దళితులు
From Wikipedia, the free encyclopedia
Remove ads
హిందూమతంలో అణగారిన వర్గాలను దళితులుగా పేర్కొంటారు. హిందూ మతంలో అతి తక్కువ స్థాయివారిగా భావించబడతారు. దళితులు భారతదేశంలోని ఇతర మతాలలో కూడా వున్నా, వారి మూలాలు హిందూ మతానికి సంబంధించి ఉంటాయి. దళితులు జన్యుపరంగా ఇతర అగ్రకులాలను పోలి ఉన్నా, వీరు సామాజికంగా తరతరాలుగా తక్కువ జాతిగా భావించబడుతున్నారు. వీరు అంటరాని వారిగా భావించబడేవారు. కొన్ని స్థలాల్లో వీరిని దేవాలయాలలో కూడా అనుమతించేవారు కాదు. Dalit means "broken people,held under check', 'suppressed' or 'crushed' — or, in a looser sense, 'oppressed'.దళి అంటే గుంట.
Remove ads
స్వాతంత్ర్యానంతరం దళితులకు భారత ప్రభుత్వం ఎన్నో ప్రత్యేక వసతులు, సౌకర్యాలు కల్పించింది. విద్యా, ఉద్యోగాలలో రిజర్వేషన్లు, అనేక పథకాల ద్వారా ఆర్థిక సహాయం అందించే సౌలభ్యం ప్రభుత్వం కల్పించింది. అంటరానితనం, వర్ణవివక్ష వ్యతిరేక చట్టాలను రూపొందించింది.రాజ్యాంగ nnjsjniramathairmatha
Remove ads
దళిత క్రైస్తవులు, దళిత ముస్లిములు
దళిత శిక్కులు, దళిత బౌద్ధులు దళితులే నని తీర్మానిస్తూ రాజ్యాంగ సవరణ జరిగింది. దళిత క్రైస్తవులు, దళిత ముస్లిములను షెడ్యూల్డ్ కులాల వారిగానే పరిగణించాలని కేంద్ర కేబినెట్ 1997 లో ఆమోదించింది. పార్లమెంటులో బిల్లు పాస్ కాలేదు. భారత ముస్లింలలో 85% మంది పూర్వీకులు హిందూ దళితులేనని ఆంధ్రపదేశ్‌లోని క్రైస్తవులలో 98 శాతం మంది పూర్వీకులు హిందూమతంలోని దళిత కులాల నుంచి వచ్చినవారేనని మానవ వనరుల అభివృద్ధి శాఖ సలహాదారు కృష్ణన్ చెప్పారు. కొల్హాపూర్ మహారాజు తొలిసారిగా 1902లో ముస్లింలకు రిజర్వేషన్ ప్రవేశపెట్టారు. 1921లో మైసూర్ మహారాజు కూడా అదే చర్య చేపట్టారు. బాంబే ప్రెసిడెన్సీ, అనంతరం మద్రాసు ప్రెసిడెన్సీ కూడా ఈ కోటాను ప్రవేశపెట్టాయి.దళిత క్రైస్తవులను కూడా దళితులుగా గుర్తించాలని కేంద్రాన్ని కోరుతూ ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి25.8.2009 న అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టారు. షెడ్యూలు కులాలతో సమానంగా వారికి అన్ని రకాల ప్రయోజనాలను వర్తింపజేయాలని కోరారు. దీన్ని టీడీపీ, ప్రరాపా, తెరాస, ఎంఐఎం, సీపీఐలు కూడా సమర్థించాయి. దళిత ముస్లింలకు కూడా దీన్ని వర్తింపజేయాలని ఎంఐఎం కోరింది. భారతీయ జనతా పార్టీ లోక్ సత్తా దీన్ని వ్యతిరేకించాయి. ఇది హిందువులకు వ్యతిరేకమని, దీనివల్ల మతమార్పిడులు ప్రోత్సహించినట్లు అవుతుందని భారతీయ జనతా పార్టీ శాసన సభ్యులు కిషన్‌రెడ్డి విమర్శించారు.మత ప్రాతిపదికన రిజర్వేషన్లు రాజ్యాంగానికి వ్యతిరేకమని లోక్‌సత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ అన్నారు. దళిత క్రిస్టియన్లు, ముస్లింలమీద ప్రేమ ఉంటే బీసీల్లోనే ఉంచి కోటా పెంచాలని కోరారు.
Remove ads
దళితుల ఆలయ ప్రవేశాలు
- వందేళ్ల తర్వాత ఆలయంలోకి ప్రవేశించిన దళితులు.నాగపట్నం: తమిళనాడు రాష్ట్రం చెట్టిపులమ్ గ్రామంలోని దళితులు వందేళ్ల తర్వాత స్థానిక శివాలయంలో ప్రవేశించి పూజలు నిర్వహించారు.పోలీసు, రెవెన్యూ సిబ్బంది ఆధ్వర్యంలో సుమారు 70మంది దళితులు ఏకాంబరేశ్వర స్వామి ఆలయంలో పూజలు నిర్వహించారు. పూజా కార్యక్రమం అనంతరం జిల్లా కలెక్టర్ సి.మునియనాథన్ స్వయంగా వారికి ప్రసాదం పంచిపెట్టారు.(ఈనాడు29.10.2009)
సినిమాలు
దళితులను ఉదహరించిన కొన్ని సినిమాలు.
- Swayamkrushi #Palasa # మాల పిల్ల
- Sapthapadi
- ఆనంద భైరవి
- రుద్రవీణ
- దిల్లీ 6
మూలాలు
యితర లింకులు
Wikiwand - on
Seamless Wikipedia browsing. On steroids.
Remove ads