జనవరి 1 , గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో మొదటి రోజు. సంవత్సరాంతమునకు ఇంకా 364 రోజులు మిగిలినవి (లీపు సంవత్సరములో 365 రోజులు).
630 : ముహమ్మద్ మక్కాకు వెళ్ళి, దానిని రక్తం చిందించకుండా ఆక్రమించుకున్నాడు
1651 : స్కాట్లాండ్ రాజుగా రెండో చార్లెస్ నియామకం.
1707 : పోర్చుగల్ రాజుగా ఐదవ జార్జ్ నియమించబడ్డాడు.
1804 : హైతీలో ఫ్రెంచి పాలన అంతమైంది.
1818 : బీమా కోరేగావ్ తిరుగుబాటు (యుద్ధం) జరిగింది.
1899 : క్యూబా స్పెయిన్ నుండి స్వాతంత్ర్యం పొందింది
1877 : ఇంగ్లాండు రాణి విక్టోరియాని భారత దేశపు మహారాణిగా వెల్లడించారు
1877 : 1866 నాటి కరువులో పూటకు ఎనిమిది వేల మందికి గంజి ఇచ్చి వేలాదిమంది ప్రాణాలు కాపాడిన బుడ్డా వెంగళరెడ్డి గారికి సన్మాన సభ ఢిల్లీలో 1877 జనవరి 1వ తేదీన జరిగింది.
1906 : బ్రిటీషు వారు ఇండియాలో భారత ప్రామాణిక కాలమానం పాటించడం మెదలు పెట్టారు
1925 : అమెరికాకు చెందిన శాస్త్రవేత్త ఎడ్విన్ హబుల్, పాల పుంతకు బయట ఇతర నక్షత్ర పుంతల ఉన్నాయని వెల్లడించాడు.
1923 : రామ్‌గోపాల్ మలానీ , హైదరాబాదులో డి.బి.ఆర్.మిల్స్ వ్యవస్థాపకుడు.
1939 : బిల్ హెవ్లెట్ , డేవిడ్ ప్యకార్డ్ కలిసి హెచ్.పి. స్థాపించారు
1948 : విభజన తరువాత భారత దేశం పాకిస్తానుకు 55కోట్ల రూపాయలను చెల్లించనన్నది
1953 : విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ స్థాపించబడింది.
1956 : సూడాన్ స్వాతంత్ర్యం పొందింది.
1958 : యూరోపియన్ కమ్యూనిటీ స్థాపించబడింది.
1960 : కామెరూన్ స్వాతంత్ర్యం పొందింది
1971 : అమెరికా టీవీలో ధూమపాన సంబంధిత అడ్వర్టైజెమెంట్లను బ్యాన్ చేసింది
1972 : మణిపూర్ రాష్ట్రం అవతరించింది.
1973 : ఫీల్డు మర్షల్ ఎస్.హెచ్.ఎఫ్.జె. మానెక్షా భారత దేశమునకు సైనిక ప్రధానాధికారిగా నియామకం.
1978 : ఎయిర్ ఇండియా ఫ్లైట్ 855, ముంబాయి సముద్ర తీరాన, అరేబియ సముద్రములోకి పడిపోయింది.
1981 : గ్రీసు రిపబ్లిక్ యూరోపియన్ కమ్యునిటీలో చేరినది.
1984 : బ్రూనై స్వాతంత్ర్యం పొందింది.
1985 : ఇంటర్నెట్ డొమైన్ నేమ్ సిస్టం ఏర్పాటుచేయబడింది.
1986 : సెన్సెక్స్ , బోంబే స్టాక్ ఎక్స్చేంజ్ సెన్సిటివ్ ఇండెక్స్ అనే ఒక విలువ-భార సూచీ ప్రారంభించబడింది.
1993 : చెకొస్లోవేకియా చెక్, స్లోవక్ రెండు దేశాలుగా విడిపోయింది.
1994 : ఉత్తర అమెరికా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (నాఫ్తా) అమలులోకి వచ్చింది.
1995 : GATT స్థానంలో ప్రపంచ వాణిజ్య సంస్థ అమలులోకి వచ్చింది.
1998 : యూరోపియన్ కేంద్రీయ బ్యాంకు స్థాపించబడింది.
1999 : యూరో కరెన్సీ చెలామణిలోకి వచ్చింది.
2002 : ఐరోపా లోని 13 దేశాల్లో యూరో నాణేలు, నోట్లను చెలామణీ లోకి తెచ్చారు.
2004 : టీవీ9 తెలుగు ప్రసారాలు (ఛానెల్) మొదలు అయ్యాయి. తేది వివరాలు తెలియవు.
