From Wikipedia, the free encyclopedia
నర్తనశాల (ఆంగ్లం: NarthanaSala) మహాభారతంలోని విరాట పర్వం కథాంశం ఇతివృత్తంగా నిర్మితమై 1963 సంవత్సరములో విడుదలైన తెలుగు సినిమా.[1] పౌరాణిక ఇతివృత్తాలను తెరకెక్కించడంలో దర్శకులకున్న ప్రతిభను ఈ సినిమా మరొక్కసారి ఋజువు చేసింది. నటులు, దర్శకుడు, రచయిత, గీత రచయిత, సంగీత కళాదర్శకులు - ఇలా అందరి ప్రతిభనూ కూడగట్టుకొని ఈ సినిమా తెలుగు చలన చిత్ర చరిత్రలో ఒక విశిష్టమైన స్థానాన్ని సంపాదించింది. ఈ సినిమా రాష్ట్రపతి బహుమానాన్ని, నంది అవార్డును గెలుచుకొంది. 1964లో ఇండొనీషియా రాజధాని, జకార్తాలో జరిగిన మూడవ ఆఫ్రో ఆసియన్ చిత్రోత్సవంలో ఉత్తమ నటుడు (ఎస్. వి. రంగారావు), ఉత్తమ కళాదర్శకుడు బహుమతులు గెలుచుకొంది.
నర్తనశాల (1963 తెలుగు సినిమా) | |
అప్పటి సినిమా పోస్టరు | |
---|---|
దర్శకత్వం | కమలాకర కామేశ్వరరావు |
నిర్మాణం | సి.లక్ష్మీరాజ్యం, కె.శ్రీధరరావు |
కథ | మహాభారతంలోని కథ - సముద్రాల రాఘవాచార్యచే కూర్పు |
తారాగణం | నందమూరి తారక రామారావు, సావిత్రి, దండమూడి రాజగోపాలరావు, ఎస్.వి.రంగారావు, మిక్కిలినేని, రేలంగి, ముక్కామల, రాజనాల, ఎల్.విజయలక్ష్మి, సంధ్య, ధూళిపాళ, ప్రభాకర రెడ్డి, సూర్యకాంతం, కాంచనమాల, అల్లు రామలింగయ్య, కాంతారావు, కైకాల సత్యనారాయణ, శోభన్ బాబు, వంగర, బాలకృష్ణ, సి.లక్ష్మీరాజ్యం, సీతారాం |
సంగీతం | సుసర్ల దక్షిణామూర్తి |
నేపథ్య గానం | మంగళంపల్లి బాలమురళీకృష్ణ, ఎస్.జానకి, బెంగుళూరు లత, ఘంటసాల వెంకటేశ్వరరావు, మాధవపెద్ది సత్యం, పి.సుశీల |
నృత్యాలు | వెంపటి పెదసత్యం |
గీతరచన | సముద్రాల రాఘవాచార్య |
సంభాషణలు | సముద్రాల రాఘవాచార్య |
ఛాయాగ్రహణం | ఎమ్.ఎ.రహమాన్ |
కళ | టి. వి. యస్. శర్మ |
కూర్పు | ఎస్.పి.ఎస్.వీరప్ప |
నిర్మాణ సంస్థ | రాజ్యం పిక్చర్స్ |
విడుదల తేదీ | అక్టోబర్ 11,1963 |
భాష | తెలుగు |
ఐ.ఎమ్.డీ.బి పేజీ |
మహాభారతంలోని 'విరాట పర్వం'లో జరిగిన పాండవుల అజ్ఞాతవాస గాథ ఈ చిత్రానికి ఇతివృత్తం. జూదంలోని షరతుల ప్రకారం రాజ్యభ్రష్టులైన పాండవులు 12 ఏళ్ళ అరణ్యవాసం ముగించుకొన్న తరువాత ఒక సంవత్సరం అజ్ఞాతవాసం చేయవలసిన సమయం ఆసన్నమైంది. అజ్ఞాతవాసం మధ్యలో భంగపడితే వనవాసం పునరావృతమౌతుంది.
శ్రీకృష్ణుని సలహా ప్రకారం పాండవులు తమ ఆయుధాలను ఒక జమ్మిచెట్టుపై ఉంచి, గొప్ప గోసంపద గల విరాటరాజు కొలువులో తలదాచుకొంటారు. ధర్మరాజు కంకుభట్టుగాను, భీముడు వంటలవాడు వలలుని గాను చేరుతారు. 'పేడివి కమ్ము' అని ఊర్వశి ఇచ్చిన శాపాన్ని అజ్ఞాతవాసములో వరంగా వినియోగించుకొని అర్జునుడు బృహన్నలగా విరాటరాజు కుమార్తె ఉత్తరకు 'నర్తనశాల'లో నాట్యాచార్యుడౌతాడు. నకులుడు ధామగ్రంథి అనే పేరుతో అశ్వపాలకుడిగాను, సహదేవుడు తంత్రిపాలుడు అనే పేరుతో గోసంరక్షకుడిగానూ చేరుతారు. ద్రౌపది సైరంధ్రిగా విరాటరాజు భార్య సుధేష్ణ పరిచారిక అవుతుంది.
