ఆగష్టు 15, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 227వ రోజు (లీపు సంవత్సరములో 228వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 138 రోజులు మిగిలినవి.
<< | ఆగస్టు | >> | ||||
ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
1 | 2 | 3 | ||||
4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 |
11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 |
18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 |
25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 |
2024 |
సంఘటనలు
- 1519: పనామా దేశంలోని, పనామా సిటీ స్థాపించబడింది. శ్రీకృష్ణదేవరాయల కాలం.
- 1535: పరాగ్వే దేశపు రాజధాని నగరం, అసున్సియన్ స్థాపించబడింది. శ్రీకృష్ణదేవరాయల కాలం.
- 1540: పెరూ దేశంలోని, అరెక్విప నగరం స్థాపించబడింది. శ్రీకృష్ణదేవరాయల కాలం.
- 1822: 1822 జనాభా లెక్కలు ప్రకారం అప్పర్ కెనడాలో 1,20,000 మంది, లోయర్ కెనడా లో,500,000 మంది ప్రజలు నివసించేవారు.
- 1834: 1834 లో బ్రిటన్ పార్లమెంట్, చేసిన "సౌత్ ఆస్ట్రేలియా చట్టము" ప్రకారము, అక్కడ వలస (కోలనీ) ఏర్పాటు చేసుకోవటానికి అనుమతి లభించింది.
- 1858: పసిఫిక్ సముద్రతీరప్రాంతానికి, ప్రతీ రోజూ ఉత్తరాల పంపిణీ జరగటం మొదలు అయ్యింది.
- 1889: ఆసియా లోనే, అతి పురాతనమైన, మోహన్ బాగన్ ఎ.సి. కలకత్తాలో స్థాపించబడింది.
- 1870: ట్రాన్స్ కాంటినెంటల్ రైల్వే మార్గము పూర్తి అయ్యింది.
- 1889: 15 ఆగష్ట్ నుంచి 16 సెప్టెంబరు వరకు జరిగిన ది గ్రేట్ లండన్ డాక్ స్ట్రైక్ వలన, బ్రిటిష్ ట్రేడ్ యూనియనిజం, నిపుణులైన కార్మికుల నుంచి, తక్కువ నిపుణత ఉన్న కార్మికులకు పాకింది.
- 1901: కాడిలాక్ మోటార్ కంపెనీ డెట్రాయిట్లో స్థాపించబడింది.
- 1914: అంకన్ అనే పేరుగల సరుకుల ఓడ (రవాణా ఓడ), అట్లాంటిక్ మహాసముద్రం నుంచి పసిఫిక్ మహాసముద్రం లోకి, పనామా కాలువ ద్వారా, ప్రయాణించటంతో, పనామా కాలువ ప్రారంభమైంది.
- 1944: ఫ్రాన్స్ దక్షిణాన, మిత్ర దేశాల దళాలు దిగి, మార్సీల్స్ పట్టణాన్ని, తిరిగి స్వాధీనం చేసుకున్నాయి.
- 1938: ఆంధ్రప్రభ దినపత్రిక చెన్నై (నాటి మద్రాసు) లో, పారిశ్రామిక వేత్త రామనాధ్ గోయెంకా మొదలు పెట్టాడు.
- 1945: కొరియా తనంతట తానే, ఒక గణతంత్రదేశంగా ప్రకటించుకుంది.
- 1947: భారత దేశానికి బ్రిటిష్ పాలన నుండి స్వాతంత్ర్యం లభించింది.
- 1947: స్వతంత్ర భారతదేశం గవర్నర్ జనరల్‌గా లూయీ మౌంట్‌బాటెన్ నియామకం.
- 1947 : పాకిస్తాన్ స్థాపకుడు ముహమ్మద్ ఆలీ జిన్నా మొదటి పాకిస్తాన్ గవర్నర్ జనరల్ గా, కరాచీలో పదవిని స్వీకరించాడు.
- 1950: విశాఖపట్నం జిల్లా నుంచి 1950 ఆగష్టు 15 న శ్రీకాకుళం జిల్లా ఏర్పడిన రోజు.
- 1950: అస్సాంలో భూకంపం 8.6 రెక్టర్ స్కేల్ మీద. 1,000 మందికి పైగా మరణించారు.
- 1960: రిపబ్లిక్ ఆఫ్ ది కాంగో (బ్రజ్జావిల్లె), ఫ్రాన్స్ నుంచి స్వతంత్రం ప్రకటించుకుంది.
- 1960: ముగ్గురు కాలిఫోర్నియా కాపలాదారులు, ఎగిరే పళ్ళాలు (గుర్తుపట్టలేని ఫ్లైయింగ్ వస్తువులు) చూసామని చెప్పారు.
