కాంతా రావు (నటుడు)
సినీ నటుడు From Wikipedia, the free encyclopedia
Remove ads
కాంతారావుగా ప్రసిద్ధి పొందిన తాడేపల్లి లక్ష్మీ కాంతారావు (1923 నవంబరు 16 - 2009 మార్చి 22) ప్రసిద్ధ తెలుగు సినిమా నటుడు, నిర్మాత.[2][3]
Remove ads
జననం
కాంతారావు సూర్యాపేట జిల్లా కోదాడ మండలం గుడిబండ గ్రామములో జన్మించాడు.[4]
సినీ ప్రస్థానం
తెలుగు సినిమాల్లో అనేక సాంఘిక, జానపద, పౌరాణిక పాత్రలు ధరించిన కాంతారావు నిర్దోషి చిత్రం ద్వారా సినీరంగ ప్రవేశం చేశాడు.[5] ఈయన సినిమా రంగానికి చేసిన సేవలకు గాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము 2000 లో రఘుపతి వెంకయ్య పురస్కారంతో సత్కరించింది. ఆయన స్వీయ చరిత్ర "అనగనగా ఒక రాకుమారుడు". ఆయన మొత్తం 400 పైగా చిత్రాలలో నటించాడు. రామారావు, నాగేశ్వరరావు లకు సమకాలికులుగా కొన్ని సందర్భాలలో వారితో సమానమైన గుర్తింపు పొందారు. దాసరి నారాయణరావు మాటల్లో "తెలుగు చలనచిత్ర సీమకు రామారావు, నాగేశ్వరరావులు రెండు కళ్ళైతే , వాటి మధ్య తిలకం వంటివారు కాంతారావు".
కాంతారావు కుమారుడు రాజా, సుడిగుండాలు సినిమాలో నటించారు. ఆ చిత్రానికి ఉత్తమ బాల నటుడిగా నంది అవార్డు అందుకున్నారు.[6]
Remove ads
చిత్ర సమాహారం
నటుడిగా
నిర్మాతగా
- సప్తస్వరాలు (1969)
- గండర గండడు (1969)
- ప్రేమ జీవులు (1971)
- గుండెలు తీసిన మొనగాడు (1974)
- స్వాతి చినుకులు (1989)
Remove ads
మరణం
కాంతారావు 2009 మార్చి 22న క్యాన్సర్ వ్యాధి మూలంగా హైదరాబాదులోని యశోద హాస్పిటల్లో రాత్రి గం 9.50 ని.లకు కన్నుమూశారు.
శత జయంతి
కాంతారావు శతజయంతి సందర్భంగా 2022, నవంబరు 16న ముఖ్యమంత్రి కేసీఆర్ నివాళులర్పించాడు.[7] తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ, తెలంగాణ రాష్ట్ర చలనచిత్ర అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో రవీంద్ర భారతిలోని పైడి జయరాజ్ ప్రివ్యూ థియేటర్‌లో కాంతారావు శత జయంతోత్సవం నిర్వహించబడింది. తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరి గౌరీశంకర్, తెలంగాణ ఎఫ్‌డీసీ చైర్మన్ అనిల్ కూర్మాచలం తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ, కాంతారావు కుమారుడు రాజా పాల్గొని కాంతారావు చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి, నివాళులు అర్పించారు. అనంతరం, కాంతారావు నటించిన 'రణభేరి' సినిమా ప్రదర్శన జరిగింది.[8]
చిత్రాలు
- కాంతారావు శతజయంతి కార్యక్రమంలో పాల్గొన్న అతిథులు
- కాంతారావు శతజయంతి కార్యక్రమంలో పాల్గొన్న కాంతారావు అభిమానులు
Remove ads
మూలాలు
బయటి లింకులు
Wikiwand - on
Seamless Wikipedia browsing. On steroids.
Remove ads