From Wikipedia, the free encyclopedia
1950 సెప్టెంబర్ 24 న పాటియాలా లో జన్మించిన మోహిందర్ అమర్నాథ్ (Mohinder Amarnath) భారత మాజీ క్రికెట్ క్రీడాకారుడు. జిమ్మీ అనే ముద్దు పేరు కలిగిన ఇతని పూర్తి పేరు మోహిందర్ అమర్నాథ్ భరద్వాజ్ (Mohinder Amarnath Bhardwaj). మోహిందర్ అమర్నాథ్ తండ్రి లాలా అమర్నాథ్ స్వతంత్ర భారత క్రికెట్ జట్టు తొలి కెప్టెన్. ఇతని సోదరుడు సురీందర్ అమర్నాథ్ కూడా భారత్ తరఫున క్రికెట్ ఆడినాడు.
వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పూర్తి పేరు | మొహీందర్ అమర్నాథ్ భరద్వాజ్ | |||||||||||||||||||||||||||||||||||||||
పుట్టిన తేదీ | పాటియాలా, పంజాబ్ | 1950 సెప్టెంబరు 24|||||||||||||||||||||||||||||||||||||||
మారుపేరు | జిమ్మీ | |||||||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | కుడిచేతి వాటం | |||||||||||||||||||||||||||||||||||||||
బౌలింగు | కుడిచేతి వాటం మీడియం పేస్ | |||||||||||||||||||||||||||||||||||||||
పాత్ర | బ్యాటింగు ఆల్ రౌండరు | |||||||||||||||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||
జాతీయ జట్టు | ||||||||||||||||||||||||||||||||||||||||
తొలి టెస్టు (క్యాప్ 125) | 1969 డిసెంబరు 24 - ఆస్ట్రేలియా తో | |||||||||||||||||||||||||||||||||||||||
చివరి టెస్టు | 1988 జనవరి 11 - వెస్టిండీస్ తో | |||||||||||||||||||||||||||||||||||||||
తొలి వన్డే (క్యాప్ 85) | 1975 జూన్ 7 - ఇంగ్లాండ్ తో | |||||||||||||||||||||||||||||||||||||||
చివరి వన్డే | 1989 అక్టోబరు 30 - వెస్టిండీస్ తో | |||||||||||||||||||||||||||||||||||||||
దేశీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||
Years | Team | |||||||||||||||||||||||||||||||||||||||
1969–1974 | పంజాబ్ | |||||||||||||||||||||||||||||||||||||||
1974–1989 | ఢిల్లీ | |||||||||||||||||||||||||||||||||||||||
1984 | బరోడా | |||||||||||||||||||||||||||||||||||||||
1984 | Wiltshire | |||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: Cricinfo, 2009 అక్టోబరు 8 |
1969 లో ఆస్ట్రేలియా పై చెన్నై లో మోహిందర్ అమర్నాథ్ తన తొలి టెస్ట్ ఆడినాడు. తన టెస్ట్ క్రికెట్ ఆఖరు దశలో అత్యుత్తమ బ్యాట్స్‌మెన్ గా పేరుపొందాడు. ఇమ్రాన్‌ఖాన్, మాల్కం మార్షల్ లాంటి మహా బౌలర్లచే పొగడబడ్డాడు. 1982-83 లో మోహిందర్ పాకిస్తాన్ పై 5, వెస్ట్ఇండీస్ పై 6 మ్యాచ్‌లు ఆడి మొత్తం 11 మ్యాచ్‌లలో 1000 పరుగులు సాధించాడు. సునీల్ గవాస్కర్ తను రచించిన "Idols" పుస్తకంలో ప్రపంచంలో ఉత్తమ బ్యాట్స్‌మెన్ గా మోహిందర్ అమర్నాథ్ ను కీర్తించాడు. తన తొలి శతకాన్ని పెర్త్ లో ఆస్ట్రేలియా పై సాధించాడు. జెఫ్ థాంప్సన్ లాంటి మేటి బౌలర్లను ఎదుర్కొని ఈ శతకం సాధించడం విశేషం. ఆ తర్వాత మరో 10 సెంచరీలు సాధించి మొత్తం 11 టెస్ట్ సెంచరీలు తన ఖాతాలో జమచేసుకున్నాడు. అవన్నీ ఫాస్ట్ బౌలింగ్‌ను ఎదుర్కొని సాధించడం గమనార్హం. పాకిస్తాన్ కు చెందిన ప్రముఖ క్రికెటర్ ఇమ్రాన్‌ఖాన్ "All Round View" పుస్తకంలో మోహిందర్ ను ఉత్తమ బ్యాట్స్‌మెన్ గా పొగిడినాడు. అతను మరో అడుగు ముందుకు వేసి మోహిందర్ నిలకడగా ఆడుతున్ననూ అతనిని తరచుగా జట్టు నుంచి తీసివేస్తున్నారని, అదే సమయంలో చెత్తగా ఆడే వారికి జట్టులోకి ఆహ్వానిస్తున్నారని పేర్కొన్నాడు. అతను భారత జట్టులో వచ్చీ పోయే బ్యాట్స్‌మెన్ గా పేరుగాంచాడు. ఎన్ని పర్యాయాలు జట్టు నుంచి ఉధ్వాసన పల్కిననూ మళ్ళీ తన ప్రతిభతో జట్టులో స్థానం పొందినాడు. అతను ఎక్కువగా 3 వ నెంబర్ లో బ్యాటింగ్ చేసేవాడు.
