నవంబర్ 7 , గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 311వ రోజు (లీపు సంవత్సరములో 312వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 54 రోజులు మిగిలినవి.
1917 : రష్యా విప్లవం (బోల్షెవిక్ విప్లవం లేదా అక్టోబర్ విప్లవం) విజయవంతమైంది. అప్పట్లో రష్యా ఉపయోగించుతున్న జూలియన్ కాలెండర్ ప్రకారం ఆ నెల అక్టోబర్. అందువలన దీనిని అక్టోబర్ విప్లవం అని అన్నారు.
1950 : నేపాల్ రాజుగా జ్ఞానేంద్ర పదవిలోకి వచ్చాడు.
బిపిన్ చంద్ర పాల్
1728 : జేమ్స్ కుక్ , ఆంగ్ల-నావికుడు, సముద్ర యానికుడు, సాహస యాత్రికుడు. (మ.1779)
1858 : బిపిన్ చంద్ర పాల్ , భారత స్వాతంత్ర్య పోరాటయోధుడు. (మ.1932)
1867 : మేరీక్యూరీ , భౌతిక, రసాయనిక శాస్త్రవేత్త. రెండు నోబెల్ బహుమతులు (భౌతిక, రసాయన శాస్త్రాలలో) గ్రహీత. (మ.1934)
1888 : చంద్రశేఖర్ వెంకటరామన్ , భారత భౌతిక శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి విజేత. (మ.1970)
1900 : పాటూరి రాజగోపాల నాయుడు , స్వాతంత్ర్య సమర యోధుడు. మాజీ పార్లమెంటు సభ్యుడు. రైతు నాయకుడు. సాహితీవేత్త.
1900 : ఎన్.జి.రంగా , భారత స్వాతంత్ర్య సమరయోధుడు, పార్లమెంటు సభ్యుడు, రైతు నాయకుడు. (మ.1995)
1912 : చితిర తిరునాల్ బలరామ వర్మ , ట్రావెన్కోర్ సంస్థానం యొక్క ఆఖరి మహారాజు. (మ.1991)
1920 : బొల్లిముంత శివరామకృష్ణ , అభ్యుదయ రచయిత, ప్రజా కళాకారుడు, హేతువాది. (మ.2005)
1928 : ఎం.ఎల్.నరసింహారావు , స్వాతంత్ర్య సమరయోధుడు, రచయిత, సాహితీవేత్త. (మ.2016)
1932 : గిడుగు రాజేశ్వరరావు , తెలుగు భాషపై పట్టున్న రచయిత, కళాకారుడు. (మ.2013)
1934 : బొమ్మన విశ్వనాథం , భారతీయ సాహిత్యాన్ని వంగభాషలోనికి అనువదించిన తెలుగువ్యక్తి.
1937 : కొత్తపల్లి ఘనశ్యామల ప్రసాదరావు , సంస్కృతాంధ్ర పండితుడు, అవధాని. (మ.2016)
1947: ఉషా ఉతూప్ , భారతీయ పాప్ గాయని , సినీనటి .
1954 : కమల్ హాసన్ , చలనచిత్ర నటుడు.
1957 : వై.విజయ , తెలుగు సినిమా నటి, నృత్య కళాకారిణి.
1960: రూప: తెలుగు చలనచిత్ర నటి.
1960 : సప్పా దుర్గాప్రసాద్ , నృత్యకళాకారుడు.
1970 : డిస్కో శాంతి , తెలుగు శృంగార నృత్యతార.
1971 : రీతూపర్ణ సేన్ గుప్త , బెంగాలి సినిమాలో నటి.
1971: త్రివిక్రమ్ శ్రీనివాస్ , తెలుగు సినీ మాటల రచయిత, కథా రచయిత, దర్శకుడు.
1973 : వేణు దోనేపూడి , భారతీయ ఆటోమొబైల్ పారిశ్రామికవేత్త, మల్టీబ్రాండ్ కార్ సేవల కంపెనీ కార్జ్ మేనేజింగ్ డైరెక్టర్.
1979: రైమా సేన్ , చలన చిత్ర నటి .
1980 : కార్తీక్ , తెలుగు, తమిళ చిత్రసీమలో గాయకుడు.
1981 : అనుష్క శెట్టి , భారతీయ సినీ నటి.
ఎన్.టి.పీ.సి. స్థాపన దినోత్సవం.
బాలల సంరక్షణ దినం.
ప్రపంచ వేసక్టమీ దినోత్సవం .
జాతీయ క్యాన్సర్ అవగాహన దినోత్సవం
నవంబర్ 6 - నవంబర్ 8 - అక్టోబర్ 7 - డిసెంబర్ 7 -- అన్ని తేదీలు
మరింత సమాచారం నెలలు తేదీలు, జనవరి ...
మూసివేయి