0070: రోమన్లు, జెరూసలేం లోని రెండవ దేవాలయాన్ని ధ్వంసం చేసారు.
0181: ఆకాశంలోని, కేసియోపియా రాశిలో సూపర్ నోవాని చూసారు. సూపర్ నోవా అంటే ఆకాశంలో అత్యంత కాంతివంతంగా వెలుగుతూ, ఎక్కువ శక్తిని విడుదల చేస్తూ, పేలిపోయే నక్షత్రం) సూపర్ నోవా
1693: డోమ్ పెరిగ్నాన్, షాంపేన్ అనే సారాయిని కనిపెట్టాడు. పాశ్చాత్య దేశాలలోని ఆడవాళ్ళు ఈ షాంపేన్ని ఎక్కువగా తాగుతారు.
1735: బ్రిటన్ యొక్క ఉత్తర అమెరికా కాలనీలలో పత్రికా స్వాతంత్ర్యం కోసం మొదటి ముఖ్యమైన విజయం జరిగింది.జాన్ పీటర్ జెంజెర్, 1733 లో న్యూయార్క్ వీక్లీ జర్నల్ ప్రచురించడం మొదలుపెట్టాడు. వలస ప్రభుత్వ విధానాలను, తన పత్రికలో విమర్శించటంతో, వలస ప్రభుత్వం అతనిని నిర్బంధించింది. న్యాయస్థానం, అతని పత్రికలో రాసిన వాటికి, ఆధారాలు ఉన్నాయని, అతనిని విడుదల చేసింది. ఇది మొదటి పరువు ఖైదు (డిఫమేషన్) కేసు కూడా.
1777: రిటైర్ అయిన, బ్రిటీష్ సైనిక దళం అధికారి ఫిలిప్ ఆష్లే, మొదటి సర్కస్ని ప్రారంభింఛాడు.
1821: అత్కిన్సన్, అలెగ్జాండర్ అనే ఇద్దరు కలిసి, "సాటర్డే ఈవెనింగ్ పోస్ట్" అనే ఒక వారపత్రికను మొట్టమొదటిసారిగా ప్రచురించారు.
1944: ఆమ్స్టర్ డాంలో దాగి ఉన్న అన్నే ఫ్రాంక్ అనే 15 సంవత్సరాల బాలికను, ఆమె కుటుంబాన్ని, నాజీలు ఖైదు చేసారు. ఈ బాలిక రాసిన అన్నే ఫ్రాంక్ డైరీ ప్రపంచ ప్రసిద్ధి పొందింది. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో, యూదులు అనుభవించిన నరక యాతనకు ప్రతిబింబం ఈ డైరీ (దినచర్య పుస్తకం) .
1947: జపాన్ సుప్రీం కోర్టు (అత్యున్నత న్యాయస్థానం) ఏర్పడింది.
1956: మొదటిసారిగా గంటకి 200 మైళ్ళవేగంతో మోటార్ సైకిల్ ప్రయాణించింది.
1960: అమెరికాకు చెందిన వైమానికదళ పరిశోధక విమానం, గంటకి 2, 150 మైళ్ళ వేగంతో ప్రయాణించి, రికార్డు నమోదు చేసింది. ఇది సంప్రదాయకమైన ప్రొపెల్లర్ తో కాకుండా, రాకెట్ ప్రొపెల్లర్ ఉపయోగించి, ఇంత వేగాన్ని సాధించింది.
1971: అమెరికా మనుషులు ఉన్న అంతరిక్షనౌకనుంచి, మొదటి సారిగా ఒక ఉపగ్రహాన్ని, చంద్రుని కక్ష్యలోకి ప్రయోగించింది.
1977: అమెరికా ప్రెసిడెంట్ కార్టర్డిపార్ట్ర్త్మెంట్ ఆఫ్ ఎనెర్జీని ఏర్పాటు చేస్తూ సంతకం చేసాడు.
1983: ఇటలీ1946 తరువాత, మొదటి సామ్యవాద ప్రధాన మంత్రిని ఎన్నుకుంది.
1972: అలబామా గవర్నర్ అయిన జార్జి వాలెస్ని హత్య చేయబోయిన ఆర్థర్ బ్రెమెర్ (21 సంవత్సరాలు) కి అమెరికా లోని మేరీలేండ్ న్యాయస్థానం, 63 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. ఈ హత్యాప్రయత్నంలో, జార్జి వాలెస్]కి పక్షవాతం వచ్చింది. మరో ముగ్గురు గాయపడ్డారు.15 మే 1972 నాడు హత్యాప్రయత్నం జరిగింది. 4 ఆగష్టు 1972 నాడు శిక్ష వేసారు (న్యాయస్థానం 77 రోజులు సమయం తీసుకుంది) . ఆ తరువాత శిక్షను 53 సంవత్సరాలకు తగ్గించారు. విడుదల అయ్యే సమయానికి నిందితుడి వయస్సు 74 సంవత్సరాలు ఉంటుంది.
2009: క్రమం తప్పకుండా యూరోపియన్లు 50% కంటే ఎక్కువ మంది, ఇంటర్నెట్ (అంతర్జాలం) లో విహరిస్తారని, (గత ఐదు సంవత్సరాలలో 33% పెరిగింది) యూరోపియన్ కమిషన్ నివేదిక ఇచ్చింది.