రాజ్యం. కె

రంగస్థల నటి From Wikipedia, the free encyclopedia

రాజ్యం. కె (నవంబర్ 2, 1956 - ఏప్రిల్ 1, 2018) ప్రముఖ రంగస్థల నటి.

త్వరిత వాస్తవాలు రాజ్యం. కె, జననం ...
రాజ్యం. కె
జననంనవంబర్ 2, 1956
మరణంఏప్రిల్ 1, 2018
జాతీయతభారతీయురాలు
వృత్తిరంగస్థల నటి
తల్లిదండ్రులుసత్యవతి అడబాల, వీరాస్వామి రాజా
మూసివేయి

జననం

రాజ్యం 1956 నవంబర్ 2వ తేదిన శ్రీమతి సత్యవతి, అడబాల వీరాస్వామి రాజా దంపతులకు తణుకులో జన్మించారు.

రంగస్థల ప్రస్థానం

ఈవిడ తన ఏడవ ఏటనే పునర్జన్మ నాటకంలో పాప పాత్ర ద్వారా రంగస్థల ప్రవేశం చేశారు. తణుకుకు చెందిన కీ.శే. ముంగడ నాగేశ్వరరావు తొలి గురువై నటనలో ఈవిడకు ప్రాథమిక శిక్షణ ఇచ్చారు. పి. సత్యనారాయణ రెడ్డి, ఈడేపల్లి రామారావు, మల్లాది సూర్యనారాయణ, ఎర్రంశెట్టి రామ్ ప్రసాద్, బళ్ళారి రాఘవ, పి. దాస్ ఈమెను మంచి నటిగా తీర్చిదిద్దారు.

1973లో గీతా కళామందిర్ పేర నట శిక్షణాలయాన్ని ప్రారంభించి, నూతన రంగస్థల నటీనటులకు శిక్షణ ఇచ్చారు. 1989లో శ్రీ కృష్ణభారతి నాట్యమండలిని స్థాపించి కీ.శే. పి.వి. భధ్రం రచించిన ‘చక్రధారి’, మల్లాది సూర్యనారాయణ రచించిన ‘లక్ష్మమ్మ కథ’ నాటకాలను శతాధిక ప్రదర్శనలిచ్చారు. లక్ష్మమ్మ పాత్ర ఈవిడకు ఎంతో కీర్తి, ప్రతిష్ఠలను తెచ్చిపెట్టింది. రంగస్థల ప్రముఖులు షణ్ముఖి ఆంజనేయ రాజు, ఎ. వి. సుబ్బారావు, అమరపు సత్యనారాయణ, మజ్జి రామారావు, ఆచంట వెంకటరత్నం నాయుడు, మద్దాల రామారావు మరెందరో ప్రముఖుల సరసన నటించారు.

నటించినవి

సాంఘిక నాటకాలు, నాటికలు

  1. మారిమారని మనషులు
  2. కట్నాలు – కాపురాలు
  3. పల్లెపడుచు
  4. పసుపు – బొట్టు – పేరంటం
  5. కన్నీటి కాపురం
  6. మంచి రోజులు
  7. పంజరంలో పక్షులు
  8. కృష్ణపక్షం
  9. నటశేఖర
  10. సద్గతి
  11. పెళ్ళిచూపులు
  12. పుణ్యస్థలం
  13. రాలిపోని ఆకు

పద్యనాటకాలు

పురస్కారాలు

  1. కళాభారతి – ఏలూరువారు ‘కళాభారతి’ బిరుదు ప్రధానం చేయగా, నటరాజ కళాపీఠం – తాడేపల్లిగూడెం వారు ‘శ్రీరంజని అవార్డును అందించారు.
  2. తిరుపతి – శ్రీ వేంకటేశ్వర నాట్య కళాపరిషత్తువారి ప్రతిష్ఠాత్మక ‘గరుడ పురస్కారాన్ని’ 2010 జూన్ 14న రూ. 10,000/- నగదుతో అందుకొన్నారు.
  3. ఉత్తమనటిగా పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాదు వారిచే కీర్తి పురస్కారాన్ని అందుకొన్నారు.
  4. కళాకారులు ఐక్యవేదిక జిల్లా ఉపాధ్యక్షురాలుగా, వృత్తి కళాకారుల సంఘం కార్యదర్శిగా సేవలందించారు.

మరణం

రాజ్యం 2018, ఏప్రిల్ 1న మరణించారు.

మూలాలు

రాజ్యం. కె, కళాదీపికలు (సమకాలీన రంగస్థల నటీమణులు), ప్రథమ ముద్రణ, సంపాదకులు: వి.ఎస్. రాఘవాచారి., కళాదీపిక మాసపత్రిక, తిరుపతి, అక్టోబరు 2011, పుట. 76.

Loading related searches...

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.