ముహమ్మద్ అజాం షాహ్

From Wikipedia, the free encyclopedia

ముహమ్మద్ అజాం షాహ్
Remove ads

" అబ్దుల్ ఫాజీ కుతుబ్ - ఉద్- దిన్ ముహమ్మద్ అజాం " (1653 జూన్ 28 - 1707 జూన్ 8) (సాధారణంగా అజాం షా) నామమాత్ర మొఘల్ చక్రవర్తి. పాలనా కాలం 1707 మార్చి 14 నుండి 1707 జూన్ 8. 6వ మొఘల్ చక్రవర్తి ఔరంగజేబుకు అతడు పెద్దకుమారుడు. అజాం షా అలంఘీర్ గా పిలువబడ్డాడు. అతడి పట్టమహిషి " దిల్ రాస్ బాను బేగం". 1681 ఆగస్టు 12న అజాం తనతండ్రి మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు వారసుడిగా అభిషేకించబడ్డాడు.[1] ఆయన బేరర్, మాల్వా, బెంగాల్, గుజరాత్, దక్కన్ సుభాహ్‌కు వైస్రాయ్‌గా సేవలందించాడు. ఔరంగజేబు మరణించిన తరువాత అజాం అహమ్మద్‌నగర్ వద్ద 1707 మార్చి 14న మొఘల్ సింహాసం అధిరోహించాడు.

త్వరిత వాస్తవాలు Muhammad Azam, Titular Mughal Emperor ...
Remove ads

అజాం షా ఆయన ముగ్గురు కుమారులు బీదర్ బఖ్తి, షహ్జాదా జవాన్ భక్త్ బహదూర్, షహ్జాదా సికందర్ షా బహదూర్ తరువాత అజాం సవతి అన్న రాకుమారుడు షా ఆలం (బహదూర్ షా) తో జరిగిన యుద్ధంలో 1707- జూన్ 8 న మరణించారు.

Remove ads

ఆరంభకాల జీవితం

ముహమ్మద్ అజాం షాహ్ 1653 జూన్ 28న రాజకుమారుడు ముహి- ఉద్ - దీన్ (ఔరంగజేబుగా గుర్తించబడ్జిన భవిష్యత్తు మొఘల్ చక్రవర్తి) ఆయన పట్టమహిషి దిల్ రాస్ బాను బేగం లకు బుర్హంపూర్‌లో జన్మించాడు. ముహమ్మద్ అజాం షాహ్ తల్లి అతడికి నాలుగు సంవత్సరాల వయసులోనే మరణించింది. దిల్ రాస్ బాను బేగం తండ్రి " మిర్జా బాది - ఉజ్- జమాన్ సఫవి " (షాహ్ నవాజ్ ఖాన్). మిర్జా బాది - ఉజ్- జమాన్ సఫవి పర్షియా (ఇరాన్) పాలించిన సఫానిద్ మంశానికి చెందినవాడు. అందువలన అజాం తండ్రి తరఫున తింరిద్ వంశావళికి చెందినవాడు అలాగే తల్లి తరఫున సఫానిద్ వంశావళికి చెందినవాడు. అందువలన అజాం తన గురించి గర్వపడేవాడు. అతడి తమ్ముడు రాజకుమారుడు సుల్తాన్ ముహమ్మద్ అక్బర్ మరణించిన తరువాత ఔరంగజేబు ఏకైక వారసుడుగా గుర్తించబడ్డాడు.

అజాం సవతి సోదరులు షాహ్ అలాం (మొదటి బహదూర్ షాహ్), కాం బక్ష్ ఔరంగజేబు హిందూ భార్యలకు (ద్వితీయ స్థాయిగా భావించబడ్డారు) జన్మించారు. [2] నిక్కోల్యో మనుస్సి అభిప్రాయంలో " షా నవాజ్ ఖాన్ సఫావి " మనువనిగా అజాం రాజ్యాంగ గుర్తింపు, మర్యాదను పొందాడు. ఆయన పూర్వీకులు పర్షియన్లు కావడం ఆయనకు ప్రత్యేకత ఇచ్చింది " .[3]

అజాం పెద్దవాడు అయ్యాడు. ఆయన తన ఙానం , నైపుణ్యం అతడికి ప్రత్యేకత ఇచ్చింది.[4] ఔరంగజేబు తనకుమారుని ఔన్నత్యానికి ఆనందించాడు. అజాంను తన సహచరినిగా భావించాడు.[5] అజాంకు ముగ్గురు అక్కలు " జెబ్- ఉన్- నిసా ", " జినత్- ఉన్- నిసా", "జుబ్బత్ - ఉన్- నిసా", ఒక తమ్ముడు రాజకుమారుడు సుల్తాన్ ముహమ్మద్ అక్బర్.

Remove ads

వివాహం

అజాం తన మేనమామ షైస్తాఖాన్ అభిమాన కుమార్తె " ఇరాన్ దుక్త్ రహ్మత్ బాను " (బీబీ పారి) తో నిశ్చితార్ధం అయింది. 1685 లో దక్కా వద్ద బీబి పారి అకస్మాత్తుగా మరణించడంతో వివాహం జరగలేదు[6] 1669 జనవరి 3 న అజాం జహంజెబ్ బాను బేగాన్ని వివాహం చేసుకున్నాడు. దారా సికో, నాదిరా బాను బేగం కుమార్తె.

