Remove ads
ఉత్తర అమెరికా ఖండంలోని దేశం From Wikipedia, the free encyclopedia
కెనడా ఉత్తర అమెరికా లోని అతి పెద్ద దేశం . ఈ దేశం పశ్చిమములోని అట్లాంటిక్ మహాసముద్రము నుండి పడమరలోని పసిఫిక్ మహాసముద్రము వరకి వ్యాపించి ఉత్తరములోని ఆర్కిటెక్ మహాసముద్రము లోపలకు కూడా వ్యాపించి ఉంది. ఇది విస్తీరణంలో ప్రపంచములోనే రెండవ అతి పెద్ద దేశం.[6] దక్షిణములో, వాయుమ్వంలో అమెరికా సంయుక్త రాష్ట్రాలతో ఉన్న ఉమ్మడి సరిహద్దు, ప్రపంచములోనే అతి పెద్దది.
Canada | ||||||
---|---|---|---|---|---|---|
నినాదం A Mari Usque Ad Mare (లాటిన్) "సముద్రం నుంచి సముద్రం వరకు " |
||||||
జాతీయగీతం "ఓ కెనడా" రాజగీతం గాడ్ సేవ్ ది క్వీన్ |
||||||
రాజధాని | అట్టావా 45°24′N 75°40′W | |||||
అతి పెద్ద నగరం | టోరంటో | |||||
అధికార భాషలు | ఆంగ్లం, ఫ్రెంచి | |||||
గుర్తింపు పొందిన ప్రాంతీయ భాషలు | ఇనుక్టిటుట్, Inuinnaqtun, క్రి, Dëne Sųłiné, Gwich’in, Inuvialuktun, Slavey, Tłįchǫ Yatiì[1] | |||||
జాతులు | 32.2% కెనడా జాతీయులు 21.0% ఆంగ్ల జాతీయులు 15.8% ఫ్రెంచ్ జాతీయులు 15.1% స్కాట్లాండ్ జాతీయులు 13.9% ఐర్లాండ్ జాతీయులు 10.2% జర్మన్లు 4.6% ఇటాలియన్లు 4.0% దక్షిణ ఆసియా జాతీయులు 3.9% చైనీయులు 3.9% ఉక్రైనియన్లు 3.8% Aboriginal 3.3% Dutch 3.2% Polish[2] |
|||||
ప్రజానామము | కెనడియన్లు | |||||
ప్రభుత్వం | సార్వభౌమిక పార్లమెంటరీ ప్రజాస్వామ్యం, రాజ్యాంగబద్దమైన రాచరికము[3] | |||||
కెనడియన్ కాన్ఫెడెరేషన్ | ||||||
- | British North America Acts | July 1, 1867 | ||||
- | Statute of Westminster | December 11, 1931 | ||||
- | Canada Act | April 17, 1982 | ||||
- | జలాలు (%) | 8.92 (891,163 km²/344,080 mi²) | ||||
జనాభా | ||||||
- | 2006 జన గణన | 31,241,030[4] | ||||
జీడీపీ (PPP) | 2008 అంచనా | |||||
- | మొత్తం | $1.300 trillion[5] (14th) | ||||
- | తలసరి | $39,098[5] (13th) | ||||
జీడీపీ (nominal) | 2008 అంచనా | |||||
- | మొత్తం | $1.499 trillion[5] (9th) | ||||
- | తలసరి | $45,085[5] (18th) | ||||
జినీ? | 32.1 (2005)[6] | |||||
మా.సూ (హెచ్.డి.ఐ) (2007) | 0.966[7] (very high) (4th) | |||||
కరెన్సీ | Dollar ($) (CAD ) |
|||||
కాలాంశం | (UTC−3.5 to −8) | |||||
- | వేసవి (DST) | (UTC−2.5 to −7) | ||||
ఇంటర్నెట్ డొమైన్ కోడ్ | .ca | |||||
కాలింగ్ కోడ్ | ++1 |
కెనడా భూభాగములో అనేక రకాల ఆదిమవాసి ప్రజలు వేలాది సంవత్సరాలుగా నివసించేవారు. 15వ శతాబ్దము చివరి భాగము మొదలుకుని, బ్రిటిష్, ఫ్రెంచ్ వారు సాహస యాత్రలు నిర్వహించి, తరువాత అట్లాంటిక్ తీరములో స్థిరపడ్డారు. ఏడు సంవత్సరాల యుద్ధం అనంతరం 1763లో ఫ్రాన్స్, ఉత్తర అమెరికా లోని వారు ఆక్రమించిన ప్రదేశాలలో దాదాపు అన్నిటినీ వదులుకుంది. 1867లో మూడు బ్రిటిష్ ఉత్తర అమెరికాల కాలనీలని కలిపి ఒక కాన్ఫేడేరేషన్‌గా ఏర్పడి, నాలుగు సంస్థానాలను కలిగి ఉన్న ఫెడరల్ డోమినియన్‌గా కెనడా ఏర్పాటయింది.[8][9][10] ఈ ప్రక్రియ వలన సంస్థానాలు, భూభాగాలకు క్రమేపీ విస్తరిస్తూ, యునైటెడ్ కింగ్డం నుండి స్వయంప్రతిపత్తిని పెంచుకోవటం జరిగింది. విస్తరిస్తున్న స్వయంప్రతిపత్తికి 1931 నాటి స్టాచ్యూ ఆఫ్ వెస్ట్ మినిస్టర్ నిదర్శనముగా నిలిచి 1982లో కెనడా యాక్ట్‌తో ఒక కొలిక్కి వచ్చింది. దీని ద్వారా బ్రిటిష్ శాసన సభ పై చట్టపరంగా ఆధార పడవలసిన అవసరాల యొక్క అవశేషాలు కూడా తెంపివేయబడ్డాయి.
పది సంస్థానాలు మూడు భూభాగాలు కలిగిన ఒక సమాఖ్య కెనడా, శాసన సభతో కలిగిన ఒక ప్రజాస్వామ్యం, రాజ్యాంగ ప్రకారం ఎలిజాబెత్ రాణి II దేశ అధిపతిగా ఉన్న ఒక రాజ్యాంగ రాజ్యరికం. ఇది ఒక ద్విభాషా, బహుసంస్కృతులు కలిగిన దేశం. ఆంగ్లం, ఫ్రెంచ్ సమాఖ్య స్థాయిలోనూ, న్యూ బృన్స్ విక్‌ప్రావిన్స్ లోనూ అధికార భాషలుగా ఉన్నాయి. కెనడా ప్రపంచంలోనే బాగా అభివృద్ధి చెందిన దేశాల్లో ఒకటి. కెనడా యొక్క బహుముఖ ఆర్థిక విధానము దాని యొక్క అపారమైన సహజ వనరులు మీదనూ, వర్తకము పైననూ, ముఖ్యంగా యునైటెడ్ స్టేట్స్ తో వాణిజ్యము మీద ఆధారపడివున్నది. యునైటెడ్ స్టేట్స్ తో కెనడాకు దీర్ఘకాల సంకీర్ణ సంబంధం ఉంది. కెనడా G8, G20, NATO, ఆర్గనైసేషన్ ఫర్ ఎకనామిక్ కో-ఆపరేషన్ అండ్ డెవలప్మెంట్, WTO, కామన్వెల్త్ అఫ్ నేషన్స్, ఆర్గనైసేషన్ ఇంటర్నేషనల్ డి లా ఫ్రాంకో ఫోనీ, OAS, APEC, యునైటెడ్ నేషన్స్ సంస్థలలో సభ్యత్వం కలిగి ఉంది.
కెనడా అనే పేరు కెనటా అనే St.లారెన్స్ ఐరోక్వోయియన్ పదం నుండి ఆవిర్బవించింది. కెనటా అనగా "గ్రామం" లేదా "స్థావరం" అని అర్ధం. 1535లో నేటి క్యుబెక్ నగర స్థానిక ప్రజల యొక్క పూర్వికులు, జాక్వెస్ కార్టియర్ అనే ఫ్రెంచ్ అన్వేషకుడికి, స్టేడకోనా అనే గ్రామం యొక్క దారి చూపటానికి ఈ పదం వాడారు.[11][12] తరువాత, కార్టియర్ కెనడా అనే పదాన్ని ఆ ఒక్క గ్రామానికే కాకుండా, డొన్నకొన (స్టేడకోనా యొక్క అధిపతి) పాలిస్తున్న ప్రదేశమంతటికి అదే పేరు వాడారు; 1545 సమయానికి ఐరోపా లోని పుస్తకాలు, దేశ పటాలు అన్నిటిలోనూ కెనడా అనే పేరునే వాడడం మొదలుపెట్టారు.[11][13]
పదిహేడవ శతాబ్ద ప్రారంభం నుండి న్యూ ఫ్రాన్సు లోని సైంట్ లారెన్స్ నది ఒడ్డున ఉన్న ప్రదేశాలను, గ్రేట్ లేక్స్ నది ఉత్తర ఒడ్డున ఉన్న ప్రదేశాలను కెనడా అని పిలిచేవారు. తరువాత, ఈ ప్రదేశాన్ని బ్రిటిష్ వారు రెండు సహనివేశాలుగా విభజించారు. వాటిని అప్పర్ కెనడా, లోయర్ కెనడాగా పేర్కొన్నారు. 1841లో మళ్ళీ ఈ భాగాలు కలిసిపోవటంతో ప్రోవిన్చి ఆఫ్ కెనడాగా పిలవబడటం మొదలయ్యింది.[14] 1867లో సమాఖ్య ఏర్పడిన తరువాత, కెనడా అనే పేరు చట్టబద్దంగా కొత్త దేశానికి[15] ఈయబడింది.డొమీనియన్ (సాల్మ్ 72:8 లోని ఒక పదం),[16] ఆ దేశ బిరుదుగా[17] తీర్మానించబడింది; ఈ రెండు పదాలను కలిపి డొమీనియన్ ఆఫ్ కెనడా అని 1950 సంవత్సరాల దాకా వాడేవారు. కెనడా తన రాజకీయ స్వయంప్రతిపత్తిని యునైటెడ్ కింగ్డం నుండి ధ్రువపరచుకున్నాక, ఆ ఫెడెరల్ ప్రభుత్వము కెనడా అనే పేరును దేశ పత్రాలలో, ఒప్పందాలలో వాడడం ఎక్కువ చేశారు. 1982లో జాతీయ సెలవుదినము యొక్క పేరును డొమీనియన్ డే నుండి కెనడా డేగా మార్చటంలో ఆ ఉద్దేశము స్పష్టంగా కనిపిస్తుంది.[18]
ఆదిమ కెనడా వాసుల ఆచారాల వలన స్థానికంగా ప్రజలు ఆ ప్రదేశంలో మొట్టమొదటి నుండి నివసిస్తున్నారని అనిపిస్తున్నా కూడా, పురావస్తు శాస్త్ర పరిశోధనల వలన మనుషులు ఉత్తర యుకొన్‌లో 26,500 సంవత్సరాల నుండి, దక్షిణ ఒంటారియోలో 9,500 సంవత్సరాల క్రితం నుండి మాత్రమే నివసిస్తున్నారని తేలింది.[19][20] ఐరోపా వాసులు ఇప్పటి కెనడాలో స్థిరపడే సమయానికి అక్కడ సుమారు 200,000 స్వదేశీ ప్రజలు ఉండేవారని అంచనా.[21] మొదటి 100 సంవత్సరాలలో ఐరోపా వాసుల ద్వారా, ఇన్ఫ్లూయంజా, మీసిల్స్, స్మాల్ పాక్స్ వంటి వ్యాధులు పలుమార్లు వ్యాపించటంతో ఉత్తర అమెరికా లోని తూర్పు ప్రాంతంలో ఆదిమవాసి జనాభా సగం నుండి మూడుకి రెండు వంతుల దాకా మరణించటం జరిగింది.[22]
సుమారు 1000 AD ప్రాంతంలో వైకింగ్ లు ఎల్'అన్సే అక్స్ మెడోస్‌లో స్థిరపడటంతో యూరోపియన్లు కెనడాకు మొదటి సారిగా రావటం జరిగింది; కానీ వారు తాత్కాలిక నివాసం ఏర్పరచుకున్నారేగాని స్థిరపడ లేకపోయారు. దాని తరువాత, 1497లో జాన్ కాబట్ ఇంగ్లాండ్[23] కోసం కెనడా యొక్క అట్లాంటిక్ తీరాన్ని అన్వేషించేవరకు ఎవరు కూడా ఉత్తర అమెరికాను మరల అన్వేషించలేదు. ఆ తరువాత 1534లో ఫ్రాన్స్[24] కొరకు జాక్వెస్ కార్టియర్ ఆ ప్రదేశాన్ని అన్వేషించారు.