2006 : ఆరవ వేతన సంఘం (కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీత భత్యాల సవరణ కోసం వేసిన సంఘం) నివేదికలోని సిఫార్సులను, సవరించిన జీతాన్ని, కేంద్ర ప్రభుత్వం ఈ రోజునుంచి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అమలు చేసింది. భత్యాలను మాత్రం 1 సెప్టంబరు 2008 నుంచి చెల్లించింది.
2007 : ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శిగా బాబ్ కి మూన్ పదవీబాధ్యతలు చేపట్టాడు.
మహమ్మద్ రజబ్ అలీ
1766 : మహారాజా చందు లాల్ , హైదరాబాద్ రాజ్యానికి ప్రధానమంత్రిగా, పేష్కరుగా పలు హోదాల్లో పనిచేసిన రాజకీయవేత్త. (మ.1845)
1840 : బుడ్డా వెంగళరెడ్డి , 1866 కాలంలో సంభవించిన కరువు కాలంలో తన ఆస్తినంతా ధారపోసి ఎంతోమంది ప్రాణాల్ని కాపాడిన మహా దాత. (మ.1900)
1888 : అమ్జద్ హైదరాబాదీ ; తెలంగాణకు చెందిన ఉర్దూ కవి. (మ. 1961)
1892 : మహదేవ్ దేశాయ్ భారత స్వాతంత్ర్య సమరయోధుడు, రచయిత. (మ.1942)
1894 : సత్యేంద్రనాథ్ బోస్ , బెంగాలి గణిత శాస్త్రవేత్త.
1905 : లంక సుందరం , భారత పార్లమెంటు సభ్యులు, అంతర్జాతీయ న్యాయశాస్త్రంలో నిపుణులు.
1909 : చర్ల గణపతిశాస్త్రి , వేద పండితులు, గాంధేయవాది, ప్రాచీన గ్రంథాల అనువాదకులు. (మ.1996)
1911 : ఎల్లాప్రగడ సీతాకుమారి , కథా రచయిత్రి, స్వాతంత్ర్య సమరయోధురాలు.ఆమె ఆంధ్రప్రదేశ్ మాజీ శాసనసభ్యురాలు.
1920 : మహమ్మద్ రజబ్ అలీ , ఖమ్మం జిల్లా రాజకీయనాయకుడు. (మ.1997)
1928 : మంత్రి శ్రీనివాసరావు తెలంగాణ ప్రాంత రంగస్థల నటుడు, ఆంధ్ర విశ్వవిద్యాలయం రంగస్థల కళల శాఖ తొలి శాఖాధిపతి. (మ.1974)
1928 : అబ్దుల్ సత్తార్ ఈది , పాకిస్థాన్‌కు చెందిన సంఘసేవకుడు, దాత. (మ.2016)
1929 : ముకురాల రామారెడ్డి మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన స్వాతంత్ర్య సమరయోధుడు, కవి, రచయిత. (మ.2003)
1938 : గణపతి తనికైమొని భారతీయ పాలినాలజిస్ట్. (మ.1986)
1938 : తిరుమల శ్రీనివాసాచార్య , గీతాలు, సాహిత్యవ్యాస సంకలనాలు, రుబాయీల రచయిత.
1939 : సత్యమూర్తి , వ్యంగ్య చిత్రకారుడు.
1942: సూర్యకళ, పాతతరం తెలుగు చలన చిత్ర నటి.పలు దక్షిణాది భాషల్లో కూడా నటించిన నటి (మ.2014)
1943 : రఘునాథ్ అనంత్ మషేల్కర్, భారతీయ శాస్త్రవేత్త.
1946 : బాలు మహేంద్ర , దక్షిణ భారతీయ సుప్రసిద్ధ ఛాయాగ్రహకుడు, దర్శకుడు .
1946 : పప్పల చలపతిరావు , ఆంధ్రప్రదేశ్ లోని అనకాపల్లి లోక్‌సభ నియోజకవర్గం నుండి 14వ లోక్‌సభకు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఎన్నికయ్యారు.
1948 : షేక్ బడేసాహెబ్ తెలుగు రచయిత.
1951 : వేణు సంకోజు , కవి, సాహితీవేత్త, ఉద్యమకారుడు.
1951 : అష్ఫక్ హుస్సేన్, ఉర్దూ కవి.
1952 : నానా పటేకర్ , నటుడు.
1954 : శాంతా రంగస్వామి , భారత మహిళా క్రికెట్ క్రీడాకారిణి.
1961 : దుర్గాప్రసాద్ ఓజా , భౌతిక శాస్త్రవేత్త.
1962 : మారొజు వీరన్న , తెలంగాణ మహాసభను స్థాపకుడు, సి.పి.ఐ. (యం.యల్) జనశక్తి కార్యకర్త. (మ.1999)
1963 : అబ్దుల్ హకీం జాని షేక్ - బాలసాహితీవేత్త.
