Remove ads
భారతదేశంలోని రాష్ట్రం From Wikipedia, the free encyclopedia
మిజోరమ్ (Mizoram) భారతదేశం ఈశాన్యప్రాంతంలోని ఒక రాష్ట్రం. 2001 జనాభా లెక్కల ప్రకారం మిజోరమ్ జనాభా సుమారు 8,90,000. మిజోరమ్ అక్షరాస్యత 89%.2011 జనాభా లెక్కల ప్రకారం మిజోరమ్ అక్షరాస్యత 91.3%%.ఇది దేశంలో కేరళ తరువాత అత్యధిక అక్షరాస్యత సాధించిన రాష్ట్రం.
మిజోరం | ||||||
---|---|---|---|---|---|---|
Motto(s): సత్యమేవ జయతే (సత్యం ఒక్కటే విజయం సాధిస్తుంది) | ||||||
Coordinates: 23.36°N 92.8°E | ||||||
Country | India | |||||
Region | ఈశాన్య భారతదేశం | |||||
Before was | అస్సాంలో భాగం | |||||
As Union territory | 21 January 1972 | |||||
Formation (as a state) | 20 ఫిబ్రవరి 1987 | |||||
Capital and largest city | ఐజ్వాల్ | |||||
Districts | 11 | |||||
Government | ||||||
• Body | Government of మిజోరం | |||||
• Governor | కంభంపాటి హరి బాబు | |||||
• Chief Minister | జోరంతంగా (MNF) | |||||
State Legislature | ఏకసభ | |||||
• Assembly | మిజోరాం శాసనసభ (40 seats) | |||||
National Parliament | Parliament of India | |||||
• Rajya Sabha | 1 seat | |||||
• Lok Sabha | 1 seat | |||||
High Court | Gauhati High Court | |||||
విస్తీర్ణం | ||||||
• Total | 21,081 కి.మీ2 (8,139 చ. మై) | |||||
• Rank | 24th | |||||
జనాభా (2011) | ||||||
• Total | 10,91,014 | |||||
• Rank | 27th | |||||
• జనసాంద్రత | 52/కి.మీ2 (130/చ. మై.) | |||||
• Urban | 52.11% | |||||
• Rural | 47.89% | |||||
Language | ||||||
• Official | Mizo, English[2] | |||||
• Official Script | Latin script | |||||
GDP | ||||||
• Total (2019-20) | ₹0.25 లక్ష కోట్లు (US$3.1 billion) | |||||
• Rank | 32nd | |||||
• Per capita | ₹1,44,394 (US$1,800) (18th) | |||||
Time zone | UTC+05:30 (IST) | |||||
ISO 3166 code | IN-MZ | |||||
Vehicle registration | MZ | |||||
HDI (2022) | 0.747[3] (10th) | |||||
Literacy (2011) | 91.58%[4] | |||||
Sex ratio (2011) | 976♀/1000 ♂ | |||||
Symbols of మిజోరం | ||||||
Language | Mizo, English[5] | |||||
Bird | Mrs. Hume's pheasant | |||||
Flower | Red Vanda | |||||
Mammal | Himalayan serow | |||||
Tree | Indian rose chestnut | |||||
State Highway Mark | ||||||
State Highway of మిజోరం SH 1- SH 11 | ||||||
List of State Symbols |
మిజోరమ్‌లో అత్యధికశాతం జనులు మిజోతెగ (జాతి) కు చెందినవారు. వీరిలో కొన్ని ఉపజాతులున్నాయి. రెండింట మూడొంతులు 'లూసాయ్' తెగకు చెందినవారు. 'రాల్తే', 'హ్మార్', 'పైహ్తే', 'పోయ్', 'పవి' తెగలుకూడా 'మిజో'లోని ఉపజాతులే. అయితే 'చక్మా' అనే తెగవారు మాత్రం మిజో జాతికి చెందరు. వీరు 'అరకాన్' జాతికి సంబంధించినవారు.
