1930: వాషింగ్టన్, డి.సి. (జిల్లా రికార్డ్) 106 డిగ్రీల ఫారెన్ హీట్ (41 డిగ్రీల సెంటిగ్రేడ్).
1934: అయొవా రాష్ట్రం రికార్డు. అయొవా రాష్ట్రంలో ఉన్న 'కియోకుక్' లో 118 డిగ్రీల ఫారెన్ హీట్ (48 డిగ్రీల సెంటిగ్రేడ్).
1935: లాహోర్ లోని మసీదు విషయమై ముస్లిములకు, సిక్కులకు జరిగిన అల్లర్లలో, 11 మంది మరణించారు.
1944: రాస్తెన్ బర్గ్ లో జరిగిన మూడవ హత్యా ప్రయత్నం నుంచి, అడాల్ఫ్ హిట్లర్ తప్పించుకున్నాడు.
1947: ప్రధాని యు. అంగ్ సాన్ మీద, అతని మంత్రివర్గ సభ్యులుగా ఉన్న మరొక తొమ్మిది మంది మీద, హత్యా ప్రయత్నం చేసినందుకు, బర్మా (నేటి మియన్మార్) మాజీ ప్రధాని 'యు. సా' ని, మరొక 19 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
1947: 1947 జూలై 19 న జరిగిన అభిప్రాయ సేకరణలో చాలా ఎక్కువ ఓట్లతో, వాయవ్య సరిహద్దు ప్రాంతం ప్రావిన్స్ (నార్త్ వెస్ట్ ఫ్రాంటియర్ ప్రావిన్స్) ప్రజలు, భారతదేశంలో కంటే, పాకిస్తాన్ లోనే చేరటానికి, తమ సమ్మతిని తెలిపారని, భారతదేశపు వైస్రాయి 1947 జూలై 20 తేదీన, చెప్పాడు.
1960: సిరిమావో బండారు నాయకే, సిలోన్ (నేటి శ్రీలంక) ప్రధానిగా ఎన్నికైంది. ఈమె ప్రపంచంలోనే మొట్టమొదటి మహిళా ప్రధాని (ప్రభుత్వాధినేత్రి).
1960: రోదసీలోకి వెళ్ళిన రెండుకుక్కలు తిరిగి భూమిమీదకు (యు.ఎస్.ఎస్.ఆర్) తిరిగి వచ్చాయి. రోదసీలోకి వెళ్ళి తిరిగివచ్చిన మొదటి జీవాలు ఇవే.
1975: 'ది టైమ్స్', 'ది డెయిలీ టెలిగ్రాఫ్', 'న్యూస్ వీక్' పత్రికా విలేకరులను, భారత ప్రభుత్వపు సెన్సార్ నిబంధనలను పాటించే పత్రంపై సంతకం చేయటానికి నిరాకరించటం వలన, భారత ప్రభుత్వం వారిని బహిష్కరించింది (అది అత్యవసర పరిస్థితి - ఎమెర్జెన్సీ కాలం)
1976: 'వైకింగ్ 1' అనే రోదసీ నౌక కుజగ్రహం మీద దిగింది. అపొల్లో 11 రోదసీ నౌక చంద్రుడిమీద దిగి ఏడు సంవత్సరాలు అయిన సందర్భంగా, అమెరికా ఈ 'వైకింగ్ 1' ని ప్రయోగించింది. మొదటిసారిగా కుజుడి నేలమీద 'క్రిస్ ప్లానిటియా' అనే చోట (కుజుడి నేల మీద ఉన్న ఒక స్థలం పేరు) ఈ వైకింగ్ దిగింది.
1976: అమెరికా తన సైనిక దళాలను థాయ్‌లేండ్ నుంచి ఉపసంహరించింది (వియత్నాం యుద్ధం కోసం అమెరికా ఈ సైనిక దళాలను ఇక్కడ ఉంచింది)
1989: బర్మాను పాలిస్తున్న సైనికా జుంటా ప్రభుత్వము, ప్రతిపక్ష నాయకురాలు 'దా అంగ్ సాన్ సూ క్యి' ని గృహ నిర్బంధం (ఇంటిలో నుంచి బయటకు రాకుండా) లో ఉంచారు.
1990: లండన్ స్టాక్ ఎక్షేంజ్ పై ఐరిష్ రిపబ్లిక్ ఆర్మీ బాంబు పేల్చింది.
1785: మహముద్ II ఒట్టొమాన్ సుల్తాన్, సంస్కర్త, పాశ్చాత్యీకరణ చేసిన వాడు.
2024: జెడింగీ, పులిని గొడ్డలితో చంపిన మిజోరాం ధీర వనిత, శౌర్యచక్ర పురస్కార గ్రహీత.[1]బంగ్లాదేశ్‌కు చెందిన ఆమె ఇరవై ఆరేళ్ల వయసులో వంట చెరకు కోసం గ్రామ సమీపంలోని అడవిలోకి వెళ్ళింది. అక్కడ, తనపై దాడికి సిద్ధమైన పులిని చేతిలోని గొడ్డలితో నరికి చంపింది. ఈ సంఘటన 1978 జులై 3న జరిగింది.