From Wikipedia, the free encyclopedia
1985 నవంబర్ 11 న కర్ణాటక లోని కొడగులో జన్మించిన రాబిన్ ఉత్తప్ప (Robin Venu Uthappa) (Kannada: ರಾಬಿನ್ ವೆನು ಉತ್ತಪ್ಪ) ప్రస్తుతం భారత వన్డే, ట్వంటీ-20 క్రికెట్ జట్టులో మెరుపులు మెరిపిస్తున్న యువ క్రికెట్ ఆటగాడు. అతని తండ్రి వేణు ఉత్తప్ప హకీ క్రీడకు అంతర్జాతీయ రెఫరీ. 2006లో ఇంగ్లాండుతో జరిగిన 7 వ, చివరి వన్డేలో మొదటిసారిగా జట్టులోకి ప్రవేశించాడు. తొలి వన్డేలోనే ఓపెనర్ గా బరిలోకి దిగి 86 పరుగులు చేసి రనౌట్ అయ్యాడు. పరిమిత ఓవర్ల క్రికెట్ లో భారత తరఫున రంగప్రవేశం చేసిన మ్యాచ్ లోనే అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్మెన్ గా రికార్డు సృష్టించాడు.
రాబిన్ ఉతప్ప 2022 సెప్టెంబర్ 15న క్రికెట్లోని అన్ని ఫార్మాట్లకీ రిటైర్మెంట్ ప్రకటించాడు.[1]
రాబిన్ ఉతప్ప 2006 ఏప్రిల్ 15న గౌహతిలో ఇంగ్లండ్ తో జరిగిన వన్డే మ్యాచ్ ద్వారా టీమిండియా తరపున అరంగ్రేటం చేసి మొత్తం 46 వన్డేలు ఆడి 934 పరుగులు, 13 టీ20 మ్యాచ్ లు ఆడి 249 పరుగులు, ఐపీఎల్లో 205 మ్యాచ్లు ఆడి 4,952 పరుగులు చేశాడు.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.