మల్లెమాల సుందర రామిరెడ్డి

నిర్మాత, దర్శకుడు, గీత రచయిత, నటుడు From Wikipedia, the free encyclopedia

మల్లెమాల సుందర రామిరెడ్డి

మల్లెమాల (ఆగష్టు 15, 1924 - డిసెంబర్ 11, 2011) తెలుగు రచయిత, సినీ నిర్మాత. ఎంఎస్ రెడ్డి పూర్తి పేరు మల్లెమాల సుందర రామిరెడ్డి . ఆయన ఇంటిపేరు ‘మల్లెమాల’ను కలం పేరుగా మార్చుకొని దాదాపు 5,000 వేలకు పైగా కవితలు, సినీ గేయాలు రచించి "సహజ కవి"గా ప్రశంసలందుకున్నారు.

త్వరిత వాస్తవాలు మల్లెమాల సుందర రామిరెడ్డి, జననం ...
మల్లెమాల సుందర రామిరెడ్డి
Thumb
మల్లెమాల
జననం
మల్లెమాల సుందర రామిరెడ్డి

ఆగష్టు 15, 1924
మరణండిసెంబర్ 11, 2011
ఇతర పేర్లుమల్లెమాల, ఎమ్.ఎస్.రెడ్డి
వృత్తిరచయిత
వీటికి ప్రసిద్ధిమల్లెమాల రామాయణం
జీవిత భాగస్వామిసౌభాగ్యమ్మ
పిల్లలుశ్యామ్ ప్రసాద్ రెడ్డి, భార్గవి, శారద
మూసివేయి

జీవిత విశేషాలు

1924, ఆగస్టు 15నెల్లూరు జిల్లా వెంకటగిరి మండలం అలిమిలి లో ఆయన జన్మించారు. మద్రాసులో మొదట ఫోటో స్టుడియో తో వీరి జీవితాన్ని ప్రారంభించారు. ఈయన చెన్నై లో సినిమా థియేటర్ నిర్మించిన తొలి తెలుగు సినీ నిర్మాత. నిర్మాతగా ఆయన తొలి చిత్రం భార్య. శ్రీకృష్ణ విజయం, కోడెనాగు, ఏకలవ్య, పల్నాటి సింహం, అమ్మోరు, ముత్యాల పల్లకి, అంజి, తలంబ్రాలు, అంకుశం, ఆహుతి, అరుంధతి లాంటి చిత్రాలు నిర్మాతగా ఎంఎస్ రెడ్డికి మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి. మొత్తం బాలలతో తీసిన రామాయణం సినిమా జూనియర్ ఎన్టీఆర్ ను బాల నటుడిగా తెరమీదకు తీసుకుని వచ్చింది. అంకుశం చిత్రంలో ఆయన ముఖ్యమంత్రి గా నటించాడు.

వీరు స్థాపించిన శబ్దాలయ థియేటర్స్ సినీ డబ్బింబ్, రికార్డింగ్ లో అత్యున్నత సాంకేతిక విలువలు కలిగినదిగా సినీ వర్గాలు చెబుతారు.

ఒక కవిగా రచించిన గొప్ప పద్యం , 

రసపిపాస లేని రాలుగాయల మధ్య

చెప్పు కవిత యెంత గొప్పదయిన

కోళ్ల సంతలోన కోహినూరు వజ్రమే,

మహిత వినయ శీల మల్లెమాల.

మరణం

హైదరాబాద్ ఫిల్మ్ నగర్‌లోని ఆయన స్వగృహంలో 2011, డిసెంబర్ 11 న కన్నుమూశారు. ఆయన తనయుడు శ్యామ్ ప్రసాద్ రెడ్డి కూడా చిత్రనిర్మాత.

నిర్మించిన సినిమాలు

  1. కన్నెపిల్ల (1966)
  2. కొంటెపిల్ల (1967)
  3. కాలచక్రం (1967)
  4. హంతకుని హత్య (1967)
  5. కలసిన మనసులు (1968)
  6. భార్య (1968)
  7. శ్రీకృష్ణ విజయం (1971)
  8. కోడెనాగు (1974)
  9. ముత్యాల పల్లకి (1976)
  10. నాయుడుబావ (1978)
  11. రామబాణం (1979)
  12. తాతయ్య ప్రేమలీలలు (1980)
  13. ఏకలవ్య (1982)
  14. పల్నాటి సింహం (1985)
  15. తలంబ్రాలు (1986)
  16. అంకుశం (1989)
  17. ఆగ్రహం (1991)
  18. అమ్మోరు (1995)
  19. రామాయణం (1996)
  20. అంజి (2004)
  21. అరుంధతి (2009)

రచనలు

వీరు రచించిన 'మల్లెమాల రామాయణం' ఒక విశిష్టమైన స్థాయిలో నిలిపింది.

వీరు రచించిన స్వీయచరిత్ర "ఇది నా కథ" ఎందరో సినీ ప్రముఖులని విమర్శించిన నిర్మొహమాటపు రచనగా పేర్కొనవచ్చును.[1]

సినిమా పాటలు

  1. శ్రీకృష్ణ విజయం (1971)
  2. కోడెనాగు (1974) : సంగమం సంగమం అనురాగ సంగమం
  3. రామయ్య తండ్రి (1974) : మల్లి విరిసింది
  4. దొరలు దొంగలు (1976) : చెప్పాలనుకున్నాను, దొరలెవరో దొంగలెవరో తెలుసుకున్నాను
  5. ముత్యాల పల్లకి (1976) : సన్నజాజికి, గున్నమామికి పెళ్ళి కుదిరింది, తెల్లావారకముందే పల్లె లేచింది
  6. తాతయ్య ప్రేమలీలలు (1980) : వెన్నెల్లో విన్నాను సన్నాయి గీతం
  7. ఏకలవ్య (1982) : అన్ని పాటలు
  8. కళ్యాణ వీణ (1983) : వేగుచుక్క మొలిచింది
  9. తలంబ్రాలు (1986)
  10. చూపులు కలసిన శుభవేళ (1988) : చూపులు కలసిన శుభవేళ
  11. పుట్టింటి గౌరవం (1996)

అవార్డులు

మూలాలు

బయటి లింకులు

Loading related searches...

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.