1966 : వద్దిపర్తి పద్మాకర్ , పేరుపొందిన అవధాని, ఆధ్యాత్మిక ప్రవచనకారుడు.
1970:ఊహా, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, చిత్రాల నటి.
1971 : కళాభవన్ మణి , భారతీయ సినిమా నటుడు, గాయకుడు. (మ.2016)
1974 : కట్టా శ్రీనివాసరావు , ఉపాధ్యాయుడు, కవి, కవిసంగమం పేరుతో పేస్ బుక్ కవిత్వ వేదికలో ప్రధాన భాగస్వామి.
1978 : విద్యా బాలన్ , హిందీ నటి.
1978 : పరమహంస శ్రీ నిత్యానందా.
1979 : డింకో సింగ్ , 1998 ఆసియా క్రీడలలో బంగారుపతకం గెలుచుకున్న భారత బాక్సింగ్ క్రీడాకారుడు.
1980 : మాలోతు కవిత, ఎంపీ (మహబూబాబాద్), మాజీ ఎమ్మెల్యే, మహబూబాబాద్ జిల్లా, తెలంగాణ.
1980: సానా యాదిరెడ్డి, తెలుగు చలన చిత్ర దర్శకుడు, నిర్మాత.
1982 : ఐశ్వర్య ధనుష్ భారతీయ సినీ దర్శకురాలు. భారతీయ నటుడు రజినీకాంత్ పెద్ద కుమార్తె.
1990: సోనాలి బింద్రే, హిందీ, మరాఠీ, దక్షిణ భారత నటి, మోడల్ .
1991: శుభ్ర అయ్యప్ప, తెలుగు, తమిళ, కన్నడ, చిత్రాల నటి .
1748 : జొహాన్ బెర్నౌలీ, స్విట్జెర్లాండ్కు చెందిన గణిత శాస్త్రవేత్త.
1775 : అహమ్మద్ షా బహదూర్ , 13వ మొఘల్ చక్రవర్తి. (జ.1725)
1782 : జొహాన్ క్రిస్టియన్ బాక్, జెర్మనీకు చెందిన సంగీత కళాకారుడు
1894 : హెన్రిచ్ రుడాఫ్ హెర్జ్ , విద్యుదయస్కాంత వికిరణాలను ఉత్పత్తి చేయడం, శోధించే ప్రక్రియలను కనుగొన్న శాస్త్రవేత్త. (జ.1857)
1940 : పానుగంటి లక్ష్మీ నరసింహరావు , ప్రసిద్ధ తెలుగు సాహితీవేత్త, హాస్య, వ్యంగ్య, అధిక్షేప రచయిత, సాక్షి ఉపన్యాసాలను రచించి తెలుగు సాహిత్యానికి అనేక అమూల్యాభరణాలు అందించిన వారు. (జ.1865)
1955 : శాంతిస్వరూప్ భట్నాగర్ , రసాయన శాస్త్రవేత్త. ఈయన పేరుమీదే శాంతిస్వరూప్ భట్నాగర్ అవార్డును ఏర్పాటు చేసారు.
1964 : శొంఠి వెంకట రామమూర్తి బహుముఖ ప్రజ్ఞాశాలి. గణితశాస్త్రవేత్త. (జ.1888)
1968 : వెంపటి సదాశివబ్రహ్మం , పేరుపొందిన చలనచిత్ర రచయిత
1994 : చాగంటి సోమయాజులు , తెలుగు రచయిత. (జ.1915)
1995 : యూగీన్ విగ్నెర్, హంగేరీకు చెందిన, నోబెల్ బహుమతి గెలుచుకున్న భౌతిక శాస్త్రవేత్త
2001 : ఆరుట్ల కమలాదేవి నిజాం నిరంకుశత్వానికి వ్యతిరేకంగా, వెట్టిచాకిరికి వ్యతిరేకంగా ఉద్యమంలో పాల్గొన్న యోధురాలు. (జ.1920)
2007 : డూండీ , తెలుగు సినిమా నిర్మాత .
2007 : టిల్లీ అల్సెన్ , అమెరికన్ రచయిత్రి (జ.1912)
2008 : ప్రతాప్ చంద్ర చుందెర్, భారతీయ క్యాబినెట్ మంత్రి.
2009 : కొత్తపల్లి సత్యశ్రీమన్నారాయణ , నిరసన కవి. (జ.1947)
డిసెంబర్ 31 - జనవరి 2 - డిసెంబర్ 1 - ఫిబ్రవరి 1 -- అన్ని తేదీలు
మరింత సమాచారం నెలలు తేదీలు, జనవరి ...
మూసివేయి