From Wikipedia, the free encyclopedia
ఇంటర్నెట్ మూవీ డేటాబేసు (English: Internet Movie Database - IMDb; అర్థం: అంతర్జాల చాలనచిత్రాల "సమాచారస్థలం") వీడియోలకి సంబంధించిన ఒక వెబ్ సైటు. ఇది సినిమాలు, TV షోలు, నటులు, సాంకేతిక నిపుణుల వివరాలతో కూడిన అతి పెద్ద ఆన్ లైన్ సమాచార నిధి (డేటాబేసు). ఇది ప్రస్తుతం Amazon.com సంస్థ ఆధ్వర్వంలో నడుస్తుంది. ఇది అందుబాటులో ఉన్న ఏకైక భాష ఆంగ్లం.
Type of site | Online database for movies, television, and video games |
---|---|
Available in | English |
Owner | Amazon.com |
Created by | Col Needham (CEO) |
URL | imdb.com |
Commercial | Yes |
Registration | Registration is optional for members to participate in discussions, comments, ratings, and voting. |
దీనిని 1990 లో కోల్ నీధమ్ అనే కంప్యూటరు ప్రోగ్రామరు రూపొందించాడు. దీనిని 1996 లో Internet Movie Database Ltd అనే పేరుతో యూకేలో రిజిష్టరు చేశారు. దీనికి ప్రకటనల రూపంలో, లైసెన్సింగ్ రూపంలోనూ, భాగస్వామ్య రూపంలోనూ ఆదాయం సమకూరేది. 1998 లో ఇది అమెజాన్.కామ్ కి ఉప కంపెనీగా మారింది. వారు దీనిలో సినిమా డీవీడీలు, వీడియో టేపుల ప్రకటనలు చూపించి వారి అమ్మకాలు పెంచుకున్నారు.
జూన్ 2016 నాటికి ఈ వెబ్ సైటులో సుమారు 37 లక్షల వీడియోల సమాచారం, 7౦ లక్షల మంది సెలబ్రిటీల సమాచారం ఉంది. 67 మిలియన్ల మంది సభ్యులు ఉన్నారు.[1] ఈ వెబ్సైటులో నమోదయిన వారు కొత్త సమాచారం చేర్చడం కోసం, ఉన్న సమాచారం మార్చడం కోసం అభ్యర్థన పంపవచ్చు. ఇందులో సమాచారం ప్రచురించే ముందే పరీక్షించినా అప్పుడప్పడు దోషాలు దొర్లుతుంటాయి. నమోదయిన సభ్యులు ఏదైనీ సినిమాకు ఒకటి నుండి పది మధ్యలో రేటింగు ఇవ్వవచ్చు. ఇలా సేకరించిన రేటింగుల సగటును సదరు వీడియో పక్కనే చూపిస్తారు. ఎవరైనా ఏదైనా సినిమాకు విపరీతంగా దొంగ ఓట్లు వేసినా పసిగట్టగల సామర్థ్యం దీనికుంది. సభ్యులు తమకు నచ్చిన సినిమాల గురించి చర్చించుకునేందుకు మెసేజ్ బోర్డులు కూడా ఉన్నాయి.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.