రాజాం (రాజాం మండలం)
ఆంధ్రప్రదేశ్, విజయనగరం జిల్లా పట్టణం From Wikipedia, the free encyclopedia
రాజాం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయనగరం జిల్లా, రాజాం మండలానికి చెందిన పట్టణం, మండల కేంద్రం. జిల్లా కేంద్రం నుండి 51 కి.మీ దూరంలో వుంది. దీని పరిపాలన నగరపంచాయతీ చేనిర్వహించబడుతుంది. 1757లో జరిగిన బొబ్బిలి యుద్ధం లో విజయనగర మహారాజైన విజయరామరాజుని చంపిన బొబ్బలి సర్దారైన తాండ్ర పాపారాయుడు ఈ ఊరికి సంబంధం కలిగినవాడు.
ఈ వ్యాసం విజయనగరం జిల్లా, రాజాం మండల పట్టణం గురించి. ఇదే పేరుతో ఉన్న ఇతర ప్రాంతాల కొరకు, రాజాం (అయోమయ నివృత్తి) చూడండి.
రాజాం | |
---|---|
![]() బొబ్బిలి యుద్ధం గాథకు చెందిన వీరుడు తాండ్ర పాపారాయుడు ఈ ప్రాంతానికి చెందినవాడు | |
Coordinates: 18.447858°N 83.661733°E | |
Country | భారత దేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | విజయనగరం |
Government | |
• Type | నగరపంచాయతీ |
• Body | రాజాం నగరపంచాయతీ, SUDA |
విస్తీర్ణం | |
• Total | 32.75 కి.మీ2 (12.64 చ. మై) |
Elevation | 61 మీ (200 అ.) |
జనాభా (2011)[3] | |
• Total | 42,197 |
• జనసాంద్రత | 1,300/కి.మీ2 (3,300/చ. మై.) |
భాషలు | |
• అధికార | తెలుగు |
Time zone | UTC+5:30 (IST) |
పిన్‌కోడ్ | 532127 |
టెలిఫోన్ కోడ్ | +91–8941 |
Vehicle Registration | AP30 (Former) AP39 (from 30 January 2019)[4] |
చరిత్ర
బొబ్బిలి యుద్ధం గాథకు చెందిన వీరుడు తాండ్ర పాపారాయుడు ఈ ప్రాంతానికి చెందినవాడు. ఇటీవల తాండ్ర పాపారాయుడుకి చెందిన ఒక ఆభరణం ఇక్కడ బయట పడింది. పూర్వ కాలంలో తాండ్ర పాపారాయుడు ఉపయోగించిన భవనాన్ని నేడు తహసీల్దారు కార్యాలయంగా వాడుతున్నారు.
ఒకప్పుడు వైజాగ్, బొబ్బిలి వైపుగా కేంద్రీకృతమైన పట్టణం పాలకొండ, శ్రీకాకుళం వైపుగా అభివృద్ధి చెందింది. 2022 ఏప్రిల్ 4 న రాజాం శ్రీకాకుళం జిల్లా నుండి విజయనగరం జిల్లాకు మారింది. [5]
భౌగోళికం
దీని అక్షాంశ రేఖాంశాలు 18.28N 83.40E.[6]. సముద్రమట్టం నుండి ఎత్తు 41 మీటర్లు. (137 అడుగులు)
గణాంకాలు
2011 జనగణన ప్రకారం జనాభా 42,197.
పరిపాలన
రాజాం నగరపంచాయతీ పట్టణ పరిపాలన నిర్వహిస్తుంది. రాజాం నగర పంచాయితీలో అత్యంత ప్రముఖమైన, అతి నివాసయోగ్యమైన ప్రాంతం ఈశ్వరి నారాయణ కాలనీ, బాబా నగర్ కాలనీల సముదాయము. నగర పంచాయితీ పరిధిలో ప్లాస్టిక్ సంచుల వాడకాన్ని నిషేధించి ఇతర ప్రాంతాల వారికి ఆదర్శంగా నిలిచింది. పురపాలికగా మారిన తర్వాత అనేక అభివృద్ది కార్యక్రమాలు చేపట్టబడ్డాయి
రవాణా సౌకర్యాలు
దగ్గరలోని రైల్వే స్టేషన్లు - గంగువారిసిగడాం, చీపురుపల్లి
విద్య
ఇక్కడ జియంఆర్ఐటి సాంకేతిక కళాశాల (GMRIT) ఉంది.
వైద్యం
ఒక సామాజిక ఆరోగ్యకేంద్రం ఉంది. ఈ 60 పడకల ఆసుపత్రి ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్తు ద్వారా నడుపబడుతుంది.[7] ఇక్కడ జియమ్ఆర్-కేర్ హాస్పిటల్ అత్యంత ఆధునిక వైద్య సదుపాయాలతో ఉంది. త్వరలో ఈ ఆసుపత్రికి అనుసంధానంగా రాజాంలో జియమ్ఆర్ వైద్య కళాశాల నెలకొల్పుతున్నారు.
పరిశ్రమలు
రాజాం పట్టణం జనపనార మిల్లులకు, ఇనుప కర్మాగారాలకు ప్రసిద్ధి. రాష్ట్రంలో అత్యధికంగా జనప నార ఇక్కడ ఉత్పత్తి అవుతుంది. ప్రతి గురువారం జరిగే సంతలో చుట్టుపక్కల చాలా మండలాల నుండి ప్రజలు వస్తారు.
పర్యాటక ఆకర్షణలు
- నవ దుర్గ ఆలయం: దేశంలో అత్యంత అరుదైన ఆలయం.
- పోలిపల్లి పైడితల్లి అమ్మవారి ఆలయం: అమ్మవారి వార్షిక యాత్రా మహోత్సవాలు వైభవంగా జరుగుతాయి.
- శ్రీ హనుమాన్ దేవాలయం,చీపురుపల్లి రోడ్డు: చుట్టుప్రక్కల గ్రామాల ప్రజలు, రాజాం ప్రజానీకం మంగళ, శనివారాల్లో ఎక్కువగా ఇక్కడకు వస్తారు.
ప్రముఖులు
మూలాలు
వెలుపలి లంకెలు
Wikiwand - on
Seamless Wikipedia browsing. On steroids.