ఫ్రెంచ్ అన్వేషికుడు సామ్యుల్ డి చంప్లయ్న్ 1603లో ఈ ప్రదేశాన్ని చేరుకొన్నారు. ఐరోపా లో మొదటి శాశ్వత స్థావరాలను వారు పోర్ట్ రాయల్ వద్ద 1605 లోను, క్యుబెక్ నగరం వద్ద 1608 లోను నెలకొల్పారు.[25][26][27] న్యు ఫ్రెంచ్ కు చెందిన ఫ్రెంచ్ ఆక్రమణదారులలో{/౦ {0}కేనేడీయన్లు, సెయింట్ లారన్సు నది లోయ లోనూ అకాడియన్లు ఈనాటి మారిటైమ్స్ లోనూ ఫ్రాన్సు దేశానికి చెందిన రోమ వ్యాపారులు, కాధలిక్కు మత ప్రచారకులు గ్రేట్ లేక్స్, హడ్సన్ బే, మిసిసిపి నదుల మధ్య లూసియానా లోని భూభాగము లూసియానా లోని భూభాగము లోనూ స్థిరపడ్డారు. రోమ వ్యాపారములో ఆధిక్యత కొరకు ఫ్రాన్స్, ఇరోక్వోయిస్ యుద్ధాలు జరిగాయి.[28]
ఆంగ్లేయులు చేపల పట్టడానికోసం స్థానాలని న్యు ఫౌండ్ లాండ్‌లో దాదాపు 1610 [29] సంవత్సర కాలములో ఏర్పరిచి, దక్షిణములోని పదమూడు స్థావరాలను ఆక్రమించారు. 1689, 1783 సంవత్సరాల మధ్యకాలములో వరుసగా నాలుగు స్థావరాల మధ్య యుద్ధాలు జరిగేవి.[30] ట్రీటీ ఆఫ్ యుట్రేక్ట్ (1713) [31] ద్వారా ప్రధాన భూభాగము నోవా స్కోటియా బ్రిటిష్ వారి పాలన క్రిందకు వచ్చింది. ఏడు సంవత్సరాల యుద్ధం తరువాత ట్రీటీ ఆఫ్ పారిస్ (1763) ద్వారా కెనడా, న్యు ఫ్రాన్స్ లోని అనేక ప్రాంతాలు బ్రిటన్ వశం అయ్యాయి.[32]
ముగ్గురు మనుష్యులు అతని పక్కనే వంగి వున్నారు, and a native man looks on. The background is large groups of men with guns|బెంజమిన్ వెస్ట్ యొక్క ద డెత్ ఆఫ్ జనరల్ వోల్ఫ్ (1771) లో, 1759 సంవత్సరంలో క్యుబెక్ లో ప్లైన్స్ ఆఫ్ అబ్రహాం లోని యుద్ధంలో, సంభవించిన వోల్ఫ్ మరణాన్ని అభివర్ణించటం జరిగింది.
ఆ పోరాటము ఏడు సంవత్సరాల యుద్ధములో ఒక భాగము.
రాజ్యాంగ ప్రకటన (1763), క్యుబెక్ సంస్థానాన్ని న్యు ఫ్రాన్స్ ఆధీనము నుండి తొలగించి, కేప్ బ్రెటన్ ద్వీపాన్ని నోవా స్కోటియ ఆధీనము లోకి తీసుకు వచ్చింది.[33] 1769 లో St.జాన్స్ ద్వీపం (ఇప్పుడు ప్రిన్స్ ఎడ్వర్డ్ ద్వీపం) విడిపోయి ఒక ప్రత్యేక స్థావరంగా ఏర్పడింది.[34] క్యుబెక్ లో ఘర్షణని తప్పించడానికి, 1774 సంవత్సరపు క్యుబెక్ యాక్ట్ క్యుబెక్ భూబాగాన్ని గ్రేట్ లేక్స్, ఒహియో లోయ వరకి విస్తరింపచేసి, ఫ్రెంచ్ భాష, కథలిక్కు మతం, ఫ్రెంచ్ పౌర చట్టాన్ని పునరుద్ధరించారు; ఇది పదమూడు కాలనీలలోని పలువురు ప్రజలకు ఆగ్రహం కలిగించి, అమెరికా విప్లవానికి దోహదం చేసింది.[35]
ద ట్రీటీ ఆఫ్ పారిస్ (1783) అమెరికా యొక్క స్వాతంత్ర్యాన్ని గుర్తించి, గ్రేట్ లేక్స్ కి దక్షిణాన ఉన్న ప్రాంతాలని యునైటెడ్ స్టేట్స్ కు సమర్పించింది. సుమారుగా 50,000 యునైటెడ్ సామ్రాజ్యపు సామంతులు యునైటెడ్ స్టేట్స్ నుండి కెనడాకు పారిపోయారు.[36] మారిటైమ్స్‌లో విధేయుల స్థావరాలను పునర్వ్యవస్థీకరించటంలో భాగముగా న్యూ స్కాటియా నుండి న్యు బ్రన్స్విక్ వేరు చేయబడింది.[37] క్యుబెక్ లోని ఆంగ్లం మాట్లాడే విధేయులను సర్థుబాటు చేయడానికి 1791 సంవత్సరపు కాన్స్టిట్యుషనల్ యాక్ట్ ప్రావిన్స్ ని ఫ్రెంచ్ మాట్లాడే లోయర్ కెనడా, ఆంగ్లం మాట్లాడే అప్పర్ కెనడాగా విభజించి వారికి వేరు వేరుగా ఎన్నికైన శాసన సభలను అనుగ్రహించింది.[38]
యునైటెడ్ స్టేట్స్ కు బ్రిటిష్ సామ్రాజ్యానికి మధ్య జరిగిన 1812 నాటి యుద్ధంలో కెనడాయే (అప్పర్, లోయర్) ప్రధాన ప్రాంతము. కెనడాని రక్షించడం కొరకు ఉత్తర అమెరికా లోని బ్రిటీషు వారి మధ్య ఒక ఐక్యత ఏర్పడింది.[39] బ్రిటన్, ఐర్లాండ్ నుండి పెద్ద సంఖ్యలో కెనడాకు వలస రావడం 1815 లో మొదలయింది.[40] పందొమ్మిదో శతాబ్ద ప్రారంభములో కలప పరిశ్రమ యొక్క ప్రాముఖ్యత ఉన్ని వ్యాపారాన్ని మించి పోయింది.
పలు రాజ్యాంగ సమావేశాల తరువాత " కాంస్టిత్యూషనల్ యాక్ట్ (1867) " ఆధారంగా 1867 జూలై 1 న ఒంటారియో, క్యూబెక్, నోవాస్కోటా, న్యూ బ్రంస్విక్ ప్రొవింస్‌లతో అధికారికంగా " కెనడియన్ కాంఫిడరేషన్ " ప్రకటించబడింది.[41][42] కెనడా నార్త్ వెస్ట్ టెర్రిటరీ రూపొందించడానికి రూపర్ట్స్ లాండ్, నార్త్ వస్టర్న్ టెర్రిటరీ మీద నియంత్రణ సాధించడానికి ప్రయత్నించింది.[43] 1871లో బ్రిటిష్ కొలంబియా, వాంకోవర్ దీవి (1866 విలీనం చేయబడిన యునైటెడ్ కాలనీస్ ఆఫ్ వాంకోవర్ ఐలాండ్ అండ్ బ్రిటిష్ కొలంబియా) కాంఫెడరేషన్‌లో కలిసింది. 1873లో ప్రింస్ ఎడ్వర్డ్ దీవి కెనడా ఫెడరేషన్‌తో కలుపబడింది.[44] కంసర్వేటివ్ కేబినెట్ (కెనడా) ఆధ్వర్యంలో కెనడియన్ పార్లమెంటు బిల్ పాస్ చేసింది. బిల్లు ద్వారా కెనడియన్ పరిశ్రమలను రక్షించడానికి నేషనల్ పాలసీ ఆఫ్ టర్రిఫ్‌కు ఆమోదం లభించింది.[42] పశ్చిమ భూభాగం అనుసంధానించడానికి పార్లమెంటు మూడు ట్రాంస్ కాంటినెంటల్ రైల్వే (ఇందులో కెనడియన్ పసిఫిక్ రైల్వే అంతర్భాగంగా ఉంది) నిర్మాణానికి ఆమోదం లభించింది. డోమియన్ లాండ్స్ యాక్ట్ ప్రవేశం, నార్త్- వెస్ట్ మౌంటెడ్ పోలీస్ " రూపొందించబడింది.[45][46] 1898లో నార్త్‌వెస్ట్ టెర్రిటరీస్‌లో క్లోండికే గోల్డ్ రష్ సమయంలో కెనడియన్ పార్లమెంటు యూకాన్ టెర్రిటరీ రూపొందించబడింది. లిబరల్ పార్టీ ప్రధానమంత్రి విల్‌ఫ్రిద్ ల్యూరియర్ కాంటినెంటల్ యురేపియన్ వలసదార్లకు మైదానాలలో స్థిరపడడానికి ప్రోత్సాహం అందించాడు.1905 లో అల్బర్టా, సస్కత్చవన్ ప్రొవింసెస్ రూపొందించబడ్డాయి.[44]
బ్రిటన్ కెనడా మీద నియంత్రణను కొనసాగించిన కారణంగా కాంఫెడరేషన్ యాక్ట్ ఆధారంగా కెనడా విదేశీవ్యవహారాల సంబంధిత నిర్ణయాధికారం బ్రిటన్ ప్రభుత్వానికి దక్కింది. 1914 లో యుద్ధం ప్రకటించబడగానే కెనడా అసంకల్పితంగా మొదటి ప్రపంచయుద్ధంలో పాల్గొనవలసిన అగత్యం ఏర్పడింది.[47] వెస్టర్న్ ఫ్రంట్‌కు పంపబడిన వాలంటీర్లు తరువాత కెనడియన్ సైన్యంలో భాగం అయ్యారు. వారు " విమీ రిడ్జి యుద్ధం " లో తగిన పాత్రవహించి తరువాతి యుద్ధంలో ప్రధానపాత్ర వహించారు.[48] 6,25,000 మంది కెనడియన్లు మొదటి ప్రంపంచయుద్ధంలో పాల్గొన్నారు. వీరిలో 60,000 మంది మరణించారు, 1,72,000 మంది గాయపడ్డారు.[49] క్షీణిస్తున్న కెనడాసైనిక సంఖ్యను అభివృద్ధిచేయడానికి యూనియన్ కేబినెట్ ప్రతిపాదించిన " ది కాంస్క్రిప్షన్ క్రైసిస్ 1917 " (నిర్భంధ సైనిక సమీకరణ 1917) ఫ్రెంచి మాట్లాడే వారి నుండి తీవ్రమైన నిరసనను ఎదుర్కొన్నది.[50] ఈ విషయమై పలు వాద వివాదాలు చెలరేగాయి. " ది మిలటరీ సర్వీస్ యాక్ట్ " నిర్భంధ సైనికసేవను ప్రవేశపెట్టింది. క్యూబెక్ వెలుపల ఉన్న ఫ్రెంచ్ స్కూల్స్ దీర్ఘంగా ఆలోచించి లేబర్ పార్టీ నుండి వెలుపలకు వెళ్ళారు. [50] 1919 లో కెనడా బ్రిటన్ నుండి స్వతంత్రంగా విడివడి " లీగ్ ఆఫ్ నేషంస్ " లో చేరింది.[48] 1931 స్టాచ్యూ ఆఫ్ వెస్ట్‌మినిస్టర్ కెనడా స్వతంత్రాన్ని బలపరిచింది.[51]
