రంగస్థల, టివీ, సినిమా నటీమణి From Wikipedia, the free encyclopedia
లహరి గుడివాడరంగస్థల, టివీ, సినిమా నటీమణి.[1] 2014లో రంగస్థలంపై అడుగుపెట్టిన లహరి, ఇప్పటివరకు 400 నాటక, నాటికల ప్రదర్శనలలో పాల్గొని, అనేక పరిషత్తులలో ఉత్తమ నటిగా బహుమతులు, సత్కారాలు అందుకుంది. 2022లో వచ్చిన అలిపిరికి అల్లంత దూరంలో అనే సినిమాతో హీరో తల్లి పాత్రతో సినిమారంగంలోకి ప్రవేశించింది.[2]
2023 నంది నాటకోత్సవంలో చీకటిపువ్వు నాటికలోని నటనకుగానూ ఉత్తమ నటిగా నంది బహుమతిని అందుకుంది.
జననం - విద్యాభ్యాసం
లహరి 1988, ఏప్రిల్ 1న గుంటూరులో జన్మించింది. తండ్రి వ్యాపారి, తల్లి జూనియర్ కళాశాల అధ్యాపకురాలు. మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తిచేసిన లహరి, ప్రస్తుతం పర్యాటకశాస్త్రంలో పి.జి. చదువుతుంది.
నటనపై ఆసక్తి
హోటల్ మేనేజ్ మెంట్ కళాశాలను నడుపుతున్న సమయంలో నటనపై ఈటీవి పరిపూర్ణ మహిళ కార్యక్రమంలో సెమీ ఫైనల్ వరకు వెళ్లింది. స్మైల్ రాణి స్మైల్, డ్యాన్స్-2001, ఛాలెంజ్-2002 పోటీల్లో విజేతగా నిలిచింది.[1]
రంగస్థల ప్రస్థానం
లహరి 2014లో రంగస్థలంపై అడుగు పెట్టింది. ఇప్పటివరకు 400 నాటక, నాటికల ప్రదర్శనలలో పాల్గొన్నది. అనేక పరిషత్తులలో ఉత్తమ నటిగా బహుమతులు, సత్కారాలు అందుకుంది.
నటించినవి
పెళ్లిచేసి చూడు, వైనాట్, పోవోయి అనుకోని అతిథి, రెండు నిశబ్ధాల మధ్య, బ్రతకనివ్వండి, ఆశ్రిత, అభయ, పల్లవి అనుపల్లవి, ఆఖరి ఉత్తరం, బైపాస్, సరికొత్త మనుషులు, అరసున్న, నిషిద్దాక్షరి, తగునా ఇది భామా, ఇరుసంధ్యలు, గోవు మాలచ్చిమి, బతుకుచిత్రం, గుర్తు తెలియని శవం,[3] నల్లజర్ల రోడ్డు, మొల్ల (పద్యనాటకం), భక్తకన్నప్ప, పాదుకా పట్టాభిషేకం, శ్రీకృష్ణదేవరాయలు, సౌదామిని, జ్యోతీరావ్ పూలే, పల్నాటి యుద్ధం, అక్క అలుగుడు..చెల్లి సణుగుడు, తొక్క తీస్తా, కొత్తనీరు, బతుకుచిత్రం, నా గూడు, సిగ్గు, మా ప్రేమకు న్యాయం కావాలి, కెరటాలు, ఆలీతో సరదాగా, చీకటిపువ్వు,[4][5] నాన్నా నేనొచ్చేస్తా వంటి నాటక, నాటికలలో నటించింది.
