From Wikipedia, the free encyclopedia
దుర్గాప్రసాద్ ఓజా ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త. ఈయన పక్కా ఆంధ్రుడు కాకపోయినా తెలుగునాట ఉండి పరిశోధనలు చేసిన ప్రసిద్ధ శాస్త్రవేత్త.
విజ్ఞాన సర్వస్వంతో సమ్మిళితం కావాలంటే ఈ వ్యాసం నుండి ఇతర వ్యాసాలకు మరిన్ని లింకులుండాలి. (అక్టోబరు 2016) |
దుర్గా ప్రసాద్ ఓఝా జనవరి 1, 1961లో జన్మించారు. భౌతిక శాస్త్ర రంగంలో మాలిక్యులర్ ఫిజిక్స్ లో ఎం.ఎస్.సి చదివారు. లిక్విడ్ క్రిష్టల్స్ అంశంపై "థియోరటికల్ స్టడీస్ ఆఫ్ ఇంటర్ మాలిక్యులర్ ఎంటెరాక్షన్ ఇన్ లిక్విడ్ క్రిస్టల్స్" పరిశోధనా పత్రం సమర్పనతో పి.హెచ్.డి అందుకున్నారు.
రెండు దశాబ్దాల పరిశోధనా జీవితంలో జాతీయ అంతర్జాతీయ సైన్స్ జర్నల్స్ లో మొత్తం 70 పరిశోధనా పత్రాలను వెలువరించారు. స్వతంత్రంగా గ్రంథ రచనలు సహరచయితగా 32, పరిశోధక బృంద్ర రచయితగా 9 గ్రంథాలను వెలువరించారు.[1]
ప్రసిద్ధ అంతర్జాతీయ, జాతీయ సైన్స్ పత్రికలలో పర్యవేక్షక సంపాదకులుగా ఉన్నారు. పలు వైజ్ఞానిక సదస్సులలో తమ పరిశోధక వయసాలను సమర్పించారు. ఆచార్య నాగార్జున యూనివర్శిటి పరిశోధకులుగా కొంతకాలం (1999-2015) వరకు ఉన్నారు. Statistical Study of Molecular Ordering in Mesogenic Compound - II Ethyl para - Azoxybenzoate; theoretical studies on Molecular Organization in Liquid Crystals; Theoretical studies of inter molecular interactions in liquid crystals మొదలగు అంశాలమీద పరిశోధనలు చేసి నూతన అంశాలను ఆవిష్కరించారు. భౌతిక శాస్త్ర రంగమును అభివృద్ధి చేశారు.
2011 లో జర్నల్ రీజెర్చ్ జర్నల్ ఆయన చేసిన కృషిని అభినందించింది.[2] పలు అవార్డులు, పురస్కారములు అందుకున్నారు.. కంప్యూటరు రంగంలో నిష్ణాతులు. ఆకాశవాణి ప్రసంగాలను అందించారు. అంతర్జాతీయ స్థాయిలో ఈయన పరిశోధనలకు గొప్ప గుర్తింపు లభించింది. ప్రస్తుతం ఈయన విజయవాడలోని ఆంధ్ర లయోలా కాలేజీ ఫిజిక్స్ పిజి శాఖకు అధిపతిగా, ప్రొఫెసర్ గా ఉంటూ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుల నిర్వహణలో ఉన్నారు. ప్రతిష్ఠాత్మక అంతర్జాతీయ సైన్స్ పరిశోధన జర్నల్ "బులిటిన్ ఆఫ్ ఫ్యూర్ అండ్ అప్లయిడ్ సైన్సెస్" ఎడిటోరియల్ బోర్డులో ఈయనకు 2005 జూలైలో సభ్యత్వం లభించింది. బయోలాజికల్, గణిత శాస్త్రం, పర్యావరణ శాస్త్రం, భారతీయ విజ్ఞాన శాస్త్రం తదితర అంశాలలో కృషి కొనసాగిస్తున్న ఈ పత్రికలో డాక్టర్ దుర్గా ప్రసాద్ కు స్థానం లభించడం గర్వకారణం.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.