శ్రీకృష్ణ తులాభారం (నాటకం)

From Wikipedia, the free encyclopedia

Remove ads

శ్రీ కృష్ణ తులాభారం నాటకాన్ని ముత్తరాజు సుబ్బారావు గారు రచించారు.తెలుగు నాటకరంగం లో దిగ్గజాలనదగిన నటులు ఎందరెందరో ఈ నాటకానికి ప్రాచుర్యం కల్పించారు. స్థానం నరసింహారావు గారు రచించి అభినయించినట్టుగా చెప్పబడుతున్న ' మీరజాల గలడా నా యానతి ' అను పాట,నారదుడు పాడే 'భలే మంచి చౌక బేరమూ ' అను పాటలు బహుళ ప్రజాదరణను పొందాయి. నాటకం లోని పాటలు,పద్యాలను యథాతథంగా ఉపయోగించి నిర్మించిన సినిమా అపురూపమైన ప్రక్షకాదరణను పొందింది.

Remove ads

కథా సారాంశం

శ్రీ కృష్ణుడు సత్యభామాదేవితో కలిసి ఇంద్రలోకానికి వెళ్ళినప్పుడు తెచ్చిన పారిజాతవృక్షాన్ని తిరిగి స్వర్గ లోకానికి తరలించే సంకల్పంతో నారదుడు భూలోకానికి రాగా, ఉద్యానవనం లో విహరిస్తున్న సత్యా-కృష్ణులు కనిపిస్తారు. అదే సమయం లో రుక్మిణీ దేవి వచ్చి తన పుట్టిన రోజు విందుకు ఆహ్వానిస్తుంది. ఆ వెనువెంటనే సత్యభామ మాట మార్చి, అనాడు తాను అత్తవారింట అడుగుపెట్టిన శుభదినమని అందుకే తన మందిరానికే విందుకు రమ్మని పిలుస్తుంది.ఈ ఇద్దరి ప్రార్ధనలలో ఎవరిని మన్నించాలో తెలియక కృష్ణుడు సతమతమౌతుండగా నారదుడు ప్రవేశించి, తన అభిప్రాయము చెప్పబోగా ' సతీ పతుల మధ్యన బ్రహ్మచారులా తగువు తీర్చువారు? మీ ఇష్టం వచ్చిన చోటికి వెళ్ళుమని ' విసురుగా వెళ్ళిపోతుంది. తన పట్టపురాణి, భక్త శిఖామణి అయిన రుక్మిణీ దేవి మందిరానికి తన చెలికాడు వసంతకుణ్ణీ, నారద మహర్షినీ వెంటతీసుకొని విందుకు వెళతాడు.

తన మాటను కృష్ణుడు లక్ష్యపెట్టలేదనే కోపంతో ఉన్న సత్యభామ దగ్గరకు నారదుడు వెళ్ళగా ఆమె కృష్ణుని సంపూర్ణ ప్రేమానురాగాలు పొందేందుకు ఏదైన మంత్రమో, తంత్రమో ఉపదేశించమంటుంది. అందుకు 'పుణ్యక వ్రతం / భర్తృ ప్రణయ వ్రతం ' అనేది ఉన్నదనీ, సాధ్వీలలామలందరూ ఆ వ్రతాన్నే ఆచరించి తమ సంసారాల్లో సంపూర్ణ ప్రమానురాగాల్ని పొందారనీ, కానీ వ్రత నియమం ప్రకారం కృష్ణుని ఎవరైనా బ్రహ్మర్షికి గానీ, దేవర్షికి గానీ దానమిచ్చి, వ్రతాంతం లో అతని ఎత్తు ధనమైనా లేక ధనేతరమైనా ఇచ్చి తిరిగి తన భర్తను తీసుకోవచ్చునంటాడు. దీనితో అహంకరించిన సత్యభామ, రోజుకు నలభై బారువుల బంగారాని ప్రసాదించే శమంతకమణి తన వద్ద ఉండగా ఒక్కడేమి ఎంతమంది కృష్ణులనైనా తులతూచగలనని, వ్రతమాచరించి, అందులో భాగంగా కృష్ణుణ్ణి నారద మహర్షికి దానమిస్తుంది. కృష్ణుణ్ణి తులతూచేందుకు 'తులాభారం ' నిర్వహించగా సత్యభామ ఏడువారాల నగలూ, శమంతకమణి ప్రసాదించిన బంగారం, ఇవేవీ తూచలేకపోతాయి. చతుర్దశ భువనాలను బొజ్జలో దాచుకున్న పరమాత్ముని తూచడం సామాన్యమనుకున్నావా తల్లీ! అని అంగడి వీధిలో కృష్ణుణ్ణి వేలం వేస్తాడు నారదుడు. అయినా అతణ్ణి కొనేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో మార్గాంతరాన్ని తెలపమంటుంది సత్యభామ. దీనిని పరిష్కరించగలిగే శక్తి ఆదిలక్ష్మి అవతారమైన రుక్మిణీ దేవికి మాత్ర్మే ఉందని,ఆమెనే శరణు వేడమంటాడు నారదుడు. తన తప్పును తెలుసుకున్న సత్యభామ ప్రాధేయపడడంతో, పరమాత్ముని తూచే శక్తి ఏ ద్రవ్యానికీ లేదని కేవలం భక్తికి మాత్రమే ఆ దేవదేవుడు వశుడౌతాడనీ ఒక తులసీదళంతో పరమాత్ముని తూచి, నారదుని దాస్యం నుండి కృష్ణుని విముక్తుని చేస్తుంది. అతనితో పాటుగా దానంగా వచ్చిన పారిజాత వృక్షాన్ని స్వర్గలోకానికి చేర్చి, భక్తికి సాటిరాగలది ఏదీ లేదని తెలియజేస్తాడు నారదుడు.

Remove ads

పాత్రలు

  • శ్రీకృష్ణుడు
  • సత్యభామ
  • రుక్మిణీదేవి
  • నారదుడు

తెలుగు సినిమాలు

ఈ నాటకం ఆధారంగా తెలుగులో సినిమాలు నిర్మించబడ్డాయి. కృష్ణ తులాభారం 1935 లో మొదటిసారి నిర్మించినప్పుడు శ్రీకృష్ణుడుగా కపిలవాయి రామనాథశాస్త్రి నటించారు. సి.ఎస్.రావు దర్శకత్వంలో ఇది రెండవసారి శ్రీకృష్ణ తులాభారం (1955 సినిమా) పేరుతో నిర్మించబడింది. మూడవసారి డి.రామానాయుడు 1966 నిర్మించిన శ్రీకృష్ణ తులాభారం (1966 సినిమా) ఘనవిజయాన్ని తెచ్చిపెట్టింది. దీనిలో నందమూరి తారక రామారావు కృష్ణుడిగా, జమున సత్యభామగా నటించారు. ఇందులోని పాటలు బహుళ ప్రజాదరణ పొందాయి.

Loading related searches...

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.

Remove ads