నవంబర్ 12

తేదీ From Wikipedia, the free encyclopedia

నవంబర్ 12, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 318వ రోజు (లీపు సంవత్సరములో 319వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 49 రోజులు మిగిలినవి.

<< నవంబరు >>
ఆది సోమ మంగళ బుధ గురు శుక్ర శని
1
2345678
9101112131415
16171819202122
23242526272829
30
2025

సంఘటనలు

  • 1766: సలాబత్‌ జంగును అతని సోదరుడు నిజాం ఆలీ ఖాను కూలదోసి, రాజమండ్రిని, శ్రీకాకుళాన్ని హసన్‌ ఆలీ ఖానుకు లీజు కిచ్చాడు. రాబర్టు క్లైవు మొగలు చక్రవర్తి షా ఆలంతో సంప్రదించి, ఉత్తర సర్కారులను ఈస్ట్‌ ఇండియా కంపెనీకి ధారాదత్తం చేసినట్లుగా ఆగస్టు 1765లో ఫర్మానా తెప్పించాడు. కాని దానిని మార్చి 1766 వరకు రహస్యంగా ఉంచాడు. బ్రిటిషు వారు కొండపల్లి దుర్గాన్ని ఆక్రమించారు. అవసరమైతే సైనిక చర్య చేపట్టడానికై జనరలు సిల్లాడ్‌ను మచిలీపట్నం పంపించారు. నిజాము కూడా శీఘ్రంగా యుద్ధ సన్నాహాలు చేసాడు. నవంబర్‌ 12, 1766 న కుదిరిన ఒక ఒప్పందం వలన యుద్ధం తప్పింది. ఉత్తర సర్కారులకు ప్రతిఫలంగా, కంపెనీ, నిజాము సహాయార్థం సైన్యాన్ని పోషిస్తుంది తూర్పు గోదావరి జిల్లా చరిత్ర
  • 1969: రాష్ట్రపతి ఎన్నికలో స్వంత పార్టీ యొక్క అధికారిక అభ్యర్థికి వ్యతిరేకంగా వి.వి.గిరిని గెలిపించిన ఇందిరా గాంధీని పార్టీ నుండి బహిష్కరించగా, కొత్తపార్టీ, కాంగ్రెస్ (ఐ) ని ఏర్పాటు చేసింది. తరువాతి కాలంలో ఇదే భారత జాతీయ కాంగ్రెసుగా గుర్తింపు పొందింది.
  • 1996: హర్యానా లోని భివాని వద్ద ఆకాశంలో రెండు విమానాలు ఢీకొన్న ఘోర దుర్ఘటనలో 350 మంది మరణించారు.

జననాలు

  • 1885: కొప్పరపు సోదర కవులు, కొప్పరపు వేంకట సుబ్బరాయ కవి, తెలుగు సాహిత్య అవధానంలో పేరొందిన జంట సోదర కవులు. (మ.1932])
  • 1920: పెరుగు శివారెడ్డి ఆంధ్రప్రదేశ్ లోని నేత్రవైద్య నిపుణుడు., ఆంధ్రప్రదేశ్ గవర్నర్ సలహాదారుగా, దేశ ప్రథమ పౌరుడి (రాష్ట్రపతి) కి గౌరవ నేత్ర చికిత్సకులుగా నియమితులయ్యారు,
  • 1925: పసుమర్తి కృష్ణమూర్తి, చలనచిత్ర నృత్యదర్శకుడు. (మ.2004)
  • 1929: సి.వి.సుబ్బన్న, శతావధాని (మ.2017)
  • 1940: అంజాద్ ఖాన్ , భారతీయ నటుడు, దర్శకుడు,(మ1992)
  • 1977: ప్రియాంక త్రివేది, కన్నడ, తెలుగు, తమిళ, హిందీ,చిత్రాల నటి.
  • 1985: సనంశెట్టి , మోడల్, తమిళ, తెలుగు, మలయాళ నటి
  • 1992:ప్రియాంక జవాల్కర్ , తెలుగు సినీ నటి.

మరణాలు

Thumb
మదన్ మోహన్ మాలవీయ

పండుగలు, జాతీయ దినాలు

బయటి లింకులు


నవంబర్ 11 - నవంబర్ 13 - అక్టోబర్ 12 - డిసెంబర్ 12 -- అన్ని తేదీలు

జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబరు | అక్టోబరు | నవంబరు | డిసెంబరు
Loading related searches...

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.