ఆంధ్ర ప్రదేశ్, గుంటూరు జిల్లా, తాడేఫల్లి మండలం లోని పట్టణం From Wikipedia, the free encyclopedia
తాడేపల్లి, గుంటూరు జిల్లాలో, కృష్ణా నది ఒడ్డున ఉన్న పట్టణం, అదేపేరుగల మండలానికి కేంద్రం. ఈ పట్టణం ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతంలొ ఉంది, కొద్ది భాగం ఆంధ్ర ప్రదేశ్ రాజధాని నగరంలో భాగంగా ఉంది.[2]
పట్టణం | |
Coordinates: 16.48333°N 80.6°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | గుంటూరు జిల్లా |
మండలం | తాడేపల్లి మండలం |
విస్తీర్ణం | |
• మొత్తం | 25.45 కి.మీ2 (9.83 చ. మై) |
జనాభా (2011)[1] | |
• మొత్తం | 64,149 |
• జనసాంద్రత | 2,500/కి.మీ2 (6,500/చ. మై.) |
జనగణాంకాలు | |
• లింగ నిష్పత్తి | 1004 |
ప్రాంతపు కోడ్ | +91 ( 8645 ) |
పిన్(PIN) | 522501 |
Website |
విజయవాడ నగరానికి సమీపాన 3 కి.మీ.దూరంలో కృష్ణకు అవతలి (కుడి) గట్టున ఉన్నది.
2011 జనగణన ప్రకారం పట్టణ జనాభా 64,149.
తాడేపల్లి పురపాలక సంఘం 2009లొ స్థాపించారు. ఇది 23 వార్డులు కలిగి ఉన్న మూడవ గ్రేడ్ పురపాలక సంఘం.[3] ఉండవల్లి గ్రామం, తాడేపల్లి పురపాలక సంఘంకు ఔట్ గ్రొత్. ఈ రెండు విజయవాడ పట్టణ ప్రాంతంలోకి వస్తాయి.[4]
ఈ గ్రామంలో కృష్ణా కెనాల్ జంక్షను పేరుతో రైల్వే జంక్షను ఉంది. విజయవాడ నుండి గుంటూరు, చెన్నై వైపు వెళ్ళే రైలు మార్గాలు చీలేదిక్కడే.
ఒకప్పుడు ఇక్కడ ఎసిసి సిమెంటు కర్మాగారం ఉండేది. ఇండియన్ ఆయిల్ కార్పోరేషను వారి చమురు ఉత్పత్తుల నిల్వ కేంద్రం ఇక్కడ ఉంది.
Seamless Wikipedia browsing. On steroids.