మార్చి 19: స్కాట్లాండ్తో యూనియన్ చట్టాన్ని ఇంగ్లాండ్ పార్లమెంట్ ఆమోదించింది.
మే 12: స్కాట్లాండ్, ఇంగ్లాండ్ రాజ్యాలు విలీనమై గ్రేట్ బ్రిటన్ యొక్క ఏకైక సార్వభౌమ రాజ్యం ఉనికిలోకి వచ్చింది, [1]
మే 23: శాంటోరిని కాల్డెరాలో అగ్నిపర్వత విస్ఫోటనం ప్రారంభమైంది.
అక్టోబరు 22: సిసిలీ నావికాదళ విపత్తు: తప్పుడు నావిగేషన్ కారణంగా నాలుగు బ్రిటిష్ రాయల్ నేవీ నౌకలు ఐల్స్ ఆఫ్ స్సిలీలో ఒడ్డు వైపుకు కొట్టుకెళ్ళాయి. అడ్మిరల్ సర్ క్లౌడెస్లీ షోవెల్ తో సహా, కనీసం 1,450 నావికులు అందరూ మునిగిపోయారు.
అక్టోబరు 23: గ్రేట్ బ్రిటన్ రాజ్యపు పార్లమెంటు మొదటిసారి లండన్‌లో సమావేశమైంది.
అక్టోబరు 28: హేయి భూకంపం (2011 వరకు జపాన్‌లో ఇదే అత్యంత శక్తివంతమైనది) తాకింది, స్థానిక పరిమాణం 8.6 గా అంచనా వేసారు.
డిసెంబరు 16: ఫుజి పర్వతపు చివరి విస్ఫోటనం జపాన్‌లో ప్రారంభమైంది.
డిసెంబరు: స్వీడన్‌కు చెందిన చార్లెస్ XII రష్యాపై దండయాత్ర ప్రారంభించాడు, 60,000 సంకీర్ణ దళాలతో లీప్జిగ్ నుండి తూర్పు వైపుకు వెళ్ళాడు. రీగా శివార్లలో మరో 16,000 మంది సైనికులు స్వీడిష్ సరఫరా మార్గాలకు కాపలాగా ఉన్నారు.
ఆగష్టు 30: జోహన్నెస్ బ్రోవాలియస్, ఫిన్నిష్, స్వీడిష్ లూథరన్ వేదాంతవేత్త, భౌతిక శాస్త్రవేత్త, వృక్షశాస్త్రజ్ఞుడు, కార్ల్ లిన్నెయస్ స్నేహితుడు (మ .1755 )