- 1961: తూర్పు జర్మనీలో బెర్లిన్ గోడ కట్టటం మొదలైంది. జర్మనీ ప్రజలకు చీకటి రోజు
- 1965: లాస్ ఏంజిల్స్ లోని, జాతి కలహాలు నివారించటానికి, అమెరికాకి చెందిన నేషనల్ గార్డ్ని పిలిచారు.
- 1965: బీటిల్స్, న్యూయార్క్ లోని, షియా స్టేడియంలో పాటలు పాడారు.
- 1969: వుడ్ స్టాక్ సంగీత ఉత్సవం మాక్స్ యాస్గర్ ఫార్మ్లో ప్రారంభించారు.
- 1971: బహ్రెయిన్, బ్రిటన్ నుంచి స్వాతంత్ర్యం పొందింది.
- 1971: అమెరికా అధ్యక్షుడు నిక్సన్, జీతాలు, ధరలు, అద్దెల మీద 90 రోజుల పాటు స్తంభింపచేసాడు.
- 1974: దక్షిణ కొరియా స్వాతంత్ర్య దినోత్సవాలలో పాల్గొంటున్న, దక్షిణ కొరియా, అధ్యక్షుడు [[పార్క్ చంగ్ హీ]] మీద జరిగిన హత్యా ప్రయత్నంలో, దక్షిణ కొరియా, ప్రథమ మహిళ యూక్ యంగ్ సూ, మరణించింది.
- 1975: బంగ్లాదేశ్లో సైనిక కుట్ర. బంగ్లాదేశ్ ప్రధాని షేక్ ముజిబుర్ రెహ్మాన్ ని, అతని కుటుంబసభ్యులను (హసీనా వజీద్ ని తప్ప) చంపారు.
- 1977: ’ఓహియో రాష్ట్ర యూనివర్సిటీ' లో "సెటి" ప్రాజక్టులో భాగంగా, నెలకొల్పిన, ’ది బిగ్ ఇయర్, అనేపేరుగల రేడియో టెలిస్కోప్ కి విశ్వాంతరాళం లోతుల నుంచి ఒక రేడియో సిగ్నల్ అందింది. దానిని "వౌ సిగ్నల్" అనే పేరు పెట్టారు.
- 1983: ఆంధ్ర ప్రదేశ్ గవర్నర్గా రామ్ లాల్ నియమితులయ్యాడు.
- 2006: ఎయిడ్స్ సమావేశము : క్లింటన్, గేట్స్, అమెరికా అధ్యక్షుడి ప్రణాళికను సమర్ధించారు.
- 2006: శీతలీకరించిన వీర్యం పై చేసిన పరిశోధన, అంతరించి పోయిన పాలిచ్చే జంతువులు (మమ్మాల్స్) తిరిగి పునఃసృష్టి చేయగలమనే ఆశలు కలిగిస్తున్నది
- 2007: పసిఫిక్ మహాసముద్రం తీరంలోని ఇకా, పెరూ దేశంలోని పలుప్రాంతాలలో, భూకంపం, 8.0- (మేగ్నిట్యూడ్) రెక్టర్ స్కేల్ మీద వచ్చి, 514 మంది మరణించగా, 1,090 మంది గాయపడ్డారు.
జననాలు
- 1769: నెపోలియన్, ఫ్రెంచ్ చక్రవర్తి. (మ.1821)
- 1771: సర్ వాల్టర్ స్కాట్, స్కాటిష్ నవలా రచయిత.
