2010 ఆసియా కప్
From Wikipedia, the free encyclopedia
From Wikipedia, the free encyclopedia
2010 ఆసియా కప్ (మైక్రోమ్యాక్స్ ఆసియా కప్) ఆసియా కప్ క్రికెట్ టోర్నమెంటుల్లో పదవది. ఇది 2010 జూన్ 15 నుండి 24 వరకు శ్రీలంకలో జరిగింది. టెస్టు ఆడే దేశాలైన భారత్, పాకిస్థాన్, శ్రీలంక, బంగ్లాదేశ్ మాత్రమే పోటీలో పాల్గొన్నాయి. ఫైనల్లో భారత్ 81 పరుగుల తేడాతో శ్రీలంకను ఓడించి రికార్డు స్థాయిలో 5వ ఆసియా కప్ టైటిల్‌ను కైవసం చేసుకుంది. 88.33 సగటు 164.59 స్ట్రైక్ రేట్‌తో టోర్నమెంట్లో అత్యధికంగా 265 పరుగులు చేసినందుకు పాకిస్థాన్ కెప్టెన్, షాహిద్ అఫ్రిదికి మ్యాన్ ఆఫ్ ద టోర్నమెంట్ పురస్కారం లభించింది.
2010 మైక్రోమ్యాక్స్ ఆసియా కప్ | |
---|---|
తేదీలు | జూన్ 15 – జూన్ 24[1] |
నిర్వాహకులు | ఆసియా క్రికెట్ కౌన్సిల్ |
క్రికెట్ రకం | వన్ డే ఇంటర్నేషనల్ |
టోర్నమెంటు ఫార్మాట్లు | రౌండ్ రాబిన్, నాకౌట్ |
ఆతిథ్యం ఇచ్చేవారు | శ్రీలంక |
ఛాంపియన్లు | భారతదేశం (5th title) |
పాల్గొన్నవారు | 4 |
ఆడిన మ్యాచ్‌లు | 7 |
మ్యాన్ ఆఫ్ ది సీరీస్ | షహీద్ అఫ్రిది |
అత్యధిక పరుగులు | షహీద్ అఫ్రిది (265) |
అత్యధిక వికెట్లు | లసిత్ మలింగ (9) |
← 2008 2012 → |
ట్రోఫీని వెండి, బంగారం, రాగి, ఇత్తడితో కలిపి వెండి పూతతో మ్యాట్, గ్లాస్ ఫినిషింగ్‌తో తయారు చేశారు. ఇది బలం, స్వచ్ఛత, వినయం, పట్టుదలలను సూచిస్తుంది. ఇది, నాలుగు లోహాలను మాత్రమే కాకుండా నాలుగు పాల్గొనే దేశాలను కూడా సూచిస్తుంది. [2]
2011 క్రికెట్ ప్రపంచ కప్ కోసం R. ప్రేమదాస స్టేడియంతో సహా శ్రీలంకలోని ఇతర స్టేడియాలు పునరుద్ధరణలో ఉన్నందున రాంగిరి దంబుల్లా అంతర్జాతీయ స్టేడియం మాత్రమే ఆసియా కప్ 2010 కి వేదికగా ఉంది. మొత్తం ఏడూ డే/నైట్ మ్యాచ్‌లే.
రాంగిరి దంబుల్లా ఇంటర్నేషనల్ స్టేడియం శ్రీలంకలోని 16,800 సీట్ల క్రికెట్ స్టేడియం. [3] ఈ స్టేడియం సెంట్రల్ ప్రావిన్స్‌లో దంబుల్లాకు దగ్గరగా 60 ఎకరాల స్థలంలో ఉంది. ఈ స్టేడియంను దంబుల్లా ట్యాంక్, దంబుల్లా రాక్ లకు అభిముఖంగా నిర్మించారు.