1930 లో " ది గ్రేట్ డిప్రెషన్ ఇన్ కెనడా " సందర్భంలో కెనడా ఆర్ధికమాంధ్యాన్ని ఎదుర్కొన్నది. ఫలితంగా దేశంలో గడ్డుపరిస్థితి నెలకొన్నది.[52] ఆర్ధికమాంధ్యం కారణంగా సస్కత్చవన్‌లోని " కో - ఆపరేటివ్ కామంవెల్త్ ఫెడరేషన్ " టమ్మీ డగుల్స్ మార్గదర్శకత్వంలో 1940, 1950 మధ్యకాలంలో పలు " వెల్ఫేర్ స్టేట్ " కార్యక్రమాలను ప్రవేశపెట్టింది. [53]
ప్రధానమంత్రి " విలియం లియాన్ కింగ్ " సలహాతో జర్మనీ మీద యుద్ధం ప్రకటించబడింది.[48]1939 డిసెంబర్‌లో మొదటి కెనడియన్ సైన్యం బ్రిటన్ చేరుకుంది. రెండవ ప్రపంచ యుద్ధంలో కెనడియన్ సైన్యం దాదాపు ఒక మిలియన్ కంటే అధికంగా పాల్గొన్నది. వీరిలో 42,000 యుద్ధంలో మరణించారు. 55,000 మంది గాయపడ్డారు.[54] యుద్ధంలో పలు కీలక సమయాలలో కెనడియన్ సైన్యం ప్రధానపాత్ర వహించింది. వీటిలో విఫలమైన 1942 డిప్పీ రెయిడ్, ది అలైడ్ ఇంవేషన్ ఆఫ్ ఇటలీ, ది నార్మండే లాండింగ్స్, ది ఆపరేషన్ ఓవర్ లార్డ్ (బాటి ఆఫ్ నార్మండీ), ది బాటిల్ ఆఫ్ ది షెడ్యూల్డ్ 1944 ఉన్నాయి.[48] డచ్ ఆక్రమించబడి నెదర్లాండుకు అప్పగించిన సమయంలో కెనడా డచ్ సాంరాజ్యానికి ఆశ్రయం కల్పించి జర్మన్ నాజీల నుండి డచ్ స్వాతంత్రం కొరకు ప్రధానపాత్ర వహించింది. [55] యుద్ధంలో కెనడా, చైనా, సోవియట్ యూనియన్ సైనికులకు అవసరమైన సామాగ్రి తయారుచేయడానికి పరిశ్రమలను స్థాపించిన కారణంగా యుద్ధసమయంలో కెనడా ఆర్ధికవ్యవస్థ శక్తివంతంగా మారింది.[48] 1944 లో క్యూబిక్‌లో సంభవించిన వేరొక " కాంస్క్రిప్షన్ క్రైసెస్ ఆఫ్ (1944) కెనడా బృహత్తర సైన్యం, శక్తివంతమైన ఆర్థికవ్యవస్థను ఏర్పరుచుకుంది. [56]
ఆర్ధికమాంధ్యం చివరికి " డోమియన్ ఆఫ్ న్యూఫౌండ్ లాండ్ " బాధ్యతల నుండి విరమించుకుని 1934లో బ్రిటిష్ గవర్నర్ ఆధ్వర్యంలో క్రౌన్ కాలనీ పాలితప్రాంతంగా మారింది. తరువాత రెండు న్యూఫౌండ్ లాండ్ రిఫరెండంస్ 1948 తరువాత న్యూఫౌండేషన్ లాండర్స్ 1949లో కెనడా ప్రొవింస్‌గా మారడానికి అనుకూలంగా ఓటు వేసారు. [57]
కెనడియన్ ఆర్థికాభివృద్ధి, లిబరల్ గవర్నమెంటు విధానాలు కలిసి కెనడాకు ప్రత్యేక గుర్తింపు సంతరించి పెట్టాయి. కెనడా 1965లో " మేపుల్ లీగల్ ఫ్లాగ్ "ను రూపొందించింది.[58] 1969లో కెనడాలో ద్విభాషా (ఇంగ్లీష్, ఫ్రెంచ్) విధానం అధికారికంగా ప్రవేశపెట్టబడింది. [59] 1971లో కెనడాలో అధికారికంగా భిన్నసంస్కృతికి అంగీకారం లభించింది.[60] మెడీకేర్, కెనడా పెంషన్ ప్లాన్, స్టూడెంటు లోన్ మొదలైన సోషల్ డెమాక్రసీ ప్రోగ్రాంస్ ఆరంభించబడ్డాయి. అందువలన ఆల్బెర్టా, క్యూబెక్ ప్రాంతీయ ప్రభుత్వాలు వారి న్యాయపరిధిలో ఈ కార్యక్రమాలు అమలుచేయడానికి వ్యతిరేకించాయి.[61] కెనడా యాక్ట్‌లో పలు రాజ్యాంగ సమావేశాల తరువాత యునైటెడ్ కింగ్డం నుండి కెనడా విభజన విజయవంతమై " కెనడియన్ చార్టర్ ఆఫ్ రైట్స్ అండ్ ఫ్రీడంస్ " రూపొందించబడింది.[62][63][64] తరువాత కెనడా పరిపూర్ణ స్వతంత్రదేశంగా అవతరించింది. కెనడా సాంరాజ్యాధినేతగా రాణిపాత్ర తొలగించబడి బ్రిటన్ లేక కామంవెల్త్ దేశాలకు పరిమితం చేయబడింది.[65][66] 1999లో వరుస రాయబారాల తరువాత నునవుత్ కెనడా మూడవ ప్రొవింస్‌గా అయింది.[67]
అదే సమయంలో 1960 క్యూయత్ తిరుగుబాటు తరువాత క్యూబిక్‌లో సాంఘిక, ఆర్థిక మార్పులు సంభవించాయి. తరువాత 1970లో క్యూబిక్ జాతీయవాదం,[68] క్యూబిక్ స్వతంత్రం ఉద్యమం మొదలైంది.1976లో పార్టీ క్యూబెకోస్ " ఎన్నికైంది. అది 1980లో క్యూబెక్ స్వతంత్రం గురించి సేకరించిన ప్రజాభిప్రాయ సేకరణ విఫలం అయింది. 1990లో క్యూబిక్ నేషనలిజం రాజ్యంగపరంగా అపజయం పాలైంది. [69] ఇది పశ్చిమ కెనడాలో " రిఫార్ం పార్టీ ఆఫ్ కెనడా " ఆవిర్భావించడానికి, క్యూబెక్‌లో " బ్లాక్ క్యూబెకోయిస్ " రూపొందడానికి దారితీసింది.[70][71] 1995లో సేకరించిన రెండవ క్యూబెక్ ప్రజాభిప్రాయ సేకరణ స్వల్ప వ్యత్యాసంతో (50.6 వ్యతిరేకత, 49.4 ఆదరణ) వీగిపోయింది.[69][72] 1980 - 1990 మద్యకాలంలో క్యూబిక్ స్వతంత్ర వివాదాలు పలు గడ్డు సమస్యలకు కారణం అయింది.ఇందులో భాగంగా జరిగిన 1985లో " ఎయిర్ ఇండియా ఫ్లైట్ 182 " కూల్చివేత వంటి సంఘటన కెనడా చరిత్రలోనే అతిపెద్ద మూకుమ్మడి మరణాల సంఘటనలలో ఒకటిగా నిలిచిపోయింది. [73] అదనంగా 1989లో ఒక పాఠశాలలో ఆడవిద్యార్థులను లక్ష్యంగా చేసుకుని సాగించిన " ది పాలీ టెక్నిక్ మాస్క్రి ", [74] 1990లో " ఒకా క్రిసిస్ ", [75] ప్రభుత్వం, ఆదిమవాసుల మద్య జరిగిన పలు ప్రచ్ఛన్న యుద్ధాలు మొదలైన సంఘటనలు జరిగాయి.[76]
1990లో యు.ఎస్.నాయకత్వం వహించిన సంకీర్ణదళాలతో కలిసి కెనడా గల్ఫ్ యుద్ధం, పలు శాంతిస్థాపన యుద్ధాలలో భాగస్వామ్యం వహించింది. యుగస్లేవియా యుద్ధం వీటిలో ఒకటి.[77]" వార్ ఇన్ ఆఫ్ఘనిస్తాన్ (2001-2014) కు కెనడా సైన్యాలను పంపింది. అయినప్పటికీ యు.ఎస్ - నాయకత్వంలో జరిగిన ఇరాక్ దాడి 2003 లో పాల్గొనడానికి నిరాకరించింది.[78] 2009లో ప్రపంచవ్యాప్తంగా సంభవించిన " గ్రేట్ రిసెషన్ " ఆర్థికసంక్షోభం సమయంలో కెనడా ఆర్థికరంగం ఒడిదుడుకులకు లోనైంది. అయినప్పటికి తిరిగి కోలుకుంది.[79][80] 2011లో కెనడియన్ సైన్యం నాటో నాయకత్వం వహించిన లిబియన్ అంతర్యుద్ధంలో పాల్గొన్నది.[81] 2010లో ఇరాక్లో " ఇస్లామిక్ స్టేట్ ఆక్రమణ " వ్యతిరేకంగా పోరాడింది.[82]
ఉత్తర అమెరికా ఖండంలో అధికభాగాన్ని కెనడా ఆక్రమించుకుని ఉంది. కెనడా దక్షిణ సరిహద్దులో యు.ఎస్ ఉంది, అలాగే వాయవ్య సరిహద్దులో యు.ఎస్. రాష్ట్రం అయిన అలాస్కా ఉంది. కెనడా తూర్పున అట్లాంటిక్ సముద్రం నుండి పశ్చిమంలో పసిఫిక్ సముద్రం వరకు విస్తరించి ఉంది. ఉత్తరసరిహద్దులో ఆర్కిటిక్ మహాసముద్రం ఉంది. [6] ఈశాన్యంలో గ్రీన్‌లాండ్ ఉంది. జలభాగ విస్తీర్ణంతో కలిపి వైశాల్యపరంగా కెనడా ప్రపంచంలో రెండవ స్థానంలో ఉంది. మొదటి స్థానంలో రష్యా ఉంది. కెనడా అతిపెద్ద మంచినీటి సరసులను కలిగి ఉంది.[83]
