Remove ads
సుప్రసిద్ధ సినీ నటి (మహా నటి) From Wikipedia, the free encyclopedia
నిశ్శంకర సావిత్రి (డిసెంబర్ 6, 1936 - డిసెంబర్ 26, 1981) తెలుగు, తమిళ సినిమా నటి, దర్శకురాలు. అభిమానులచేత మహానటిగా కీర్తింపబడింది. గుంటూరు జిల్లా చిర్రావూరు గ్రామంలో సామాన్య తెలగకాపు కుటుంబంలో జన్మించిన సావిత్రి చిన్నతనంలోనే తండ్రిని పోగొట్టుకుంది. పెదనాన్న కొమ్మారెడ్డి వెంకట్రామయ్య ఆమెను పెంచి పెద్దచేశాడు. చిన్నప్పటి నుంచి కళలవైపు ఆసక్తితో పెరిగిన సావిత్రి తర్వాత నాటక రంగంలోకి ప్రవేశించింది. అప్పుడే హిందీ నటుడు పృథ్వీరాజ్ కపూర్ చేతుల మీదుగా బహుమానం కూడా అందుకుంది. తర్వాత సినిమాల్లో నటించడం కోసం మద్రాసు చేరింది. చిన్న పాత్రలతో తన ప్రస్థానం మొదలు పెట్టి అగ్ర కథానాయికగా ఎదిగింది. తెలుగులోనే కాక తమిళంలో తనదైన ముద్ర వేసి నడిగర్ తిలగం అనే బిరుదు పొందింది. తమిళ నటుడు జెమిని గణేశన్ ను పెళ్ళి చేసుకుంది. అప్పటికే ఆయనకు ఇద్దరు భార్యలున్నారు. సావిత్రికి విజయ చాముండేశ్వరి అనే కూతురు, సతీష్ కుమార్ అనే కొడుకు జన్మించారు. కుటుంబ కలహాలు, ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవడంతో ఒక దశలో బాగా బతికిన ఆమె చివరి దశలో పేద జీవితాన్ని గడిపింది. అనారోగ్యంతో ఒక సంవత్సరం కోమాలో ఉండి 46 సంవత్సరాల వయసులో మరణించింది.
సావిత్రి | |
---|---|
జననం | నిస్శంకర సావిత్రి 1935 డిసెంబరు 6 [a] చిరవూరు, మద్రాస్ ప్రెసిడెన్సీ, బ్రిటిష్ ఇండియా (ప్రస్తుత ఆంధ్రప్రదేశ్, భారతదేశం) |
మరణం | 1981 డిసెంబరు 26 46) చెన్నై, తమిళనాడు, భారతదేశం | (వయసు
ఇతర పేర్లు | మహానటి సావిత్రి నడిగైయర్ తిలగం |
వృత్తి | నటి, గాయని, దర్శకురాలు |
జీవిత భాగస్వామి | |
పిల్లలు | 2 |
పురస్కారాలు | రాష్ట్రపతి అవార్డు నంది అవార్డు కళైమామణి |
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, గుంటూరు జిల్లా, తాడేపల్లి మండలంలోని చిర్రావూరు గ్రామంలో డిసెంబరు 6, 1936న నిశ్శంకర గురవయ్య, సుభద్రమ్మ దంపతులకు జన్మించింది. వారికి సావిత్రి రెండవ సంతానం, 1934లో ఆడపిల్ల పుట్టగా మారుతి అని నామకరణం చేశారు. సావిత్రికి ఆరు నెలలు నిండగానే టైఫాయిడ్ కారణంగా తండ్రి మరణించాడు. గురవయ్య మరణంతో సుభద్రమ్మ విజయవాడలోని తన అక్క అయిన దుర్గాంబ ఇంటికి మకాం మార్చింది. దుర్గాంబ భర్త పేరు కొమ్మారెడ్డి వెంకట్రామయ్య, సావిత్రికి వరుసకు పెద్దనాన్న. మారుతి, సావిత్రి విజయవాడలోని కస్తూరిబాయి మెమోరియల్ పాఠశాలలో చేరారు. పాఠశాలకు వెళ్ళే దారిలో నృత్య విద్యాలయం ఉండేది. రోజూ ఇతరులు నాట్యం చేయటం చూసి ఆ నృత్యనిలయంలో చేరి శిష్ట్లా పూర్ణయ్య శాస్త్రి దగ్గర సంగీతం, శాస్త్రీయ నృత్యం నేర్చుకొని విజయవాడలో తన చిన్నతనంలోనే ప్రదర్శనలు ఇచ్చింది. కొంతకాలం ఎన్టీఆర్, జగ్గయ్య తదితరులు నడుపుతున్న నాటకాల కంపెనీలో పనిచేసి, అనంతరం స్వయంగా పెదనాన్న నడిపిన నాట్య మండలిలో కూడా నటించింది. బుచ్చిబాబు రాసిన ఆత్మవంచన అనే నాటకంలో కూడా నటించింది.[1]
సావిత్రి 13 సంవత్సరాల వయసులో ఉన్నసమయంలో కాకినాడలోని ఆంధ్రనాటక పరిషత్ నిర్వహించిన నృత్యనాటక పోటీలలో ఆనాటి హిందీ నటుడు, దర్శకుడు, హిందీ సినిమా రంగంలో ప్రసిద్ధుడు అయిన పృధ్వీరాజ్‌కపూర్ చేతుల మీదుగా బహుమతి అందుకున్నది. అది ఆమెలో కళలపట్ల ఆరాధన పెరగడానికి కారణమైంది. ఆమె 1949లో చలనచిత్రాలలో నటించడానికి మద్రాసు నగరం చేరి౦ది.