మోహిందర్ అమర్నాథ్ 69 టెస్టులు ఆడి 4378 పరుగులు సాధించాడు. ఇందులో 11 సెంచరీలు, 24 అర్థ సెంచరీలు ఉన్నాయి. బౌలింగ్‌లో 32 టెస్ట్ వికెట్లు పడగొట్టాడు. వన్డే క్రికెట్ లో 85 మ్యాచ్‌లు ఆడి 1924 పరుగులు చేశాడు. వన్డేలో అతని అత్యధిక స్కోరు 102 నాటౌట్.
భారత్ విజయం సాధించిన 1983 ప్రపంచ కప్ క్రికెట్ లో మోహిందర్ అమర్నాథ్ మంచి ప్రతిభ కనబర్చాడు. సెమీ-ఫైనల్, ఫైనల్ రెండింటిలోనూ అతడు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు పొందినాడు.
సెమీ ఫైనల్ లో ఇంగ్లాండు తో జరిగిన మ్యాచ్ లో బౌలింగ్ చేసి డేవిడ్ గోవర్, మైక్ గాటింగ్ లను ఔట్ చేసి టాప్ ఆర్డర్ ను కుప్పకూల్చాడు. ఈ మ్యాచ్ లో 12 ఓవర్లు బౌలింగ్ చేసి కేవలం 2.25 సగటుతో 27 పరుగులను మాత్రమే ఇచ్చాడు. ఆ తర్వాత బ్యాటింగ్ లో 46 విలువైన పరుగులు జోడించాడు. దాంతో సహజంగానే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఆవార్డుకు అర్హత పొందినాడు.
వెస్ట్ఇండీస్ తో జరిగిన ఫైనల్ పోరులోనూ తన ప్రతిభను కొనసాగించాడు. అప్పటి సమయంలో ప్రపంచంలోనే వారిది అత్యుత్తమ జట్టు. అరవీర భయంకర ఫాస్ట్ బౌలింగ్ ను ఎదుర్కొని 80 బంతులను ఎదుర్కొని 26 పరుగులు చేశాడు. పరిమిత ఓవర్ల క్రికెట్ లో గణాంకాల ప్రకారం ఇది ఉత్తమ ఇన్నింగ్స్ కాకున్ననూ అప్పటి పరిస్థితి ప్రకారం అది సరైనదే. 60 ఓవర్ల మ్యాచ్ లో భారత్ 54.5 ఓవర్లు మాత్రమే ఆడి 183 పరుగులు చేసింది. ఈ ఇన్నింగ్సులో అత్యధిక బంతులను ఎదుర్కొన్న భారతీయుడు అమర్నాథే. చేసిన పరుగుల ప్రకారం చూస్తే ఇతనిది కృష్ణమాచారి శ్రీకాంత్ (38), సందీప్ పాటిల్ (27) ల తర్వాత మూడో స్థానం.184 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్ట్ఇండీస్ కు ప్రారంభంలో ఇదేమీ కష్టసాధ్యం అనిపించలేదు. కాని మదన్‌లాల్, అమర్నాథ్ లు చెరో మూడు వికెట్లు పడగొట్టి 140 పరుగులకే కట్టడి చేసి వెస్ట్ఇండీస్ ఆశలపై నీళ్ళు చల్లారు. దీంతో భారత్ 43 పరుగులతో విజయం సాధించింది. అమర్నాథ్ 7 ఓవర్లలో 1.71 సగటుతో 12 పరుగులు మాత్రమే ఇచ్చి భారత విజయానికి దోహదపడ్డాడు. ఫైనల్ మ్యాచ్ లోనూ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఇతనికే వరించింది.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.