జనవరి 31: జెంబ్లోక్స్ యుద్ధం: ఆస్ట్రియాకు చెందిన డాన్ జాన్, అలెగ్జాండర్ ఫర్నేస్ ల ఆధ్వర్యంలోని స్పానిష్ దళాలు డచ్‌ను ఓడించాయి; ఫర్నేస్, ఫ్రెంచ్ మాట్లాడే దక్షిణ నెదర్లాండ్స్‌పై తిరిగి నియంత్రణ పొందడం ప్రారంభించాడు.
మే 31: మార్టిన్ ఫ్రోబిషర్ తన మూడవ యాత్రలో ఇంగ్లాండ్‌లోని హార్విచ్ నుండి కెనడాలోని ఫ్రోబిషర్ బేకు ప్రయాణించాడు.
జూలై: ఉత్తర అమెరికాలో యూరోపియన్లు చేసిన మొదటి థాంక్స్ గివింగ్ వేడుకను న్యూఫౌండ్లాండ్లో మార్టిన్ ఫ్రోబిషర్ నిర్వహించారు. అతను ముడిసరుకులను రవాణా చేసేవాడు.
ఆగష్టు 20–సెప్టెంబర్ 6: ఫ్రాన్సిస్ డ్రేక్, తన భూప్రదక్షిణ సమయంలో, తన ఓడలో మాగెల్లాన్ జలసంధి గుండా వెళ్ళాడు. అప్పటికే దానికి కొత్తగా గోల్డెన్ హైండ్ అని పేరు మార్చారు. [1]
అక్టోబర్ 1: అలెశాండ్రో ఫర్నేస్ డాన్ జాన్ తరువాత స్పానిష్ నెదర్లాండ్స్ గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించాడు .
అక్టోబర్ 21: వెండెన్ యుద్ధం: స్వీడన్లు రష్యన్లను ఓడించి, ముందుకు సాగి పోలోట్స్క్ పట్టుకున్నారు.