1949లో అవకాశం వచ్చినా, ఆమె చిన్నపిల్లని ఆ పాత్రకు సరిపోదని ఆమెను ఎంపిక చేయకపోయినా, ఆ తర్వాత ఆమెను వెతుక్కుంటూ అవకాశం వచ్చింది. పాతాళబైరవి సినిమాలో నృత్య౦ చేసే అవకాశం అది. సావిత్రికి, అలా చిన్న చిన్న పాత్రలతో సినీ ప్రస్థానం ప్రారంభమైంది. ముఖ్యంగా ఆమె నటన పెళ్లి చేసి చూడు సినీ జీవితంలో ఒక మలుపుగా చెప్పవచ్చు. అయితే సావిత్రిలోని అసామాన్య నటిని తెలుగు తెరకు పరిచయం చేసిన సినిమా మాత్రం దేవదాసు కావ్యంలో. పార్వతిగా సావిత్రి నటన అజరామరంగా నిలిచిపోయింది. మనసును వెంటాడే పాటలలో నటన అద్భుతం. సావిత్రి తనకు వచ్చిన పద్మశ్రీ పురస్కారాన్ని తిరస్కరించింది.
మూడు దశాబ్దాల కాలంలో సావిత్రి 250 కన్నా ఎక్కువ సినిమాలలో నటించింది. 1950 60 70 లలో ఎక్కువ పారితోషికం, ఎక్కువ ప్రజాదరణ పొందిన నటీమణులలో సావిత్రి ఒకరు. ఒకసారి సావిత్రి అవకాశం కోసం ప్రయత్నించినప్పుడు ఒక సినిమాలో ఒక పాత్ర కోసం మాత్రమే అవకాశం లభించింది కానీ డైలాగులు చెప్పేటప్పుడు సిగ్గుపడేవారు. హీరోలను చూసి విస్మయ పోయేవారు. అదే సమయంలో తమిళ నటుడు జెమినీ గణేశన్ సావిత్రి యొక్క ఫోటోలను తీసుకొని రెండు నెలల తర్వాత రమ్మని చెప్పి పంపాడు.. చేసేదేం లేక సావిత్రి తిరిగి తన గ్రామానికి వెళ్లి నాటకాలలో నటించడం ప్రారంభించారు. ఒకరోజు సావిత్రి ఇంటికి ఒక వ్యక్తి సినిమా అవకాశం తీసుకుని వచ్చాడు . అలా అలా సావిత్రి సినిమా జీవితం ప్రారంభమైంది. రూపవతి, పాతాళ భైరవి సినిమాలలో చిన్నచిన్న పాత్రలను చేశారు. తరువాత సావిత్రి నటించిన పెళ్లి చేసి చూడు సినిమా కూడా విజయవంతం అయింది . తరువాత దేవదాసు మిస్సమ్మ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలలో నటించారు . దర్శకుడు పి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ సావిత్రి అందం- టాలెంట్ ముందు ఎవరు పోటీ చేయలే రు అన్నారు. సావిత్రి ఇతరుల సలహాలను వినేది కాదు. చాలా త్వరగా వివాహం చేసుకుంది. సావిత్రి బాలీవుడ్ సినిమాలలో నటించినా పెద్దగా సక్సెస్ కాలేదు 1973లో చూజీ అనే ఒకే ఒక్క మలయాళ సినిమాలో నటించారు 1957లో వచ్చిన మాయాబజార్ సినిమాలో ఆమె అభినయం సావిత్రిని ఆకాశానికి ఎత్తేసింది తరువాత సౌత్ ఇండియన్ సినిమాలలో ఎక్కువగా పారితోషికం