జహంజెబ్ అజాంకు పట్టపురాణి, అజాం అభిమానపాత్రురాలైన భార్య. 1670 ఆగస్టు 4 న అజాం పెద్ద కుమారుడికి జన్మ ఇచ్చింది. కుమారునికి "బీదర్ బఖ్త్" అని తాత చేత నామకరణం చేయబడింది.[7] ఔరంగజేబు తన జీవితమంతా కుమారుడు అజాం, కోడలు జహంజెబ్ (అభిమానపాత్రురాలైన కోడలు), రాకుమారుడు బీదర్ భఖ్త్ పట్ల అపారమైన ప్రేమాభిమానాలు కనబరిచాడు. అజాం విచక్షణ, అందం, సదా విజయాన్ని సాధించే వాడు. అతడు సాధించిన యుద్ధాలలో అతడికి విలాసవంతమైన బహుమతులను అందుకున్నాడు.[8] Bidar Bakht was also Aurangzeb's favourite grandson.[9]

రాజకీయ కూటమిలో భాగంగా అజాం 1681లో తన మూడవ (చివరి) వివాహంగా షహర్ బాను బేగాన్ని (పాద్షా బీబి) వివాహం చేసుకున్నాడు. ఆమె ఆదిల్షా సామ్రాజ్య రాజకుమార్తె, బీజపూర్ రాజు రెండవ అలి ఆదిల్ షా కుమార్తె.[10] రెండు వివాహాల తరువాత కూడా అజాంకు జహజ్జెబ్ పట్ల ప్రేమలో మార్పు లేదు. ఆమె 1705లో మరణించినప్పుడు అజాం గొప్ప విచారంలో మునిగిపోయాడు. ఆ విచారం ఆయన మిగిలిన జీవితం అంతా ఉండి పోయింది.[8]

Remove ads

చరిత్ర

బీజాపూరు ముట్టడి

Thumb
Muhammad Azam with his son, Prince Bidar Bakht

1685 లో మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు తన కుమారుడైన అజాం వెంట 50,000 సైన్యాలను ఇచ్చి బీజపూర్ పాలకుడైన సికిందర్ ఆదిల్ షాను ఓడించి బీజపూర్ కోటను స్వాధీనం చేసుకోవడానికి పంపాడు. సికిందర్ ఆదిల్ ష సామంతరాజుగా నిరాకరించడమే ఇందుకు కారణం. రెండు వైపులా ఫిరంగులను అధికంగా ఉపయోగించినందున మొఘల్ తరఫున విజయం సాధ్యం కాలేదు. ఈ వార్త విన్న ఔరంగజేబు ఆగ్రహించి తానే స్వయంగా దండయాత్రకు వెళ్ళి (1686 సెప్టెంబరు 4) బీజపూర్ మీద దండయాత్ర చేసి కోటను జయించాడు.

బెంగాలు సుబేదారు

Thumb
Crown Prince Azam, stands before his father, Emperor Aurangzeb

అజమ్ం ఖాన్ కొక మరణించిన తరువాత రాజకుమారుడు అజాం 1678-1701 వరకు బేరర్, మాల్వా, బెంగాల్ సుబా గవర్నరు (సుబేదారు) గా నియమించబడ్డాడు. [11] 1679లో అతడు కమర్పురాను జయించాడు. అసంపూర్తిగా ఉన్న లాల్బాగ్ కోటను అజాం పూర్తిగా కట్టించాడు. అజాం సమయంలో మీర్ మౌలా దివాన్‌గా నియమించబడ్డాడు. ములాక్ చంద్ పన్ను వసూలు కొరకు హుజూర్ - నవిస్ గా నియమించబడ్డాడు. [11] రాకుమారుడు అజాంను 1679 అక్టోబరు 6న ఔరంగజేబు తిరిగి తన వద్దకు పిలిపించుకున్నాడు.[11] బేరర్ సుబా, మాల్వాలను మరాఠీలు తమరాజ్యంలో విలీనం చేసుకున్నారు. బెంగాల్ ముర్షిదాబాద్ నవాబుల వశం అయింది. అజాం 1701-1706 వరకు గుజరాత్ సుబా సుబేదార్‌గా నియమించబడ్డాడు.

రాజ్యసంక్రమణ

1707 ఫిబ్రవరి మూడవ వారంలో ఔరంగజేబు తన కుమారులిద్దరినీ వేరుచేసాడు. అజాంను మల్వాకు, బక్ష్ ను బీజపూర్ జిల్లాకు పంపాడు. ఆయన మరణించడానికి కొన్ని రోజుల ముందు ఆయన అజాంకు వీడ్కోలు లేఖ వ్రాసాడు. తరువాత రోజు ఉదయం అజాం మాల్వా వెళ్ళకుండా అహ్మద్‌నగర్ చేరుకుని వెలుపల వేచి ఉండి చక్రవర్తి మకాముకు చేరుకుని ఆయన భౌతిక శరీరం తీసుకుని దౌలతాబాద్‌కు చేరి అక్కడ సమాధి చేసాడు.[12] తరువాత అజాం స్వయంగా తనకు తాను చక్రవర్తిగా ప్రకటించుకున్నాడు. వివాదాస్పదంగా రాజ్యాధికారం చేజిక్కించికున్న తరువాత రాజకీయ యుద్ధాలు సంభవించాయి. 1707 జూన్ 8 అజాం, రాజకుమారుడు బీదర్ బఖ్త్ యుద్ధంలో అజాం సవతి తమ్ముడు రెండవ బహదూర్ షా చేతిలో ఓడిపోయి మరణించారు. తరువాత బహదూర్ షా మొఘల్ చక్రవర్తి అయ్యాడు. [13]

Full title

Padshah-i-Mumalik Abu'l Faaiz Qutb-ud-Din Muhammad Azam Shah-i-Ali Jah Ghazi

References

Loading content...
Loading related searches...

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.

Remove ads