కెనడా ప్రపంచపు ఉత్తరతీర వలసరాజ్యం, కెనడియన్ ఫోర్సెస్ అలర్ట్ (ఉత్తరతీర ఎల్లెస్మెరె ద్వీపంలో) ఉంది.[84] కెనడియన్ ఆర్కిటిక్‌లో అత్యధిక భాగం మంచుతో నిండి ఉంది. ప్రపంచంలో అత్యంత పొడవైన సముద్రతీరం కలిగిన దేశంగా కెనడా ప్రత్యేకత కలిగి ఉంది.[85] అదనంగా యు.ఎస్. మద్య కెనడా ఉన్న సరిహద్దు ప్రపంచంలో ఇరుదేశాల మద్య ఉన్న అత్యంత పొడవైన సరిహద్దుగా గుర్తించబడుతుంది.8,891 కిలోమీటర్లు (5,525 మై.).[86] గ్లాసియల్ పీరియడ్ ముగిసిన తరువాత కెనడా 8 అరణ్యప్రాంతాలను కలిగి ఉంది.విస్తారమైన టైగా ఫారెస్ట్ కెనడాకు ప్రత్యేకతగా ఉంది.[87] కెనడాలో 20,00,000 సరసులు ఉన్నాయి. వీటిలో 563 100 చ.కి.మీ కంటే వైశాల్యమైనవి. ఇతరదేశాల కంటే అత్యధికంగా మంచినీటి జలవనరులు ఉన్న దేశంగా కెనడాకు ప్రత్యేకత ఉంది.[88][89] కెనడాలో ఫ్రెష్ - వాటర్ గ్లాసరీలు (కెనడియన్ రాకీలు), సముద్రతీర పర్వతాలు ఉన్నాయి. కెనడా భౌగోళికంగా చైతన్యవంతమైన దేశం. దేశంలో తరచుగా భూకంపాలు సంభవిస్తుంటాయి. అలాగే సజీవమైన అగ్నిపర్వతాలు ఉన్నాయి. వీటిలో మౌంట్ మీగర్, మౌంట్ గరిబల్డీ, మౌంట్ కేలే, మౌంట్ ఎడ్జిజా వాల్కానిక్ కాంప్లెక్స్ ప్రధానమైనవి.[90] కెనడాలో అతి తీవ్రమైన ప్రకృతివైపరీత్యంగా 1775లో సంభవించిన టీయాక్స్ కోనె అగ్నిపర్వతం ప్రేలుడు వర్ణించబడింది. ఈ ప్రమాదంలో 2,000 నిస్గా ప్రజలు మరణించారు. ఉత్తర బ్రిటిష్ కొలంబియాలో ఉన్న నాస్ నది ప్రాంతంలో ఉన్న వారి గ్రామం సమూలంగా ధ్వంసం అయింది. ప్రేలుడులో వెలువడిన లావా 22.5 కి.మీ భూభాగంలో ప్రవహించింది. నిస్సా పురాణకథనం అనుసరించి లావాప్రవాహం నిస్సా నదీ ప్రవాహాన్ని అడ్డగించిందని వివరిస్తుంది. [91] కెనడా జనసాంధ్రత చ.కి.మీకి 3.3. ఇది ప్రపంచదేశాలలో అత్యంత కనిష్ఠం. దేశంలో అత్యంత జనసాంధ్రత కలిగిన ప్రాంతం " క్యూబెక్ విండ్సర్ కారిడార్ ". అది గ్రేట్ లేక్, సెయింట్ లారెంస్ నదీతీరం వెంట సదరన్ ఒంటారియో ప్రాంతంలో ఉంది.[92] సరాసరి శీతాకాలం, వేసవి కాలం ప్రాంతాలవారిగా విభేదించి ఉంది. దేశంలోని పలు ప్రాంతాలలో కఠినంగా ఉంటుంది. ప్రత్యేకంగా ప్రియరీ ప్రొవింస్ వాతావరణం అత్యంత కఠినంగా ఉంటుంది. ఇక్కడ దినసరి సరాసరి ఉష్ణోగ్రత - 15 సెల్షియస్ ఉంటుంది. ఒక్కోసారి శీతలవాయువులతో -40 సెల్షియస్ ఉష్ణోగ్రతకు పతనం ఔతుంది.[93] సముద్రతీరరహిత ప్రాంతాలు సంవత్సరంలో 6 మాసాలకాలం మంచుతో కప్పబడి ఉంటాయి. ఉత్తరభూభాగం సంవత్సరం అంతా మంచుతో కప్పబడి ఉంటుంది. సముద్రతీర బ్రిటిష్ కొలంబియా ప్రాంతం కొంచం ఉష్ణప్రాంతంగా ఉంటుంది. స్వల్పమైన, వర్షపాతంతోకూడిన శీతాకాలం ఉంటుంది. తూర్పు, పశ్చిమ సముద్రతీరాలు సరాసరి అత్యధిక ఉష్ణోగ్రత 20 డిగ్రీల సెల్షియస్ ఉంటుంది. ఇరు సముద్రాల మద్యప్రాంతంలో సరాసరి ఉష్ణోగ్రత 30 డిగ్రీల సెల్షియస్ ఉంటుంది. కొన్ని లోతట్టు ప్రాంతాలలో సరాసరి అత్యధిక ఉష్ణోగ్రత 40 డిగ్రీల సెల్షియస్ ఉంటుంది.[94]
కెనడా జి.డి.పి. ప్రపంచదేశాలలో 11 వ స్థానంలో ఉంది. 2015లో కెనడా జి.డి.పి. 1.79 అమెరికన్ డాలర్లు.[95] కెనడా హైలీ గ్లోబలైజ్డ్ ఆర్థికరంగంతో " ఎకనమిక్ - కో ఆపరేషన్ అండ్ డెవెలెప్మెంట్ ", గ్రూప్ ఆఫ్ 8, వరల్డ్ ఒన్ ఆఫ్ ది టాప్ టెన్ నేషంస్ లలో సభ్యత్వం కలిగి ఉంది. [96][97] కెనడా " మిశ్రిత ఆర్ధికరంగం " (మిక్సెడ్ ఎకనమీ) ని కలిగి ఉంది." హెరిటేజ్ ఫౌండేషన్ "కి చెందిన ఇండెక్స్ ఆఫ్ ఎకనమిక్ ఫ్రీడం వర్గీకరణలో కెనడా ఆర్థికరంగం యు.ఎస్. యురేపియన్ దేశాలకంటే ముందున్నది.[98] కెనడా ప్రజల తలసరి ఆదాయంలో వ్యత్యాసం స్వల్పంగా మాత్రమే ఉండడం కూడా ప్రత్యేకతే.[99] దేశంలో సరాసరి కుటుంబ ఆదాయం 23,900 అమెరికన్ డాలర్లు. ఇది ఒ.ఇ.సి.డి సరాసరి కంటే అధికం.[100]
అదనంగా టొరంటో స్టాక్ ఎక్సేంజ్ ప్రపంచంలో 7 వ స్థానంలో ఉంది. ఇందులో 1,500 కంపెనీలు ఉన్నాయి. 2015లో మొత్తం మార్కెట్ పెట్టుబడులు 2 ట్రిలియన్ అమెరికన్ డాలర్లు.[101]2014లో కెనడా ఎగుమతులు మొత్తం 528 బిలియన్ల కెనడా డాలర్లకు చేరుకున్నాయి. దిగుమతుల మొత్తం 524 బిలియన్ల కెనడా డాలర్లు. ఇందులో యు.ఎస్. దిగుమతులు మాత్రమే 351 బిలియన్ల కెనడా డాలర్లు, యురేపియన్ యూనియన్ దిగుమతులు 49 బిలియన్ల కెనడా డాలర్లు, చైనా దిగుమతులు 35 బిలియన్ల కెనడా డాలర్లు ఉన్నాయి.[102] 2014 దేశం మొత్తం వాణిజ్యం 5.1 బిలియన్ల కెనడియన్ డాలర్లు ఉండగా 2008లో ఈ మొత్తం బిలియన్ల కెనడియన్ డాలర్లు 46.9 ఉంది.[103][104]
20 వ శతాబ్దంలో కెనడా తయారీ రంగం, మైనింగ్, సేవారంగం అభివృద్ధి కెనడా ఆర్థికరంగాన్ని గ్రామాల నుండి పారిశ్రామీకరణ, నగరీకరణ దిశగా మార్పుచెందడానికి సహకరించింది. పలు ఇతర దేశాల మాదిరిగా కెనడా ఆర్థికరంగంలో సేవారంగం ఆధిక్యత కలిగి ఉంది. దేశంలో ఉపాధికల్పనలో నాల్గింట మూడువంతులకు సేవారంగం బాధ్యత వహిస్తుంది.[105] అభివృద్ధి చెందిన దేశాలలో కెనడా అసాధారణమైన ఆర్థికవిధానాలను కలిగి ఉంది. కెనడా ఆర్థికరంగం అరణ్యం, పెట్రోలియం పరిశ్రమలకు ప్రాధాన్యత ఇస్తుంది.[106]
విద్యుత్తును మొత్తంగా ఎగుమతి చేస్తున్న అభివృద్ధి చెందిన కొన్ని దేశాలలో కెనడా ఒకటి.[108] అట్లాంటి కెనడా ఆఫ్‌షోర్ సహజవాయువు నిల్వలు, అల్బెర్టా కూడా పెద్ద మొత్తంలో ఆయిల్, గ్యాస్ నిక్షేపాలను కలిగి ఉంది. అథబస్కా ఆయిల్ శాండ్స్, కెనడా ఇతర నిక్షేపాలు అంతర్జాతీయ ఆయిల్ నిల్వలలో 13% నికి భాగస్వామ్యం వహిస్తుంది. కెనడా ఆయిల్ నిల్వలు ప్రంపంచంలో 3 వ స్థానంలో ఉన్నాయి. మొదటి రెండు స్థానాలలో వెనెజులా, అరేబియాలు ఉన్నాయి. [109] విశాలమైన కెనడా వ్యవసాయభూములు గోధుమ, కనోలా, ఇతర ధాన్యాలను ఉత్పత్తి చేస్తున్నాయి. [110] కెనడా " మినిస్టరీ ఆఫ్ నేచురల్ రిసౌర్సెస్ " ప్రధానంగా జింక్, యురేనియం, గోల్డ్, నికెల్, అల్యూమినియం, స్టీల్, ఐరన్ ఓర్, వట బొగ్గు, లీడ్ ఎగుమతి చేస్తుంది. [111]
ఉత్తర కెనడాలోని పలు పట్టణాలలో వ్యవసాయం సాధ్యం కాదు. అందువలన సమీపంలోని గనులు, టింబర్ మీద ఆధారపడి ప్రజలు జీవనోపాధి సాగిస్తుంటారు. సదరన్ ఒంటారియో, క్యూబెక్ లలో ఆటోమొబైల్స్, ఎయిరోనాటిక్స్ పరిశ్రమలు ఉత్పత్తిని కొనసాగిస్తున్నాయి.[112] రెండవ ప్రపంచ యుద్ధం తరువాత కెనడా, యునైటెడ్ స్టేట్స్ ఆర్థికంగా సమైక్యవిధానం అనుసరిస్తున్నాయి.[113]
1965లో కెనడా సరిహద్దులోని ఆటోమొబైల్ పరిశ్రమ వ్యాపార అనుబంధంగా " ది ఆటోమోటివ్ ప్రొడక్ట్ ట్రేడ్ అగ్రిమెంటు " జరిగింది. 1970లో తయారీరంగంలో ప్రధానమంత్రి పియరె ట్రుడ్యూ చేత నేషనల్ ఎనర్జీ ప్రోగ్రాం (ఎన్.ఇ.పి), విదేశీ పెట్టుబడులు చైతన్యవంతం చేయడానికి " ఎనర్జీ సెల్ఫ్ - సఫీషియంసీ అండ్ ఫారిన్ ఒనర్షిప్ " ప్రతిపాదించబడింది. [114] 1980లో ప్రధానమంత్రి బ్రెయిన్ ముల్రోనీ ప్రోగ్రెసివ్ కంసర్వేటిస్ ఎన్.ఇ.పి.ని రద్దు చేసి విదేశీ పెట్టుబడులకు ప్రోత్సాహంగా పేరును ఇంవెస్ట్మెంటు కెనడాగా మార్చింది. [115] 1988లో యునైటెడ్ స్టేట్స్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంటు రెండుదేశాల మద్య సుంకాలను ఎత్తి వేసింది. 1994లో ఉత్తర అమెరికన్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంటు ఫ్రీ- ట్రేడ్ జోన్ ప్రాంతాన్ని మెక్సికో వరకు విస్తరించింది.[110] 1990లో జీన్ క్రెటియన్ ప్రభుత్వం వార్షిక మిగులు నిధులను జాతీయ ఋనాలను చెల్లింపుకు వినియోగించింది.[116]