ఉత్తమనటి - రెండు నిశబ్దాల మద్యం (నాటిక), 2015 (చిలకలూరిపేట కళా పరిషత్ 5వ రాష్ట్రస్థాయి నాటిక పోటీలు (మార్చి 29-31, 2015), (చిలకలూరి పేట, గుంటూరు జిల్లా)[7]
తెలంగాణ యువ నాటకోత్సవంలో "మా ప్రేమకు న్యాయం కావాలి" నాటికలో నటి లహరి గుడివాడఉత్తమనటి - అంతా మన సంచికే (నాటిక), 2017 (ఎన్టీఆర్ కళాపరిషత్, వినుకొండ), 16వ నాటకోత్సవం[10]
ఉత్తమనటి - గోవు మాలచ్చిమి (నాటిక), నవంబరు 11-13, (నటరత్న నాటక పరిషత్ -2017, విజయనగరం)
ఉత్తమనటి - గోవు మాలచ్చిమి (నాటిక), డిసెంబరు 27-30, 2017, (డా. నందమూరి తారకరామారావు కళాపరిషత్, తెనాలి, కీ.శే. పోలేపెద్ది నరసింహమూర్తి & తుమ్మల వెంకట్రామయ్య స్మారక రాష్ట్రస్థాయి 10వ ఆహ్వాన సాంఘిక నాటిక పోటీలు)
ఉత్తమనటి - బతుకు చిత్రం (నాటిక) - అభినయ నాటక పరిషత్, 13వ తెలుగు రాష్ట్రాల ఆహ్వాన నాటిక పోటీలు (జనవరి 12,13,14 - 2018), (పొనుగుపాడు, గుంటూరు జిల్లా)[11]
ఉత్తమనటి - బతుకు చిత్రం (నాటిక) - రాష్ట్రస్థాయి ఆహ్వాన నాటిక పోటీలు (ఫిబ్రవరి 12-16, 2018), (చోడవరం, విశాఖపట్టణం జిల్లా)
ఉత్తమనటి - గుర్తు తెలియని శవం (నాటిక) - నరసరావుపేట రంగస్థలి, రాష్ట్ర్లస్థాయి ఆహ్వాన నాటిక పోటీలు (ఫిబ్రవరి 23-25, 2018), (నరసరావుపేట, గుంటూరు జిల్లా)
ఉత్తమనటి - గుర్తు తెలియని శవం (నాటిక) - గరికిపాటి ఆర్ట్ థియేటర్, 6వ జాతీయస్థాయి నాటిక పోటీలు (మార్చి 23-25, 2018), (ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లా)
ఉత్తమనటి - బతుకు చిత్రం (నాటిక) - శ్రీ సుమిత్ర కళాసమితి జాతీయస్థాయి ఆహ్వాన నాటిక పోటీలు (మార్చి 27-30, 2018), (శ్రీకాకుళం)
ఉత్తమనటి - బతుకు చిత్రం (నాటిక) - చిలకలూరిపేట కళా పరిషత్ 8వ రాష్ట్రస్థాయి నాటిక పోటీలు (ఏప్రిల్ 1-3, 2018), (చిలకలూరి పేట, గుంటూరు జిల్లా)[13]
ఉత్తమనటి - బతుకు చిత్రం (నాటిక) - కొండవీటి కళాపరిషత్ 21వ జాతీయస్థాయి ఆహ్వాన నాటిక పోటీలు (ఏప్రిల్ 14-16, 2018), లింగారావుపాలెం)[14][15]
ఉత్తమనటి - కొత్తనీరు (నాటిక) - కళారంజని నాటక అకాడమీ సప్తమ జాతీయస్థాయి తెలుగు నాటిక పోటీలు (ఏప్రిల్ 16-18, 2018), (భీమవరం, పశ్చిమ గోదావరి జిల్లా)
ఉత్తమనటి - గుర్తు తెలియని శవం (నాటిక) - లావు వెంకటేశ్వర్లు & కల్లూరి నాగేశ్వరరావు కళాపరిషత్ 4వ తెలుగు రాష్ట్రాల ఆహ్వాన నాటిక పోటీలు (ఏప్రిల్ 19-21, 2018), (వరగాని, గుంటూరు జిల్లా)[16]
ఉత్తమనటి - కొత్తనీరు (నాటిక) - యూత్ క్లబ్ నాటక పరిషత్ తెలుగు నాటిక పోటీలు (ఏప్రిల్ 22-24, 2018), (కొంతేరు)
ఉత్తమనటి - గుర్తు తెలియని శవం (నాటిక) - శ్రీకారం & రోటరీ కళాపరిషత్ 10వ రాష్ట్రస్థాయి నాటిక పోటీలు (ఏప్రిల్ 24-26, 2018), (మార్టూరు, ప్రకాశం జిల్లా)[17]
కోవిడ్ -19 సమయంలో నాటకరంగ కళాకారులు పడిన కష్టాలను చూసి చలించిన లహరి, సంవత్సరానికి కనీసం ఒకరు లేదా ఇద్దరు కళాకారులకు సహాయం చేయాలని నిర్ణయించుకుంది. ఆ సంకల్పంతో తన సోదరి అమృతవర్షిణితో కలిసి అమృతలహరి ఆర్ట్స్ అనే ఒక కళా సంస్థను స్థాపించింది. ఆ సంస్థ ద్వారా నాటకాలను ప్రదర్శించడంతోపాటు కొంతమంది మహిళలతో కలిసి ఊరగాయల తయారీ యూనిట్‌ను ప్రారంభించింది. అలా తయారుచేసిన వాటిని నాటక పోటీలు నిర్వహించే ప్రదేశాల్లో స్టాల్ పెట్టి, వాటి అమ్మకం ద్వారా వచ్చిన లాభాలతో నిరుపేద కళాకారులకు ఆర్థిక సాయాన్ని అందిస్తుంది.[23]