నేపథ్య గాయకుడు, రంగస్థల నటుడు. From Wikipedia, the free encyclopedia
మాధవపెద్ది సత్యం (మార్చి 11, 1922 - డిసెంబర్ 18, 2000) తెలుగు సినిమా నేపథ్య గాయకుడు, రంగస్థల నటుడు. ఈయన తెలుగు, తమిళం, కన్నడ, మళయాళం, హిందీ, సింహళ భాషలతో సహా దాదాపు అన్ని భారతీయ భాషలలో 7,000 పైగా పాటలు పాడి ప్రసిద్ధి చెందాడు.
మాధవపెద్ది సత్యం | |
---|---|
వ్యక్తిగత సమాచారం | |
జననం | 1922 మే 11 |
మూలం | బ్రాహ్మణ కోడూరు, బాపట్ల ఆంధ్ర ప్రదేశ్, India |
మరణం | 2000 డిసెంబరు 18 78) | (వయసు
సంగీత శైలి | నేపథ్య గాయకుడు |
వృత్తి | నేపథ్య గాయకుడు, రంగస్థల నటుడు |
క్రియాశీల కాలం | 1946–2000 |
సత్యం 1922, మార్చి 11 న బాపట్ల సమీపాన బ్రాహ్మణ కోడూరు గ్రామంలో మాధవపెద్ది లక్ష్మీనరసయ్య, సుందరమ్మ దంపతులకు జన్మించాడు. వృత్తిరీత్యా నటుడైన సత్యం చిన్నతనములో ఎనిమిదేళ్ల వయసునుండి రంగస్థల నాటకాలలో నటించేవాడు. తెలుగు రంగస్థలముపై మల్లాది సూర్యనారాయణ నాటక బృందములోని సభ్యునిగా హరిశ్చంద్ర నాటకములో నక్షత్రకుని పాత్రను అద్భుతము పోషిస్తూ పెరుతెచ్చుకున్నాడు. ఈయన ప్రతిభను గుర్తించిన చక్రపాణి సత్యాన్ని తనతోపాటు మద్రాసు తీసుకువెళ్లి, తను నాగిరెడ్డితో కలిసి అప్పడే కొత్తగా స్థాపించబడిన విజయా పిక్చర్స్ పతాకము కింద నిర్మిస్తున్న షావుకారు చిత్రములో నటించే అవకాశము కలుగజేశాడు. ఈయన తొలిసారిగా వెండితెరపై హిందీ, తమిళ ద్విభాషాచిత్రం రామదాసులో కనిపించాడు. ఈ సినిమాకు రెండు భాషల్లోనూ తన పాత్ర యొక్క పాటలు తనే స్వయంగా పాడాడు. మాధవపెద్ది సత్యం షావుకారు సినిమాతో తెలుగు సినిమా రంగములో అడుగుపెట్టాడు. ఈ సినిమాలో సత్యం ఒక గుడ్డివాని పాత్రపోషించి ఆ పాత్రకు ఉన్న మూడు పాటలు పాడాడు. ప్రసిద్ధిమైన పాటలు అయ్యయో జేబులో డబ్బులు పోయెనే, మాయాబజార్ సినిమాలోని వివాహ భోజనంబు వింతైన వంటకంబు (పాట) ఈయన మధురకంఠమునుండి జాలువారినవే. కొన్ని తెలుగు చిత్రాలలో నటించినా మాధవపెద్ది సత్యం ప్రధానంగా గాయకుడే. ఈయన ఆనాటి ప్రసిద్ధ సంగీతదర్శకులైన సాలూరు రాజేశ్వరరావు, ఘంటసాల వెంకటేశ్వరరావు తదితరులందరితో పనిచేశాడు. సత్యం ఎస్వీ రంగారావు, రేలంగి వెంకటరాయయ్య పాటలన్నీ దాదాపు తనే పాడాడు. ఈయన పౌరాణిక చిత్రాలలో పద్యాలు పాడటములో ప్రసిద్ధి చెందాడు.ముఖ్యంగా పిఠాపురం నాగేశ్వరరావు,మాధవపెద్ది సత్యం జొడి కలిసి పాడిన పాటలు తెలుగు వారి నొళ్ళలో ఇప్పటికి నానుతూనే ఉన్నాయి.
75ఏళ్ల్ల వయసులో కూడా కృష్ణవంశీ తీసిన సింధూరం సినిమాలో సంకురాతిరి పండగొచ్చెరో పాటపాడి పలువురి ప్రశంసలందుకున్నాడు.
ఈయన 78 సంవత్సరాల వయసులో 2000, డిసెంబర్ 18న చెన్నైలో అస్వస్థతతో మరణించాడు. ఈయన భార్య అంతకు సంవత్సరము మునుపే మరణించింది. ఈయనకు ఒక కొడుకు, ఒక కూతురు. ఈయన కుమారుడు మాధవపెద్ది మూర్తి తన తల్లితండ్రుల స్మృత్యర్ధం తెలుగు సినీ రంగములో కృషి చేసిన వారికి మాధవపెద్ది సత్యం అవార్డు, మాధవపెద్ది ప్రభావతి అవార్డును ప్రారంభించాడు[1]
సంవత్సర | చిత్రం | పాట | రిమార్కులు |
---|---|---|---|
1954 | బంగారు పాప | తధిమి తకధిమి | నటులు: ఎస్. వి. రంగారావు |
1957 | మాయా బజార్ | వివాహ భోజనంబు భళి భళి భళి దేవా |
నటులు: ఎస్. వి. రంగారావు తనకోసమే పాడుకున్నాడు |
తోడికోడళ్ళు | నీ షోకు చూడకుండా | ||
1959 | ఇల్లరికం | భలే ఛాన్స్ లే | |
1960 | శ్రీ వేంకటేశ్వర మహత్యం | వేగరార ప్రభో | |
1961 | జగదేక వీరుని కథ | ||
1962 | కులగోత్రాలు | అయ్యయ్యయ్యో జేబులో డబ్బులు పోయెనే | రమణా రెడ్డి |
1963 | లక్షాధికారి | ఓహో అందమైన చినదాన బంగారు వన్నెదాన | |
1966 | శ్రీ కృష్ణ పాండవీయం | భళా భళా నా బండి పరుగు | |
1975 | బలిపీఠం | ఏసుకుందాం బుడ్డోడా ఏసుకుందాం |
సంవత్సరం | సినిమా | పాత్ర |
---|---|---|
1962 | దక్షయజ్ఞం | |
1957 | మాయాబజార్ | దారుకుడు |
1950 | షావుకారు | |
1946 | రామదాసు | కబీరు |
మాధవపెద్ది సత్యం కుమారుడు మాధవపెద్ది మూర్తి ఒక కూచిపూడి కళాకారుడు. ఈయన మాధవపెద్ది అవార్డులను ప్రారంభించాడు. ఎం. ఎస్. విశ్వనాథన్, పి. బి. శ్రీనివాస్ ఈ అవార్డులు అందుకున్నవారిలో ఉన్నారు.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.