2008 అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభం సమయంలో కెనడియన్ నిరుద్యోగుల సంఖ్య అధికరించింది.[117] 2009 అక్టోబరు నాటికి కెనడా జాతీయ నిరుద్యోగుల శాతం 8.6% చేరుకుంది. మనిటోబా నిరుద్యోగ శాతం 5.8% ఉండగా న్యూఫౌండ్‌లాండ్, లేబ్రేడర్ ప్రాంతాలలో 17% ఉండేది.[118] 2008 - 2010 అక్టోబరు మద్య కెనడియన్ లేబర్ మార్కెట్ 1,62,000 ఫుల్ - టైం ఉద్యోగాలను, మొత్తం 2,24,000 పర్మినెంటు ఉద్యోగాలను కోల్పోయింది.[119]
2008 - 2009 లో 463.7 బిలియన్లు ఉన్న కెనడా జాతీయ ఋణం 2010 - 2011 మద్య " కెనడా ఫెడరల్ డెబ్ట్ " మొత్తం 566.7 బిలియన్లకు చేరుకుంది.[120] కెనడా విదేశీ ఋణం 41 బిలియన్ల నుండి 2010 నాటికి 194 బిలియన్లకు చేరుకుంది.[121] బ్యాంకింగ్ సెక్టర్ రెగ్యులేషన్, ఫెడరల్ గవర్నమెంటు ప్రీ - క్రైసెస్ బడ్జెట్ మిగులు, జాతీయ ఋణభారం తగ్గించడానికి ప్రభుత్వం తీసుకున్న దీర్ఘకాల విధానాల ఫలితంగా కెనడా జాతీయ ఋణం జి - 8 దేశాలతో పోల్చిచూస్తే తగ్గుముఖం పట్టింది.[122] 2015 నాటికి కెనడా ఆర్థికరంగం పెద్ద మొత్తంలో క్రమబద్ధీకరించబడింది. అయినప్పటికీ ఆయిల్ ధరలలో కొనసాగిన హెచ్చుతగ్గులు ఆర్థికరంగంలో సమస్యలకు కారణమయ్యాయి. కెనడా ఆర్థికరంగం యురోజోన్ ఆర్థికసంక్షోభం, నిరోద్యోగ శాతం అధికరించడం మొదలైన సమస్యలకు ఎదుర్కొన్నది.[123][124] కెనడియన్ ఫెడరల్ గవర్నమెంటు, పలు కెనడియన్ పరిశ్రమలు తమ వాణిజ్యపరిధిని సరికొత్తగా తలెత్తుతున్న ఆసియన్ మార్కెట్ల వరకు విస్తరించాయి.ప్రస్తుతం కెనడా ఎగుమతులకు ఆసియా రెండవ స్త్యానంలో నిలిచింది. మొదటి స్థానంలో యునైటెడ్ స్టేట్స్ ఉంది.[125][126] దేశవ్యాప్తంగా వివాదాలకు తెర తీసిన " ఎంబ్రిడ్జ్ నార్తెన్ గేట్‌వే " ప్రతిపాదన కెనడా ఆయిల్ ఉత్పత్తూను చైనాకు ఎగుమతి చేయడానికి సహకరిస్తుందని భావిస్తున్నారు.[127][128]
2012లో కెనడా దేశీయ పరిశోధనారంగం అభివృద్ధికి 31.3 బిలియన్లు వ్యయం చేసింది. ఇందులో 7 బిలియన్లు ఫెడరల్, ప్రొవినికల్ ప్రభుత్వాలు మంజూరు చేసాయి. [129] 2015 నాటికి కెనడా భౌతికశాస్త్రం, రసాయనశాస్త్రం, వైద్యంలో 13 మంది నోబుల్ గ్రహీతలను అందించింది.[130][131] 2012 అంతర్జాతీయ శాస్త్రీయపరిశోధనల నాణ్యతలో కెనడా 4 వ స్థానంలో నిలిచింది. [132] అంతర్జాతీయ సాంకేతిక సంస్థలకు కెనడా నిలయంగా ఉంది.[133] 33 మిలియన్ల అంతర్జాతీయ వాడకందార్లతో అత్యధికంగా అంతర్జాల వాడుకరులు ఉన్న దేశాలలో కెనడా ఒకటిగా నిలిచింది. 2014 గణాంకాలు మొత్తం కెనడా జనసంఖ్యలో 94% అంతర్జాలం వాడుతున్నారని తెలియజేస్తున్నాయి. [134] కెనడా స్పేస్ ఏజెంసీ అత్యంత చురుకుగా స్పేస్ ప్రోగ్రాంను నిర్వహిస్తుంది. ఇది డీప్ స్పేస్, ప్లానిటరీ, అవియేషన్ రీసెర్చి, రాకెట్లు, శాటిలైట్ల అభివృద్ధి మొదలైన ప్రోగ్రాంలను నిర్వహిస్తుంది. ఉపగ్రహాలను అంతరిక్షంలో ప్రవేశపెట్టిన దేశాలలో కెనడా 3 వ స్థానంలో ఉంది.మొదటి రెండు స్థానాలలో రష్యా, అమెరికా దేశాలు ఉన్నాయి.[135] 1984లో " మార్క్ గార్న్యూ " కెనడా మొతటి అంతరిక్షయాత్రికుడయ్యాడు. కెనడా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్), స్పేస్ రోబోటిక్స్, కెనడర్మ్, కెనడర్మ్2, ఐ.ఎస్.ఎస్, నాసా స్పేస్ షటిల్ కొరకు డైస్ట్రె రోబోటిక్ మనిప్యులేటర్స్ తయారుచేయడంలో భాగస్వామ్యం వహించింది. 1960లో కెనడా ఎయిరో స్పేస్ ఇండస్ట్రీ రాడార్ శాట్, రాడార్ శాట్ -2, ఐ.ఎస్.ఐ.ఎస్. శాటిలైట్, ఎం.ఒ.ఎస్.టి మొదలైన పలు ఉపగ్రాహాల రూపకల్పన, నిర్మాణం చేపట్టింది. [136] అంతర్జాతీయంగా విజయవంతమై అత్యధికంగా ఉపయోగించిన సండ్లింగ్ రాకెట్లలో ఒకదానిని, బ్లాక్ బ్రంట్ రాకెట్‌లను కెనడా నిర్మ్ంచింది. 1961లో రాకెట్ పరిచయం చేసినప్పటి నుండి 1,000 బ్లాక్ బ్రంట్ వాడుకలో ఉంది.[137]
2016 గణాంకాలు అనుసరించి కెనడా జనసంఖ్య 3,51,51,728. 2011 తరువాత జనసంఖ్య 5% అధికరించింది.[138][139] 1990, 2008 మద్య జనసఖ్య 5.6 మిలియన్లు అధికరించింది. మొత్తం 20.4% అధికరించింది.[140] జనసంఖ్య అభివృద్ధికి వలస ప్రజల రాక అధికరించడం, వలసపోయే ప్రజల సంఖ్య తక్కువగా ఉండడం, సహజమైన అభివృద్ధి కారణంగా ఉన్నాయి.[141] అత్యధికంగా వలసప్రజలు స్థిరపడుతున్న దేశాలలో కెనడా ఒకటి.[142] కెనడా అనుసరిస్తున్న ఆర్థికవిధానాలు ఇందుకు కారణంగా ఉన్నాయి.[143][144] కెనడియన్ ప్రజలు అలాగే రాజకీయపార్టీలు ఇందుకు సహకారం అందిస్తున్నాయి.[143][145][146] 2010 గణాంకాలను అనుసరించి కెనడాకు వలసవచ్చి స్థిరపడిన వలసప్రజలసంఖ్య 2,80,636.[147] 2016లో కెనడా ప్రభుత్వం 2,80,000 నుండి 3,05,000 వరకు పర్మినెంట్ రెసిడెంట్లు ఉంటారని ఊహిస్తుంది.[148] ఇది ప్రస్తుత వలసప్రజల సంఖ్యకు సామీప్యతలో ఉంది.[149] కొత్తగా వచ్చే వలసప్రజలు టొరంటో, మాంట్రియల్, వాంకోవర్ మొదలైన నగరాలలో స్థిరపడుతుంటారు.[150] కెనడా శరణార్ధులకు అధికసంఖ్యలో ఆశ్రయం కల్పిస్తుంది.[151] అంతర్జాతీయ శరణార్ధులలో దాదాపు 10% కెనడాలో నివసిస్తున్నారు. [152]
కెనడాలోని ఐదింట 4 వంతుల ప్రజలు 150 కి.మీ పొడవైన యునైటెడ్ స్టేట్స్ సరిహద్దులో నివసిస్తున్నారు.[153] 50% కెనడా ప్రజలు క్యూబిక్ సిటీ - విండ్సర్ కారిడార్ ప్రాంతాలలోని నగరాలలో నివసిస్తున్నారు.[154] 30% ప్రజలు బ్రిటిష్ కొలంబియాలోని అల్బెర్టా ప్రాంతంలో ఉన్న లోవర్ మెయిన్‌లాండ్, కాల్గరీ - ఎడ్మోంటన్ కారిడార్ ప్రాంతాలలో నివసిస్తున్నారు.[155] కెనడా 83 - 41 ఉత్తర అక్షాంశంలో ఉంది. 95% ప్రజలు 55 ఉత్తర అక్షాంశంలో నివసిస్తున్నారు.[154] ఇతర అభివృద్ధి చెందిన దేశాలమాదితిగా కెనడాలో కూడా వయోజనుల సంఖ్య అధికంగా ఉంది.2006లో 39.5 ఉన్న సరాసరి వయసు.[156] 2011 నాటికి 39.9 కి చేరుకుంది.[157] 2013 ఆయుః ప్రమాణం 81 సంవత్సరాలు.[158] 69.9% ప్రజలు కుటుంబాలలో జీవిస్తున్నారు. 26.8% ఒంటరిగా జీవిస్తున్నారు. 3.7% ప్రజలు బధుత్వరహితంగా కలిసి జీవిస్తున్నారు.[159] 2006 సరాసరి కుటుంబ సభ్యుల సంఖ్య 2.5.[159]2011 - 2016 మద్యకాలంలో కెనడా జనసంఖ్య 1.7 మిలియన్లు అభివృద్ధి చెందింది. వీరిలో మూడింట రెండు వంతుల ప్రజలు వలసల కారణంగా అభివృద్ధి చెందారు. మిగిలిన వారు జనన మరణాల వ్యత్యాసం కారణంగా కారంఅంగా అభివృద్ధి చెందారు. [160]
