దేబాశీష్ సర్బేశ్వర్ మొహంతి (జననం 1976 జూలై 20) 1997, 2001 మధ్య రెండు టెస్ట్ మ్యాచ్‌లు, 45 వన్డే ఇంటర్నేషనల్స్ ఆడిన మాజీ భారతీయ క్రికెటర్ . అతను రైట్ ఆర్మ్ మీడియం-ఫాస్ట్ బౌలరు. పొడవైన తన శరీరానికి పేస్‌ని జత చేసి మంచి ఫలితాలు సాధించాడు. అతను పరిమిత-ఓవర్ల ఫార్మాట్లో 30 కంటే తక్కువ సగటుతో సగటున ఒక ఆటకు ఒక వికెట్ కంటే ఎక్కువ తీసుకున్నాడు. 2020 డిసెంబరు 24 న మొహంతి, భారత క్రికెట్ జట్టు జాతీయ సెలెక్టర్‌గా నియమితుడయ్యాడు.
త్వరిత వాస్తవాలు వ్యక్తిగత సమాచారం, పూర్తి పేరు ...
దేబాశిష్ మొహంతి
|
పూర్తి పేరు | Debasish Sarbeswar Mohanty |
---|
పుట్టిన తేదీ | 20 July 1976 (1976-07-20) (age 48) భువనేశ్వర్, ఒడీశా |
---|
ఎత్తు | 6 అ. 1 అం. (185 cమీ.) |
---|
బ్యాటింగు | కుడిచేతి వాటం |
---|
బౌలింగు | Right-arm ఫాస్ట్ మీడియం |
---|
పాత్ర | Bowler |
---|
|
జాతీయ జట్టు | |
---|
తొలి టెస్టు (క్యాప్ 213) | 1997 ఆగస్టు 9 - శ్రీలంక తో |
---|
చివరి టెస్టు | 1997 నవంబరు 19 - శ్రీలంక తో |
---|
తొలి వన్డే (క్యాప్ 107) | 1997 సెప్టెంబరు 13 - పాకిస్తాన్ తో |
---|
చివరి వన్డే | 2001 జూలై 22 - శ్రీలంక తో |
---|
|
---|
|
Years | Team |
1996–2010 | ఒడిశా |
---|
|
---|
|
పోటీ |
టెస్టులు |
వన్డేలు |
ఫక్లా |
లి ఎ |
---|
మ్యాచ్‌లు |
2 |
45 |
117 |
129 |
చేసిన పరుగులు |
– |
28 |
1,553 |
218 |
బ్యాటింగు సగటు |
– |
5.59 |
13.62 |
7.26 |
100లు/50లు |
– |
0/0 |
0/5 |
0/0 |
అత్యుత్తమ స్కోరు |
– |
18* |
97 |
22 |
వేసిన బంతులు |
430 |
1,996 |
22,053 |
6,024 |
వికెట్లు |
4 |
57 |
417 |
160 |
బౌలింగు సగటు |
59.75 |
29.15 |
21.05 |
26.84 |
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు |
0 |
0 |
19 |
1 |
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు |
0 |
0 |
3 |
0 |
అత్యుత్తమ బౌలింగు |
4/78 |
4/56 |
10/46 |
5/22 |
క్యాచ్‌లు/స్టంపింగులు |
0/– |
10/– |
47/– |
26/– | |
|
---|
|
మూసివేయి
వెంకటేష్ ప్రసాద్‌తో కలిసి మొహంతి బలమైన కొత్త బాల్ భాగస్వామ్యాన్ని నెలకొల్పిన కాలం ఉంది. 1999 క్రికెట్ ప్రపంచ కప్‌లో ప్రారంభించి, అతను భారత ప్రధాన వికెట్ టేకర్ జవగల్ శ్రీనాథ్ కంటే నాలుగు ఆటలు తక్కువగా ఆడినప్పటికీ అత్యధిక వికెట్లు తీసిన రెండవ భారతీయుడు. మొహంతి 17 వన్డేలు ఆడి, సుమారు 20 చిల్లర సగటుతో 29 వికెట్లు తీశాడు. ICC వన్డే ప్రపంచ ర్యాంకింగ్స్‌లో టాప్ 20లోకి చేరాడు. అయితే, అజిత్ అగార్కర్ తిరిగి రావడంతో, అతని అవకాశాలు తగ్గిపోయి, మరో ఏడు గేమ్‌లు మాత్రమే ఆడాడు. 1990లలో టొరంటోలో పాకిస్తాన్‌తో జరిగిన సహారా కప్ సిరీస్‌లో ఒకదానిని గెలవడంలో హర్విందర్ సింగ్‌తో కలిసి మొహంతి కీలకపాత్ర పోషించాడు.
మొహంతీ ఒక పించ్ హిట్టరు అయినప్పటికీ, భారతీయ థింక్ ట్యాంక్ అతన్ని ఎప్పుడూ ఉపయోగించుకోలేదు. అతను చాలా సమర్ధుడైన లోయర్ ఆర్డర్ బ్యాట్స్‌మన్. భారత క్రికెట్లో 11వ ఆటగాడు మొహంతి, 10వ ర్యాంక్‌లో ఉన్న రాహుల్ సంఘ్వీలు ఓడిపోయిన మ్యాచ్‌లలో కూడా మంచి సిక్సర్లతో ప్రేక్షకులను అలరించారు. అతను బంతిని వేసిన వేగం కంటే అతని బౌలింగ్ యాక్షన్ చాలా ప్రమాదకరమైనది. ఫ్లాట్ పిచ్‌లపై, శక్తిని ఆదా చేయడానికి ఆఫ్ స్పిన్ బౌలింగ్ చేయమని అతనికి సలహాలు ఇచ్చారు.
2000-01 సీజన్లో, అగర్తలాలో జరిగిన ఈస్ట్ జోన్ v సౌత్ జోన్ కోసం ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌లో ఆడిన మొహంతీ 46 పరుగులకు మొత్తం 10 వికెట్లూ తీసుకున్నాడు. అది అతని కెరీర్-బెస్ట్ బౌలింగు ప్రదర్శన. తద్వారా ఒక ఇన్నింగ్స్‌లో మొత్తం పది వికెట్లు తీయడం అనే అరుదైన ఘనతను సాధించాడు. [1]
2006లో, అతను వేల్స్‌లోని కోల్విన్ బే క్రికెట్ క్లబ్లో క్లబ్ ప్రొఫెషనల్‌గా చేరాడు. అతను భువనేశ్వర్‌లోని నాల్కోలో ఉద్యోగం చేస్తున్నాడు. 2011 నుండి ఒడిశా రంజీ జట్టుకు కోచ్‌గా నియమితుడయ్యాడు. అతను మాజీ కోచ్ మైఖేల్ బెవన్ స్థానంలో చేరాడు. 7 సంవత్సరాల తర్వాత అతని స్థానంలో మరొక మాజీ భారత క్రికెటర్ శివ సుందర్ దాస్ 2017లో ఆ జట్టుకు కోచ్‌గా నియమితుడయ్యాడు [2] మహంతి, ఈస్ట్ జోన్ జట్టుకు శిక్షణ ఇచ్చి, ఆ జట్టు తమ మొదటి దులీప్ ట్రోఫీని గెలుచుకోవడాంలో దోహద పడ్డాడు.
మూస:India Squad 1999 Cricket World Cup