పాండవుల అజ్ఞాతవాసాన్ని ఎలాగైనా భంగం చేయాలని కౌరవులు చారులను పంపి ప్రయత్నాలు సాగిస్తారు. పాండవులు ఈ విధంగా అజ్ఞాత వాసం వెలుబుచ్చుండగా ఒకరోజు విరాటరాజు బావ, ఆ రాజ్యానికి రక్షకుడు, మహా బలవంతుడు అయిన కీచకుని కన్ను ద్రౌపదిపై పడుతుంది. ఉపాయంగా కీచకుని రాత్రివేళ నర్తనశాలకు పిలిపించి భీముడు, అతడిని హతం చేస్తాడు.
కీచకుని మరణం సంగతి విని, అక్కడ పాండవు లుండవచ్చునని అనుమానించిన కౌరవులు, వారి ఉనికిని బయట పెట్టేందుకు సుశర్మ సాయంతో దక్షిణ గోగణాలను బలవంతంగా తీసుకుపోతారు. వారిని ఎదుర్కోవడానికి విరాటుడు సకల సైన్యాలతో యుద్ధానికి వెళతాడు. ఇక కలుగులో ఎలుకలను లాగడానికి కౌరవులు, భీష్మ, ద్రోణ, కర్ణాది మహావీరులతో ఉత్తరగోగణాలను తోలుకుపోవడానికి వస్తారు.
"అంతఃపుర పరివారం తప్ప అంతా యుద్ధానికి వెళ్ళారే! అయినా ఫరవాలేదు. నేను కౌరవ సేనను వీరోచితంగా జయిస్తాన"ని పలికి విరాటుని కొడుకు ఉత్తర కుమారుడు యుద్ధానికి బయలుదేరుతాడు. అతనికి సారథిగా బృహన్నల వెళతాడు. కాని కౌరవసేనను చూచి ఉత్తరునికి వణుకు మొదలై పారిపోజూస్తాడు. బృహన్నల అతనికి నచ్చచెప్పి, తన నిజ రూపం తెలిపి అర్జునుడుగా యుద్ధానికి వెళ్ళి, కౌరవసేనను సమ్మోహనాస్త్రంతో జయించి, గోవులను మళ్ళించుకు వస్తాడు. శుభప్రదంగా పాండవుల అజ్ఞాతవాసం ముగుస్తుంది. ఇదీ కథ.
నటులు | పాత్ర |
---|---|
నందమూరి తారక రామారావు | అర్జునుడు, బృహన్నల |
సావిత్రి | ద్రౌపది |
ఎస్. వి. రంగారావు | కీచకుడు |
మిక్కిలినేని | ధర్మరాజు |
దండమూడి రాజగోపాలరావు | భీముడు |
రేలంగి[2] | ఉత్తర కుమారుడు |
ముక్కామల | విరాటరాజు |
శోభన్ బాబు | అభిమన్యుడు |
ఎల్. విజయలక్ష్మి | ఉత్తర |
సంధ్య | సుధేష్ణ |
ధూళిపాళ | దుర్యోధనుడు |
ప్రభాకర రెడ్డి | కర్ణుడు |
అల్లు రామలింగయ్య | వాల (వాలతుల్య) |
కాంతారావు | శ్రీ కృష్ణుడు (అతిథిపాత్ర) |
సి. లక్ష్మీరాజ్యం | సుభద్ర |
కైకాల సత్యనారాయణ | దుశ్శాసనుడు |
వంగర | |
బాలకృష్ణ | |
సీతారాం |
మహాభారతంలోని ఉత్తర గోగ్రహణం కథా వస్తువు. ఈ కథకు సముద్రాల చేత సంభాషణలు రాయించారు.దర్శకుడు కమలాకర కామేశ్వర్రావు చిత్రానువాదం చేసాడు.
ఈ చిత్రంలో నటీనటుల ఎంపిక చిత్ర విజయానికి బాగా దోహదపడింది. ఇంత వరకు శ్రీరాముడు, శ్రీకృష్ణుడు వంటి భక్తి,ఆకర్షణీయమైన పాత్రలు చేసిన ఎన్. టి.రామారావును ఈ చిత్రంలో పేడి వాని పాత్ర అయిన బృహన్నల కు ఎంపిక చేయడం ఓ సాహసం.
