు టెస్టుల్లో భారత్‌కు కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఈ రెండూ మ్యాచ్ లో భారత్ ఓడిపోయంది.
1952 పర్యటనలో ముఖ్య బౌలర్‌గా నిలిచాడు, ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌లలో 21.92 యావరేజ్ తో 80 వికెట్లు, నాలుగు టెస్టుల్లో 24.73 యావరేజ్ తో 15 వికెట్లు తీశాడు.[2] తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 63 ఓవర్లు బౌలింగ్ చేసి 100 పరుగులకు వికెట్లు తీశాడు. ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంతో జరిగిన మ్యాచ్ లో 84 పరుగులకు 8 వికెట్లు, 66 పరుగులకు 5 వికెట్లు తీశాడు.
1952-53లో పాకిస్థాన్‌తో జరిగిన తొలి టెస్టులో 5 వికెట్లు పడగొట్టి, 11వ స్థానంలో 50 పరుగులు చేశాడు, హేము అధికారితో కలిసి పదవ వికెట్‌కు 109 పరుగులు చేశాడు.[3]
1956-57లో కలకత్తాలో ఆస్ట్రేలియాతో జరిగిన మూడవ టెస్టులో అతను 49 పరుగులకు 7 వికెట్లు, 81 పరుగులకు 3 వికెట్లు తీశాడు.[4]
మద్రాస్ జరిగిన రంజీ ట్రోఫీ 1947-48లో 28 పరుగులకు 5 వికెట్లు, 53 పరుగులకు 9 వికెట్లు తీసుకున్నాడు. 1950-51లో హైదరాబాద్‌పై హోల్కర్ 757 పరుగులు చేసినప్పుడు అహ్మద్ బౌలింగ్ గణాంకాలు 92.3-21-245-4 గా ఉన్నాయి.
1967-68లో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లో పర్యటించిన భారత జట్టును నాయకత్వం వహించాడు.[5]
అహ్మద్ పాకిస్తాన్ మాజీ కెప్టెన్ ఆసిఫ్ ఇక్బాల్ కు, భారత టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా కు మామ అవుతాడు.[6][7]
1998, అక్టోబరు 28న హైదరాబాదులో మరణించాడు.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.