From Wikipedia, the free encyclopedia
'దొరలు దొంగలు' తెలుగు జానపద చలన చిత్రం,1976 మే 6 న విడుదల.సుందరం మూవీస్ పతాకంపై మోహనరెడ్డి నిర్మించిన ఈ చిత్రానికి దర్శకుడు కొండా సుబ్బరామదాస్.ఈ చిత్రంలో జి.రామకృష్ణ, రంగనాథ్, వాణీశ్రీ, చంద్రమోహన్, శ్రీధర్ మొదలగు తారాగణంతో రూపొందిన ఈ చిత్రానికి సంగీతం చెళ్లపిళ్ల సత్యం సమకూర్చారు.
దొరలు దొంగలు (1976 తెలుగు సినిమా) | |
![]() దొరలు దొంగలు సినిమా పోస్టర్ | |
---|---|
దర్శకత్వం | కె.ఎస్.ఆర్. దాస్ |
తారాగణం | జి. రామకృష్ణ, రంగనాథ్, శ్రీధర్, చంద్రమోహన్, వాణిశ్రీ |
గీతరచన | మల్లెమాల |
నిర్మాణ సంస్థ | సుందరం మూవీస్ |
భాష | తెలుగు |
ఎమ్.ఎస్.రెడ్డి నిర్మించిన ఏకైక జానపద చిత్రం ఇదే కావచ్చు. గీతరచయిత మల్లెమాలగా చక్కటి పాటలు ఆయన ఈ చిత్రంలో అందించారు. జి. రామకృష్ణ, రంగనాథ్, శ్రీధర్, చంద్రమోహన్, వాణిశ్రీ (ద్విపాత్రాభినయం) వంటి తారలతో, బాగా ఖర్చు పెట్టి నిర్మించారు. రాబిన్ హుడ్ వంటి కథానాయకుడు, రాజుగారి పేరుతో అరాచకాలు చేసే సైన్యాధికారి, యువరాణిని ప్రేమించే ఒకరాజు, యువరాణి పోలికలతో వుండే ఒక చాకలి, ఆమెను యువరాణి బదులుగా కూర్చొపెట్టటం వంటి మలుపులతో అచ్చమయిన జానపద చిత్రం లా సాగుతుంది. ఆక్షన్ చిత్రాల దర్శకుడు కె.ఎస్.ఆర్.దాస్ దీనికి దర్శకుడు.
Seamless Wikipedia browsing. On steroids.