తీసుకున్న నటిగా నిలిచారు. సావిత్రి తన దానగుణంలో ప్రసిద్ధి చెందారు ఆస్తి, నగలు కొనడానికి ఇష్టపడేవారు. సావిత్రి తన ఖర్చుపై నియంత్రణ ఎక్కువగా చేయలేకపోయేవారు 1960 లో చివరికి మిగిలేది సినిమాకు గాను రాష్ట్రపతి అవార్డు లభించింది చిన్నారి పాపలు అనే సినిమాకు నిర్మాతగా ఉన్నారు ఈ సినిమా పెద్దగా విజయం సాధించలేదు ఫలితంగా భారీ నష్టాలను చూడవలసి వచ్చింది సావిత్రి మద్యానికి కూడా బానిసయ్యారు సావిత్రి జెమినీ గణేశన్ ను పెళ్లి చేసుకున్నారు. జెమినీ గణేశన్ కుటుంబం వారు ఈ పెళ్లికి వ్యతిరేకత తెలిపారు ఎందుకంటే అంతకుముందే జెమిని గణేషన్ కు పెళ్లి అయింది, నలుగురు కూతుళ్లు కూడా ఉన్నారు అదే సమయంలో పుష్పవల్లి అనే నటితో రిలేషన్ లో ఉన్నారు ఇవన్నీ లెక్క చేయకుండా సావిత్రి పెళ్లి చేసుకుంది క్రమంగా ఆర్థికంగా సావిత్రి చాలా నష్టపోయారు తన ఆర్థిక పరిస్థితిని చూసిన దాసరి నారాయణరావు తను నిర్మించిన సినిమాలలో సావిత్రికి అవకాశాలను ఇచ్చారు పెదనాన్న ప్రోద్బలంతో సినిమా రంగం వైపు దృష్టి సారించి ఎన్నో కష్టాలనోర్చి తిరుగులేని అభినేత్రిగా విరాజిల్లింది. ఎల్వీ ప్రసాద్ దర్శకత్వం వహించిన సంసారం సినిమాలో చిన్న పాత్ర పొంది, ఆనక ఆ పాత్రకు తగ్గ వయసు లేదని అందులోనుండి తొలగింపబడింది. ఆ తరువాత కె.వి.రెడ్డి దర్శకత్వం వహించిన పాతాళ భైరవిలో ఒక చిన్న పాత్రలో నటించింది. పెళ్ళిచేసిచూడు ఆమె సినీ జీవితంలో ఒక మలుపు. కాని అందులో ఆమె రెండో కథానాయిక పాత్రకే పరిమితం కావలసి వచ్చింది. తన నటనా ప్రతిభను నిరూపించుకోవటానికి ఆమె, నృత్యరూపకుడు మరియూ దర్శకుడూ అయిన వేదాంతం రాఘవయ్య దర్శకత్వం వహించిన దేవదాసు సినిమా వరకూ ఆగవలసి వచింది. ఎల్వీ ప్రసాద్ దర్శకత్వంలో మిస్సమ్మలో ప్రధానపాత్ర పోషించింది. ఆ చిత్రంతో ఆమె తెలుగు చిత్ర పరిశ్రమలో అగ్ర కథానాయికగా స్థిరపడింది. ఆ తరువాత వచ్చిన దొంగరాముడు, అర్థాంగి, చరణదాసి ఆమె స్థానాన్ని పదిలపరచాయి. 1957 లో వచ్చిన తెలుగు చిత్ర చరిత్ర లోనే అజరామరం అనదగిన మాయాబజార్ చిత్రంలో ఆమె ప్రదర్శించిన అసమాన నటనా వైదుష్యం ఆమె కీర్తి పతాకంలో ఒక మణిమకుటం. అది మొదలు ఎన్నో వైవిధ్యమైన పాత్రలను తనకే సాధ్యమైన రీతిలో పోషించి వాటికి ప్రాణ ప్రతిష్ఠ చేసింది.
