ఆగష్టు 6

తేదీ From Wikipedia, the free encyclopedia

ఆగష్టు 6, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ (gorgeon calander) ప్రకారము సంవత్సరములో 218వ రోజు (లీపు సంవత్సరములో 219వ రోజు ) . సంవత్సరాంతమునకు ఇంకా 147 రోజులు మిగిలినవి.

<< ఆగస్టు >>
ఆది సోమ మంగళ బుధ గురు శుక్ర శని
12
3456789
10111213141516
17181920212223
24252627282930
31
2025

సంఘటనలు

  • 1787: అమెరికా రాజ్యాంగ ప్రతి తాలుకు, 60 (ప్రూఫ్ షీట్లు) పుటలను, అమెరికా రాజ్యాంగ సభ సమావేశానికి అందించారు.
  • 1806: పవిత్ర రోమన్ సామ్రాజ్యం అధికారికంగా ముగిసింది.
  • 1825: బొలీవియాకు స్వాతంత్ర్యం, 300 సంవత్సరాలు స్పెయిన్ పాలకుల చేతిలో నలిగి పోయిన బొలీవియా 1825 ఆగష్టు 6 న స్వతంత్ర రిపబ్లిక్ గా ఏర్పడింది.
  • 1861: బ్రిటన్, నైజీరియాకు చెందిన, లాగోస్ ని, తన సామ్రాజ్యంలో కలుపుకున్నది.
  • 1889: ప్రైవేట్ స్నానాలగదులు కలిగిన, మొదటి బ్రిటిష్ హోటల్, "సావోయ్ హోటల్" లండన్ లో ప్రారంభమైంది.
  • 1890: న్యూయార్క్లో ఉన్న, ఆబర్న్ జైలులో, విద్యుత్ కుర్చీ మీద కూర్చుని మరణశిక్ష అనుభవించాలని, శిక్ష విధించబడిన మొదటి వ్యక్తి హంతకుడు విలియమ్ కెమ్లెర్.
  • 1915: మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో, వార్సా, జర్మనీ చేతుల్లోకి వచ్చింది.
  • 1926: గెర్త్రుడ్ ఏడెర్లె, ఇంగ్లీష్ ఛానల్ ని, 14 గంటల 30 నిమిషాలలోమ్ ఈదిన మొదటి మహిళ.1926 ఆగష్టు 6 రోజు ఉదయం 07:05 వద్ద ఫ్రాన్స్ లో కాప్ గ్రిస్-నెజ్ వద్ద మొదలు పెట్టి, 14 గంటల 30 నిమిషాల తరువాత, ఆమె కింగ్స్‌డౌన్, కెంట్, ఇంగ్లాండ్ వద్ద ఒడ్డుకి వచ్చింది. 1950లో, ఫ్లోరెన్స్ చాడ్విక్ 13 గంటల 20 నిమిషాల్లో ఇంగ్లీష్ ఛానెల్ ని ఈదినంతవరకు, ఆమె నమోదు చేసిన రికార్డు అలాగే ఉంది.
  • 1945: హిరొషిమా మీద బాంబ్ ప్రయోగించబడింది. 1945 ఆగష్టు 6 న 'ఎనొల గే' అనే అమేరికా బి-29 బాంబర్ (బాంబులను ప్రయోగించడానికి వాడే విమానం), మొదటి సారి ఒక అణ్వాయుధాన్ని జపాన్ లోని, హిరోషిమా పట్టణం పైన విడిచింది. ప్రపంచ చరిత్రలో, అణ్వాయుధాన్ని ఒక దేశం పై ప్రయోగించడం అదే ప్రథమం. ప్రయోగించిన కొద్ది నిముషాల్లొనే మహా విస్పొటనం సంభవించింది. దీని నుంచి వెలువడిన అగ్నిక్షనాలోనే పట్టణం అంతా వ్యాపించి భస్మం చేసింది. ఈ విస్ఫోటనంలో, 70, 000 అక్కడికక్కడే మరణించారు. అంటే ఈ సంఖ్య హిరోషిమా పట్టణ జనాభాలో మూడవ వంతు. మళ్ళీ, మూడవ రోజు, అతి పెద్ద తీరప్రాంత పట్టణమైన, నాగసాకి పై, అటువంటిదే, మరో అణ్వాయుధాన్ని అమెరికా ప్రయోగించింది. దీనితో జపాన్ రెండవ ప్రపంచ యుద్ధం లో, అమెరికాకు, లొంగి పోక తప్పలేదు. ఇది ప్రపంచ చరిత్ర లోనే, అతి ఖరీదైన యుద్ధం గా, మిగిలి పోయింది. రెండు పట్టణాలు మరల నిర్మించ బడ్డాయి, కాని, మానవ చరిత్రలో మరిచి పోలేని పీడ కలగా ఈ సంఘటన మిగిలి పోయింది. 1945 ఆఖరికి 2 లక్షల మందికి పైగా, యుద్దబాధితులుగా మిగిలారు. వీరిలో చాలామంది జీవించ గలిగినా, తరువాత చాలా వ్యాధులకు గురయ్యారు.
  • 1961: రష్యా వ్యోమగామి (కాస్మోనాట్) మేజర్ ఘెర్మన్ టితోవ్ రోదసీలో ఒక రోజు (24 గంటలు) గడిపి, ప్రపంచాన్ని, ఆశ్చర్యంలో, ముంచాడు.
  • 1962: జమైకాకు స్వాతంత్ర్యం. 300 సంవత్సరాలు బ్రిటిష్ పాలకుల క్రింద వున్న జమైకా 1962 ఆగష్టు 6 న స్వతంత్ర దేశంగా ఏర్పడింది.
  • 1991: వరల్డ్ వైడ్ వెబ్ (www) ఇంటర్నెట్ లో ప్రజలకు అందుబాటులోకి వచ్చిన రోజు. అందుబాటులోకి తెచ్చిన వ్యక్తి సర్ టిమ్ బెర్నెర్స్ లీ.
  • 1991: ఆగస్టు 6 1991న చుండూరు, ఆంధ్రప్రదేశ్ గ్రామంలో దళితులపై అగ్రకులస్తులు (రెడ్డి, తెలగలు) చేసిన దాడి, హత్యాకాండలను చుండూరు ఘటనగానూ, చుండూరు హత్యాకాండగానూ అభివర్ణిస్తారు.
  • 1997: శ్రీలంక క్రికెట్ జట్టు టెస్ట్ క్రికెట్‌లో 6 వికెట్లకు 952 పరుగులు చేసి ప్రపంచ రికార్డు సృష్టించింది.

జననాలు

Thumb
Alexander Fleming 3

మరణాలు

పండుగలు , జాతీయ దినాలు

  • తల్లిపాల వారోత్సవాలు తెలంగాణ/ఆంధ్రప్రదేశ్ లో వారం రోజులు జరుగుతాయి (1 ఆగష్టు నుంచి 7 ఆగష్టు వరకు)
  • 1825: బొలివియా స్వాతంత్ర్యదినోత్సవం.స్పెయిన్ నుంచి స్వాతంత్ర్యం ప్రకటించుకున్నది. ప్రపంచం 1847 జూలై 21 లో గుర్తించింది.
  • 1962: జమైకా స్వాతంత్ర్యదినోత్సవం.
  • హిరోషిమా దినోత్సవం.

బయటి లింకులు


ఆగష్టు 5 - ఆగష్టు 7 - జూలై 6 - సెప్టెంబర్ 6 -- అన్ని తేదీలు

జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబరు | అక్టోబరు | నవంబరు | డిసెంబరు
Loading related searches...

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.