2012 " ఆర్గనైజేషన్ ఫర్ ఎకనమిక్ కో - ఆపరేషన్ అండ్ డెవెలెప్మెంటు " (ఒ.ఇ.ఇ.డి) నివేదిక ఆధారంగా ప్రపంచంలో అధికంగా విద్యావంతులున్న దేశాలలో కెనడా ఒకటి అని తెలియజేస్తుంది.[161] కెనడా వయోజన విద్యలో ప్రంపంచంలో మొదటి స్థానంలో ఉంది. కెనడాలోని 51% వయోజనులు కనీసం అండర్ గ్రాజ్యుయేట్ కాలేజ్ లేక యూనివర్శిటీ డిగ్రీ విద్యను కలిగి ఉన్నారు.[161] కెనడా విద్యకొరకు జి.డి.పి.లో 5.3% వ్యయం చేస్తుంది.[162] టెర్రిటరీ ఎజ్యుకేషన్ కొరకు కెనడా ఒక్కొక విద్యార్థి కొరకు 20,000 డాలర్లు పెట్టుబడి పెడుతుంది.[163] 2014 గణాంకాల ఆధారంగా 25-64 మద్య వయసున్న 89% వయోధికులు ఉన్నత పాఠశాల డిగ్రీతో సమానమైన విద్యార్హత కలిగి ఉన్నారని తెలుస్తుంది.[100]1982లో సెక్షన్ 23 చట్టానికి అంగీకారం లభించిన తరువాత కెనడా అంతటా ఇంగ్లీష్, ఫ్రెంచ్ భాషలలో విద్యావకాశం లభిస్తుంది.[164] కెనడియన్ ప్రొవింసెస్, టెర్రిటరీలు కెనడా విస్యావిధానానికి బాధ్యత వహిస్తుంది.[165] 5-7 నుండి 16-18 సంవత్సరాల మధ్య నిర్భంధవిద్య అమలులో ఉంది.[166] ఇందువలన వయోజన విద్య 99%నికి చేరుకుంది.[6] 2002లో 25-64 మద్యవయస్కులలో 43% సెకండరీ విద్యార్హత కలిగి ఉన్నారు. 25-34 మద్య వయస్కులలో 51% పోస్ట్ సెకండరీ విద్యార్హత కలిగి ఉన్నారు.[167] " ది ప్రోగ్రాం ఫర్ ఇంటర్నేషనల్ స్టూడెంట్ అసోసియేషన్ " కెనడియన్ విద్యార్థులు ఒ.ఇ.సి.డి. సరాసరి కంటే అధికంగా విద్యార్హత కలిగి ఉన్నారని (ప్రత్యేకంగా సైన్సు, రీడింగ్) సూచిస్తుంది.[168][169]
2006 గణాంకాల ఆధారంగా దేశంలో 32% ప్రజలు తమకుతాము కెనడియన్లుగా నమోదు చేసుకున్నారని అంచనా. తరువాత ఇంగ్లీష్ కెనడితన్లు 21%, ఫ్రెంచ్ కెనడియన్లు 15.8%, స్కూటిష్ కెనడియన్లు 15-1%, ఐరిష్ కెనడియన్లు 13.9%, జర్మన్లు 10.2%, ఇటాలియన్లు 4.6%, చైనీయులు 4.3%, ఫస్ట్ నేషంస్ 4%, ఉక్రెయిన్ ప్రజలు 3.9%, డచ్ కెనడియన్లు 3.3% ఉన్నారని అంచనా.[171][172]2006 గణాంకాలను అనుసరించి కెనడాలో 4% మంది తమను ఆదిమవాసులుగా నమోదు చేసుకున్నారు. 16.2 % ప్రజలు ఆదిమవాసులు కాని అల్పసంఖ్యాక ప్రజలుగా నమోదుచేయబడ్డారు.[173] 2006 గణాంకాల ఆధారంగా అల్పసఖ్యాక ప్రజలలో 4% ఆసియన్లు, 3% చైనీయులు, నల్లజాతి కెనడియన్లు 2.5% ఉన్నారని అంచనా. 2001-2006 మద్యకాలంలో అల్పసంఖ్యాక ప్రజలశాతం 27.2%. [174] 1961లో 2% కంటే తక్కువ కెనడియన్ ప్రజలు (3,00,000 మంది) అల్పసంఖ్యాక ప్రజలుగా ఉన్నారు.[175] 2007లో 19.8% విదేశాలలో జన్మిచిన ప్రజలు, 60% కొత్తగా వలసవచ్చిన ప్రజలు ఉన్నారని అంచనా.[176] కెనడాలో నివసిస్తున్న వలసప్రజలలో అధికంగా చైనీయులు, ఫిలిప్పైన్లు, భరతీయులు ఉన్నారు.[177] 2031 నాటికి కెనడాలో అల్పసంఖ్యాక ప్రజలసంఖ మొత్తం జనసంఖ్యలో మూడింట ఒక వంతు ఉంటుందని అంచనా.[178]
Religion in Canada (2011)[179] | ||||
---|---|---|---|---|
Christianity | 67.2% | |||
Not Religious | 23.9% | |||
Islam | 3.2% | |||
Hinduism | 1.5% | |||
Sikhism | 1.4% | |||
Buddhism | 1.1% | |||
Judaism | 1.0% | |||
Other | 0.6% |
పలు విధమైన మతాలు, ఆచారాలను అనుసరిస్తున్న కెనడా పలు మతపరమైన వైవిధ్యాలు కలిగి ఉంది. కెనడాలో అధికారికమైన చర్చి లేదు. కెనడా ప్రభుత్వం పలు మతాలకు అధికారికహోదాను ఇస్తుంది.[180] కెనడా ప్రజల మతస్వాతంత్ర్యాన్ని రాజ్యాంగపరంగా రక్షిస్తూ ఉంది. ప్రజలు స్వతంత్రంగా మతసంబంధిత ఉత్సవాలలో చేసుకోవడానికి ప్రభుత్వం ఎటువంటి పరిమితి విధించడం, జోక్యం చేసుకోదు.[181] దేశం అంతటా, సంఘం అంతటా మతాన్ని అనుసరించడం వ్యక్తిగత విషయంగా భావించబడుతుంది.[182] కెనడియన్ దైనందిక జీవితం, సంస్కృతిలో క్రైస్తవం ప్రధానమైనదిగా ఉంది.[183] కెనడా పోస్ట్‌క్రిస్టియానిటీ, లౌకికవాద దేశంగా గుర్తించబడుతుంది.[184][185][186][187] కెనడా లోని క్రైస్తవులు అధికంగా దైనందిక జీవితంలో మతానికి ప్రాముఖ్యత లేదని భావిస్తున్నారు.[188] అయినప్పటికీ దైవం పట్ల విశ్వాసం కలిగి ఉన్నారు. [189] 2011 గణాంకాలను అనుసరించి 67.3% కెనడియన్లు క్రైస్తమతాన్ని అనుసరిస్తున్నారని, వీరిలో రోమన్ కాథలిక్కులు అధికంగా ఉన్నారు, కెనడా జనసంఖ్యలో రోమన్ కాథలిక్కులు 38.7% ఉన్నారు. మిగిలిన వారు ప్రొట్స్టెంట్లు. కెనడియన్ జనసంఖ్యలో 6.1% ఉన్న ప్రొటెస్టెంట్లు యునైటెడ్ చర్చి ఆఫ్ కెనడాకు చెందినవారై ఉన్నారు. తరువాతి స్థానంలో 5% ప్రజలతో ఆగ్లికన్ చర్చికి చెందిన క్రైస్తవులు ఉన్నారు. చివరిగా 1.9% బాప్టిస్ట్ క్రైస్తవులు ఉన్నారు.[179]1960 నుండి లౌకికవాదం అధికరిస్తూ ఉంది.[190][191] 2011 గణాంకాలు 23.9% ప్రజలు ఏమతానికి చెంసనివారుగా నమోదు చేసుకున్నారు. 2001లో వీరి శాతం 16.5% ఉంది.[192] మిగిలిన 8.8% క్రైస్తవమతేతరులు ఉన్నారు. వీరిలో 3.2% కెనడియన్ ముస్లిములు, హిందువులు 1.5% ఉన్నారు.[179]
కెనడాలో పలు భాషలు వాడుకలో ఉన్నాయి. కెనడియన్ ఇంగ్లీష్ 60% ప్రజలతో అధికారహోదాను కలిగి ఉండగా కెనడియన్ 20% ప్రజలతో కెనడియన్ ఫ్రెంచ్ అధికార హోదా కలిగి ఉంది.[194] 6.8 మిలియన్ల కెనడా ప్రజలు అనధికార మతాలను వారి మాతృభాషగా ఉన్నారు.[195] వీటిలో చైనీస్ (ప్రధానంగా యూ చైనీస్) ప్రజల సంఖ్య 10,72,555, పంజాబీ ప్రజల సంఖ్య 4,30,705, స్పానిష్ ప్రజల సంఖ్య 4.10,670, జర్మన్ ప్రజల సంఖ్య 4,09,200, ఇటాలియన్ ప్రజల సంఖ్య 4,07,490 ఉంది. [196] కెనడా రాజ్యాంగ అధికారం కలిగి ఉన్న ఆగ్లం, ఫ్రెంచ్ భాషలు ఫెడరల్ కోర్టులు, పార్లమెంటు, అన్ని ఫెడరల్ సంస్థలలో ఉపయోగించబడుతుంది.ఫెడరల్ గవర్నమెంటు సేవలలో నియామకాలకు ఆగ్లం, ఫ్రెంచ్ భాషలకు ప్రాధాన్యత ఉంది. అల్పసంఖ్యాక భాషాప్రజలకు అన్ని ప్రొవింస్, టెఋఋఇటరీలలో వారి స్వత పాఠశాలలో ప్రవేశించే అర్హతకలిగి ఉన్నారు.[197]
1977 " చార్టర్ ఆఫ్ ఫ్రెంచ్ లాగ్వేజ్ " ఫ్రెంచ్ భాషను క్యూబెక్ అధికారభాషగా చేసింది.[198] ఫ్రెంచ్ మాట్లాడే 85% ప్రజలు క్యూబెక్‌లో నివసిస్తున్నారు. న్యూ బర్న్‌స్విక్‌లో గుర్తించతగినంతమంది ఫ్రాంకోఫోన్ ప్రజలు నివసిస్తున్నారు.క్యూబెక్ వెలుపల అధికసంఖ్యలో ఉన్న ఫ్రెంచ్ భాష మాట్లాడే ప్రజలలో ఫ్రాంకో అల్బెర్టా, ఫ్రాంకో మనిటోబా ప్రజలు ప్రాధాన్యత కలిగి ఉన్నారు.[199] కెనడాలో రెండు అధికార భాషలను కలిగిన ఒకేఒక ప్రొవింస్ అయిన న్యూ బర్న్‌విక్ ఫ్రెంచ్ మాట్లాడే వారి శాతం 33% ఉంది.[200] సదరన్ నోవా స్కూటియా, బ్రెటన్ ద్వీపం, ఎడ్వర్డ్ ద్వీవి సెంట్రల్, వెస్టర్న్ ప్రాంతాలలో అక్కడక్కడా ఫ్రెంచి మాట్లాడే ప్రజలు నివసిస్తున్నారు.[201] ఇతర ప్రొవింసెస్‌లో అధికార భాషలు ప్రత్యేకంగా లేకున్నా ఆంగ్లభాషేకాక ఫ్రెంచ్ ఇంస్ట్రక్షన్ భాష, కోర్టువ్యవహారాలలో, ఇతర ప్రభుత్వసేవలకు ఉపయోగించబడుతుంది.
