ఏప్రిల్ 1

తేదీ From Wikipedia, the free encyclopedia

ఏప్రిల్ 1, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 91వ రోజు (లీపు సంవత్సరములో 92వ రోజు ) . సంవత్సరాంతమునకు ఇంకా 274 రోజులు మిగిలినవి.

<< ఏప్రిల్ >>
ఆది సోమ మంగళ బుధ గురు శుక్ర శని
12345
6789101112
13141516171819
20212223242526
27282930
2025

సంఘటనలు

  • 1914: ఆంధ్రపత్రిక, వారపత్రిక నుంచి దినపత్రికగా మారింది మద్రాసులో (చెన్నై) . తెలుగు లెక్కలో కీలక నామ సంవత్సరం భాద్రపద శుద్ధ చతుర్థి హిందువులకు పండుగ దినమైన వినాయక చవితి నాడు కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు ఆంధ్రపత్రికను వారపత్రికగా ( 1908 సెప్టెంబరు 9) ప్రారంభించారు. ఇది బొంబాయిలోని తత్వవివేచక ముద్రాక్షరశాలలో ముద్రించబడేది.
  • 1935: భారతీయ రిజర్వు బ్యాంకు స్థాపించబడింది.
  • 1936: కళింగ లేదా ఉత్కళ్ అని పిలువబడే ఒడిషా భారతదేశంలో క్రొత్త రాష్ట్రంగా అవతరించింది.
  • 1957: డబ్బు, కానీ, అర్ధణా, అణా, బేడ అన్న 'డబ్బు', 'రూపాయి' లను 1 ఏప్రిల్ 1957 నుంచి నయాపైసలు, పైసలు, ఐదు పైసలు, పదిపైసలు అన్న దశాంశ పద్ధతిని ప్రవేశ పెట్టారు. భారతదేశంలో మెట్రిక్ (దశాంశ) పద్ధతిని, తూనికలు కొలతలకు 1 అక్టోబరు 1958 న ప్రవేశ పెట్టారు. 1793: ద్రవ్యరాశి మెట్రిక్ పద్ధతి కొలమానం (యూనిట్) లోని ద్రవ్యరాశి (బరువు) ని కొలిచే, మనం కె.జి అని పిలిచే కిలోగ్రామ్ ని, ఫ్రాన్స్ లో ప్రవేశపెట్టారు.
  • 1960: TIROS-1 ఉపగ్రహం టెలివిజన్ మొదటి చిత్రాన్ని అంతరాళం నుండి ప్రసారం చేసింది.
  • 1973: పులుల సంరక్షన పథకం - కోర్బెట్ట్ నేషనల్ పార్కులో పులుల సంరక్షణా పథకాన్ని ప్రారంబించారు.
  • 2001: స్వలింగ వివాహాలను చట్టబద్ధం చేసిన మొదటి దేశం నెదర్‌లాండ్స్.
  • 2010 : RTE- విద్యా హక్కు చట్టం అమలులోకి వచ్చిన సంవత్సరం.. edit by. మాధవ చారి..

జననాలు

మరణాలు

పండుగలు, జాతీయ దినాలు

  • ఒడిషా రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం.
  • -

ఇతర విశేషాలు

ఏప్రిల్‌ 1ని ఏప్రిల్ ఫూల్ రోజు అంటుంటారు.

Thumb
డెన్మార్క్‌లో ఏప్రిల్ ఫూల్

ఇందుకు ఒక వివరణ: పదహారో శతాబ్దం మధ్య వరకు యూరప్‌లో కూడా సంవత్సరాది మార్చి మధ్యలోనే వచ్చేది. యూరప్‌లో ఈ నూతన సంవత్సరపు ఉత్సవాలు, వసంత కాలపు ఉత్సవాలు ఓ పది రోజుల పాటు జరిగేవి. ఏప్రిల్‌ 1 రాగానే ఈ ఉత్సవాలు ముగిసే సందర్భంలో ఒకరికొకరు లాంఛనప్రాయంగా బహుమానాలు ఇచ్చుకునేవారు. ఇలా సజావుగా జరిగిపోతూన్న జీవితాలలో ఒక పెనుమార్పు వచ్చి పడింది. అప్పటి ఫ్రాన్సు దేశపు రాజు సంవత్సరాదిని మార్చి మధ్య నుండి జనవరి 1 వ తారీఖుకి మార్చుతూ ఒక తాఖీదు జారీ చేసేడు. ఆ రోజులలో వార్తాపత్రికలు, రేడియోలు, టెలివిజన్లు లేవు. (దండోరా వేయించి ఉంటాడు.) కాని రాజు గారి తాఖీదు అందరికీ అందలేదు. అందిన వాళ్ళు కూడా పాత అలవాట్లని గభీ మని మార్చుకోలేకపోయారు. కనుక రాజధానిలో సంవత్సరాది జనవరి ఒకటిన జరిగిపోయినా, దేశపు మూలల్లో ఏప్రిల్‌ 1 న లాంఛనప్రాయంగా బహుమానాలు ఇచ్చుకోవటం మానలేదు. అందుకని వాళ్ళని ఎగతాళికి ఏప్రిల్‌ ఫూల్స్‌ అనేవారు. పాత అలవాట్లు చావవు కదా. అందుకని ఇప్పటికీ కొంటె బహుమానాలు ఇచ్చుకోవటం, ఎగతాళి చేసుకోవటం మిగిలేయి. [ఆధారం చూపాలి]

బయటి లింకులు


మార్చి 31 - ఏప్రిల్ 2 - మార్చి 1 - మే 1 -- అన్ని తేదీలు

జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబరు | అక్టోబరు | నవంబరు | డిసెంబరు
Loading related searches...

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.