ఆమె తమిళ చిత్రాలలోనూ నటించి పేరుతెచ్చుకుంది. తమిళంలోనూ మహానటి (నడిగర్ తిలగం) బిరుదు పొందింది. 1968లో చిన్నారి పాపలు సినిమాకు దర్శకత్వం వహించింది. ఈ సినిమాకు ఒక ప్రత్యేకత ఉంది. బహుశా దక్షిణ భారతదేశంలోనే తొలిసారిగా దాదాపు పూర్తిగా మహిళలచే నిర్మింపబడిన చిత్రంగా ప్రత్యేకత సంతరించుకున్నది. అయితే అది అంత విజయం సాధించలేదు. ఆ తరువాత చిరంజీవి, మాతృదేవత, వింత సంసారం మొదలగు సినిమాలకు దర్శకత్వం వహించింది. 1956లో అప్పటికే రెండు పెళ్ళిళ్ళయిన తమిళ నటుడు జెమినీ గణేశన్ను పెళ్ళిచేసుకుంది. వారికి ఒక కుమార్తె, ఒక కుమారుడు - విజయ చాముండేశ్వరి, సతీష్ కుమార్. అయితే ఆ పెళ్ళి విఫలమైంది. ఆస్తిపాస్తులు కోల్పోయి, తాగుడుకు, మత్తుమందులకు, నిద్రమాత్రలకు బానిసై[ఆధారం చూపాలి], 1981 డిసెంబర్ 26 న మరణించింది
అభిమానులు, ప్రచారసాధనాలు సావిత్రి జన్మదినాన్ని డిసెంబరు 6 గా జరుపుకుంటాయి. మల్లెపూలు, వర్షం సావిత్రికి ఇష్టమైనవి. ఆమెది ఎడమ చేతివాటం. క్రికెట్, చదరంగం ఆటలను బాగా ఇష్టపడేది. చెన్నైలో క్రికెట్ మ్యాచ్ ఉంటే ఆమె తప్పక చూసేది. వెస్టిండీస్ ప్రముఖ ఆటగాడు "గ్యారీ సోబర్స్"కు సావిత్రి అభిమాని. ఆ రోజుల్లోనే శివాజీగణేశన్ తోపాటు తారల క్రికెట్లో పాల్గొనేది. ఆమె వద్ద ఏనుగు దంతంతో చేసిన చదరంగం బల్లకూడా ఉండేది. సావిత్రి మంచి చమత్కారి, అంతే కాదు ఇతరులను అనుకరించటంలో కూడా దిట్ట. ఆమె తన భర్త జెమినీ గణేశన్ను, రేలంగిని, బి.సరోజాదేవిని, ఎస్వీ రంగారావుని, ఇంకా అనేకమందిని తరుచూ అనుకరించేది. దానధర్మాల విషయంలో అమెది ఎముకలేని చెయ్యి. ఒకసారి నిండుగా నగలతో అలంకరించుకుని ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రిని కలిసేందుకు వెళ్ళి, అక్కడ మొత్తం నగలన్నిటినీ వలిచి ప్రధానమంత్రి సహాయ నిధికి దానమిచ్చేసింది.
మహానటి సావిత్రి జీవితంలో సంభవించిన వరుస అపజయాలు ఆమెను ఆర్థికంగానూ మానసికంగానూ బాధించాయి. ఆమె దర్శకత్వం వహించిన మొదటి చిత్రం చిన్నారి పాపలు. ఈ చిత్ర నిర్మాణంలో చాలా మంది పాలుపంచుకున్నారు. వీరి అభిప్రాయ బేధాలతో సినిమా సరిగా ముందుకు సాగకపోవడంతో ఆమె సొంత ఆస్తులు అమ్మి ఈ సినిమా నిర్మాణానికి వెచ్చించవలసి వచ్చింది.[2] తెలుగులో అమోఘ విజయం సాధించిన మూగమనసులు చిత్రాన్ని తమిళంలో నిర్మించి అందులో శివాజీ గణేషన్ తో నటించింది. ఆ చిత్రం అపజయాన్ని ఎదుర్కొనడం ఆమె ఆర్థికపతనానికి దారితీసింది. ఆర్థికంగా సమస్యలను ఎదుర్కొంటూ టీ నగర్ నుండి అణ్ణానగర్‌కు నివాసం మారిన తరువాత ఆమె అంతిమ అంకం ముగిసిపోయింది.
సావిత్రి జీవిత విశేషాలతో 2018లో దర్శకుడు అశ్విన్ నాగ్ తెలుగు తమిళ భాషలలో "మహానటి" అనే సినిమా రూపొందించారు. ఆ చిత్రంలో సావిత్రి పాత్రలో కీర్తీ సురేష్ నటించింది, ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా అశేష జనాదరణ లభించింది. ఈ చిత్రంలో నటించిన కీర్తి సురేష్ కి జాతీయ ఉత్తమ నటి పురస్కారం లభించింది.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.