మనిటోబా, ఒంటారియో, క్యూబెక్ అంగ్లం, ఫ్రెంచ్ భాషలకు అనుమతి లభిస్తుంది. అలాగే ప్రజలలో ప్రాంతీయభాషలు వాడుకలో ఉన్నాయి. చట్టాలు రెండుభాషలలో రూపుదిద్దుకుంటున్నాయి. ఒంటారియాలో ఫ్రెంచి చట్టపరమైన హోదాకలిగి ఉన్నప్పటికీ పూర్తిగా అధికారహోదా మాత్రం లేదు. [202] కెనడాలో 11 గిరిజనాభాషలు ఉన్నాయి, 65 వైద్యమైన భాషలు, యాసలు ఉన్నాయి.[203] వీటిలో క్రీ భాష, ఇనుయిట్ భాష, ఒజిబ్వే భాషలకు పెద్ద సంఖ్యలో వాడుకరులు ఉన్నారు. ఇవి దీర్ఘకాలం సజీవంగా ఉండగలవని పరిశీలకులు భావిస్తున్నారు. [204] వాయవ్య భూభాగంలో పలు గిరిజనాభాషలకు అధికారహోదా కల్పించబడింది.[205] నునవూట్ టెర్రిటరీలో ఇనుక్తిటట్ భాషతో చేఎర్చి మూడు భాషలు అధికారభాషలుగా ఉన్నాయి.[206]
కెనడా సఙాఅభాషలకు నిలయం. వీటిలో రెండు స్థానిక భాషలు ఉన్నాయి. అమెరికన్ సఙా భాష దేశం అంతటా వాడుకభాషగా ఉండడమేకాక ఎ.ఎస్.ఎల్. ప్రాథమిక, మాధ్యమిక పాఠశాలలో బోధించబడుతున్నాయి.[207] క్యూబెక్ సఙా భాష క్యూబెక్‌లో మాత్రమే వాడుకలో ఉంది. న్యూబర్న్‌స్విక్, ఒంటారియో, మనిటోబా ప్రాంతంలో ఈ భాష ఫ్రాంకోఫోన్ ప్రజలలో గుర్తించతగినంతగా వాడుకలో ఉన్నాయి. ఫ్రాంకోఫోన్ ప్రజలతో ఈ భాషకున్న చారిత్రక అనుబంధమే ఇందుకు ప్రధానకారణం.[208] ప్లెయింస్ సఙా భాష కాలనైజేషన్‌కు ముందు ఉత్తర అమెరికాలో వాడుకలో ఉండేది. పలు ఫస్ట్ నేషన్ ప్రజలకు ఇది వాడుక భాషగా ఉంది. [209] ఇనుయిట్ సఙా భాష నునవుట్ లోని ఇనుయిట్ ప్రజలకు వాడుకభాషగా ఉంది.[210] నోవా స్కూటియా, న్యూ బ్రన్‌స్విక్, ప్రింస్ ఎడ్వర్డ్ దీవిలో మారీటైం సఙా భాష వాడుకలో ఉంది.[211]
కెనడా సంస్కృతిలో పలుదేశాల సంస్కృతులు సమ్మిళితమై ఉన్నాయి. కెనడా రాజ్యాంగబద్ధంగా " జస్ట్ సొసైటీ " విధానాన్ని సంరక్షిస్తూ అనుసరిస్తుంది.[212][213] కెనడా తనప్రజలకు అందరికీ సమానహోదా కల్పిస్తూ ఉంది.[214] బహుళ సంస్కృతి కెనడా ప్రత్యేకతగా గుర్తించబడుతుంది.[215] ఇది కెనడాకు ప్రత్యేక కీలకమైన ప్రత్యేకతగా భావించబడుతుంది.[216][217] క్యూబిక్ సాంస్కృతిక సంపద శక్తివంతమైనది. క్యూబిక్ సంస్కృతి ఇంగ్లీష్ కెనడియన్ సంస్కృతికి భిన్నమైనదిగా విశ్లేషకులు భావిస్తున్నారు.[218] కెనడా పలు ప్రాంతీయ, స్థానిక, సంప్రదాయ సంస్కృతుల మిశ్రమంగా ఉంది. [219] కెనడా వలస విధానం, సాంఘిక సమైక్యత, దీర్ఘకాల రాజకీయ అణిచివేత కారణంగా ఏర్పడిన మిశ్రిత సంస్కృతికి అనుకూలమైన విధానం అవలబిస్తూ. విస్తారమైన ప్రజలమద్దతుతో పాలనసాగిస్తుంది.[220] ప్రభుత్వం ఆరోగ్యసంరక్షణ, ఆదాయం పన్ను విధానం, కెనడియన్ ఆర్థిక ప్రణాళిక, కఠినమైన శిక్షలు మొదలైన విధానాలతో బీదరికాన్ని తొలగించడానికి ప్రయత్నాలు కొనసాగిస్తూ పాలన కొనసాగిస్తుంది. తుపాకీ వాడకం కఠినతరం చేయడం, స్వలింగ వివాహాలను చట్టబద్ధం చేయడం కెనడా రాజకీయ, సాంస్కృతిక విధానాలకు అద్దం పడుతుంది. [221][222] కెనడియంస్ ఆరోగ్య సంరక్షణ సంస్థలు, కెనడియన్ శాంతిబధ్రతల రక్షణ, కెనడా జాతీయపార్కుల ఏర్పాటు, కెనడియన్ చార్టర్ ఆఫ్ రైట్స్ అండ్ ఫ్రీడం వంటి పాలనావిధానం కెనడా ప్రత్యేకతగా ఉంది.[216][223] చారిత్రకంగా కెనడా సంస్కృతి మీద యునైటెడ్ కింగ్డం సంస్కృతి, ఫ్రెంచి సంస్కృతి, స్థానిక సంస్కృతి, సంప్రదాయాల ప్రభావం ఉంది.స్థానిక అమెరికన్ కళ, ఫస్ట్ నేషంస్ సంగీతం వారి భాషా ప్రభావం ఉంది.కెనడియన్ సంస్కృతి మీద స్థానిక సంస్కృతి ప్రభావం నిరంతరంగా కొనసాగుతూ ఉంది.[224] 20 వ శతాబ్దంలో కెనడియన్ సంస్కృతి సంప్రదాయాలకు ఆఫ్రికన్, కరేబియన్, ఆసియన్ దేశాల సంస్కృతి చేరింది.[225] కెనడియన్ హాస్యం కెనడా ప్రత్యేకతలలో ఒకటి. హాస్యం జానపదసాహిత్యం, సాహిత్యం, సంగీతం, మాధ్యాలలో అంతర్లీనంగా ఉంటుంది. [226] కెనడియన్ హాస్యనటులు అమెరికన్ టి.వి, చలనచిత్రాలలో నటించి అంతర్జాతీయ ఖ్యాతిని గడించారు.[227] కెనడా చక్కగా అభివృద్ధి చెందిన మాధ్యమరంగాన్ని కలిగి ఉంది. కెనడా సంస్కృతి చలనచిత్రాలలో, టెలివిజన్ ప్రదర్శనలు, పత్రికలు ప్రదర్శితమౌతూ ఉంటుంది. ఒక్కోసారి వీటిమీద యునైటెడ్ స్టేట్స్ నుండి దిగుమతి చేసుకొనబడుతున్న మాధ్యమనీడలు పడుతున్నాయి. [228] ఫలితంగా ఫెడరల్ గవర్నమెంటు చట్టం, కెనడియన్ బ్రాడ్‌కాస్టింగ్ కార్పొరేషన్ వంటి ఇంస్టిట్యూషన్ ( సి.బి.సి), నేషనల్ ఫిల్ం బోర్డ్ ఆఫ్ కెనడా (ఎన్.ఎఫ్.బి), ది కెనడియన్ రేడియో - టెలివిజన్ అండ్ టెలీకమ్యూనికేషన్ కమీష (సి.ఆర్.టి.సి) మొదలైన విధానాలద్వారా కెనడియన్ సంస్కృతిని రక్షించడానికి ప్రయత్నిస్తుంది.[229]
కెనడియ జాతీయ చిహ్నాలు ప్రకృతి, చరిత్ర, ఆదిమనాగరికతలతో ప్రభావితమై ఉన్నాయి. 18 వ శతాబ్దంలో మాపుల్ ఆకు కెనడియన్ చిహ్నం వాడుకలో ఉంది. మాపుల్ చిహ్నం కెనడియన్ జాతీయ జంఢాలలో, కెనడా ఆయుధాలలో చోటు సంపాదించుకుంది.[231] రాయల్ కోట్ ఆఫ్ ఆర్మ్‌స్ ఆఫ్ ది యునైటెడ్ కింగ్డం తయారీ తరువాత కెనడియన్ ఆయుధాలకు రూపకల్పన జరిగింది.[232] ది గ్రేట్ సీల్ ఆఫ్ కెనడా ప్రభుత్వ ముద్రగా రాజ్యాంగ అవసరాలకు ఉపయోగించబడుతుంది. దీనిని ప్రకటనలు, రాణి తరఫున పనిచేసే రాజప్రతినిధుల కమిషన్లు, కేబినెట్ మంత్రుల, లెఫ్టినెంట్ గవర్నర్, సెనేటర్లు, న్యాయాధికారుల నియామకంలో ఉపయోగించబడింది.[233][234] ఇతర కెనడియన్ చిహ్నాలలో బీవర్, కెనడా గూస్, కామన్ లూన్, ది క్రౌన్, ది రాయల్ మౌంటెడ్ పోలిస్ ప్రధానమైనవి.[231] సమీపకాలంలో టోటెం ప్రజలు, ఇంక్సుక్ ప్రజలు చిహ్నాలలో చోటుచేసుకున్నారు.[235] కెనడా డాలర్ నాణ్యాలలో ఈ చిహ్నాలలో అనేకం చోటుచేసుకునాయి. లూన్ 1 డాలర్, ది ఆర్ంస్ ఆఫ్ కెనడా 50 సెంట్లు, కెనడియన్ నికెల్ నాణ్యంలో బీవర్ చోటుచేసుకున్నాయి.[236] మాపుల్ ఆకు చిహ్నంతో పెన్ని 2013 లో విడుదల చేయబడింది.[237] కెనడియన్ 20 డాలర్ల నోటు, ఇతర కెనడియన్ నాణ్యలన్నింటి మీద రాణి చిత్రం ముద్రించబడింది.[236]
