ఆగస్టు 18: గ్రెగర్ మెక్‌గ్రెగర్ అనే స్కాటిష్ సాహసికుడు అసలు ఉనికిలోనే లేని "పొయాయిస్" అనే దేశానికి, లండను లోని థామస్ జెంకిన్స్ అండ్ కంఫెనీ బ్యాంకు ద్వారా 3 లక్షల పౌండ్ల ఋణాన్ని మంజూరు చేసాడు. దీంతో ప్రపంచపు మొట్టమొదటి స్టాక్ మార్కెట్ పతనం జరిగింది. లండన్‌లో 6 బ్యాంకులు, మిగతా ఇంగ్లాండులోమరో 60 బ్యాంకులూ మూత పడ్డాయి.
డిసెంబరు 26: రష్యా చక్రవర్తిగా నికోలస్ 1 గద్దెనెక్కడాన్ని నిరసిస్తూ రష్యా సైన్యం లోని కొందరు అధికారులు సెంట్ పీటర్స్ బర్గ్ లో తిరుగుబాటు చేసారు. ప్రభుత్వం దాన్ని అణచివేసింది.
తేదీ తెలియదు: భీమిలి రేవు పట్టణం బ్రిటిషు వారి వశమైంది.
తేదీ తెలియదు: బీజింగ్‌ను త్రోసిరాజని లండన్, ప్రపంచపు అతిపెద్ద నగరమైంది.[1]
తేదీ తెలియదు: లండన్‌లో గుర్రాలు లాగే బస్సులను ప్రవేశపెట్టారు
తేదీ తెలియదు: మిన్హ్ మాంగ్, వియత్నాంలో క్రైస్తవం బోధించడాన్ని నిషేధించాడు.
మే 19: నానా సాహెబ్, పీష్వా రెండో బాజీరావు దత్తపుత్రుడు (మ. 1859)
ఫ్రాన్సుకు చెందిన పియరి చార్లెస్ లీ ఎన్పేంట్ ప్రసిద్ధి పొందిన సివిల్ ఇంజనీరు, ఆర్కిటెక్ట్. (వాషింగ్టన్ డి.సి. లోని వీధులను ప్రణాళిక ప్రకారం అత్యంత మనోహరంగా రూపు దిద్దిన వాడు) (జ.1754)