మొత్తం రాష్ట్ర జనాభాలో 85% క్రైస్తవులు - ముఖ్యంగా బాప్టిస్టు లేదా ప్రెస్బిటీరియన్ వర్గం. దాదాపు మిజోజాతివారు అంతా క్రైస్తవులే. చుట్టుప్రక్కలున్న నాగాలాండ్, మేఘాలయ, మణిపూర్ రాష్ట్రాలలో కూడా క్రైస్తవమతం ప్రధానమైనది. ఎక్కువగా హిందువులు, తరువాత ముస్లిములు ఉన్న భారతదేశంలో ఈశాన్యరాష్ట్రాలలోని ఈ సోదరీరాష్ట్రాల విలక్షణతల్లో క్రైస్తవమతం ఒకటి. చక్మా తెగవారు ప్రధానంగా ధేరవాద బౌద్దమతస్తులు. కాని వారి ఆచారాల్లో హిందూసంప్రదాయాలు, అడవిజాతి సంప్రదాయాలు (Animism) కలసి ఉంటాయి.
ఇటీవలి కాలంలో కొందరు మిజోలు యూదు మతాన్ని అందిపుచ్చుకొంటున్నారు. యూదులలోనుండి దూరమైన తెగలలో మిజోలు ఒకరు అని ఒక స్థానిక పరిశోధకుడు వెలువరించిన పరిశోధనా పఠనము దీనికి స్ఫూర్తి. 1980 నుండి దాదాపు 5 వేలమంది మిజోలు, కుకీలు యూదుమతాన్ని స్వాగతించిన కుటుంబాలకు చెందినవారు. కాని స్థానిక చర్చివర్గాలు ఈ వాదనను పూర్తిగా తిరస్కరిస్తున్నాయి. మిజోరమ్‌లో 7,50,000 పైగా జనాభాను ప్రభావితం చేయగలందున చర్చిలు గణనీయమైన ప్రతిష్ఠ కలిగిఉన్నాయి.
2005 ఏప్రిల్ 1 న ఇస్రాయెల్‌కు చెందిన 'షెఫర్డిక్ యూదు'ల మతగురువు ('రబ్బీ') ష్లోమో ఆమర్ చేత మిజోరమ్‌లోని ప్రస్తుత యూదు వర్గము ఇస్రాయెల్ యూదుల దూరమైన తెగ వారి సంతతి అని అధికారికంగా గుర్తించబడింది. అదే సమయంలో పురాతన యూదు సంప్రదాయానుసారము మతము మార్పు చేయడానికి మతగురువుల బృందమొకటి మిజోరమ్ వచ్చింది. తత్ఫలితంగా జరిగిన మార్పిడి వల్ల మెనాషే యూదు తెగ వారి సంతతిని చెప్పుకొనే మిజోలు ఇస్రాయెల్ పునరాగమనచట్టం ప్రకారం ఇస్రాయెల్ తిరిగి వెళ్ళడానికి అర్హులు. శాస్త్రీయవిశ్లేషణ ప్రకారం ఈ వర్గంలో మగవారిలో యూదుసంతతిని సూచించే జన్యువులు (Y-chromosomal_Aaron) కానరాలేదు గాని ఆడువారిలో మధ్యప్రాచ్యప్రాంతానికి చెందిన జన్యువులు గుర్తించబడ్డాయి. ఎప్పుడో మధ్యప్రాచ్యంనుండి వచ్చిన ఒక స్త్రీ స్థానికుడిని పెండ్లాడినందున ఇలా జరిగి ఉండవచ్చునని ఒక వివరణ.
ఈశాన్య భారతదేశంలోని మిజోరంలో రాజకీయాలు మిజో నేషనల్ ఫ్రంట్, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఆధిపత్యంలో ఉన్నాయి. 2024 నాటికి, జోరామ్ పీపుల్స్ మూవ్‌మెంట్ రాష్ట్రాల శాసనసభలో అధికార పార్టీగా ఉంది.[6]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.