ముహమ్మద్ అజహరుద్దీన్
From Wikipedia, the free encyclopedia
ముహమ్మద్ అజహరుద్దీన్ (జననం 1963, ఫిబ్రవరి 8, హైదరాబాదులో) అజహర్ గా పిలువబడే అజహరుద్దీన్, భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్. మ్యాచ్‌ఫిక్సింగ్ ఆరోపణలు ఎదుర్కొని ఆటకు దూరమయ్యాడు. కానీ కోర్టులో ఆ కేసు నుంచి నిర్దోషిగా విడుదలయ్యాడు.[1] 2009 మేలో కాంగ్రెస్ పార్టీ తరఫున పార్లమెంటు సభ్యునిగా ఉత్తర ప్రదేశ్ లోని మురాదాబాద్ నియోజకవర్గం నుండి గెలుపొందాడు. ఈయన సికింద్రాబాదులోని మహబూబ్ కళాశాలలో చదువుకున్నాడు.
ముహమ్మద్ అజహరుద్దీన్ | |||
![]() | |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 2009 | |||
ముందు | షాఫిఖర్ రహమాన్ బరక్ | ||
---|---|---|---|
నియోజకవర్గం | మొరదాబాద్ | ||
వ్యక్తిగత వివరాలు |
|||
రాజకీయ పార్టీ | భారత జాతీయ కాంగ్రెసు | ||
జీవిత భాగస్వామి | సంగీత బిజ్లానీ | ||
సంతానం | అయాజుద్దిన్ అసద్ | ||
మతం | ఇస్లాం | ||
వెబ్‌సైటు | http://azhar.co/ | ||
జనవరి 2, 2014నాటికి |
వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పూర్తి పేరు | ముహమ్మద్ అజహరుద్దీన్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పుట్టిన తేదీ | ఫిబ్రవరి 8, 1963 | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
మారుపేరు | అజహర్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | కుడిచేతి బ్యాట్స్‌మాన్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బౌలింగు | కుడిచేతి మీడియం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పాత్ర | బ్యాట్స్-మ్యాన్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
జాతీయ జట్టు | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి టెస్టు (క్యాప్ 169) | 1984 డిసెంబరు 31 - ఇంగ్లాండ్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి టెస్టు | 2000 మార్చి 2 - దక్షిణాఫ్రికా తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి వన్‌డే (క్యాప్ 51) | 1985 జనవరి 20 - ఇంగ్లాండ్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి వన్‌డే | 2000 జూన్ 3 - పాకిస్తాన్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
దేశీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
Years | Team | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
1981–2000 | హైదరాబాద్ క్రికెట్ టీమ్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
1983–2000 | సౌత్ జోన్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
1991–1994 | Derbyshire | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: CricketArchive, 2009 ఫిబ్రవరి 13 |
జీవిత చరిత్ర
అజారుద్దీన్ 1963 ఫిబ్రవరి 8 న మహమ్మద్ అజీజుద్దీన్, యూసఫ్ సుల్తానా దంపతులకు, హైదరాబాదులో జన్మించాడు. ఆల్ సెయింట్స్ హైస్కూల్లో చదివాడు. నిజాం కళాశాల నుంచి బి.కాం డిగ్రీ పుచ్చుకున్నాడు.[2]
క్రికెట్ జీవితం
ఇతని మణికట్టు ఆట శైలికి పేరు పొందాడు. ఇతను మొట్టమొదటిసారిగా 1984 డిసెంబరు 31 న కలకత్తాలో భారత్ ఇంగ్లండు దేశాల మధ్య జరిగిన టెస్ట్ మ్యాచ్ తో అంతర్జాతీయ కెరీర్ ప్రారంభించాడు. మొదటి ఇన్నింగ్స్ లోనే 322 బంతులు ఎదుర్కొని 110 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్ లో ఇతనికి జతగా రవిశాస్త్రి 111 పరుగులు చేశాడు. ఈ ఆట డ్రాగా ముగిసింది. తర్వాత ఆడిన రెండు టెస్టు మ్యాచుల్లోనూ అజర్ రెండు శతకాలు సాధించాడు.
1989 లో కృష్ణమాచారి శ్రీకాంత్ తర్వాత భారత క్రికెట్ జట్టు కెప్టెన్సీ చేపట్టాడు. మొత్తం 47 టెస్ట్ మ్యాచులు, 174 వన్డే మ్యాచులకు కెప్టెన్ గా వ్యవహరించాడు.
మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు
2000 లో అజారుద్దీన్ మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు ఎదుర్కొన్నాడు.[3] సిబిఐ నివేదిక ప్రకారం దక్షిణాఫ్రికా కెప్టెన్ హ్యాన్సీ క్రోనేకి బుకీలకు పరిచయం చేసింది అజారుద్దీనే.[4] సిబిఐ తరఫున కె. మాధవన్ ఇచ్చిన నివేదిక ఆధారంగా ఐసిసి, బిసిసిఐ అజారుద్దీన్ ను జీవితకాలం క్రికెట్ లో ఆడకుండా నిషేధించారు.[5][6]
2012 నవంబరు 8 న హైదరాబాదులోని డివిజనల్ కోర్టులోని న్యాయమూర్తులు అశుతోష్ మొహంతా, కృష్ణమోహన్ రెడ్డి కోర్టుకు సమర్పించిన ఆధారాల మేరకు ఆయనపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేశారు. అతనిపై నిషేధం అక్రమమని తీర్పు చెప్పింది. అయితే ఆరోపణలు ఎదుర్కొన్నప్పటి నుంచి అజహర్ మైదానంలోకి రాలేదు. ఈ తీర్పు వెలువడే నాటికి అజహర్ వయసు 49 సంవత్సరాలు.[7][8][9]
రాజకీయ జీవితం
2009 పార్లమెంటు ఎన్నికలు
కాంగ్రెస్ పార్టీ తరఫున పార్లమెంటు సభ్యునిగా ఉత్తర ప్రదేశ్ లోని మురాదాబాద్ నియోజకవర్గం నుండి 49,107 మెజారిటీతో గెలుపొందాడు.[10] ఆయన 2014లో రాజస్థాన్‌లోని టోంక్ సవాయీ మాధోపుర్ లోక్‌సభ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి సుఖ్బీర్ సింగ్ జోనాపురియా చేతిలో 1,35,000 ఓట్ల తేడాతో ఓడిపోయాడు. అజహరుద్దీన్ 2019 ఎన్నికలలో పోటీకి దూరంగా ఉండి[11], 2023 తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రకటించిన రెండో జాబితాలో ఆయనను జూబ్లీహిల్స్ అభ్యర్థిగా ప్రకటించింది.[12][13][14]
ఇతరాలు
2013 జూలై 14 న మొహమ్మద్ అజహరుద్దీన్ ఢిల్లీ బ్యాడ్మింటన్ సంఘం (డీబీఏ) అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు.[15]
వ్యక్తిగత జీవితం
అజహర్ తన మొదటి భార్య నౌరీన్ కు విడాకులిచ్చి, నటి సంగీతా బిజలానీని వివాహం చేసుకున్నాడు. మొదటి భార్య సంతానం ఇద్దరు కొడుకులు అయాజుద్దీన్, అసద్. అయాజుద్దీన్ 2011 సెప్టెంబరు 11 న ఔటర్ రింగ్ రోడ్డులో పుప్పాలగూడ వద్ద బైక్ ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చనిపోయాడు.
ఇవి కూడా చూడండి
మూలాలు
బయటి లింకులు
Wikiwand - on
Seamless Wikipedia browsing. On steroids.