అనుష్క శెట్టి
From Wikipedia, the free encyclopedia
Remove ads
అనుష్క శెట్టి (తుళు: ಅನುಷ್ಕ ಶೆಟ್ಟಿ) తెలుగు, తమిళ సినిమా నటీమణి. బెంగుళూరు నగరానికి చెందిన యోగా శిక్షకురాలు అనుష్క అసలు పేరు స్వీటీ శెట్టి. పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో నాగార్జున నటించిన సూపర్ చిత్రం ద్వారా ఈమె సినీరంగంలో అడుగుపెట్టింది. ఆ తరువాత ఈమె విక్రమార్కుడు, లక్ష్యం వంటి విజయవంతమైన చిత్రాల ద్వారా తెలుగు చిత్రరంగంలో కథానాయికగా తన స్థానాన్ని పదిలపరచుకుంది. తమిళంలో మాధవన్ సరసన రెండు చిత్రం ద్వారా పరిచయమైంది. అదేవిదంగా బాహుబలి సినిమా ద్వారా భారతదేశంలో ప్రాముఖ్యత కలిగిన సినీతారగా గుర్తింపు తెచ్చుకుంది.
Remove ads
వ్యక్తిగత జీవితం
మంగుళూరులో పుట్టిన అనుష్క పాఠశాల, కళాశాల విద్య అంతా బెంగుళూరులోనే జరిగింది. ఈమె మాతృభాష తుళు. కుటుంబ సభ్యులు ఈమెను స్వీటీ అని, సన్నిహిత స్నేహితులు టొమ్ములు అని పిలుస్తారు. బెంగుళూరు విశ్వవిద్యాలయానికి అనుసంధానంగా ఉన్న మౌంట్ కార్మెల్ కళాశాలనుండి బి.సి.ఏ పట్టా పొందింది. అయితే కంప్యూటర్ రంగంలో పనిచేసే ఉద్దేశ్యమేమీ లేదని, ఫిట్‌నెస్ రంగంలో పనిచెయ్యాలని ఈమె అభిలాష. ఈమె యోగా శిక్షణ కూడా ఇస్తుంది. ఈమె గురువు ఇటీవల భూమికా చావ్లాను పెళ్ళి చేసుకున్న ప్రఖ్యాత యోగా నిపుణుడు భరత్ ఠాకూర్.సినీ నటుడు నాగార్జున ఈమెను సినీరంగానికి పరిచయం చేశాడు.
Remove ads
అరుంధతి
కోడి రామకృష్ణ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత ఎమ్. శ్యామ్ ప్రసాద్ రెడ్డి నిర్మించిన అరుంధతి సినిమా ఈమె సినిమాలలో ఒక మైలురాయిగా నిలిచి ఈమెను ప్రఖ్యాత నటీమణిగా మార్చింది. ఈ చిత్రంలో అనుష్క అరుంధతి, జేజమ్మ పాత్రలను పోషించింది. 13 కోట్ల పెట్టుబడితో తీసిన ఈ చిత్రం అత్యద్భుత విజయాన్ని సాధించి 68 కోట్లను వసూలు చేసింది. అందులో 10 కోట్లు తమిళనాడు నుండే వసూలయ్యాయి. ఈ సినిమాను తమిళంలో కూడా డబ్బింగ్ చేసి విడుదల చేశారు. సినిమాలో అనుష్క నటనకు విమర్శకుల ప్రశంసలు అందుకున్నది.అనుష్క మొదటీ సినిమాతొనే తనలోని నటిని ఆవిష్కరింఛింది
Remove ads
సినిమా జీవితము
Remove ads
మూలాలు
Wikiwand - on
Seamless Wikipedia browsing. On steroids.
Remove ads