రవిరాజా పినిశెట్టి చలనచిత్ర దర్శకుడు, రచయిత. ఈయన తెలుగు, తమిళ భాషలలో ఇంతవరకు దాదాపు 35 చిత్రాలకు దర్శకత్వం వహించారు. యముడికి మొగుడు, పెదరాయుడు, బంగారు బుల్లోడు, చంటి, కొండపల్లి రాజా లాంటి చిత్రాలు ఆయన కెరీర్లో ముఖ్యమైన చిత్రాలు. ఆయన దర్శకత్వం వహించిన సినిమాల్లో ఎక్కువ భాగం పునర్నిర్మాణాలే. తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విజయవంతమైన చిత్రాలను తెలుగులో పునర్నిర్మాణం చేసిన సినిమాలకు దర్శకత్వం వహించాడు.[1]
రవిరాజా పినిశెట్టి | |
---|---|
జననం | జులై 14[1] |
వృత్తి | దర్శకుడు, రచయిత |
క్రియాశీల సంవత్సరాలు | 1985 - ప్రస్తుతం |
జీవిత భాగస్వామి | రాధారాణి |
పిల్లలు | ఆది పినిశెట్టి, సత్యప్రభాస్ |
కెరీర్
దర్శకుడిగా రవిరాజా మొదటి సినిమా వీరభద్రుడు (1984). చిరంజీవి, రవిరాజా పినిశెట్టి కాంబినేషన్ లో వచ్చిన మొదటి సినిమా జ్వాల (1985). ఇది బాక్సాఫీసు వద్ద విజయం సాధించింది.[2] 1995 లో మోహన్ బాబు ప్రధాన పాత్రలో నటించిన పెదరాయుడు ఆయన కెరీర్లో పెద్ద విజయం సాధించిన చిత్రాల్లో ముఖ్యమైనది.
దర్శకత్వం వహించిన చిత్రాల జాబితా
తెలుగు
- కేడీ నెంబర్ 1 (2004)
- మా బాపు బొమ్మకు పెళ్ళంట (2003)
- అధిపతి (2002)
- మా అన్నయ్య (2000)
- దేవుడు (1997)
- అరణ్యం (1996)
- సరదా బుల్లోడు (1996)
- సూపర్ హీరో (1996)
- ఎస్.పి.పరశురాం (1996)
- పెదరాయుడు (1995)
- బంగారు బుల్లోడు (1994)
- ఎమ్ ధర్మరాజు ఎం. ఏ. (1994)
- కొండపల్లి రాజా (1993)
- బలరామకృష్ణులు (1992)
- చంటి (1991)
- రాజా విక్రమార్క (1990)
- ముత్యమంత ముద్దు (1989)
- యమపాశం (1989)
- అన్నా చెల్లెలు (1988)
- దొంగ పెళ్ళి (1988)
- న్యాయం కోసం (1988)
- సిరిపురం చిన్నోడు (1988)
- యముడికి మొగుడు (1988)
- చక్రవర్తి (1987)
- కృష్ణ లీల (1987)
- కోనసీమ కుర్రోడు (1986)
- పుణ్య స్త్రీ (1986)
- జ్వాల (1985)
- వీరభద్రుడు (1984)
తమిళము
- యెమాట్రటే యెమాట్రటే (1988)
మూలాలు
బయటి లింకులు
Wikiwand in your browser!
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.