- 1888: టి.ఇ. లారెన్స్, 'లారెన్స్ ఆఫ్ అరేబియా'; సైనికుడు, రచయిత
- 1889: దండు నారాయణరాజు, స్వాతంత్ర్య సమరయోధులు. (మ.1944)
- 1895: వేమూరి గగ్గయ్య, తెలుగు రంగస్థల, సినిమా నటుడు. (మ.1955)
- 1902: మోటూరి సత్యనారాయణ, దక్షిణ భారతదేశంలో హిందీ వ్యాప్తిచేసిన మహా పండితుడు, స్వాతంత్ర్య సమరయోధులు. (మ.1995)
- 1913: బాడిగ వెంకట నరసింహారావు, కవి, సాహితీ వేత్త, బాల సాహిత్యకారుడు. (మ.1994)
- 1914: పరశురామ ఘనాపాఠి వేదపండితుడు. (మ.2016)
- 1915: ఇస్మత్ చుగ్తాయ్, ఉర్దూ అభ్యుదయ రచయిత్రి. (మ.1994)
- 1924: మల్లెమాల సుందర రామిరెడ్డి, తెలుగు రచయిత, సినీ నిర్మాత. (మ.2011)
- 1929: ద్వివేదుల విశాలాక్షి, కథా, నవలా రచయిత్రి. (మ.2014)
- 1931: నాగభైరవ కోటేశ్వరరావు, కవి, సాహితీవేత్త, సినిమా మాటల రచయిత. (మ.2008)
- 1935: రాజసులోచన, తెలుగు సినిమా నటి, కూచిపూడి, భరతనాట్య నర్తకి. (మ.2013)
- 1938: సుకుమారి, తెలుగుతో పాటు,పలు భాషా చిత్రాలలో,2000 పైగానటించిన నటి(మ.2013)
- 1945: రాళ్లపల్లి వెంకట నరసింహ రావు, తెలుగు చలనచిత్ర నటుడు(మ.2019)
- 1948: భారతి, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ చిత్రాల నటి.గాయనీ, దర్శకురాలు.
- 1949: మైలవరపు గోపి, తెలుగు సినిమా రంగంలో ఒక ఉత్తమమైన భావాలున్న రచయిత. (మ.1996)
- 1949: దేవిప్రియ, పాత్రికేయుడు, కవి (మ.2020).
- 1961: సుహాసిని, దక్షిణ భారత సినిమా నటి.
- 1961: పందిళ్ళ శేఖర్‌బాబు, రంగస్థల (పౌరాణిక) నటుడు, దర్శకుడు, నిర్వాహకుడు. (మ.2015)
- 1964: శ్రీహరి, తెలుగు సినిమా నటుడు. ప్రతినాయకునిగా తెలుగు తెరకు పరిచయమై తరువాత నాయకుడిగా పదోన్నతి పొందిన నటుడు. (మ.2013)
- 1975: భారత మాజీ క్రికెట్ క్రీడాకారుడు విజయ్ భరద్వాజ్
- 1985: లయ (నటి), తెలుగు సినిమా నటీమణి.
- 1986: కాసోజు శ్రీకాంతచారి, మలిదశ తెలంగాణ ఉద్యమంలో తొలి అమరవీరుడు. (మ.2009)
మరణాలు
- 1935: అవ్వారి సుబ్రహ్మణ్యశాస్త్రి ఆశుకవి, శతావధాని. (జ.1883)
- 1942: మహదేవ్ దేశాయ్ భారత స్వాతంత్ర్య సమరయోధుడు, రచయిత. (జ.1892)
- 1949: కొండా వెంకటప్పయ్య, ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రోద్యమానికి ఆద్యుడు, స్వాతంత్ర్య సమరయోధుడు, దేశభక్త బిరుదాంకితుడు. (జ.1866)
- 2004: అమర్‌సిన్హ్ చౌదరి, గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి. (జ. 1941).
- 2005: బెండపూడి వెంకట సత్యనారాయణ, చర్మవైద్యులు. (జ.1927)
- 2006: జి. వి. సుబ్రహ్మణ్యం, వైస్ ఛాన్సలర్, ఆచార్యుడు. (జ.1935)
- 2013: లాల్‌జాన్ బాషా, రాజకీయవేత్త, తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడు. (మ.1956).
- 2018: అజిత్ వాడేకర్, భారత టెస్ట్ క్రికెట్ క్రీడాకారుడు. (జ.1941)
- ఆగష్టు 15: మహ్మద్ హబీబ్, తెలంగాణకు చెందిన ఫుట్‌బాల్ ఆటగాడు. (జ. 1949)
పండుగలు , జాతీయ దినాలు
బయటి లింకులు
- బీబీసి: ఈ రోజున
- టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో
- చరిత్రలో ఈ రోజు : ఆగష్టు 15
- చారిత్రక సంఘటనలు 366 రోజులు - పుట్టిన రోజులు - స్కోప్ సిస్టం.
- ఈ రోజున చరిత్రలో ఏమి జరిగింది.
- ఈ రోజున ఏమి జరిగిందంటే.
- చరిత్రలో ఈ రోజున జరిగిన సంగతులు.
- ఈ రొజు గొప్పతనం.
- కెనడాలో ఈ రోజున జరిగిన సంగతులు
- చారిత్రక దినములు.
ఆగష్టు 14 - ఆగష్టు 16 - జూలై 15 - సెప్టెంబర్ 15 -- అన్ని తేదీలు
జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబరు | అక్టోబరు | నవంబరు | డిసెంబరు |
Wikiwand in your browser!
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.