మాయాబజార్ (నాటకం)

From Wikipedia, the free encyclopedia

మల్లాది వెంకట కృష్ణ శర్మ రచించిన నాటకం మాయాబజార్. సురభి బాబ్జీ దర్శకత్వం వహించారు. శశిరేఖా పరిణయం నేపథ్యంగా సాగే ఈ కథ ఆద్యంతం ఆహ్లాదంగా సాగుతుంది. సురభి నాటక సమాజం లోని శ్రీ వెంకటేశ్వర నాట్య మండలి ద్వారా ఈ నాటర ప్రదర్శన జరుగుతుంది.

కథ

నారదుడు బలరాముని సతీమణి రేవతీదేవి వద్దకు వెళ్ళి శశిరేఖను అభిమన్యునకు ఇచ్చి వివాహం చేయడం కంటే దుర్యోధన సార్వభౌముని కుమారుడు లక్ష్మణ కుమారునికి ఇచ్చి వివాహం చేయడం ఉత్తమమని చెప్పి రేవతీదేవి మనసు మార్చి కలహ బీజం నాటుతాడు. దీని ప్రభావంతో సుభద్ర అభిమన్యుని తీసుకుని పుట్టినిల్లు విడిచి వదిలి వెళ్ళిపోతుంది. అరణ్యంలో ప్రయాణిస్తున్న వారిని భీమసేనుని పుత్రుడు ఘటోత్కచుడు తారసపడి, వారికి జరిగిన అవమానం తెలుసుకుని, కౌరవులకు గర్వభంగం చేసి, శశిరేఖా అభిమన్యులకు వివాహం చేయించేందుకు ప్రతిన పూని, ద్వారకకు చేరి, శ్రీకృష్ణుని దర్శించి, అతని సలహా మేరకు శశిరేఖను తన ఇంటికి చేరుస్తాడు. తన మాయాజాలంతో శశిరేఖ రూపం దాల్చి, అనుచరులతో కౌరవులను, బంధువర్గాన్ని అల్లరి పెట్టి, పరాభవించి, శశిరేఖాభిమన్యుల వివాహం జరిపించడంతో కథ ముగుస్తుంది.


చిత్రమాలిక

మరిన్ని చిత్రాలకోసం ఇక్కడ చూడండి

Loading related searches...

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.