సంఖ్య | పాట/పద్యం | నేపథ్యగానం | గీతరచన | సంగీతం | నటీనటులు |
---|---|---|---|---|---|
1. | బావా బావా పన్నీరు | పి. సుశీల | సుసర్ల దక్షిణామూర్తి | ||
2. | నరవరా ఓ కురువరా | ఎస్. జానకి | సముద్రాల రాఘవాచార్యులు | సుసర్ల దక్షిణామూర్తి | |
3. | అన్న యిల్లాలు తమ్ముని | పి. సుశీల | సముద్రాల రాఘవాచార్య | సుసర్ల దక్షిణామూర్తి | |
4. | ఆడితప్పని మా యమ్మ (పద్యం) | ఘంటసాల వెంకటేశ్వరరావు | సముద్రాల రాఘవాచార్య | సుసర్ల దక్షిణామూర్తి | |
5. | జననీ శివకామినీ జయ శుభకారిణి, విజయ రూపిణీ | పి. సుశీల | సముద్రాల రాఘవాచార్య | సుసర్ల దక్షిణామూర్తి | సావిత్రి |
6. | జయగణనాయక విఘ్న వినాయక | ఘంటసాల వెంకటేశ్వరరావు, ఎస్. జానకి | సముద్రాల రాఘవాచార్య | సుసర్ల దక్షిణామూర్తి | ఎన్. టి. రామారావు, ఎల్. విజయలక్ష్మి |
7. | సరసాలు ఉలికింప మురిపాలు పులకింప | పి. సుశీల | కొసరాజు రాఘవయ్యచౌదరి | సుసర్ల దక్షిణామూర్తి | ఎల్. విజయలక్ష్మి చెలికత్తెలు |
8. | సలలిత రాగసుధారససారం | మంగళంపల్లి బాలమురళీకృష్ణ, బెంగుళూరు లత | సముద్రాల సీనియర్ | సుసర్ల దక్షిణామూర్తి | ఎన్. టి. రామారావు, ఎల్. విజయలక్ష్మి |
9. | సఖియా వివరించవే వగలెరిగిన చెలునికి | పి. సుశీల | సముద్రాల రాఘవాచార్య | సుసర్ల దక్షిణామూర్తి | సావిత్రి |
10. | ఎవరికోసం చెలి మందహాసం ఒకపరి వివరించవే సఖీ | ఘంటసాల, పి. సుశీల | శ్రీ శ్రీ | సుసర్ల దక్షిణామూర్తి | శోభన్ బాబు, ఎల్. విజయలక్ష్మి |
11. | హే గోపాలక హే కృపాజలనిధే - కర్ణామృతం | పి. సుశీల | శ్రీ కృష్ణమృతం | సుసర్ల దక్షిణామూర్తి | |
12. | దుర్వారోద్యమ బాహుబల విక్రమ (పద్యం - భారతం) | పి. సుశీల | తిక్కన్న | సుసర్ల దక్షిణామూర్తి | |
13. | ఎవ్వాని వాకిట ఇభమద (పద్యం - భారతం) | ఘంటసాల వెంకటేశ్వరరావు | సముద్రాల రాఘవాచార్య | సుసర్ల దక్షిణామూర్తి | ఎన్. టి. రామారావు |
14. | దరికి రాబోకు రాబోకు రాజా | పి. సుశీల | సముద్రాల రాఘవాచార్య | సుసర్ల దక్షిణామూర్తి | సావిత్రి |
15. | ఓ శీలవతీ నీ గతీ ఈ విధిగా మారెనా | బెంగళూరు లత | సముద్రాల రాఘవాచార్యులు | సుసర్ల దక్షిణామూర్తి | సావిత్రి |
16. | కాంచనమయ వేదికా కనత్కేతనోజ్వల (పద్యం) | ఘంటసాల వెంకటేశ్వరరావు | తిక్కన (భారతం) | సుసర్ల దక్షిణామూర్తి | ఎన్. టి. రామారావు |
17. | కౌరవసేన జూచి వడకందొడగెన్ (పద్యం - భారతం) | మాధవపెద్ది సత్యం | తిక్కన (భారతం) | సుసర్ల దక్షిణామూర్తి | రేలంగి వెంకట్రామయ్య |
18. | సింగంబాకటితో గుహాంతరమున చేర్పాటుమైయుండి (పద్యం) | మాధవపెద్ది సత్యం | తిక్కన (భారతం) | సుసర్ల దక్షిణామూర్తి | |
19. | వచ్చినవాడు ఫల్గుణుడు (పద్యం - భారతం) | మాధవపెద్ది సత్యం | తిక్కన (భారతం) | సుసర్ల దక్షిణామూర్తి | |
20. | ప్రేలితివెన్నొమార్లు కురువృద్ధుల ముందర (పద్యం - భారతం) | ఘంటసాల వెంకటేశ్వరరావు | సముద్రాల రాఘవాచార్య | సుసర్ల దక్షిణామూర్తి | ఎన్. టి. రామారావు |
21. | పోటుమగండులా బుగిలపోయిన విల్లొకటి చేతబట్టి (పద్యం) | మాధవపెద్ది సత్యం | సముద్రాల రాఘవాచార్య | సుసర్ల దక్షిణామూర్తి | ప్రభాకరరెడ్డి |
22. | ఏనుంగునెక్కి పెక్కేనుంగు లిరుగడరా పురవీధుల గ్రాలగలరె (పద్యం - భారతం) | ఘంటసాల వెంకటేశ్వరరావు | తిక్కన్న | సుసర్ల దక్షిణామూర్తి |
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.