నటి, నృత్య కళాకారిణి From Wikipedia, the free encyclopedia
లయ తెలుగు సినిమా నటీమణి. కుటుంబ చిత్రాల కథానాయకిగా పేరుతెచ్చుకున్న ఈవిడ జాతీయ స్థాయి చదరంగం క్రీడాకారిణి కూడా.[1]
లయ | |
సినీ నటి లయ చిత్రము | |
జన్మ నామం | లయ |
జననం | విజయవాడ, కృష్ణా జిల్లా | ఆగస్టు 15, 1981
ప్రముఖ పాత్రలు | భద్రం కొడుకో స్వయంవరం ప్రేమించు |
చిన్నతనంలో ఈవిడ తండ్రి వృత్తి (ప్రస్తుతం నెఫాలజిస్ట్) రీత్యా మద్రాసులో వున్నప్పుడు ప్రి-నర్సరీ, నర్సరీ చదువుకుంది. తరువాత విజయవాడకి మారి ఎల్.కె.జి నుంచీ సినిమారంగానికి వచ్చేవరకూ (ఇంటర్మీడియట్) నిర్మలా కాన్మెంటు ఉన్నత పాఠశాలలో చదువుకుంది.
రెండో తరగతిలో వున్నప్పుడే చదరంగంలో మంచి ప్రావీణ్యం సంపాదించింది. రాష్ట్రస్థాయిలో ఏడుసార్లు, జాతీయస్థాయిలో ఒకసారి పతకాలు కూడా గెలుచుకుంది. పదవ తరగతి వరకు చదరంగం పోటీలలో పాల్గొంది.
5వ తరగతి నుంచే సంగీతం, కూచిపూడి నృత్యం నేర్చుకుంది. విజయవాడలో జోస్యుల రామచంద్రమూర్తి వద్ద, హైదరాబాదు వచ్చాక పసుమర్తి రామలింగశాస్త్రి వద్ద. . హైదరాబాదు విహారయాత్రకు వెళ్ళినప్పుడు అక్కినేని కుటుంబరావు ఆయన తీయబోయే బాలల చిత్రం భద్రం కొడకో సినిమాలో నటించడం కోసం పిల్లల్ని వెదుకుతూ వీరి బృందాన్ని చూడడం, అందులో చలాకీగా వున్న లయను చూసి సినిమాల్లో వేషానికి గానూ ఎంపిక చేసుకోవడం జరిగింది.[1]
లయకు నాలుగవ తరగతిలోనే మొదటి సినిమాలో నటించే అవకాశం వచ్చినది. అయితే, ఆ సినిమా మామూలు సినిమాగా విడుదల అవ్వకపోవడం వల్ల ఎక్కువమందిని చేరలేకపోయింది. అటుతరువాత లయ విజయవాడ వచ్చేసి తన చదువును కొనసాగించింది. 10వ తరగతిలో వున్నప్పుడు 1996లో జెమిని టి.వి.లో కె. రాఘవేంద్రరావు కొత్త సినిమాకి నటీనటులకోసం స్టార్ 2000 పోటీల గురించి ప్రకటన వచ్చింది. దానికి లయ ఫోటోలు పంపించారు. ఆ పోటీలో వివిధ దశలు దాటి లయ రెండో స్థానంలో గెలుపొందింది. ఐతే మొదటి స్థానం వచ్చిన వాళ్ళకే సినిమాలో వేషం ఇస్తానన్నారు కాబట్టి ఈమెకు పరదేశీ సినిమాలో నటించే అవకాశం రాలేదు. తరువాత ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చివరలో ఉండగా స్వయంవరం సినిమాలో హీరోయిన్ గా ఎంపికైంది. ఆ సినిమా పూర్తై 1999 ఏప్రిల్లో విడుదలైంది. కొత్త నిర్మాత , కొత్త దర్శకుడు, కొత్త హీరో, కొత్త హీరోయిన్, కొత్త రచయిత ఇలాంటి కాంబినేషన్లో రూపుదిద్దికున్న స్వయంవరం సినిమా విజయవంతమైనది.[1]
Seamless Wikipedia browsing. On steroids.