కెనడా సాహిత్యం తరచుగా ఆగ్లం, ఫ్రెంచిగా విభజించబడుతూ ఉంటుంది. ఈ సాహిత్యసంప్రదాయాలకు మూలాలు ఫ్రాంస్, బ్రిటన్లో లభిస్తాయి. [238] కెనడియన్ సాహిత్యచరిత్రలో ప్రకృతి, పూర్వీకుల జీవితం ప్రపంచంలో కెనడా స్థానం, పోరాట మనస్తత్వం మొదలైనవి ప్రధానాంశాలుగా ఉంటాయి.[239] 1990 నాటికి కెనడా సాహిత్యం ప్రపంచ ఉన్నత సాహిత్యాలలో ఒకటిగా భావించబడుతుంది.[240] కెనడా సంస్కృతి, సంప్రదాయాల వైవిధ్యం కెనడా సాహ్యం మీద ప్రభావం చూపుతున్నాయి.[241] కెనడాలో అంతర్జాతీయంగా ఖ్యాతిగడించిన మార్గరెట్ అట్వుడ్ ప్రబల నవలారచయితగా, కవిగా, సాహిత్యకారుడుగా కీర్తిగడించాడు.[242] పలు కెనడియన్ రచయితలు అంతర్జాతీయ పురస్కారాలు అందుకున్నారు.[243] వీరిలో నోబుల్ బహుమతి గ్రహీత అలిస్ ముంరో ఆగ్లం చిన్నకథల రచనలో ఉత్తమ రచయితగా ఖ్యాతి గడించాడు.[244] బూకర్ ప్రైజ్ అందుకున్న మైకేల్ ఒండాత్జె ఉత్తమ నవలారచయితగా ఖ్యాతిగడించాడు. ఆయన వ్రాసిన " ది ఇంగ్లీష్ పేషెంట్ " నవల అదేపేరుతో చలనచిత్రంగా చిత్రీకరించబడి ఉత్తమ చిత్రంగా అకాడమీ అవార్డ్ అందుకున్నాడు.[245]
కెనడియన్ విషయుయల్ ఆర్ట్‌లోటాం థాంసన్ గొప్ప చిత్రకారుడుగా పేరుతెచ్చుకున్నాడు.[246] 39 సంవత్సరాల వయసులో లాండ్ స్కేప్ చిత్రీకరణను ఉపాధిగా చేపట్టిన థాంప్సన్ 1917లో మరణించాడు. [247] ది గ్రూప్ ఆఫ్ సెవెన్‌కు చెందిన చిత్రకారులు నేషనలిస్టిక్, ఐడియలిస్టిక్ అంశాల మీద దృష్టి సారించారు. వీరు తమ నైణ్యాన్ని ప్రదర్శిస్తూ 1920 నుండి బృందంగా పనిచేయడం ప్రారంభించారు. వీరిలో ఐదుమంది చిత్రకారులు (లారెన్ హర్రీస్, ఎ.వై. జాక్సన్, ఆర్థర్ లిస్మర్, జె.ఇ.హెచ్. మాక్ డొనాల్డ్, ఫ్రెడెరిక్ వర్లీ) గ్రూప్ చిత్రాలకు అవసరమైన సలహాలు అందిస్తారు. వీరిని ఫ్రాంక్ జాంస్టన్, కమర్షియల్ ఆర్టిస్ట్ ఫ్రెడరి వర్లీ అనుసంధానించాడు.1926లో ఎ.జె.కేసన్ ఈ బృందలో ఒకడుగా చేరాడు.[248] విరితో అనుబంధం ఉన్న ప్రబల కెనడియన్ కళాకారిణి " ఎమిలీ కార్ " ఒకరు. ఈమె వాయవ్య పసిఫిక్ మహాసముద్రతీర స్థానికతెగల ప్రజలజీవిత సంబంధిత చిత్రాలను చిత్రించడంలో నిపుణురాలు.[249] 1950 నుండి ఇనుయిట్ ఆర్ట్ చిత్రాలను కెనడా ప్రభుత్వం విదేశీప్రముఖులకు బహుమతిగా అందించబడుతుంది.[250]
కెనడియన్ సంగీతపరిశ్రమ ప్రంపంచ అత్యంత బృహత్తర సంగీతపరిశ్రమలలో ఒకటిగా గుర్తించబడుతుంది. కెనడా సంగీత దర్శకులు, సంగీతకారులు, సంగీత బృందాలు అంతర్జాతీయ గుర్తింపు పొందాయి.[251] కెనడా సంగీత ప్రసారాలను సి.ఆర్.టి.సి. నియంత్రిస్తుంది.[252] " ది కెనడా అకాడమీ ఆఫ్ రికార్డింగ్ ఆర్ట్స్ అండ్ సైంస్ " కెనడా సంగీత కళాకారులకు " జూనో అవార్డ్ " (1970) లను అందిస్తుంది.[253]1976లో కెనడియన్ సంగీతకారుల జీవితకాల సాధనను గౌరవించడానికి " ది కెనడియన్ మ్యూజిక్ హాల్ ఆఫ్ ఫేం " స్థాపించబడింది.[254] 200 సంవత్సరాలనాటి దేశభక్తి గీతాలలో బ్రిటిష్ పాలననకు వ్యతిరేకంగా 50 సంవత్సరాల కాలం కొనసాగిన స్వతంత్రపోరాట భావాలు ప్రతిఫలిస్తుంటాయి. 1812 వ్రాయబడిన " ది బోల్డ్ కెనడియన్ " గీతం మొట్టమొదటగా వ్రాయబడినదని భావిస్తున్నారు.[255] కెనడా జాతీయగీతం, ఓ కెనడా గీతాలను " లెఫ్టినెంట్ గవర్నర్ ఆఫ్ కెనడా " దేశానికి అంకితం చేసాడు. ది హానరబుల్ థియోడర్ రాబిటియల్లె, 1880 లో ఫెరె నేషనలె డూ క్యుబెక్ సెరిమొనీ అధికారికంగా అంగీకరించబడింది.[256] కాలిక్సా లవల్లె దేశభక్తి గీతాన్ని కవి, న్యాయవాది అయిన సర్ అడాల్ఫె బసిలెరైథియర్ వ్రాసి సంగీతం సమకూర్చాడు. ఇందులోని గీతం ముందుగా ఫ్రెంచిలో ఉండేది. 1906లో ఇది ఆంగ్లంలోకి అనువదించబడింది.[257]
కెనడియన్ క్రీడాచరిత్ర 1770లో ఆరంభం అయింది.[258] కెనడియన్ అధికారిక జాతీయ క్రీడలు ఐస్ హాకీ, లస్క్రోస్.[259] నేషనల్ హాకీ లీగ్ (ఎన్.హెచ్.ఎల్), వాంకోవర్, కాల్గరీ, ఎడ్మోంటన్, విన్నిపెగ్, టొరంటో, ఒట్టావా, మాంట్రియన్ నగరాలలో క్రీడలను నిర్వహిస్తుంది. 1995లో కొలరాడోకు తరలి వెళ్ళే వరకు క్యూబెక్ నగరం క్యూబెక్ నార్డిక్యూ క్రీడలకు మూలస్థానంగా ఉండేది. కెనడాలో మేజర్ లీగ్ బేస్‌బాల్ టీం, ఒక బాస్కెట్‌బాల్ టీం, మూడు సాకర్ లీగ్ టీం, 4 నేషనల్ లాక్రోస్ టీం ఉన్నాయి. ఇతర క్రీడలలో కెనడియన్ ఫుట్‌బాల్ (ఇది కెనడియన్ ఫుట్‌బాల్ లీగ్ తరఫున ఆడుతుంది), కర్లిగ్ క్రీడలు ప్రధానమైనవి.రగ్బీ టీం, ది టోరంటో వూల్ఫ్ పాక్ లీగ్ 1 తరఫున క్రీడలలో పాల్గొంటున్నాయి.
కెనడా అన్ని ఒలింపిక్ క్రీడలలో భాగస్వామ్యం వహించింది. కెనడా సమ్మర్ ఒలింపిక్స్ 1900 నుండి ఒలింపిక్ క్రీడలలో పాల్గొంటుంది. కెనడా పలు అత్యుత్తమ అంతర్జాతీయ క్రీడలకు ఆతిథ్యం ఇచ్చింది.వీటిలో మాంట్రియల్‌లో 1976 ఒలింపిక్ క్రీడలు, కాల్గరేలో 1988 వింటర్ ఒలింపిక్స్, ది 1994 వరల్డ్ బాస్కెట్‌బాల్ చాంపియన్‌షిప్, ది 2007 ఎఫ్.ఐ.ఎఫ్.ఎ. యు-20 వరల్డ్ కప్, వాంకోవర్, విష్ట్లర్, బ్రిటిష్ కొలంబియాలలో ది 2010 వింటర్ ఒలింపిక్స్, 2015 ఎఫ్.ఐ.ఎఫ్.ఎ. వుమెన్ వరల్డ్ కప్ క్రీడలు ప్రధానమైనవి. [260] గోల్ఫ్, టెన్నిస్, స్కీయింగ్, బాడ్మింటన్, వాలీబాల్, సైక్లింగ్, స్విమ్మింగ్, బౌలింగ్, రగ్బీ యూనియన్, కానోయింగ్, ఎక్యూస్ట్రియన్, స్క్వాష్, మార్షల్ ఆర్ట్ అధ్యయనం మొదలైన క్రీడలను దేశమంతటా ఉన్న యువత, అమెచ్యూర్ క్రీడాకారులు ఆడి ఆనందిస్తున్నారు.[261]
నిఘంటువు విక్షనరీ నుండి
పాఠ్యపుస్తకాలు వికీ పుస్తకాల నుండి
ఉదాహరణలు వికికోట్ నుండి
వికీసోర్సు నుండి వికీసోర్సు నుండి
చిత్రాలు, మీడియా చిత్రాలు, మీడియా నుండి
వార్తా కథనాలు వికీ వార్తల నుండి
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.