బభ్రువాహన (నాటకం)
From Wikipedia, the free encyclopedia
Remove ads
బభ్రువాహన ఒక ప్రసిద్ధిచెందిన తెలుగు పద్య నాటకం.
కథా సంగ్రహం
ధర్మరాజు రాజసూయ యాగాన్ని సంకల్పించి యాగాశ్వం వెంట రక్షకునిగా అర్జునుని పంపుతాడు. దారిలో మణిపుర ప్రదేశం చేరగానే దాన్ని బభ్రువాహనుడనే రాకుమారుడు బంధిస్తాడు. మణిపుర మహారాజు చిత్రవాహనుడు. అతని కుమార్తె చిత్రాంగద. అర్జునుడు తీర్థయాత్రలు చేసే కాలంలో చిత్రాంగదను వరించి కొంతకాలం ఆ రాజ్యం లో ఉంటాడు. వారికి జన్మించిన కుమారుడే బభ్రువాహనుడు. ఈ ఉదంతాన్ని తెలిపి అశ్వాన్ని విడవమని, తండ్రితో యుద్ధం సరికాదని తల్లీ, తాత ఎంత వారించినా బభ్రువాహనుడు వినడు. అప్పుడే వచ్చిన ఉలూచి బభ్రువాహనున్ని సమర్థిస్తుంది. తండ్రీ కొడుకుల మధ్యన యుద్ధానికి రంగం సిద్ధం చేస్తుంది. అందుకు కారణం అర్జునుని కారణంగా అస్త్రసన్యాసం చేసిన భీష్ముని సోదరులైన వసువులు ధరుడు, సోముడు తమ అన్నగారి మరణానికి కారకుడైన అర్జునుడు యుద్ధం లో మరణించి నరక ప్రాప్తిని పొందుతాడని శపిస్తారు. గంగాతీరం లో ఆ శాపవచనాలు విన్న ఉలూచి తాను అర్జునుని భార్యనని, తీర్థ యాత్రాకాలం లో తాను అర్జునుని మోహించి తన మాయచే అతడిని నాగలోకానికి తీసుకొని పోయి వివాహమాడి అతనివల్ల ఇలావంతుడనే కుమారుణ్ణి పొందానని తెలిపి శాపవినమోచనాన్ని తెలియజేయమంటుంది. అర్జునుడు యుద్ధంలో తన రక్త సంబంధీకుల చేతిలో మరణించి తిరిగి పునర్జావితుడైతే అతనికి నరకబాధ తప్పుతుందని తెలుపుతారు వసువులు. ఉలూచి ప్రేరేపించిన ఆ యుద్ధం లో కుమారుడైన బభ్రువాహనుని చేతిలో అర్జునుడు మరణించగా తన వద్దనున్న మణి ప్రభావంతో అర్జునుణ్ణి తిరిగి బ్రతికించుకుంటుంది ఉలూచి.
Remove ads
పాత్రలు
- బభ్రువాహనుడు - మణిపుర రాజకుమారుడు.
- అర్జునుడు - పాండవ మధ్యముడు.
- చిత్రాంగద - అర్జునుని భార్య
- చిత్రవాహనుడు - మణిపుర మహారాజు
- ఉలూచి - అర్జునుని భార్య.
- ధర్మరాజు - పాండవ అగ్రజుడు.
ఇవి కూడా చూడండి
Wikiwand - on
Seamless Wikipedia browsing. On steroids.
Remove ads