టోర్నమెంట్లో పాల్గొనే నాలుగు జట్ల జట్టులను ఆయా క్రికెట్ బోర్డులు జూన్ ప్రారంభంలో ప్రకటించాయి. [4]
బంగ్లాదేశ్[5][6] (13) | భారతదేశం[7][8] (1) | పాకిస్తాన్[9][10] (5) | శ్రీలంక[11][12] (7) |
---|---|---|---|
|
|
|
|
గ్రూప్ దశలో ఒక్కో జట్టు మిగతావాటితో ఒకసారి ఆడాయి. గ్రూప్ దశల ముగింపులో పాయింట్ల ఆధారంగా టాప్ 2 జట్లు ఒకదానితో ఒకటి ఫైనల్లో తలపడ్డాయి. ప్రతి విజయానికి 4 పాయింట్లు, టై/ ఫలితం తేలనివి 1 పాయింటు వస్తాయి. ఒక బోనస్ పాయింట్ విధానం కూడా అమలులో ఉంది, ఒక జట్టు అందుబాటులో ఉన్న ఓవర్లలో 80% లేదా అంతకంటే తక్కువ ఉపయోగించి విజయం సాధించినా లేదా ప్రత్యర్థి జట్టు స్కోరును తమ స్కోరులో 80% కి మించకుండా నిలబెట్టినా ఆ విజయం ద్వారా అందుకున్న నాలుగుతో పాటు, అదనంగా మరొక పాయింటు వస్తుంది.
పోస్ | జట్టు | Pld | W | ఎల్ | టి | NR | BP | Pts | NRR |
---|---|---|---|---|---|---|---|---|---|
1 | శ్రీలంక | 3 | 3 | 0 | 0 | 0 | 2 | 14 | 1.424 |
2 | భారతదేశం | 3 | 2 | 1 | 0 | 0 | 1 | 9 | 0.275 |
3 | పాకిస్తాన్ | 3 | 1 | 2 | 0 | 0 | 1 | 5 | 0.788 |
4 | బంగ్లాదేశ్ | 3 | 0 | 3 | 0 | 0 | 0 | 0 | -2.627 |
v |
||
చమార కపుగెదర 55* (88) ఆషిష్ నెహ్రా 4/40 (9 ఓవర్లు) |
84 బంతుల్లో 66 పరుగులు చేసిన దినేష్ కార్తీక్‌ను మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌గా ప్రకటించగా, టోర్నమెంట్లో 3 మ్యాచ్‌లలో 265 పరుగులు చేసిన పాకిస్థాన్ ఆటగాడు షాహిద్ ఆఫ్రిది మ్యాన్ ఆఫ్ ద సిరీస్‌గా ఎంపికయ్యాడు. [13]
Countries | Broadcaster |
---|---|
భారతదేశం | NEO Cricket |
బంగ్లాదేశ్ | |
Arab World | |
దక్షిణ కొరియా | |
శ్రీలంక | |
హాంగ్ కాంగ్ | |
మూస:Country data TAI | |
దక్షిణాఫ్రికా | Supersport |
మూస:Country data AGO | |
మూస:Country data BEN | |
బోత్సువానా | |
మూస:Country data BFA | |
మూస:Country data BDI | |
కామెరూన్ | |
మూస:Country data CPV | |
మూస:Country data CAF | |
మూస:Country data TCD | |
మూస:Country data COM | |
కోటె డి ఐవొరి | |
మూస:Country data COD | |
జిబూటి | |
మూస:Country data ERI | |
Ethiopia | |
ఈక్వటోరియల్ గ్వినియా | |
మూస:Country data GAB | |
మూస:Country data GMB | |
ఘనా | |
మూస:Country data GIN | |
మూస:Country data GNB | |
కెన్యా | |
మూస:Country data LBR | |
మూస:Country data MDG | |
మలావి | |
మాలి (దేశం) | |
మూస:Country data MUS | |
మొజాంబిక్ | |
నమీబియా | |
మూస:Country data NER | |
నైజీరియా | |
మూస:Country data COG | |
రువాండా | |
మూస:Country data SHN | |
మూస:Country data STP | |
సెనెగల్ | |
మూస:Country data SYC | |
సియెర్రా లియోన్ | |
South Sudan | |
ఈశ్వతిని | |
మూస:Country data TZA | |
మూస:Country data TGO | |
Uganda | |
మూస:Country data ZMB | |
జింబాబ్వే | |
ఆస్ట్రేలియా | Setanta Sports Australia |
భారతదేశం | Doordarshan (Only India matches and final) |
శ్రీలంక | Sirasa TV |
సింగపూర్ | Starhub |
మలేషియా | Astro |
పాకిస్తాన్ | Geo Super |
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.