Remove ads
From Wikipedia, the free encyclopedia
అమరపు సత్యనారాయణ (ఏప్రిల్ 12, 1936 - అక్టోబరు 20, 2011) రంగస్థల నటుడు. ఈయన "కలియుగ కృష్ణుడు" గా పేరొందాడు.[1]
అమరపు సత్యనారాయణ AMARAPU SATYANRAYANA | |
---|---|
జననం | అమరపు సత్యనారాయణ 1936 ఏప్రిల్ 12 పాములవలస గ్రామం బొబ్బిలితాలూకా, శ్రీకాకుళం జిల్లా |
మరణం | 2011 అక్టోబరు 20 75) రాజాం | (వయసు
నివాస ప్రాంతం | పాములవలస గ్రామం బొబ్బిలితాలూకా, శ్రీకాకుళం జిల్లా |
వృత్తి | నటుడు గాయకుడు రంగస్థల కళాకారుడు |
ప్రసిద్ధి | కలియుగ కృష్ణుడు |
మతం | హిందూ |
తండ్రి | అప్పలనాయుడు |
తల్లి | కన్నమ్మ |
అమరపు సత్యనారాయణ విజయనగరం జిల్లా, తెర్లాం మండలం, పాములవలస గ్రామంలో అప్పలనాయుడు, కన్నమ్మలకు 1937 ఏప్రిల్ 12 న జన్మించాడు. చిన్నతనంలో పాటలు, పద్యాలు గొంతెత్తి అందరూ వినెలా పాడేవారు. అతని కంఠ మాధుర్యాన్ని గుర్తించి పక్కి సత్యన్నారాయన అనే ఉపాధ్యాయుడు శిక్షణనిస్తే మంచి కచ్ళాఇంకారుడవుతాడని చేరదీసాడు. ఒకవైపు నాటకాల్లో అవకాశాలిస్తూ మరొకవైపు నోము సూర్యారావు వద్ద శిక్షణ యిప్పించాడు. పద్యం భావయుక్తంగా పాడటానికి సంగీతం చాలా అవసరమని అందులో శిక్షణ పొందాడు. శ్రావ్యమైన కంఠం, చూడచక్కని రూపం, భావాత్మక గానం ఆయనను అందరిలో మేటిగా నిలిపింది.[2] ఆయన ఏ పాత్ర ధరించవలసి వచ్చినా ఆహార్యం మొదలుకొని అన్ని విషయాలలో ప్రత్యేక శ్రద్ధ వహించేవాడు. నిండుతనం కోసం పరితపించేవాడు. అందువల్ల ఆయన పాత్రలకి ఆయనకు ప్రజాదరణ పెరిగింది. అమరపు సత్యనారాయణ అనేక పాత్రలు ధరించినా ఆయనకు కొన్ని పాత్రలతొ విడదీయరాని సంబంధం పెరిగింది. ముఖ్యంగా రామాంజనేయ యుద్ధంలో రాముడు, గయోపాఖ్యానం నాటకంలో కృష్ణుడు, అర్జునుడు, చింతామణి నాటకంలో బిల్వమంగళుడు పాత్రలు మంచి ఆదరణ పొందాయి.
2011, అక్టోబరు 20 న రాజాం లో కన్ను మూశాడు.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.